ప. మృడానీ కుండలి కుమారీ
అ.ప. గుహారణి గుహిని గుహ్నే కామారి
ప. నిత్యతృప్త నిత్యస్వరూపానందా
అ.ప. ఆత్మానందా బ్రహ్మానందా
ప. భక్త దయామృత వర్షిణీ
అ.ప. శ్రీమాతా ఆశ్రిత పాలనకరీ ॥
ప. రవిప్రఖ్యా త్రిపురసుందరీ
598. త్రికోణాంతరదీపికా
ప. త్రికోణాంతరదీపికా
అ.ప తురీయ పదగామినీ
చ.1
త్రికాలజ్ఞాన సంపన్నా
త్రివళీ త్రిజగద్వంద్యా
త్రివిష్టపా త్రిలోచనా
త్రివిక్రమ పదాక్రాంతా
చ.2
సూర్య చంద్రాగ్ని మండల మందున
పూజలందుకొను త్రిదశేశ్వరీ
త్రిలోచన మనోల్లాసినీ
మల్లికాకుసుమగాన హర్షిణీ ||
599. దాక్షాయణీ
ప. దాక్షాయణీ భక్తరక్షణీ
అ.ప దక్షప్రజాపతిసుత వేషధారిణి ॥
చ.1
స్వధర్మ పారీణ సులభా
ఆపీన పయోధరా
శ్రేష్ఠ ధర్మాత్మ వందిత
బ్రహ్మ విష్ణు సంసేవితా ॥
చ. 2
దక్షాధ్వర వినాశిని
వీరభద్ర జననీ మోహినీ
కస్తూరీ తిలకోల్లాసిని
మల్లికాసుమగానాహ్లాదిని ॥
600. దైత్యహంత్రీ
ప. దైత్య హంత్రీ నవదుర్గారూపిణీ
అ.ప కాంతారవాసినీ వరవర్ణినీ ॥
చ.1
కుంకుమ శోభిత ఫాలలోచనీ
సర్వోపద్రవ వారిణీ
త్రికాల జ్ఞాన సంపూర్ణా
బ్రహ్మవిష్ణు శివాత్మికా ॥
చ.2
పద్మరాగ మణిమేఖలా వలయిని
మారవైరి సహచారిణీ తారిణీ
మధుకైటభ మహిషాసుర మర్దనీ
మల్లికాసుమగాన వినోదినీ ॥
601. దక్షయజ్ఞ వినాశిని
ప. దక్షయజ్ఞ వినాశిని ఈశతాండవ సాక్షిణీ
అ.ప. పరమేశ్వర నిత్యానుపాయిని
చ.1
ధ్యాననామ సంకీర్తనముల
పూజా వందన కైంకర్యముల
జడులకు సైతము జ్ఞానము కలిగించు
మంగళరూపిణీ సర్వమంగళా ॥
చ.2
వింధ్యా వాసిని దాక్షాయణి
శంకరదేశిక మాన్యపదా
అష్టాదశ పీఠ నిలయినీ
మల్లికాకుసుమ గానలోలినీ ॥
602 దరాందోళిత దీర్ఘాక్షీ
ప. దరాందోళితదీర్ఘాక్షీ అభయప్రదాయినీ
అ.ప ఆకర్ణాంత విశాలలోచనీ కరుణామృత వీక్షణీ!!
చ.1
మన్మధుని బ్రతికించిన కాతరేక్షణి
గణేశుని లాలించే ఈశ్వరేక్షణి
కమనీయదరస్మిత హరిణేక్షణీ
కుంచిత భ్రూ చాపాంచిత విశాలాక్షిణి ॥
చ.2
కామారినేవరించిన కామాక్షీ
మహిషాసుర మదమణచిన రక్తాక్షీ
మూగకైన కవితనొసగు కరుణాకటాక్షీ
మల్లికాసుమగాన చంచలాక్షీ ॥
603. దరహాసోజ్వలన్ముఖీ
ప. దరహాసోజ్వలన్ముఖీ సుముఖీ
అ.ప హిమవత్పర్వత వంశభూషణీ ॥
చ.1
నీలారవింద లోచనా
లోలాలక అలికేక్షణా
సోమార్ధ ముద్రిత కుంతలా
కాలకంఠ సహధర్మచారిణీ ॥
చ.2
పరమేశునిమది ఝల్లుఝల్లుమను
నీచిరునవ్వే అమృతపుజల్లు
సర్వేశ్వర హృదయస్పందినీ
మల్లికాకుసుమగానప్రేరణీ ॥
604. గురుమూర్తిః
ప. సుజ్ఞానజ్యోతిని వెలిగించే గురుమూర్తి
అ.ప అజ్ఞానతిమిరములు తొలగించు గురుమూర్తీ॥
చ.1
అఖండమండలాకారమై
విశాలవిశ్వమున వ్యాపించిన
గురువే విష్ణువు గురువే బ్రహ్మా
గురువే అధికుడు మహేశుడు ||
చ.2
ఆది గురువులు ఉమామహేశులకు
అనాదిగురువు దక్షిణామూర్తికి
హాదిగురువు శంకరాచార్యులకు
మల్లికాకుసుమ గానాంజలులు ||
605. గుణనిధి
ప. సత్వరజస్తమో గుణనిధి
అ.ప జ్ఞాన వైరాగ్యాది సద్గుణ నిధి ॥
చ.1
నవవ్యూహాత్మక పరానంద
పరాశక్తి చిదానంద భైరవి
నిర్గుణ సగుణ బ్రహ్మోపాసనా
చింతిత ఫలపరిపోషణా ॥
చ. 2
కారణాచతుర యశోనిధి
స్వప్రకాశ చైతన్య రూపనిధి
భక్త జనాశ్రయ కృపాపయోనిధి
మల్లికాకుసుమ గాన సుధానిధి ॥
606. గోమాత
ప. గోమాత నీకు వందనములమ్మా
అ.ప మాఇంట వెలసినమహలక్ష్మివమ్మా ॥
చ.1
బ్రహ్మాది దేవతలు నీలోననిలచి
నాల్గుపాదములతో ధర్మమునునిలుప
నీక్షీరమే అమృతధారలై కురిసి
సకలలోకాలకు జీవనము నందించు॥
చ.2
నీపంచగవ్యములు పంచామృతములై
యాగములలో భాగమై నిలచునే
నీ పంచితమే గంగతీర్ధమ్ముగా
పంచపాతకములను హరియించునే ||
607. గుహజన్మభూః
ప. పంచకోశాంతరస్థితా గుహజన్మభూ
అ.ప. భక్త హృదయ నివాసినీ హాసినీ ॥
చ.1
గుహ్యా గురుగుహజననీ
ఈశ్వరత్వ విధాయినీ
ఈతిబాధావినాశినీ
హత్యాది పాపశమనీ
చ.2
బ్రహ్మానపాయినీ బ్రాహ్మణీ
కారణపర చిద్రూపా
కఠిన స్తనభర నమ్రా
మల్లికాకుసుమ గానవినమ్రా ॥
608. దేవేశీ
ప. దేవేశీ త్రిపురాధి వాసిని
అ.ప హరిద్రా కుంకుమ లిప్తాంగీ ॥
చ.1
ఇంద్రాదిదేవతలు దాసభావముతో
నీచరణ యుగమును ఆశ్రయింతురే
సర్వాంగ సుందర నిత్యయౌవ్వనా
హస్తి కృత్తి ప్రియాంగనా ॥
చ.2
నీపాదోద్భవ పరాగములు
మాజీవితములను రక్షచేయునే
లాక్షా రసాలంకార పాదపద్మయుగళా
మల్లికాసుమగాన సంకీర్తితా ||
609 దండనీతిస్థా
ప. దండనీతి నీతిశాస్త్ర విశారదా
అ.ప సకలశాస్త్ర విజ్ఞాన నైపుణీ ॥
చ.1
విజ్ఞాన బోధకమైన విద్యలను
ధర్మార్ధ విచక్షణలను
అర్ధానర్ధ బోధకములను
భక్తులకు బోధించు శుకపాణి వాణి ॥
చ.2
దుర్మార్గులను దండనచేసి
సన్మార్గులను రక్షణ చేసే
చిరతర సుచరిత కలభా
మల్లికాకుసుమ గానసులభా ॥
610. దహరాకాశరూపిణీ
ప. హృదయకమల విహారిణీ దహరాకాశ రూపిణీ
అ.ప యోగాతీత హృదయా శ్రీకరీ ॥
చ.1
నాదబిందు కళాత్మికా
బ్రహ్మ విష్ణు శివాత్మికా
సూర్యతేజ చంద్రశీతల
చిదంబర శరీరిణీ
చ.2
యోగినీహృదయ పంకజవాసిని
అణురేణుతృణకాష్ట స్వరూపిణీ
మందహాస మనోజ్ఞసుందరీ
మల్లికాకుసుమ గానవైభవీ ॥
611. ప్రతిపన్ముఖ్యరాకాంత తిధిమండల పూజితా
ప ప్రతిపన్ముఖ్యరాకాంత తిధిమండల పూజితా
అ.ప షోడశ కళారూపిణి బాలాత్రిపురసుందరీ ॥
చ.1
పాడ్యమినందు పూజలందుకొను కామేశ్వరి
విదియ తదియలందు భగమాలిని నిత్యక్లిన్నా
చవితియందుభేరుండ పంచమిన వహ్నివాశిని
షష్టి యందు వజ్రేశ్వరి సప్తమితిధి శివదూతి॥
చ. 2
అష్టమి నవమినందు త్వరితకులసుందరి
దశమినందు నిత్య ఏకాదశి నీలపతాక
ద్వాదశివిజయత్రయోదశిసర్వమంగళ
చతుర్దశి జ్వాలామాలిని పూర్ణిమ చిత్రారూపిణి ॥
612. కలాత్మిక
ప. సర్వకలామయీ కలాత్మికా
అ.ప కనకరుచిశీలా శ్రీకళా
చ.1
చంద్రకళలు అగ్ని కళలు
సూర్యకళల స్వరూపిణీ
నాదబిందుకళాధరీ
కలమంజుల భాషిణీ ॥
చ.2
రవిచంద్రాగ్ని లోచనీ
కందర్ప శతకోటిరూపిణీ
కంబుకందరు సహచారిణీ
మల్లికాకుసుమగానకారిణీ ॥
613. కలానాధ
ప. చంద్రకళాధరి కలానాధా
అ.ప చంద్రమండల వాశిని ॥
చ.1
చంద్రభాసమాన చంద్రచూడా
చంద్రావతంస సహధర్మ చారిణీ
ఆదిమపురుష నయనపీయూష
మధురదనుషా చిద్వపుషా ॥
చ.2
కామేశ్వరీ భగమాలినీ యనుచు
పదహారు కళలతో విలసిల్లు దేవీ
షోడశ తిధులందు పూజలందుకొను
మల్లికాసుమగాన మంగళచరణీ ॥
614. కావ్యాలాప వినోదినీ
ప. కావ్యాలాప వినోదినీ కామేశ్వరీ
అ.ప సంగీత సాహిత్య సరసవినోదిని
చ.1
నీగానములే మాకు పానము
నీనామములే మాకు ప్రాణము
వెతికి వెతికి నే వేసారితినే
మమ్ము కావగా జాలమేలనే
చ.2
శృతి రాగ లయ విన్యాసినీ
వీణాగాన వినోదమోహినీ
సత్కవీ హృదయనివాశినీ
మల్లికాసుమగానాలాపినీ
615. సచామరరమావాణీ సవ్యదక్షిణ సేవితా
ప. సచామరరమావాణీ సవ్యదక్షిణ సేవితా
అ.ప. కాదంబవనవిహారిణి సర్వమంగళకారిణీ ॥
చ.1
స్వర్ణమణిమయ కంకణములు
హారములు కానుకలనిచ్చి
కురులుదువ్వి పూలు ముడిచి
