July 31, 2015

క్షేత్రమహిమ ఆవిష్కరణ

Purohithula vari kshetra mahima nu avishkarinchina GANTANNA, collector. Mrs Ananda Gajapati Raju , EO , DCP , JC , VC , ZP chairperson.





సింహాచలం శ్రీ వరహాలక్ష్మీనృసింహస్వామివారి ఆలయ నమూనా

రాజమండ్రి పుష్కరాలలో సింహాచలం శ్రీ వరహాలక్ష్మీనృసింహస్వామివారి నమూనా ఆలయం 


                                                        నమూనా ఆలయంలో సింహాద్రి అప్పన్న 

త్రిపురాంతకస్వామివారికి అభిషేకం 



గురుపాదుకా స్తోత్రం

గురుపాదుకా స్తోత్రం

అనంతసంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యామ్ |
వైరాగ్యసామ్రాజ్యదపూజనాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ||

కవిత్వవారాశినిశాకరాభ్యాం దౌర్భాగ్యదావాం బుదమాలికాభ్యామ్ |
దూరికృతానమ్ర విపత్తతిభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ||

నతా యయోః శ్రీపతితాం సమీయుః కదాచిదప్యాశు దరిద్రవర్యాః |
మూకాశ్ర్చ వాచస్పతితాం హి తాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ||

నాలీకనీకాశ పదాహృతాభ్యాం నానావిమోహాది నివారికాభ్యామ్ |
నమజ్జనాభీష్టతతిప్రదాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ||

నృపాలి మౌలివ్రజరత్నకాంతి సరిద్విరాజత్ ఝషకన్యకాభ్యామ్ |
నృపత్వదాభ్యాం నతలోకపంకతే: నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ||

పాపాంధకారార్క పరంపరాభ్యాం తాపత్రయాహీంద్ర ఖగేశ్ర్వరాభ్యామ్ |
జాడ్యాబ్ధి సంశోషణ వాడవాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ||

శమాదిషట్క ప్రదవైభవాభ్యాం సమాధిదాన వ్రతదీక్షితాభ్యామ్ |
రమాధవాంధ్రిస్థిరభక్తిదాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ||

స్వార్చాపరాణామ్ అఖిలేష్టదాభ్యాం స్వాహాసహాయాక్షధురంధరాభ్యామ్ |
స్వాంతాచ్ఛభావప్రదపూజనాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ||

కామాదిసర్ప వ్రజగారుడాభ్యాం వివేకవైరాగ్య నిధిప్రదాభ్యామ్ |
బోధప్రదాభ్యాం దృతమోక్షదాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ||


July 30, 2015

Ashada Pournami.....Simhachalam Giripradakshina

Ashada Pournami.....Simhachalam Giripradakshina
ఆషాఢ పౌర్ణమి....సింహాచలం గిరిప్రదక్షిణ గురించి మా అన్నయ్య (పెద్దమ్మగారి అబ్బాయి) చెప్పిన విషయాలు

సింహగిరికి ప్రదక్షిణ

ఈరోజు భక్తులందరూ సింహగిరికి ప్రదక్షిణ చేయటం మొదలుపెడతారు
ఒక స్వామి ఆశీర్వాదం కోసం
రెండు పూటల పాదయాత్ర
మూడు పదుల కి.మి.లు
నాలుగు అడుగులు నడవలేని వృద్దులు సైతం
పంచభూతలకు ఎదురెళ్తూ...
ఆరు చక్రాల రథం పై స్వామి తోడు రాగా...
సప్త స్వరాల సంగీతం వింటూ....
ఎనిమిది దిక్కులు నీవేనంటూ...
తొమ్మిది గ్రహలు చల్లగా చూసేట్టూ దీవించమంటూ...
పది మందీ కలిసి నడిచే
"సింహగిరి ప్రదక్షిణ" లో...
మీరు మీ బంధుమిత్ర సకుటుంబ సపరివార సమేతంగా పాల్గొని చరితార్థులు కండి
ॐ సింహగిరి ప్రదక్షిణం భూ ప్రదక్షిణాసమానం ॐ
**********************************************