లక్ష్మి సేవలు చేయునే
చ.2
పసుపు పూసి గంధమలది
నుదుట కుంకుమ రేఖ దిద్ది
మల్లికాసుమగానములతో
వాణి హారతులిచ్చునే ॥
616. ఆదిశక్తి
ప ఆదిశక్తి శరణు శరణు
అ.ప మహాశక్తి శరణు శరణు
చ.1
భువనమోహిని సింహవాహిని
త్రిపురాధి వాశీని శరణు శరణు
ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి
క్రియాశక్తి శరణు శరణు ||
చ.2
నిర్వికారిణి సాధు' పోషిణి
ఆర్త రక్షణి శరణు శరణు
మల్లికాసుమ గానవిలసిత
శివశివానీ శరణు శరణు ॥
617. అమేయాత్మా
ప. అమేయాత్మా విశ్వాత్మా
అ.ప సృష్టిస్థితిలయ కారణా ॥
చ.1
అణువుకన్నా చిన్ననైనది
జగములన్నీ నిండియున్నది
ఆది మధ్య అంతములేనిది
సత్యమైనది నిత్యమైనది ॥
చ. 2
జ్ఞానమయమై విశుద్ధమై
ఆనందమయమై అనంతమై
బ్రహ్మమై పరబ్రహ్మమై
మల్లికాసుమగానమైనది ॥
618. పరమా
ప. పరమా ప్రేమామృత సాగరీ
అ.ప నిత్యసనాతనీ పరమపూజ్యా ॥
చ. 1
పరాశక్తి పరమాత్మికా
పరాన్ముఖమేలనే పరాత్పరీ
చిదగ్ని సముద్భవా
పరతంత్రా త్రిపురేశ్వరి ॥
చ.2
నిఖిల వాగ్విభూతి
అఖిలతంత్ర రూపిణివి
పరానంద సంధాయిని
మల్లికాసుమగాన హృదయా॥
619. పావనాకృతి
ప. విశ్వవికృతిమయీ పావనాకృతీ
అ.ప గంగాధర పరతంత్రీ ॥
చ.1
కళ్యాణీ సంకల్పసిద్ధాకృతీ
కంబుకంధరు రాణి సులభాకృతీ
అరవిందాసనీ కృతప్రకృతీ
కనకమణికలిత శృంగారాకృతి |
చ. 2
విద్రుమశూలినీ సూక్ష్మాకృతీ
సిందూర రంజితా స్థూలాకృతీ
నిత్యప్రసన్నా హ్రీంకారాకృతీ
మల్లికాకుసుమ సంగీతాకృతీ ॥
620 అనేకకోటి బ్రహ్మాండజననీ
ప అనేకకోటి బ్రహ్మాండజననీ
అ.ప పరశివ వామాంక నిలయినీ ॥
చ.1
విద్రుమశాలినీ సురజన పాలినీ
బ్రహ్మాండ భాండోదరీ మహేశచాలినీ
సమరోద్దండ విపక్ష కాలినీ
భైరవ మండలినీ నాట్యవిలోలినీ ॥
చ. 2
కైవల్యానందా శుభగుణ శాలినీ
ఫణిరాజభూషణి దనుజదలినీ
మల్లికాసుమగాన రసాహ్లాదిని
కామేశ్వర హృత్కేళినీ శూలినీ ॥
621 దివ్యవిగ్రహా
ప. దివ్యవిగ్రహా హైమవతీ
అ.ప బహుశోభమానా దాక్షాయణీ
చ.1
కరుణామృతము చిలుకు నీకటాక్షములు
శివుని హృదయమున రాగబంధమును
మునుల హృదయమున వైరాగ్యబంధమును
కలిగించునే త్రిపురతాపన పత్నీ ॥
చ.2
ఒక్కక్షణము నీచూపుసోకినచాలు
ఆజన్మ కురూపి మన్మాధాకారుడౌను
పుట్టుమూగకు కవితలబ్బును
మల్లికాకుసుమగాన సంచారియగునే ॥
622 క్లీంకారీ
ప. సదాశివమయీ క్లీంకారీ
అ.ప పరశివమయ పుష్ప పర్యంకా॥
చ.1
ఏకవీర సంసేవ్యా
సర్వాతిశయ ప్రభాభాసురా
ఏకాతపత్ర సామ్రాజ్యప్రద
కలానాధముఖీ కామేశీ ॥
చ.2
కామితార్ధమునిచ్చు కామేశ్వరీ
క్లీంకార రూపిణీ రాజేశ్వరీ
హ్రీంకారలక్షణా త్రిపురేశ్వరీ
మల్లికాకుసుమగాన పీఠేశ్వరీ||
623 కేవలా
ప. కరుణాలవాలా కేవలా
అ.ప కలావినోదినీ కైవల్య ॥
చ.1
హ్రీంకారనందనారామా
నవకల్పకవల్లరీ
నిత్యకల్యాణశీల
సర్వాంగసుందరీ
చ.2
శివానంద సంధాత్రీ
జగదేక జనయిత్రీ
సర్వజన వందితా
మల్లికాసుమగానకేవలా॥
624 గుహ్యా
ప. రహస్య మంత్రార్ధ రూపిణీ గుహ్యా
అ.ప షోడశీ మంత్రార్ధ రహస్య శ్రీవిద్య ॥
చ.1
మాతృకా బీజ రూపిణీ
బ్రహ్మవిద్యా ప్రదాయినీ
మృణాళీ తంతురూపిణీ
సర్వ మంత్ర ఫలప్రదాయినీ ॥
చ. 2
ఈషణ త్రయనిర్ముక్తా
ఈంకారమంత్రాత్మికా
రజతాచలవాసినీ
మల్లికాకుసుమగాన హంసికా ॥
625 కైవల్యపదదాయినీ
ప కైలాస నివాసినీ కైవల్య పదదాయిని
అ.ప శరణాగత దీనార్ధ పరిత్రాణ పరాయణీ ॥
చ.1
ఆదిమధ్యాంత రహిత షోడశీ
తాపత్రయ విమోచనీ వైష్ణవీ
సంసార విషనాశని శాంకరీ
ఉత్తమపద ప్రదాయినీ శ్రీకరీ ॥
చ. 2
ద్యుతిమతీ ధీమతీ
శశిశేఖర ప్రియసతీ
రజతాచలవాసినీ అందుకొనుము మావినతీ
మల్లికాసుమగాన సన్నుతీ ॥
626 త్రిపురా
ప త్రిలోకవాసినీ దేవీత్రిపురా
అ.ప త్రిపురాసుర సంహారిణి ॥
చ.1
త్రైలోక్య మోహనాంగి
త్రిలోకపావనీ
సంహార త్రయ కారిణీ
త్రికాల జ్ఞానదాయినీ
చ.2
ఏకభక్తి మదర్చితా
మైథిలీవరసేవితా
సమానాధిక వర్జితా
మల్లికాసుమగాన సంస్తుతా ॥
627 త్రిజగద్వంద్యా
ప. త్రిజగద్వంద్యా మంగళ చరితా
అ.ప నటితనటీ నటరాజమోహినీ ॥
చ.1
నీపదయుగళము నెన్నుదిటితో తాకి
శతకోటి వందనములను చేతుమే
నానుదిటి పైనున్న దురదృష్టరేఖలను
నీపాదరజముతో తొలగింపవే ॥
చ.2
పాపముల కడతేర్చి కోరికలు ఈడేర్చి
ఈతిబాధలు తీర్చి కరుణతో దరిజేర్చవే
శర్వాణి రుద్రాణి కళ్యాణ కారిణీ
మల్లికాసుమగాన మంగళదాయినీ ॥
628 త్రిమూర్తిః
ప. దివ్యరూప కన్యకామణి త్రిమూర్తి
అ.ప లక్ష్మీ వాణీ నిషేవితా సుందరమూర్తి॥
చ.1
సుందర మహనీయ చిద్విలాస మూర్తి
సిందూరారుణ శాలిని మంగళమూర్తి
నీలకంఠ ప్రియాంగనా శృంగారమూర్తి
రిపుమర్దిని సురపాలిని ధర్మమూర్తి ॥
చ.2
యోగీంద్రజనమానస యోగమూర్తి
ఓంకారనాదప్రియ ఓంకారమూర్తి
బ్రహ్మజ్ఞాన త్రిగుణాత్మికా పావన మూర్తి
మల్లికాసుమగాన మోహన మూర్తి ॥
629 త్రిదశేశ్వరీ
ప. సృష్టి స్థితి లయ త్రిదశేశ్వరి
అ.ప నిత్యయౌవ్వనా రాజేశ్వరీ॥
చ.1
త్రిగుణాతీత త్రిజగన్మాత
త్రిమూర్తి రూపా త్రిజగద్వంద్యా
త్రిలోకమోహన త్రిమూర్తి పూజితా
త్రికోణార్చితా త్రిపురమాలినీ ॥
చ.2
త్రివర్గాత్మిక త్రివర్ణాత్మిక
త్రిపధ గామినీ త్రిస్వర త్రిపురా
బ్రహ్మవిద్యా శివతత్వరూపిణి
మల్లికాకుసుమగాన త్రినేత్రీ ॥
630 త్ర్యక్షరీ
ప శుద్ధ విద్యా కుమారీ త్ర్యక్షరీ
అ.ప త్రివర్ణ మంత్ర స్వరూపిణీ ॥
చ.1
వాగ్భవ బీజ వాగీశ్వరీ
వైభవ మోక్షరూపిణీ
కామబీజాత్మక కామేశీ
క్రియాశక్తివి కామరూపిణీ ॥
చ. 2
శక్తిబీజాత్మిక పరాశక్తి
ఇచ్ఛాశక్తివి శివరూపిణి
అక్షరత్రయ విభాగరూపిణి
మల్లికాకుసుమగాన దాయినీ ॥
631 దివ్యగంధాడ్యా
రాగం - ఆనందభైరవి
ప. శృంగారవేషాఢ్యా దివ్యగంధాఢ్యా
అ.ప మరకతమణిమయ అలంకారప్రియా ॥
చ.1
ఘనసార హారవలయా
సుందరతర పరదేవతయా
కరుణారస కింకరయా
సూర్యప్రభావిరాజితయా
చ. 2
కామేశాలింగన పులకాంకితయా
నిరుపమానంద కందళితహృదయా
హ్రీంకారనందనోద్యాన నిలయా
మల్లికాకుసుమగాన పరిమళయా |॥
632 సిందూరతిలకాంచితా
రాగం - కాపీ
ప. సిందూరతిలకాంచితా
అ.ప మల్లికాకుసుమసంశోభితా
చ.1
నీఫాలమున రక్తకుంకుమై మెరవనా
నీకంటిపాపనై నివసింపనా
రత్నాల హారమై నీకంఠసీమలో
అందాలు చిందింపనా॥
చ.2
తాంబూలరసముతో తడిసిన అధరాల
మందస్మితమునై హరుగెలవనా
మణిమేఖలైనేను శోభించనా
అందెనైనీపాదమున రంజిల్లనా॥
633 ఉమా
రాగం - కానడ
ప. ధరాధరేంద్ర నందినీ ఉమా
అ.ప సింధువనదేవతాప్రణవస్వరూపిణీ ॥
చ.1
హిమవంతుని గారాల పట్టివై పుట్టి
శివుని భర్తగా వరించి తపసుచేయ పోవగా
ఓయమ్మా వద్దనివారించెనుమేనక
ఉమా అన్న నామమే సార్ధకమై నిలచెను ॥
చ. 2
అ.. ఉ.. మకారములు ఓంకారము
ఉమానామమే దేవీప్రణవము
పంచభూతాత్మికము త్రిమూర్త్యాత్మకము
మల్లికాకుసుమగాన శక్త్యాత్మకము
634 శైలేంద్ర తనయా
రాగం - వలజి
ప
శైలేంద్ర తనయా సదయ హృదయ
కైలాసగిరి నిలయా కరుణాలయా||
1.