అఖిల లోకాలు కాచే అప్పన్న ఆలయంలో జరిగే అధ్భుత ఘట్టం భూ ప్రదక్షిణ ఫలితమిచ్చే ఒకే ఒక్క అవకాశం
సింహచల వరహా నరసింహుని దివ్య కొండ చుట్టూ సుగంధ ఔషధ వృక్షల గాలి పీలూస్తూ... 32కి.మి. పాటు సాగే పాదయాత్ర ఇది జూలై 30న మధ్యహ్నం 2 గంటల నుండి సింహచలం దిగువ తొలిపావంచ వద్ద ప్రారంభం కానున్న సింహగిరి ప్రదక్షిణ లో పాల్గొని మీరు మీ కుటుంబాలు ఆజన్మాంతం లక్ష్మీ కటాక్షం పొందండి. స్వామి కూడ ప్రాచార రథం తో పాటు మనతో వచ్చే సమయం అఖిలాండకోటి బ్రహ్మండ నాయకునితో కలిసి పాదయాత్ర చేద్దాం రండి.
*********************************************

సింహగిరి ప్రదక్షిణంలో పాల్గోనండి భూ ప్రదక్షిణ ఫలితం పొందండి.........
అప్పన్న ఆలయ నూతన ధ్వజస్థంభావిష్కరణ జరిగిన తరువాత తొలి గిరిప్రదక్షిణ....
మహా పుష్కరం జరిగిన వారం రోజులకే జరుగుతున్న గిరిప్రదక్షిణ.....
అధికాషడం వచ్చిన ఏడాది జరుగుతున్న గిరి ప్రదక్షిణ.....
పూరీ నవకళేభర యాత్ర ముగిసిన మూడు రోజులకే జరుగుతున్న మహా గిరి ప్రదక్షిణ....
ఇన్ని విశేషాల గిరి ప్రదక్షిణ మహోత్సవం జరగాలంటే ఇంకో వేయి సంవత్సరాల తరువాతే...
ఇటువంటి మహాధ్భుత గిరి ప్రదక్షిణోత్సవంలో పాల్గొని వేయి తరాల మీ వంశాన్ని తరింప జేయండి.
***********************************************

1) తొలి పావంచ వద్ద స్వామి ప్రచార రథం మధ్యహ్నం 2గం. కు మొదలు అవుతుంది 
2) రథంతో పాటుగా 32కి.మి. ఫాదయాత్ర ప్రారంభించలేని వారు ముందుగా అయిన, తరువాత అయిన సింహగిరి ప్రదక్షిణ ప్రారంభించవచ్చు 
3) ఎటువంటి వి.ఐ.పి. లైన్స్ కానీ టిక్కెట్స్ కానీ ఉండవు, సామాన్య భక్తులవలే పాదయాత్ర చేయ్యాలి
4) చెప్పులు ధరించక పోవడం మంచిది
5) వర్షం పడే అవకాశలు ఎక్కువ, సెల్ఫోన్ వంటి పరికరాలు డబ్బులు జాగ్రత్త
6) దేవస్థానం ఎక్కడిక్కడ ఉచిత వైద్య, మంచినీటి, విశ్రాంతి సదుపాయాలు కల్పించింది. తగిన స్వస్థత చేకూరాక తిరిగి బయలు దేరండీ
7) 32 కి.మి. పాదయాత్ర తిరిగి తొలిపావంఛ వద్దే పూర్తి అవుతుంది





ప్రదక్షిణ చేస్తున్న భక్తజనం 


July 29, 2015

Kukkuteswaraswamy kshetra mahatyam ......Pithapuram

కుక్కుటేశ్వరస్వామి, శ్రీదత్తపీఠం, శక్తి పీఠం పాదగయ.... క్షేత్రమహాత్మ్యం ........ పిఠాపురం

Kukkuteswaraswamy kshetra mahatyam ......Pithapuram

ఐ. వి. వేదవ్యాస్ ప్రసంగం -- రెండవ భాగం .....