పార్వతీ కాత్యాయని గౌరీ ఉమా
మేనకా హిమవంతుల పూజాఫలమా
చంద్రాభరణా పుర హరజాయా
అద్రిసుతా అపర్ణా శంకర నయనామృతా
2.
లబ్దపతీ స్వానురాగ శరదిందు చంద్రికా
శివపాద పూజితా శివనిధీ విభాసిని
శీతాలోచనపాతా శాశ్వతీ మాతా
మల్లికా కుసుమగాన పల్లవితా
635. గౌరీ
ప. జయ జయ గౌరీ శ్రీ గౌరీ
అ.ప జయనగరాజకుమారీ ॥
చ.1
మంగళ దాయిని మంగళగౌరీ
షోడశకళలతో వెలిగేదేవీ
షోడశ పూజలు చేసెదమమ్మా
గౌరాంగసతీ వరమీయవమ్మా ॥
చ.2
అష్టసంపదలనిచ్చు సంపదగౌరీ
సౌభాగ్యమునిచ్చు షోడశగౌరీ
కేదారేశ్వరి కేదారగౌరీ
మల్లికాసుమగాన నిరుపమగౌరీ ॥
636. గంధర్వ సేవితా
రాగం - కేదారగౌళ
ప. గంధర్వ సేవితా సుమధురచరితా
అ.ప దివ్యహార ప్రలంబితా ॥
చ.1
పంచక్రోశ పరీతపూత
దక్షిణాచారవందితా
సంతత సదాశివార్చితా
కామేశాలింగనా పులకితా ॥
చ.2
వీణావేణు మృదంగ వాద్యముల
మల్లికాకుసుమ సంకీర్తనముల
గంధర్వ యక్ష కిన్నెర ప్రమధుల
సేవలనందే రాజరాజేశ్వరి ॥
637. విశ్వగర్భా
ప. మాయాస్వరూపిణి విశ్వగర్భా
అ.ప. విశ్వవినోదిని విశ్వకారిణీ ॥
చ.1
జలరూపమున భూమిరూపమున
అగ్నిరూపమున వాయురూపమున
ఆకాశములో మాయారూపమున
విశ్వమంతయూ గర్భములోదాచు
చ. 2
పంచభూతముల శాసించు దేవీ
పంచాగ్నుల మించినతేజమునీదీ
మల్లికాకుసుమగాన మర్పింతుమమ్మా
అవనికి శుభమును కల్పించుమమ్మా ॥
638 స్వర్ణగర్భా
శ్రీరాగం - రాగం
ప. స్వర్ణగర్భా రత్నగర్భా ధరాధరనందినీ
అ.ప స్వర్ణ మణిమయ సింహాసినీ ॥
చ.1
మణిద్వీపనివాసినీ స్వర్ణగౌరీ
శుభానన్దగుణార్ణవీ ఆర్యా
చారుచంద్ర కళాధరీ తేజోమయీ
పరమేష్టి పరబ్రహ్మరూపాధికా ॥
చ.2
అష్టాదశ పీఠవాసిని అపర్ణా
విద్యాధిదేవతా హిరణ్యవర్ణా
సర్వపాపభంజనా సువర్ణా
మల్లికాకుసుమగాన సవర్ణా ॥
639. అవరదా
స్వరకర్త - శ్రీమతి భారతీదేవి
రాగం - శివరంజని
ప పరాకేలనే అవరదా ! పరాత్పరీ
అ.ప వరాలొసగవే బిరాన మముగని ॥
చ.1
నిరాదరించుట నీకుతగునా
చరాచరాత్మిక పురాతనీ
నేరములెంచక సరగున బ్రోవుము
సారసలోచని శాంతదయాపరా ॥
చ.2
అష్టదిక్పాలికా వందిత
అష్టాదశపీఠ పూజితచరణీ
క్రూరదానవమదసంహారిణి
మల్లికాకుసుమగాన వరదా ॥
640 వాగధీశ్వరీ
స్వరకర్త - కొమ్మూరి రాజేశ్వరి
రాగం - మోహన
ప. వాగధీశ్వరీ వాగేశ్వరి
అ.ప భారతి వాణీ సరస్వతీ ॥
చ.1
పరాపశ్యంతి వైఖరి మధ్యమా
పరదేవత వాగ్దేవతాస్వరూపిణి
సర్వశ్రేయప్రదా 'మేధాప్రదా
నవనవాద్భుత రమణీయగానప్రద |॥
చ.2
కనకవల్లకీ ధారిణి బ్రాహ్మణి
సంగీతానంద శుభదాయిని
సాహిత్యామృత సారసలోచని
మల్లికాసుమ గానాస్వాదీని ॥
641 ధ్యానగమ్యా
ప ధ్యానగమ్యా అగమ్యా
అ.వ అనంతా అవ్యయా అలుప్తా సర్వజ్ఞా ॥
చ.1
హ్రీంకారబోధితా వేదశాస్త్ర సన్నుతా
ధ్యాన యోగాత్మికా చరాచర విధాయినీ
సహజసుఖస్వరూపా కుతూహల విభ్రమా
కైవల్యానంద కంద సగుణబ్రహ్మ ॥
చ.2
నిర్గుణా నిరాకారానిత్యానందదాయినీ
షడ్భావ వికార రహితస్వరూపిణీ
అఖండశాశ్వత పరమానందా
మల్లికాకుసుమగానయోగినీ
642 అపరిచ్ఛేద్యా
ప. అపరిచ్ఛేద్య అనంతమయా
అ.ప సత్యజ్ఞానానంతమయా ॥
చ.1
అణువణువులోనా నీరూపమే
ప్రతిజీవిలోన నీకాంతులే
నినుకొలుచువారలకు ఉన్నతిని కల్పించి
దివ్యమహిమలనిచ్చు వనదుర్గా ॥
చ.2
నీకరుణ లేశముచూపి దురితములను బాపి
దుఃఖములు వారించి సంతోషమును నిలిపి
పరమార్ధమును కూర్చవేముక్తిప్రదా
మల్లికాకుసుమగానశుభదా ॥
643 జ్ఞానదా
ప. బుద్ధిదాయిని మోక్షదాయిని జ్ఞానదా
అ. ప తుష్టిదాయినిపుష్టిదాయినిశర్మదా ॥
చ.1
ప్రకటయోగిని గుప్తయోగిని
జ్ఞానయోగిని మోక్షదా
విశ్వమోహిని విశ్వసాక్షిణి
విశ్వవ్యాప్తిని విశ్వదా ॥
చ.2
జ్ఞానప్రద ముక్తిప్రద విజయప్రద ద్వివిధా
సూక్ష్మరూపసూక్ష్మతరసూక్ష్మతమ కామదా
జ్ఞానశక్తి కామశక్తి క్రియాశక్తి శక్తిదా
మల్లికాకుసుమగానదా ఘనదా ॥
644 జ్ఞానవిగ్రహా
ప జ్ఞానానందిని జ్ఞానవిగ్రహా
అ.ప పరమ శాంభవీ చిదానంద ఘనవిగ్రహా ॥
చ.1
సకలజ్ఞాన పరమార్ధ ప్రబోధకా
అకలంకహృదయ మోహార్ణవ తారకా
మంత్రాక్షర సంకేత మాలికా
త్రిపురసుందరి పరాభట్టారికా ॥
చ.2
జరామృత్యురోగ విమోచక
విద్వజ్జన సాధనారేచకా
అవ్యయ నిర్మల చిదాత్మ వాచకా
మల్లికాకుసుమగాన ప్రేరకా॥
645 సర్వవేదాంతవేద్యా
ప. సర్వవేదాంతవేద్యా ఉపనిషత్ సారా
అ. ప యమనియమాది అష్టాంగయోగినీ ॥
చ.1
చతురాశ్రమధర్మములు
వేదవిహిత ఆచారములు
యజ్ఞ యాగాది క్రతువులు
నియమించే కులవర్ధని ॥
చ.2
అసదృశ సౌందర్య రాశి
వసియింపుము నాహృదయమరసి
పరశివ ప్రేమాభిలాషి ||
మల్లికాసుమగాన సరసి
646. సత్యానంద స్వరూపిణీ
ప. సత్యానంద స్వరూపిణీ సర్వజగద్రక్షకీ
అ. ప అగణితబ్రహ్మానందసద్గురుపరమానంద ॥
చ.1
సర్వాంతర్యామిని
సకలలోక కళ్యాణకారిణి
సామాది చతుర్వేద సమ్మత
సదతుల తైజసాత్మికా ॥
చ.2
రవి శశి వహ్ని కిరణ సుశోభిత
సుషుమ్నాది శక్తిరూప
సుధాసారాభి వర్షితా
మల్లికాకుసుమగాన విహ్వలా ॥
647 లోపాముద్రార్చితా
ప. శ్రీవిద్యా లోపాముద్రార్చితా
అ.ప పంచదశిమహామంత్రపూజితా ॥
చ.1
సకలయోగి వినుతచరణా
విశ్వత్రాణ పుషే
సురభి బాణజుఫా
పరంజ్యోతిషే చిద్వపుషే ॥
చ.2
మణికలితభూషే మధురధనుషే
కారుణ్య విభ్రమ జుషే
శివ ఐశ్వర్య వపుషే
మల్లికాసుమగాన విదుషే ॥
648 లీలాక్లప్తబ్రహ్మాండమండలా
ప. లీలాక్లప్త బ్రహ్మాండమండలా కపాలకుండలా
అ.ప లీలానాటక సూత్రధారిణీ ॥
చ.1
సృష్టి చేసెదవు లయము చేసెదవు
పాలనచేతువు లాలనచేతువు
నీవుకోపింతువు మముకరుణింతువు
నీలీలను తెలియగతరమా ॥
చ.2
ప్రపంచమంతా కందుకముచేసి
ఆజాండబంతులాడుచుండెదవు
లీలామానుష విగ్రహరూపిణి
మల్లికాకుసుమగాన సారిణి ॥
649 అదృశ్యా
ప. ఎందుంటివే తల్లీ అదృశ్యా
అ. ప చూపులకందని నీవెవరే ॥
చ.1
ఎవ్వరివో నీవు ఊహించలేను
ఏపేరుననిను నే పిలువగలను
నాహృదయములో నిండియుంటివే
అక్షయసౌఖ్యములొసగవె వశ్యా ॥
చ.2
తపమల్పముచేసి ఫలమధికముకోరి
అత్యాశగానిన్ను వేడుకొందుమే
కనుపాపవలెమము కాపాడుము
మల్లికాకుసుమగానవిశుద్ధా ॥
650 దృశ్యరహితా
ప. ఎందని నినునేవెదకుదునే దృశ్యరహితా
అ.ప వెదకి వెదకి వేసారితినే ॥
చ. 1
అండములోనా పిండములోనా
బ్రహ్మాండములోనా అణువణువులోనా
వెలుగులోనా చీకటిలోనా
హృదయములోని శూన్యములోనా॥
చ.2
పలుకులకందవు పిలుపులకందవు
చూపులకందవు తలపులకందవు
మల్లికాకుసుమ గానమునందున
ఉందువు నీవని నమ్ముకొంటినే ॥
651 విజ్ఞాత్రీ
ప. సుజ్ఞానరూపిణీ వి జ్ఞాత్రీ
అ.ప సర్వప్రపంచ సాక్షీభూతా !
చ.1.
సర్వేశ్వరుడన నీపతియే
కుమారుడనగా నీతనయుడే
ఆదిపూజితుడు నీసుతుడే
ఆది అనాదియు నీకుటుంబమే ॥
చ.2
సురుచిర శుభకర మంత్ర స్వరూపిణి
వందన చందనమందుకొనగదే
మల్లికాసుమరాగ భావమాలికల
నిన్నుకొలుచుటే నాభాగ్యముగా ॥
652 వేద్యవర్జితా
ప. వేద్యవర్జితా ఈడితా
అ. ప ఈశ్వరార్ధాంగశరీరా ఈప్సితా||
చ.1
తాదృశ చైతన్యస్వరూపిణి
ఈశానాది బ్రహ్మమయీ
దివ్యతపోమార్గదర్శినీ
తత్వార్ధరూపాత్మికా ॥
చ. 2
నీకటాక్షమహిమాతిశయమున
కవితామృతములు జాలువారునే
దభరిత రసవంతమై నిలచు
॥ శ్రీ మల్లికాసుమగాన కవితలీయగదే॥
653 యోగినీ
ప. యోగినీ కులయోగినీ
అయోగినీ గణ సేవితా ॥
చ.1
శివసందర్శనా కుతూహల యోగిని
పరమానంద సుఖానుభవ యోగిని
కామ క్రోధ వివర్జితాయోగిని
మహాప్రత్యంగిరాదేవతాయోగిని ॥
చ.2
పురాణాగమ రూపయోగినీ
లీలామానుష విగ్రహ యోగినీ
బ్రహ్మజ్ఞానైకసాధనా యోగినీ
మల్లికాకుసుమగాన యోగినీ ॥
654 యోగదా
ప ఓం నమోభగవతీ యోగదా
అ.ప సుజనరక్షా దీక్షితా శుభప్రదా॥
చ.1
భక్త శ్రేణికి ఆరాధ్యదేవతవు
ఆడంబరులకు ఆత్మదుర్లభవు
ఆశ్రితురాలను ఆనందవల్లీ
నిను సేవించేభాగ్యమునిమ్మా॥
చ.2
బాహ్యమునందున వెలుగువునీవై
అంతరమందున జ్ఞానదీపమై
పరమార్ధమునిచ్చు యోగదీపమై
మల్లికాసుమగాన జ్యోతివినీవు।
655 యోగ్యా
ప. యోగిజన సేవ్యా యోగ్యా
అ.స మేరుశృంగాగ్రమున నివసించు దేవీ ॥
చ.1
త్రిజగద్వంద్య పదారవిందా
నీరూపమును మేమువర్ణింపలేము
నీదయకల్గుచో సకలార్ధములు కలుగు
భవబంధములుబాపు నీపదము సేవింతు
చ.2
నిన్నుపూజించినా నీపేరుతలచినా
మరుజన్మమేలేదు సురరాజ పూజితా
ధర్మము తప్పని జీవనమునీయవే
మల్లికాకుసుమగాన నవరాగ మాలినీ ॥
656 యోగానందా
ప శివశివాత్మికా యోగానందా
అ.ప అధర్మదండినీ కళ్యాణీ!!
చ.1
రాగభోగాతీత సకలలోకారాధ్య
నవకోటి యోగినీ గణసేవితా
సంసార విషవృక్షనిర్మూలనా
అఖండమోక్షానంద యోగినీ ॥
చ.2
దీనావనోల్లాస నిత్యదయాశీలా
పునర్జన్మ రహిత ముక్తిప్రదాయినీ
అష్టాంగమార్గ యోగానందా
మల్లికాకుసుమ గానానందా ॥
657 యుగంధరా
ప. కాలస్వరూపిణి యుగంధరా
అ. ప సాంప్రదాయస్థితా సమరసా॥
చ.1
ధర్మరక్ష బహురూపములుదాల్చి
జగములను పాలించు భువనేశ్వరీ
యుగములకు జగములకు సాక్షిగా నిలచిన
నిత్యదయశీల హరిణేక్షణా |
చ.2
దుష్టులను శిక్షించు ధీరసమర్చితా
శిష్టులను రక్షించు ధర్మాత్మికా
దుష్టకలి దోషములువర్ణించి బ్రోవుమా
మల్లికాసుమగాన సంతుష్టినీ ||
658 ఇచ్ఛాశక్తిజ్ఞాన శక్తి క్రియాశక్తిస్వరూపిణీ
ప. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియా శక్తి స్వరూపిణీ
అ.ప రమా వాణీ కళ్యాణీ ॥
చ.1
జ్ఞానమునొసగే శరదిందు శుభ్రా
సంపదలొసగే నవవిద్రుమాభా
రాక్షస సంహారి తమాలనీలా
త్రిలోకజననీ తవపాదశరణం ॥
చ.2
ఓఢ్యాణ పీఠేశ్వరి గిరిజాకుమారి
కొల్హాపురేశ్వరి శ్రీ మహాలక్ష్మి
కాశ్మీరమందున శ్రీ శారదాంబా
మల్లికాసుమగాన సుమనోహరీ ॥
659 సర్వాధారా
ప. జగదాధారా సర్వాధారా
అ.ప జననీ స్మితమంజరీ
చ.1
కల్మషక్లేశా మోచనకరీ ...
మమతారూపిణిగిరాదేవీ
సుజననయనా నందజననీ
త్రిభువన క్షేమంకరీ సుధామయీ ॥
చ.2
సమస్త వర్ణాత్మిక నాదరూపిణి
కవులపాలిటి భాగ్యసీమా
శమితదురితా కారుణ్యసీమా
మల్లికాకుసుమగానసుషమా॥
660 సుప్రతిష్ఠా
ప. సుప్రతిష్ఠా ప్రతిభా ప్రదాత్రీ
అ. ప సకలదేవతా అధినాయికా
చ.1
హిమగిరి భాగ్యమా స్మితకౌముదీ
కుటిలబోధసంహారిణి
చంచలీకృత త్రిపురశాసనా
పురమధన సామ్రాజ్య విహరిణి|
చ.2
నిగమమకుటోత్తంస కలికా
ప్రజ్ఞానామృత వరదాయినీ
నిత్యాలంకార అభిషేక ప్రియ
మల్లికాకుసుమగానామృత వర్షిణి |
661. సదసద్రూపధారిణీ
ప సదసద్రూపధారిణీ శ్రీకరీ
అ.ప కృపాతిశయకింకరీ శాంకరీ
చ.1
కందర్పప్రియసహచరీ అనఘా
మరకతప్రభానీల కమలతరళాక్షీ
తరుణాదిత్యకిరణచరణా
కారుణ్యామృత వీచికా విహరణా ||
చ.2
పరమసంవేదికాత్మికా సద్రూపిణి
పశ్యంతీ మధ్యమా వైఖరి వాగ్రూపిణి
మహితరూప శోభావతి తీక్షణి
మల్లికాకుసుమగాన వీక్షణి ||
662 అష్టమూర్తి
ప అష్టమూర్తి రూపిణీ శ్రీలలితా
అ.ప గుణభేదాత్మ మూర్తీ ॥
చ.1
లక్ష్మీమేధాధరపుష్టి
గౌరీ తుష్టి ప్రభాధృతి
శుద్ధాత్మ భూతాత్మ
అష్టాత్మ రూపిణీ
చ.2
భవుడు రుద్రుడు ఈశానుడు
కాదిహాది భూమావిద్యలు
అష్టదా పరికీర్తితా
మల్లికాసుమగాన కీర్తితా ॥
663 అజా
ప. సుజనసేవ్యా అజాద్రిజా
అ.ప కరుణ లేశము చూపవే ॥
చ.1
దురితములను బాపవే
శత్రువర్గము నణచవే
నీధ్యానమును కలిగించవే
ముక్తిసంపద నీయవే ॥
చ. 2
సర్వశుభములు కలుగచేసే
నిన్ను భక్తితో కొలుతుమే
భవాంబోధిని దాటించవే
మల్లికా సుమగాన సుందరీ ॥
664 జై త్రీ
ప. పర్వతరాజపుత్రీ జైత్రీ
అ.ప లలితలావణ్యమూర్తి ॥
చ.1
భండాసురభంజనీ మహిషాసుర మర్దనీ
మోహాంధకారమున కన్నుగానకయున్న
లోకకంటకులైనరాక్షసులఖండించి
సాధులను రక్షించు ధీరగుణరమ్మా ॥
చ.2
నవరాత్రిరోజులలో విజయదశమియందు
పూజలందుకొనే రాజరాజేశ్వరీ
అజ్ఞానమునుబాపు అధ్యాత్మ
మల్లికాసుమగాన లావణ్యశేవధీ||
665 లోకయాత్రావిధాయినీ
ష. లోకయాత్రావిధాయినీ సర్వేశ్వరీ
అ.ప త్రిలోక్యమోహన చక్రేశ్వరీ
చ.1
జగత్పరిపాలనకు బ్రహ్మనే సృష్టించి
లోకరక్షణకు విష్ణువును సృజియించి
లయముగావించుటకు రుద్రుని నియమించి
చంద్రసూర్యాగ్నుల వెలుగుకే వెలుగైన II
చ.2
గిరిసార్వభౌమ తనయా
మృదులస్మిత ద్యుతిమయీ
మతంగమహాముని మనోనటీ
మల్లికాకుసుమగానోల్లాసినీ |॥
666 ఏకాకినీ
ప. ఏకాకినీ పరబ్రహ్మ స్వరూపిణీ
అ.ప కళ్యాణ సందోహినీ ॥
చ.1
జ్ఞానాంబోనిధి వీచికా
సంసారతాపహర సూచికా
ఏకానంద చిదాకృతీ
ఏకానేక అక్షరాకృతీ !!