ఐ. వి. వేదవ్యాస్ ప్రసంగం --  రెండవ భాగం .....
I.V.Vedavyas(My Brother)  Speech Part -2


July 25, 2015

అప్పన్న చెంత పుష్కర దీపం

అప్పన్న చెంత పుష్కర దీపం

గోదావరి పుష్కర మహోత్సవాల ముగింపు సంధర్భంగా అప్పన్న తొలిపావంచ వద్ద వైభంగా దీపారాధన మహోత్సవం



July 14, 2015

పెళ్ళికానివారు చదువుకునే శ్లోకం

ఈశ్లోకం రోజుకు 28సార్లు, 40 రోజులుచదవాలి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి, దేవుని పూజ చేసుకుంటూ చదవాలి. ఈవిధంగా చేస్తే 40 రోజులు పూర్తి అయ్యేసరికి పెళ్ళి కుదురుతుంది. మనస్పర్థలు ఉన్న ఆలూమగల మధ్య సఖ్యత కుదురుతుంది.

కామేశ్వరాయ కామాయ - కామపాలాయ కామినే
నమః కామ విహారాయ - కామరూప ధరాయచ   


July 11, 2015

భారతీయ ఔన్నత్యం ----- Erwin Schrodinger

భారతీయ ఔన్నత్యం ----- Erwin Schrodinger


భారతీయ ఔన్నత్యం ----- Erwin Schrodinger

 భారతీయ ఔన్నత్యం ----- Erwin Schrodinger


July 8, 2015

భారతీయ ఔన్నత్యం ---- Niels Bore

భారతీయ ఔన్నత్యం ----  Niels Bore


July 7, 2015

ఐ. వి. వేదవ్యాస్ ప్రసంగం -- మొదటి భాగం

ఐ. వి. వేదవ్యాస్ ప్రసంగం -- మొదటి భాగం .....
I.V.Vedavyas(My Brother)  Speech Part -1

లింగాష్టకం యొక్క అర్థం


లింగాష్టకం యొక్క అర్థం




బ్రహ్మ మురారి సురార్చిత లింగంబ్రహ్మ ,
విష్ణు , దేవతల చేత పూజింపబడ్డ లింగం..!!

నిర్మల భాషిత శోభిత లింగం,
నిర్మలమైన మాటల చేత అలంకరింపబడ్డ లింగం..!!

జన్మజ దుఃఖ వినాశక లింగం,
జన్మ వల్ల పుట్టిన బాధలను నాశనం చేసే లింగం..!!

తత్ ప్రణమామి సదా శివ లింగం,
ఓ సదా శివ లింగం నీకు నమస్కారం..!!

దేవముని ప్రవరార్చిత లింగందేవమునులు ,
మహా ఋషులు పూజింప లింగం..!!

కామదహన కరుణాకర లింగం,
మన్మధుడిని దహనం చేసిన , అపారమైన కరుణను చూపే చేతులు గల శివలింగం..!!

రావణ దర్ప వినాశక లింగం,
రావణుడి గర్వాన్ని నాశనం చేసినట్టి శివ లింగం..!!

తత్ ప్రణమామి సద శివ లింగం,
నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!

సర్వ సుగంధ సులేపిత లింగం,
అన్ని మంచి గంధాలు , మంచి గా పూసిన శివ లింగం..!!

బుద్ధి వివర్ధన కారణ లింగం,
మనుషుల బుద్ధి వికాసానికి కారణ మైన శివ లింగం ..!!

సిద్ధ సురాసుర వందిత లింగం,
సిద్ధులు , దేవతలు , రాక్షసుల చేత కీర్తింపబడ్డ శివ లింగం..!!

తత్ ప్రణమామి సదా శివ లింగం,
నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!

కనక మహామణి భూషిత లింగం,
బంగారు , మహా మణుల చేత అలంకరింప బడ్డ శివ లింగం..!!

ఫణిపతి వేష్టిత శోభిత లింగం,
నాగరాజు నివాసం చేత అలంకరింపబడ్డ శివ లింగం..!!

దక్ష సుయజ్ఞ వినాశక లింగం,
దక్షుడు చేసిన మంచి యజ్ఞాన్ని నాశనం చేసిన శివ లింగం..!!

తత్ ప్రణమామి సదా శివ లింగం,
నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!

కుంకుమ చందన లేపిత లింగం,
కుంకుమ , గంధము పూయబడ్డ శివ లింగం..!!

పంకజ హార సుశోభిత లింగం,
కలువల దండ చేత చక్కగా అలంకరింప బడ్డ శివ లింగం..!!

సంచిత పాప వినాశక లింగం,
సంక్రమించిన పాపాలని నాశనం చేసే శివ లింగం..!!

తత్ ప్రణమామి సదా శివ లింగం,
నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!

దేవగణార్చిత సేవిత లింగం,
దేవ గణాల చేత పూజింప బడ్డ , సేవించ బడ్డ శివ లింగం..!!

భావైర్ భక్తీ భిరేవచ లింగం,
చక్కటి భావం తో కూడిన భక్తీ చేత పూజింప బడ్డ శివ లింగం..!!

దినకర కోటి ప్రభాకర లింగం,
కోటి సూర్యుల కాంతితో వెలిగే మరో సూర్య బింబం లాంటి శివ లింగం..!!

తత్ ప్రణమామి సదా శివ లింగం,
నీకు ఇవే నా నమస్కారాలు, ఓ సదా శివ లింగమా ..!!

అష్ట దలోపరి వేష్టిత లింగం,
ఎనిమిది రకాల ఆకుల మీద నివాసముండే శివ లింగం..!!

సర్వ సముద్భవ కారణ లింగం,
అన్నీ సమానంగా జన్మించడానికి కారణమైన శివ లింగం..!!

అష్ట దరిద్ర వినాశక లింగం,
ఎనిమిది రకాల దరిద్రాలను (అష్ట దరిద్రాలు) నాశనం చేసే శివ లింగం..!!

తత్ ప్రణమామి సదా శివ లింగం,
నీకు ఇవే నా నమస్కారాలు, ఓ సదా శివ లింగమా ..!!

సురగురు సురవర పూజిత లింగం,
దేవ గురువు (బృహస్పతి), దేవతల చేత పూజింప బడ్డ శివ లింగం..!!

సురవన పుష్ప సదార్చిత లింగం,
దేవతల తోటల్లో పూచే పువ్వులు (పారిజాతాలు) చేత ఎప్పుడూ పూజింప బడే శివ లింగం..!!

పరమపదం పరమాత్మక లింగం,
ఓ శివ లింగమా, నీ సన్నిధి ఏ ఒక స్వర్గముతత్ ప్రణమామి సదా శివ లింగంనీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!

లింగాష్టక మిదం పుణ్యం యః పట్టేత్ శివ సన్నిధౌ,
ఎప్పుడైతే శివుడి సన్నిధిలో చదవబడుతుందో , వారికి చాలా పుణ్యం వస్తుంది..!!

శివ లోక మవాప్నోతి శివేన సహమోదతే,
శివ లోకం లభిస్తుంది .....(శివుడి లో ఐక్యమయ్యే మార్గం దొరుకుతుంది)

July 1, 2015

తిరుపతి 28 జూన్ (2015)

తిరుపతి 28 జూన్ (2015) కాలినడకన తిరుమల వెళ్ళాము.(నేను, మాపెద్దబ్బాయి, తమ్ముడు-మరదలు- మేనకోడలు & మేనల్లుడు)  


 అలిపిరి వద్ద తొలిమెట్టు 
 తిరుమల చేరుకునే మార్గమధ్యంలో ఉన్న పెద్ద హనుమంతుని విగ్రహం 

 హనుమంతుని ముందు మా పెద్దబ్బాయి & మా మేనల్లుడు 
 హనుమంతుని ముందు నేను 


 మోకాళ్ళ పర్వతం (చుక్కల పర్వతం అని కూడా అంటారు) 