చ.2
అఖండైక చైతన్యరూపా
ఏకప్రాభవశాలినీ
ఏకాతపత్ర సామ్రాజ్యా
మల్లికాసుమగాన ఏకాక్షరీ ||
667 భూమరూపా
ప. సర్వాధారాస్వరూప భూమరూపా
అ.ప నిత్యసత్య అమృతస్వరూపా ॥
చ.1
రత్నతాటంక కర్ణవిభూషిణీ
శంకరదేశిక పూజితకామినీ
అఘోరమంత్రిత పదభామినీ
లోకాధినాథ గృహిణీ శిఖరిణీ II
చ.2
పర్వతనందినీ సురవరవందినీ
భూమానందకరీ ప్రియజన పోషిణీ
సప్తస్వరరాగ గానవివర్ధినీ
మల్లికాకుసుమ గానవర్ధినీ
668 నిర్వైతా
ప. శుద్ధ సత్వరూపిణీ నిర్వైతా
అ.ప సర్వలోకవశంకరీ చతురంగబలేశ్వరీ ||
చ.1
సూర్యగమనము నిరోధించిన
రాక్షసులను సంహరించిన
సృష్టికారణశక్తి సవిత్రీదేవీ
సవితృమండల తేజోశక్తి ॥
చ.2
తప్తకాంచనవర్ణా బ్రహ్మతేజసా
భక్తానుగ్రహవిగ్రహా వహ్నిశుద్ధా
వేదశాస్త్రస్వరూపిణీ గాయత్రీ రూపిణీ
మల్లికాసుమగాన భూషిణీ II
669 ద్వైతవర్ణితా
ప ద్వైతవర్ణితా భూతాంతరంగప్రభా
అ.ప మనోవాగాతీతా సమరప్రభా ॥
చ.1
కలవునీవని నేను మదినమ్మియుంటిని
కలనైన నిను నేను చూడలేకుంటిని
ఆత్మవైననునీవె పరమాత్మయూ నీవె
నీకన్ననాకింక ఆధారమెవరే II
చ.2
నీపదధ్యానమే మనసులో నిలిపితిని
నీస్మితవదనమే మరువలేకుంటిని
నీనామస్మరణమే నాకుగతియనుకొంటి
మల్లికాసుమగానమందుకోమంటి ॥
670 అన్నదా
ప. వాత్సల్యపూరితా అన్నదా
అ.ప మాతా అన్నపూర్ణేశ్వరీ!!
చ.1
అతిదుర్లభమైన మానవజన్మమిచ్చి
దోషరహితమగు ధనమును మాకిచ్చి
అన్నపానములు సమకూర్చెదవే
కాశీపురాధీశ్వరీ విశ్వేశ్వరీ ||
చ.2
విశ్వేశ్వరుడే కపాలపాత్రతో
నీముందరనిలచి యాచించునట
సకలజీవులకు ఆకలితీర్చే
మల్లికాకుసుమగానవిపంచినీ ॥
671. వసుధా
ప వసుధా సుధామయి
అ.ప శుభఫల వర్షిణి హర్షిణీ ||
చ.1
కర్మఫలరూపమున పుట్టుకను యిచ్చి
పుణ్యఫలముపండి బహుసుఖములిచ్చి
ధనధాన్యములనిచ్చి పాడిపంటలనిచ్చి
మోక్షమునుఇచ్చేటి అన్నదా వసుధా ॥
చ.2
నీవంటి దైవము వసుధలోకలదా
వాత్సల్యరూపిణీ వసుమతీ భగవతీ '
నీదయామృతలహరి ఓలలాడెదమమ్మా
మల్లికాసుమగాన మకరందపంకిలా ॥
672 వృద్ధా
ప. విశ్వరూపా వృద్ధా
అ.ప సర్వజ్యేష్టా పురాతనీ II
చ.1
బ్రహ్మాది త్రిమూర్తుల సృజనకారిణీ
రమావాణీ కారణరూపిణీ
ముక్తినీయగల మంత్రమూర్తీ
సర్వచరాచర మూలభామినీ ॥
చ.2
ఆదిశంకరీ ఆదిమజననీ
మధురస్మితా మరధునీ
విలాసవీక్షణ కలాపురంధ్రీ
మల్లికాకుసుమ గానపావనీ ॥
673 బ్రహ్మాత్మైకస్వరూపిణీ
ప. బ్రహ్మాత్మైకస్వరూపిణీ
అ.ప ఏషణారహితాధృతా ॥
చ.1
ఇహపరసుఖములనిచ్చునది
ఆత్మవేదనను తొలగించునది
ఆనందమొసగే ఆహ్లాద చంద్రిక
నీరూపమేకదా రాజరాజేశ్వరి ||
చ.2
పరమయోగులకు బ్రహ్మానందము
కలుగచేసేడి ఆనందరూపము
లలిత లలిత లావణ్యస్వరూపము
మల్లికాకుసుమ గాననిలయము ॥
674 బృహతీ
ప. జగదీశ్వరీ బృహతీ
అ.ప సుగుణగుణవిశేషిణీ ॥
చ.1
ప్రణతార్త జనరంజనీ
ప్రణవాక్షరామృత బ్రహ్మమయీ
చతుర్దశభువన మండలవిహారిణీ
జయజననీ కేయూర హారావళీ
చ.2
నిరాలంబా లంబోదర జననీ
సకలభువన ఆధారనిలయినీ
అక్షయ అవ్యయ త్రిలోకస్వామినీ
మల్లికాసుమగాన ఆహ్లాదినీ ॥
675 బ్రాహ్మణీ
ప. మునిమానస సంచారిణి బ్రాహ్మణీ
అ.ప సత్యాన్వేషణ బ్రహ్మజ్ఞానీ॥
చ.1
భక్తచింతామణీ శివమానస లోలినీ
సమరవిజిత సంతోషిణి రాక్షస సంహారిణీ
మధురదరస్మిత వదనీ భువనమోహినీ
శ్రీచక్రసంచారిణి సుమంగళీ బ్రాహ్మణీ ॥
చ.2
వాగర్ధ విభూతినిచ్చు ఆదిశక్తి స్వరూపిణీ
సహస్రార చక్రమందు ప్రకాశించు చిన్మయీ
బాలగ లలితాంబగ పూజలందుకొను దేవీ
మల్లికాసుమగానము అందుకొనవె ఈశ్వరీ ॥
676 బ్రాహ్మీ
ప. సప్తమాతృకా బ్రాహ్మీ
అ.ప విజ్ఞానరూపిణీ సరస్వతీ
చ.1
శుంభ నిశుంభుల నిర్మూలనకై
పరమేశ్వరికి అండగానిలచి
దుర్మార్గులను అంతముచేసిన
సర్వశక్తిమయీ జయవాణీ ॥
చ.2
శుభ్ర వస్త్రాన్వితా హంసవాహినీ
శ్వేత పద్మాసనా సర్వకళాధరీ
భారతీ భార్గవీ వీణాలోలినీ
మల్లికాసుమగాన సంగీత శాలినీ ॥
677 బ్రహ్మానందా
ప. నిరతిశయ ఆనందా బ్రహ్మానందా
అ.ప ఆనందకందళిత హృదయారవింద ॥
చ.1
ఆనందమయ కోశమందున
బ్రహ్మానందమును అనుభవించే
యోగిజన బృందహిత సానందరూప
అతిశయ సౌందర్య పరశివానందా ॥
చ.2
వేయి రేకుల మహాపద్మ మందిరమందు
అణిమాది సిద్ధిగణ సేవ్యమై వెలుగొందు
సదానంద సుధాపయోనిధీ
మల్లికాసుమగాన గుణనిధీ ॥
678. బలిప్రియా
ప. బలిప్రియా కలిదోష నివారిణీ
అ.ప త్రివళీ విలసిత లలాట ఫలకా॥
చ.1
యజ్ఞయాగాది క్రతువుల ప్రీతి కారిణీ
కూష్మాండము నారికేళము
ఇక్షుదండము శ్రీఫలమును
బలిసమర్పణచేతుమే ||
చ.2
యోగులను ధర్మపరులను
జ్ఞానులను ఆరాధ్యులను
సంతతము దయచూచుసదయా
మల్లికాసుమగాన హృదయా ॥
679 భాషారూపా
ప భాషారూపా మాతృకావర్ణరూపిణీ
అ.ప వర్ణమయ అక్షరమాలాధారిణి ॥
చ.1
సౌందర్యలహరిలో ఉప్పొంగిన
నీకటాక్షములే భాష
మూగవానికి మాటలొచ్చి
నిన్నుపొగడినదే భాష ||
చ.2
కాళిదాసును కరుణించి
వాగర్ధమిచ్చినదే భాష
నీదయామృత ధార కురిసిన
మల్లికాసుమగానమే భాష ॥
680 బృహత్సేనా
ప. బృహత్సేనా విజయదుర్గా
అ.ప అనంతసేనా సమూహా ॥
చ.1
దేవతలందరు నీకు సేనలై
నీసేవలకై వేచియుందురే
శ్యామలా వారాహి బాలా
నీఆజ్ఞలకై ఎదురు చూతురే II
చ. 2
అవిధేయులకు భయంకరివి
శరణాగతులకు క్షేమం కరివీ
చతురంగబల సేనాసమన్వితా
మల్లికాసుమగాన చరితా !
681 భావాభావవివర్జితా
ప భావాభావవివర్జితా
అ.ప ప్రియాప్రియ గుణవర్జితా ||
చ.1
గుణకర్మ విశేష భావములు
అనురాగములు ద్వేషభావములు
నిన్ను అంటవు నీకు చెందవు
విశ్వసాక్షిణీ శుభహేతురీశ్వరీ ॥
చ.2
అవ్యాకృత ప్రపంచకరణా
పరిపూర్ణచంద్రవదనా
మృదుహాసపూర సుషుమా
మల్లికాసుమగాన సుమనా ॥
682 సుఖారాధ్యా
ప. సుఖారాధ్యా రమ్యా శోభనా
అ.ప భక్తజన చింతామణి ॥
చ.1
మదిలో తలచిన పాపముతొలగించి
శీఘ్రముగ వరములను ఇచ్చేటి తల్లీ
పత్రమో పుష్పమొ ఫలమొ జలమో చాలు
పూజించినంతనే కనికరముచూపెదవు ॥
చ.2
స్మరణమాత్రముచేత తుష్టిచెందెదవు
నిన్నుస్తుతియించిన పొంగిపోయెదవు
నీసన్నిధానమే పరమశుభంకరము
మల్లికాసుమగాన సంతోషిణీ ॥
683 శుభకరీ
ప. దీవింపవే శుభకరీ
అ.ప శివోల్లాస హాసాంకురీ ॥
చ.1
పంకజనాభ సోదరీ
కర్పూరద్యుతి చాతురీ
హాసప్రకాశాంకురీ
సౌభాగ్యమాహేశ్వరీ ||
చ.2
నీవు ఎవరియెడ ప్రీతిపూనువుదువో
వారిదే ధనము వారిదేయశము
జయములనీయవే శ్రీచక్రేశ్వరి
మల్లికాసుమగాన శుభంకరీ ॥
684 శోభనాసులభాగతిః
ప శోభనా సులభాగతీ
అ.ప సర్వశుభంకరీ శోభనా సుభగా॥
చ.1
మానవులు సురలు యోగులూ భోగులూ
నిరతముపూజించు మంగళ ప్రదాయిని
నిత్యాలంకార అభిషేకన ప్రియా
సులభముగ కరణించు సులభాగతీ ॥
చ. 2
రాయని పిలచిన ఓ యని పలికి
అడిగిన కోర్కెల నిచ్చేతల్లి
భాగ్యములిచ్చెడి సౌభాగ్యేశ్వరి
మల్లికాకుసుమగాన శోభనా ॥
685 రాజరాజేశ్వరీ
ప రాజీవలోచని రాజరాజేశ్వరి
అ.ప రక్షింపరావమ్మ త్రిగుణాత్మిక ॥
చ.1
నీపాదసేవయే సకల సౌభాగ్యాలు
నీపూజలేనిత్యసంకీర్తనాలు
నీధ్యానమే మాకు ముక్తిసోపానాలు
నీదివ్యచరణాలు మాకు శరణాలు 1
చ.2
అన్నిలోకాలకు తల్లినీవేనమ్మ
విశ్వేశ్వరునికి సిరిమల్లివమ్మ
భక్తజనకోటికి కల్పవల్లివమ్మ
రావమ్మమమ్మేలు బంగారు బొమ్మ ॥
686 రాజ్యదాయినీ
ప.. రాజ్యదాయినీ సామ్రాజ్యదాయినీ
అ.ప. సకలలోక శుభదాయిని శ్రీదాయినీ ॥
చ1.
సృష్టి ఆరంభము త్రిమూర్తులను సృష్టించి
సృష్టి స్థితి లయ కారకులను చేసి
లోకాధిపతిగా విధాతనే నియమించి
విష్ణువునేవైకుంఠ పతినిచేసితివి ||
చ.2
ఇంద్రాదిదేవతల రారాజులను చేయు
పంచదశీ మంత్ర వైభవశాలినీ
హేమాంబురాశి శంకర మానసరాజ్జీ
మల్లికాకుసుమ గాన సంచారిణీ
687 రాజ్యవల్లభా
వ. రాజ్యవల్లభా శ్రీచక్ర రాజ నిలయా
అ.ప. ముక్తారత్న విచిత్ర కాంతి కలితా ॥
చ.1
కాదంబ వనవాటికా వల్లభా
చింతామణి గృహ మంటపవాసిని
శివుని పర్యంకమున రాజాధిరాజుగా
కామేశరాజ్ఞియై కనువిందు కలిగించు ||
చ.2
మధుర మనోహర మధురస్వరముల
కచ్చపి వీణానాదము వినుచు
మల్లికాకుసుమగాన మధురిమల
దివ్య పరిమళము నాస్వాదించుము ॥
688 రాజత్కృపా
ప. రాజత్కృపా కృపాంబురాశీ
అ.ప. ఆశ్రితురాలను దయచూపవే ॥
చ.1
నీదయాదృష్టియే నాకుచాలును
సిరిసంపదలను అపేక్షించను
నీవరదాభయకరము చాలునే
కరకంకణములు నేనుకోరను ॥
చ.2
నీపదధూళియె సుంతచాలును
రత్నహారములునేనాశించను
అతులితభోగములేవీ అడగను
మల్లికాకుసుమ గానముచాలును ॥
689 రాజపీఠనివేశితనిజాశ్రితా
ప రాజపీఠ నివేశితనిజాశ్రితా
అ.ప ఆశ్రితజనపాలిని ధీరసమర్చితా ॥
చ.1
జ్ఞానవిహీనుని కాళిదాసుని'
మహాకవిగా అనుగ్రహించితివి
మాటలేరాని మూగవానికి
కవితాశక్తిని ప్రసాదించితివి ॥
చ.2
నిన్నుకొలిచెడి భక్తజనులకు
దివ్యమహిమలను సిద్దింపజేతువు
వాగర్ధముల సంపదనీయవె
మల్లికాకుసుమ గానబోధితా ॥
690 రాజ్యలక్ష్మీ
ప. నవనిధిదాయిని రాజ్యలక్ష్మీ
అ.ప. సదాశివ మనోరాజ్యలక్ష్మీ ॥
చ.1
చతురాననునకు బ్రహ్మాధిపత్యము
మహేంద్రునకు స్వర్గాధిపత్యము
కుబేరునకు ధనాధిపత్యము
అనుగ్రహించిన ధర్మాధిదేవతా
చ.2
కైలాసనాధుని అర్ధాంగ లక్ష్మీ
భక్తులపాలిటి అదృష్టలక్ష్మీ
మల్లికాకుసుమ గానమునిచ్చే
హిమాచలేశుని సంతానలక్ష్మీ ॥
691 కోశనాధా
ప. ధనాధినాధా కోశనాధా
అ.ప. సిరిసంపద ప్రసాదిని ॥
చ.1
లోకములోని ధనమంతటికీ
అధికారిణివి నీవేనమ్మా
చింతలు తీర్చే చింతామణీ
ధనరాసులిచ్చే నవరత్ననిధి
చ.2
భక్తులపాలిటి భక్తనిధి
పరమయోగులకు మోక్షనిధి
నీసన్నిధియే మాకుపెన్నిధి
మల్లికాకుసుమ గాననిధి ॥
692 చతురంగబలేశ్వరీ
ప. చతురంగబలేశ్వరీ
అ.ప. సర్వసైన్యాధిపతీ మహాత్రిపురేశ్వరీ ||
చ.1
రధ గజ తురగ పదాతిదళములకు
వాయుసేనలకు నౌకాసేనలకు
అధిపతియై అలరారుచుండెడి
అరివీరభయంకరి రణరంగ చాతురీ ॥
చ.2
నాల్గువేదములకు అధికారిణిపై
సకలధర్మముల సంరక్షించుచు
అధర్మపరులను అణచివేసెదవు
మల్లికాకుసుమ గాననిలయినీ ॥
693 సామ్రాజ్యదాయినీ
ప.. సామ్రాజ్యదాయినీ
అ.ప. మహామహేశ్వరీ II
చ.1
బ్రహ్మవిద్యలనిచ్చు బ్రాహ్మీ మహేశ్వరీ
ఆత్మవిద్యలనిచ్చు ఆత్మసామ్రాజ్జీ
ముక్తిమార్గము చూపు మోక్ష సామ్రాజ్ఞి
నీలకంఠేశ్వరుని మనోసామ్రాజ్ఞి ||
చ.2
అఖండ సామ్రాజ్యమిచ్చి
అతులితసంపదలనిచ్చి
భక్తిసామ్రాజ్యమునిచ్చు
మల్లికాసుమగానరాజ్ఞి II
694 సత్యసంధా
ప. సత్యసంధా శ్రీవిద్యా
అ.ప. సత్యాన్వేషణ నిజరూపా ॥
చ.1
నిత్యమైనది సత్యమైనది.
నామములేనిది రూపములేనిది.
నాశములేనిది శాశ్వతమైనది
శుద్ధ సాత్విక బ్రహ్మరూపము
చ.2
సత్యమును దాటరానిది
సత్యమునే బోధించునది
సత్యమందున ప్రజ్ఞకలది
మల్లికాసుమగానరూపము ॥
695 సాగరమేఖలా
ప. సాగరమేఖలా విరాట్ స్వరూపిణీ
అ.ప.సర్వచరాచర జగత్కారిణి ॥
చ.1
సత్యలోకమేనీశిరము
సూర్యచంద్రులే నీనేత్రములు
సప్తసంద్రములే స్వర్ణ మేఖల
నీవాలుచూపులేసృష్టివిలాసము ॥
చ.2
హిమవంతునిభాగ్యమా
మహదేవకుటుంబినీ
సేవకజన పాలినీ శాలినీ
మల్లికాసుమగాన రంజనీ ॥
696 దీక్షితా
వ. కరుణాంతరంగా
అ.ప. సద్గురురూపా మంత్రారాధితా ॥
చ.1
మంత్రదీక్షనుయిచ్చి పాపక్షయముచేసి
జ్ఞానమును అందించి అజ్ఞానమును బావీ
స్పర్శదీక్షతో గురురూపమున
శిష్యుని శ్రేయము కోరే మంత్రదీక్షితా ||
చ.2
గురువేవిష్ణువు గురువే బ్రహ్మ
గురువే పరమేశ్వరరూపుడు
శ్రీవిద్యార్చిత పూర్ణ దీక్షితా
మల్లికాసుమగాన మంత్రదీక్షితా !!
697 దైత్యశమనీ
ప. దైత్యశమనీ అధర్మ నాశనీ
అ.ప. దురితభంజనీ మహిషాసుర మర్దనీ ॥
చ.1
సంద్రమునుచిలుకువేళల
అమృతకలశము వుద్భవించగా
విష్ణురూపమున మోహినియై
దైత్యకులమును శిక్షచేసితివి ॥
చ.2
విష్ణుమాయయై అసురులనణచి
దేవతలకు ఆనందముకూర్చిన
ధర్మసంవర్ధినీ అధర్మదండినీ
మల్లికాకుసుమ గానమోహినీ ॥
698. సర్వలోకవశంకరీ
ప. సర్వలోకవశంకరీ త్రిభువనాధిష్ఠాత్రి
అ.ప మమతామూర్తి సమతాదర్శనీ
చ.1
మంచినడకలు నేర్పుతల్లివేనీవు
జరామరణము బాపు వైద్యుడేనీవు
అష్టసిద్దులనొసగు దాతవేనీపు
దుఖఃసంద్రమునడచు దైవమేనీవు ॥
చ.2
ఇంద్రాదిదేవతలు నీపదములను పట్టి
సామ్రాజ్యపదవులను అందుకొనలేదా
సర్వవశంకరీ త్రిలోక్యమోహినీ
మల్లికాసుమగాన మకరందభ్రామరీ ॥
699 సర్వార్ధదాత్రీ
ష. సర్వార్దధాత్రీ గిరినాధపుత్రీ
అ.ప. హిమవంతునిభాగ్యమా కనక శలాకమా
చ.1
నీకు ఉగ్గును పెట్టి జోలలను పాడిన
తల్లిమేనక ఎంత పరవశించేనో
నీముద్దుపలుకులను చెవులార వినిన
హిమగిరి రాజెంత పుణ్యాత్ముడో
చ.2
నీనడకలకు భూదేవి మైమరచెనో
నిను చూసి హిమమెంత కరిగిపోయేనో
నీఆటలకు నెమలి పురివిప్పి ఆడెనో
మల్లికా కుసుమములు విరిసి పాడేనో ॥
700 సావిత్రీ
ప. వేదపూజితా సావిత్రీ
అ.ప భావశుద్ధిస్వరూపా క్లీంకారీ ॥
చ.1
గౌరీదేవిగా పూజలందుకొని
సౌభాగ్యములను ప్రసాదింతువే
శృతి ఆగమాది వేదజననీ
వరగాయత్రీ బ్రాహ్మణ పూజితా ॥
చ.2
సూర్యరూపమున ప్రజ్వరిల్లుచూ
గాయత్రిగ త్రిసంధ్యలందున
వందనములందుకొను సవితారూపణీ
మల్లికాకుసుమగాన సవిత్రీ ॥
701 సచ్చిదానంద రూపిణీ
ప. సచ్చిదానందరూపిణీ పరబ్రహ్మస్వరూపిణీ
అ.ప సదానంద చిదానంద సత్యానంద రూపిణీ ॥
చ.1
బలవంతుడైనను దుర్బలుడైన
మూఢుడైననూ మహాప్రౌఢుడైన
గుణహీనుడైనను మహాకులజుడైన
నీమనసులో వారందరూ ఒకటే ॥
చ.2
రమ్యగుణాలంకృత నిర్మలాకృతా
భుక్తిముక్తి ఫలదాయిని చిత్తరంజనీ
ఏకాత్మ స్వరూపిణి మదనశ్రియా
మల్లికాకుసుమగానానందా ॥
702 దేశకాలాపరిచ్ఛిన్న
ప. దేశకాలాపరిచ్చిన్న సుమనసా
అ.ప బుధార్చితపదాబ్జా భక్త చింతామణీ ॥
చ.1
దేశకాలములకతీతమైనది
యుగములు మారినా జగములు మారినా
ఆకాశమువలే సర్వవ్యాపియై
శాశ్వతమైనది సత్యమైనది ॥
చ.2
ఆర్తిని తొలగించి కోర్కెలుతీర్చి
విశ్వశ్రేయము కూర్చు వైభవశాలి
పరమానంద సుధాపయోనిధి
మల్లికాకుసుమ గానసుధానిధి ॥
703 సర్వగా
ప. లీలాకల్పిత సర్వలోక సర్వగా
అ.ప సర్వరూపిణీ సర్వవ్యాపినీ ॥
చ1
సర్వమునీవై కార్యకారణమయీ
చరాచరవిశ్వము సృజియించు శక్తివి
నీ మహత్యములు ఎన్నగాతరమౌనా
నీసాన్నిధ్యము నొసగుమా శుభగా ॥
చ.2
బాలేందునిటలా హృద్యత్తరకలా
ఘనాఘన వినోదకరవేణీ
గ్రహరాబ్జనిలయినీ అఖిలలోకాంబా
మల్లికాకుసుమగాన సర్వగా ॥
704 సర్వమోహినీ
ప. సర్వమోహినీ పద్మాసనా
అ.ప స్తవనీయోత్తమా శృతివేద్యా !