పాపనాశనం
పాపవినాశన తీర్థం, పరమ పావనమైన తిరుమలలో ప్రసిద్ధ పుణ్య తీర్థాలలో ఒకటిగా వెలసింది. ఈ తీర్థంలో స్నానం ఆచరించిన సకల పాపములు నశించి, సకల కోరికలు మరియు సుఖశాంతి ప్రాప్తించును. కావున ఈ తీర్థమునకు ఈ నామము ఏర్పడింది. శ్రీ వేంకటాచల పురాణములలో పేర్కొనబడింది. పాపవినాశనము ఆశ్వీయుజ మాసమందు శుక్లపక్ష సప్తమై ఉత్తరాషాడ నక్షత్రముతో కూడిన ద్వాదశి దినముగాని తీర్థ విశేష దినముగా పాపావినాశనము గురించి స్కందపురాణంలో చెప్పబడింది. ఇచట శ్రీ గంగాభవాని మరియు శ్రీ ఆంజనేయస్వామి విగ్రహములు నెలకొల్పి తి.తి.దే వారి పురోహిత సంఘం సభ్యులచే పూజలు జరుగుచున్నవి.          





పాపనాశనం వద్ద మా మేనకోడలు, నేను, మా మరదలు   

 తిరుమల కొండలపై నుండి చూస్తే తిరుపతి పట్టణం ఎంత అందమగా కనిపిస్తోందో 



రోడ్డు మార్గంలో తిరుమల వెళ్ళేటప్పుడు, మార్గమధ్యంలో తాళ్ళపాక అన్నమయ్య వంశస్థీయులు నిర్వహిస్తున్న (నడుపుతున్న) అన్నమాచార్య సంగీత, సాహిత్య విశ్వవిద్యాలయం కనిపిస్తుంది. అక్కడ నిర్మించిన అన్నమాచార్యుని విగ్రహం.    

కర్నూలు- చిత్తూరు హైవే రోడ్డు మార్గంమధ్యలో, కడపలో ఆలంఖానపల్లెలో....  ఋషివాటిక ఆశ్రమంలో ఉన్న వెంకన్నస్వామి..... ఈ ఆశ్రమ విశేషం ఏమిటంటే ఈ స్వామికి పూజలు చేయటానికి పూజారి ఉండడు. ఎవ్వరైనా వెళ్ళి, వారికి వారే పూజలు చేసుకోవచ్చును, స్వామి పాదాలను తాకవచ్చును.       



ఆశ్రమం వెనుక గోశాల ఉంది. కబేళాలకి తరలించే గోవులను ఆదుకొని, సంరక్షిస్తున్నారు, ఇక్కడ ప్రస్తుతం 35 గోవులు ఉన్నాయి. 



అహోబిలం 27 జూన్ (2015)

అహోబిలం 27 జూన్ (2015)
స్వాతి నక్షత్రం రోజున అహోబిల నరసింహస్వామివారిని ఏది కోరుకుంటే అది సిద్ధిస్తుందంట, మేము వెళ్ళిన రోజు స్వాతి నక్షత్రం అవ్వటం వలన జనం చాలా ఎక్కువగా ఉన్నారు.       



పచ్చని చెట్లతో కూడిన కొండలు, కొండలపై నుండి కిందకి దూకే జలపాతాలు..... చూసి ఆనందాన్ని అనుభవించాలేకానీ అక్కడి ప్రకృతిని వర్ణించటం చాలా కష్టం. ఎటు చూసినా పచ్చని ప్రకృతి, జలపాతాలే కనిపిస్తాయి.    







ఒక  అబ్బాయి..... పుట్టు జుత్తులు(కేశఖండన) కోసం వారి కుటుంబం మొత్తం బస్సులో వచ్చిన దృశ్యం.        

అహోబిలం దిగువ నరసింహస్వామి కోవెల 

మేము వెళ్ళినరోజు స్వాతి నక్షత్రం అయినందువల్ల,  అహోబిలంలో దిగువ నరసింహస్వామివారికి  గరుడవాహనంపై తిరువీధి జరుపున్నారు.....