చ.1
సురుచిరాంగ సత్కళా విశారద
శాశ్వతకైవల్య వితరణపరా
భక్త హృత్సరసనిలయాసదయా
సర్వేశగేహినీ కేదారనిలయా ॥
చ.2
గణగణఘంటారవములతో
వీణామృదంగ స్వరతాళముతో
శంఖనాదముల సునాదముతో
మల్లికాకుసుమగానవినోదినీ ॥
705. సరస్వతి
ప. మాంపాహి సరస్వతీ విద్యాధరీ
అ.ప శ్రీవ్యాసపూజిత వాల్మీకివందిత ॥
చ.1
వీణాపాణీ వేదచారిణి
వాగీశ్వరీ నిగమాగమరూపిణీ
బాసరలో వెలసి బాసటగా నిలచి
భక్తులబ్రోచేటి గానవిలోలినీ
చ. 2
పద్మనివాసినీ పద్మనయనీ
పద్మసంభవు రాణి పరమపావనీ
కామిత దాయినీ సురుచిరవేణీ
మల్లికాకుసుమ గానవిహారిణి
706. శాస్త్రమయీ
ప ఓంకారబీజాక్షరీ భారతీ శాస్త్రమయీ
అ.ప జయములనీయవేదయగలతల్లీ ॥
చ.1
కోటి విద్యలనొసగే బాసరవాణి
మేటిసంపదలనిచ్చు నలువరాణి
సుమధుర సుస్వరములతో కొలిచెదమమ్మా
విజ్ఞానతరంగిణి హంసవాహిని
చ. 2
చదువులరాణిగా వాసికెక్కిన తల్లి
మృదుమధువాక్కుల కల్పకవల్లీ
మల్లికాపుష్పముల మాలికలను అల్లి
అర్పింతునోయమ్మకరుణాలవల్లి
707. గుహాంబా
ప. గుహాంబా గురుగుహజననీ.
అ.ప బాలగ్రహ విధ్వంశిని భవానీ ॥
చ.1
హృదయ కుహరమున నెలకొనియుందువు
పంచకోశాంతరస్తితాఆశ్రితరక్షా
విపులమంగళ దానశీలా సుశీలా
ధ్యానించు హృదయముల వికసింపజేయవే ॥
చ.2
మనసునందలి మదమాత్సర్యముల
మోహలోభముల త్రుంచివేయవే
శరణార్ధిని నను రక్షణచేయవే
మల్లికాకుసుమగాన శరణ్యా ॥
708. గుహ్యరూపిణీ
ప. పరకృపానిధి గుహ్యరూపిణీ
అ.ప రహస్యజ్ఞాన స్వరూపిణీ ॥
చ.1
గురుమూర్తిధరా రహస్య యోగినీ
గుహనివాసినీ దహరాకాశ రూపిణీ
సర్వోపనిషత్ సారా జననీ
గుహ్యోపనిషత్ ప్రబోధినీ
చ.2
నాల్గువేదముల సకలశాస్త్రముల
అన్నిమంత్రముల గోప్యముగానుండు
భక్త మనోరధ పూరణచతురా
మల్లికాకుసుమ గానరహస్యా ॥
709. సర్వోపాధి వినిర్ముక్తా
ప. సర్వోపాధి వినిర్ముక్తా అద్వైతమూర్తీ
అ.ప ఆకారమేలేని చిన్మయస్వరూపా ॥
చ.1
ఆత్మవు నీవే జీవాత్మవునీవే
మేము కనుగొనలేని రూపమే మనసా
వెలుగునీడలు నీవె కర్మఫలములు నీకే
పరబ్రహ్మ రూపమే మనసా ॥
చ.2
రంగు రూపములేని స్పటికవంటిది ఆత్మ
పాపపుణ్యములేవి అంటవే మనసా
మనసులోనీ పరాత్మనే తెలుసుకో
మల్లికాసుమగాన ఫలితమే మనసా ॥
710. సదాశివపతివ్రతా
ప. సదాశివపతివ్రతా సుచరితా
అ.ప. పరశివ ముఖావలోకనానందకరీ ॥
చ.1
వేద విజ్ఞానులందరూ సరస్వతీపతులే
లక్ష్మీకటాక్షులు లక్ష్మీవల్లభులే
నీకృపాకటాక్షము ఆపరమశివునికే
గౌరీవల్లభుడు మహదేవుడొకడే ॥
చ. 2
నీపాతివ్రత్యము లోకోత్తరము
శివశక్తుల కలయికయే అపూర్వము
నీపతిభక్తి అనన్య సామాన్యము
మల్లికాకుసుమగాన పరిమళా ॥
711. సంప్రదాయేశ్వరీ
ప. సంప్రదాయేశ్వరీ రాజరాజేశ్వరీ
అ.ప. శ్రీ విద్యా సంప్రదాయ స్వరూపిణి ॥
చ.1
పాపములను తొలగించును
అజ్ఞానమును బాపజాలును
జ్ఞానదీపమును వెలిగించి
మంచిమార్గమును చూపును గురువు ॥
చ.2
గురురూపమున సంప్రదాయమును
సౌశీల్యమును రక్షణచేయును
పరమగురువే పరమేశ్వర రూపము
మల్లికాకుసుమ గానస్వరూపము ॥
712. సాధ్వీ
ప. సాధ్వీ----సాధ్వీ నీచరణములే శరణము
అ.ప. నీవే జగతికి మూలకారణము
చ1.
నినుచేపట్టిన గరళకంఠుడు
మంగళకరుడై లోకపూజితుడై
త్రిలోకవంద్యుడై అర్ధనారీశుడై
శరణాగతరక్షకుడై కరుణామయుడాయె।।
చ. 2
పాతకములను దరిజేరనీయక
మము బ్రోవు మమ్మా గిరిజాకుమారి
మగువలపాలిటి మంగళ గౌరి
పరమపతివ్రత సాధ్వీమతల్లీ॥
713. గురుమండలరూపిణి
ప. గురుమండలరూపిణీ శ్రీచక్రేశ్వరీ
అ.ప పరమేష్టి పరమగురు దేవతా
చ.1
అవాఙ్మనస గోచరీ
దక్షిణామూర్తి రూపిణీ
త్రిలోకార్చితా శ్రీ విద్యా
వశిన్యాది వాగ్దేవతా మధ్యమా ॥
చ.2
ఆదిదంపతులు ఆదిగురువులు
దత్తప్రభువులు దేశికులు
వందే వందే గురుపద ద్వంద్వాం
మల్లికాసుమగా గురుపాదుకాం ॥
714. కులోత్తీర్ణా
ప. కులోత్తీర్ణా అతీంద్రియా
అ.ప యోగసిద్ధిప్రదా అవ్యయా॥
చ.1
వేదాంగాయా అప్రమేయా
అమేయాత్మా అనుత్తమా
గురురూపాయ గురుతమాయ
గుప్తయోగినీ సర్వోన్మాదినీ ॥
చ.2
సనకసనందనాదిమునిధ్యేయా
లబ్దాహంకార దుర్గమా దుర్గా
దేవగణాశ్రిత పాదయుగా
మల్లికాకుసుమగాన ప్రభా॥
715. భగారాధ్యా
వ. భగారాధ్యా పరమేశ్వరి
అ.ప అణిమా గరిమాది సిద్దిపూజితా
చ.1
సిద్ధమాతా సూర్యారాధిత
జ్ఞానవైరాగ్యదాయినీ
ప్రభారూపా జగన్మోహినీ
కమలాసనార్చితపదా ॥
చ.2
సూర్యమండల మధ్యస్థా
ఆశ్రితరక్షకపోషజననీ
దివ్యశక్తిప్రదా శ్రీవిద్యా
మల్లికాకుసుమగాన ప్రదా॥
716. మాయా
ప. మాయా విచిత్రకార్యకరణా
అ.ప చింతితఫలప్రదా మాయావతీ ॥
చ.1
ఒకసారి సకలము నీవుగాతలచి
అంత మా ప్రజ్ఞయేననుచుఇంకొకసారి
విర్రవీగుటె గాని నిక్కమ్ము నెరుగము
ఇదియంత నీమాయ అనిఎరుగలేము ॥
చ.2
నీటిగుంటలలోన నాచువంటిది మాయ
నిద్రలోకలవలె మనసునేమరపించు
నీనామగానమే భ్రమలను తొలగించు
మల్లికాసుమగాన సుజ్ఞానదీపికా ॥
717. మధుమతీ
ప. మధుమతీ సావిత్రీ
అ.ప సవితా దేవతాశక్తీ యోగధాత్రీ
చ.1
నిశ్చలభక్తితో పరమనిష్టతో
బ్రహ్మైకస్థితి పొందుయోగులకు
మధురానుభూతులను కలిగించి
ఆత్మానందము నందించుదేవి |
చ.2
యమ నియమ సమాధి సంపదతో
యోగమాతగా పేరుగాంచితివి
యోగానుభవములు మాకీయవమ్మా
మల్లికాకుసుమగాన యోగినీ ॥
718. మహీ
ప. భూదేవతారూపా మయామహీ
అ.ప. మమతామయీ మహితామహీ
చ.1
భూదేవివై భూభారమునుమోసి
జగమంతయు ఫలపుష్ప భరితముగ
జనులందరికి అన్నదాతవైనిలచేవు
ఓర్పుతో అదితిగా పూజలందేవు ॥
చ. 2
వేదమాతా సర్వ కళ్యాణ శీలా
మహిమాన్వితా సదాస్తూయమానా
మహామహీ భువనాంబికా
మల్లికాకుసుమగాన మహీ ॥
719. గణాంబా
ప. ప్రమాధాది గణపూజితా గణాంబా
అ.ప. నందికేశ్వర వందితా
చ.1
నగాధీశపుత్రీ రాజీవనేత్రి
మహాదైత్య జైత్రీ భక్తమందారవల్లీ
పరమేశ్వరాలోక ఆనందవల్లీ
బొజ్జగణపతితల్లి అనురాగవల్లీ ॥
చ.2
నందీశు భృంగీశు సేవలను గైకొని
వీరభద్రుని ప్రణతులందుకొంటావు
ప్రమధాదిగణనాయకుని మోహినీ
మల్లికాసుమగాన సందర్శినీ I॥
720. గుహ్యకారాధ్యా
ప. గుహ్యకారాధ్యా శరవణ పూజితా
అ.ప. నవనిధులను కాపాడు మణిభద్రార్చితా
చ.1
పంచకోశాంతరస్థితా శ్రీలలితా
లలితా సహస్ర త్రిశతి నామముల
గోప్యముగానుండి హయగ్రీవునిచేత
ఆరాధించబడు గుహ్యగోపిణీ
చ.2
యంత్రములందు మంత్రములందు
రహస్యమంత్రార్ధ స్వరూపిణీ
లోపాముద్రాగస్త్య పూజిత చరణీ
మల్లికాకుసుమసంకీర్తనానంద॥
721. కోమలాంగీ
ప. కోమలాంగీ సుమశోభితా
అ.ప. హిమవంతుని భాగ్యమా మరాళ గామినీ
చ.1
నీమందస్మిత వదనారవిందము
పరితాపములను దూరముచేయునే
వయ్యారపునీకులుకుల హెుయలు
రాజహంసలకు నడకలు నేర్పునే ॥
చ.2
తేనెలొలుకు నీమధుర వాక్కులకు
శారద వీణా సిగ్గులొలుకునే
అనురాగభరితమౌ నీచూపులకు
మల్లికాసుమగానామృతముచిందునే ॥
722. గురుప్రియా
ప. గురుప్రియా శ్రీవిద్యా గురుపూజితా
అ.ప. పరసాధనాకలిత దక్షిణామూర్తిరూపా
చ1
ముదితవదనా జ్ఞానానందమయీ
త్రిభువన గురుచరణా చిన్ముద్ర మూర్తీ
సారస్వత పురుషాకార సామ్రాజ్జీ
వ్యాసాంబరీష శౌనక హృదివాసినీ ॥
చ.2
అఖిలాగమ మంత్రగురవే
మహావ్యామోహ సంహారిణే
రాగద్వేష దూషితమానసే
మల్లికాకుసుమ గానకౌతుకే ॥
723. స్వతంత్రా
ప. స్వతంత్రా పరాకృత పరాయణా
అ.ప. శ్రీవిద్యాతంత్ర స్వతంత్ర తంత్రా
చ.1
నిన్నుమించిన అధికులెవరే
బ్రహ్మాదిదేవతలు నీఅనుయాయులే
మహిమాన్వితమైన నీశుభచరితము
వర్ణింపగ మేమెంతవారమే
చ.2
క్షణముసేపు నీచూపు సోకిన చాలు
బహు జన్మాంతరజ్ఞానము సిద్దించు
పరమేశుడే నీఆజ్ఞలుపాలించు
మల్లికాసుమగాన సర్వస్వతంత్రా ॥
724. సర్వతంత్రేశీ
ప. సర్వతంత్రేశీ సర్వమంత్రాత్మికా
అ.ప భక్తుల కోర్కెలనుతీర్చు సర్వేశ్వరీ
చ.1
సర్వయంత్ర స్వరూపాయ
ముక్తిబీజాయ కళ్యాణదా
నవశక్తిదాయినీ అమృతస్వరూప
ముక్తినీయగల మంత్రమూర్తివి ||
చ.2
మతంగకులనాయికామాతంగినీ
బీజాక్షర శ్రీ చక్ర మంత్రేశ్వరి
రసవంతమై ఆమోద భరితమౌ
మల్లికాసుమగాన కవితలను ఈయవే ॥
725. దక్షిణామూర్తిరూపిణీ
ప. దక్షిణామూర్తిరూపిణీ సుప్రసన్నా
అ.ప సోమసూర్యాగ్నిలోచనీ మహాదేవీ
చ.1
పద్మాసనీ చిన్మయముద్రాలంకృత
శుద్ధస్పటిక సంకాశినీ సరస్వతీ
జ్ఞానముద్రాక్షమాలా యోగపట్టాభిరామ
దక్షిణామూర్తి రూపిణీ శరణం ప్రపద్యే ॥
చ.2
శశిశకలధారిణీ భువనక్షేమ జననీ
కైలాసవిహారరసికే భవరోగమహౌషధీ
కటాక్షమహిమాతిశయ విలోకనామహీ
మల్లికాకుసుమగాన శివనిధీ ॥
726. సనకాది సమారాధ్యా
ప. సనకాది సమారాధ్యా కార్యకారణ రూపిణీ
అ.ప. సనత్కుమారాది యోగగణపూజితా
చ.1
మృత్యుముఖములో నేనున్నపుడు
నీధ్యానమునేచేయగలేను
నీనామమునే సదాస్మరించే
వరమునీయవే సురసేవ్యా ॥
చ.2
అన్నిజన్మలలోన ఏజీవిగానున్న
నీనామజపమునే చేసేటి వరమివ్వు
సర్వదేవతా యోగిజనవంద్యా
మల్లికాసుమగాన దాయినీ శివానీ ॥
727. శివజ్ఞాన ప్రదాయినీ
ప. జ్ఞానస్వరూపిణీ
అ.ప శివతత్త్వ ప్రకాశినీ శివకామినీ
చ.1
నీవేశివుడు శివుడేనీవు
వాగర్దముల కలయిక మీరు
శివజ్ఞానమును భక్తులకిచ్చి
మోక్షజ్ఞానము కలుగచేతువే ॥
చ. 2.
నీపూజనమే శివపూజనము
నిను అర్చించుటే శివపదార్చనము
శివసాయుజ్యమునందజేయుమా
మల్లికాకుసుమగాన ప్రకాశినీ ॥
728. చిత్కలా
ప. అద్వైతానందాచిత్కలా
అ.ప పరమేశ్వర రూప షోడశీకలా
చ.1
సకల జీవులను నీ సంతానముగా
ప్రేమ భావముతో రక్షించే తల్లీ
నీ నామములను పలికిన చాలు
సకల సుఖములను కలిగించుదేవీ ॥
చ.2
అవ్యాజకరుణతో సాలోక్యమును ఇచ్చు
అనురాగమును పంచి సామీప్యమిచ్చు
జననమరణములేనిసాయుజ్యము ఇచ్చు
మల్లికాకుసుమగాన వరదాయినీ ॥
729. ఆనందకలికా
ప. ఆనందకలికా మహేశ్వరి
అ.ప అద్వైతానంద సంతోషిణీ
చ.1
అతులిత భోగముల భాగ్యానందము
వాసనానందము బ్రహ్మానందము
నీనామజపములో అఖండానందము
నీసన్నిధిలోనే శాశ్వతానందము ॥
చ.2
నీనామసంకీర్తనే అద్భుతానందము
నీపూజనమే అతులితానందము
నీపాద సంసేవయే చిదానందము
మల్లికా సుమగానమే సదానందము ॥
730. ప్రేమరూపా
ప. ప్రేమరూపా వాత్సల్యరూపిణీ
అ.ప సర్వప్రియంకరీ శ్రీకరీ
చ.1
సకలజగములను ప్రేమతో లాలించి
నీభక్తులకు భోగభాగ్యములిచ్చి
దుష్ట మార్గులగు పిల్లలను దండించి
సన్మార్గులను కరుణతో చూడు ॥
చ.2
నీప్రేమయే మమ్ము కాపాడు కవచము
భవసాగరము దాటు నావ నీప్రేమయే
కన్నతల్లివినీవు కాఠిన్యమేలనే
మల్లికాసుమగానకీర్తనానందా ।
731. ప్రియంకరీ
ప. ప్రియంకరీ అభయంకరీ
అ.ప హరసహచరీ భువనేశ్వరీ
చ.1
నామీద నీకింత కోపమా
ననుబ్రోవగా ఇంతపంతమా
నీ వారము మేము కాలేమా
కరుణ చూపగ రావే హే ఉమా ॥
చ.2
దాసులమై కొలువలేమా
కామమోహముల దాసులమా
నీసంతానముకామా
మల్లికాసుమగానఘనమా ॥
732. నామపారాయణ ప్రీతా
ప. నామపారాయణ ప్రీతా శ్రీ మాతా
అ.ప సర్వజనమనోహరిణీ మాతంగేశ్వరీ
చ.1
భవబంధములు బాపు నామపారాయణం
సిరిసంపదలనిచ్చు నామపారాయణం
లలితాసహస్రముల నామపారాయణం
దివ్యమహిమోపేత మధురకలితం
చ.2
పంచదశీ మంత్ర త్రిశతీపారాయణ
అష్టాక్షరీమంత్రనామ సంతోషిణీ
పంచప్రణవాసనీ గానవినోదిని
మల్లికాసుమగాన సంగీతప్రీతా ॥
733. నందివిద్యా
ప. నందివిద్యా శ్రీవిద్యా స్వరూపిణీ
అ.ప నందికేశ్వర విద్యాంబా
చ.1
శివుని సన్నిధిలోన నిరతరము నివసించి
శివుని సేవలు చేసి శివుని ప్రేమను పొంది
శివుని వీపున మోయు నందికేశ్వరుడు
ఎంతపుణ్యాత్ముడో ఎంతధన్యాత్ముడో
చ.2
నీనామపారాయణాఫలితమేకదా
శివుని సామీప్యమున ముక్తిసాధించే
నీపాదసేవయే మోక్షసాధనము
మల్లికాసుమగానభక్తి ముక్తిప్రదము ॥
734. నటేశ్వరీ
ప. నటేశ్వరీ శివతాండవలోలినీ
అ.ప మూలాధారచక్రనిలయినీ
చ.1
గానసరస్వతి వీణమీటగా
శ్రీహరి మృదంగ తాళమువేయగా
నవరస తాండవ కేళీలోలుడు
నృత్యము సలిపెను నాట్యసుందరితో ॥
చ.2
లాస్యవిలాస అభినయములతో
నాట్యము చేతువే మహాభైరవీ మీ
ఆదిదంపతుల నాట్యవిలాసము
మల్లికాకుసుమగాన శోభితము ॥
735. మిధ్యాజగదధిష్ఠానా
ప. మిధ్యా జగదధిష్టానా శంకరీ.
అ.స మాయాజగతికి ఆధారభూతా
చ.1
మట్టిబొమ్మలుచేసి ప్రాణములుపోసి
జీవితపు భ్రమలలో కప్పివేస్తావు
పూర్వకర్మము ఇచట అనుభవించాలని
నడిసంద్రములోన ముంచివేస్తావు ॥
చ. 2
ఈజగమునిత్యమని సుఖముశాశ్వతమని
ఆశలనుకల్పించి మాయచేస్తావు
సంసార సంద్రమును దాటించు నావ
మల్లికాసుమగానపుణ్యమేత్రోవ ॥
736. ముక్తిదా
ప. ముక్తిదా పరసౌఖ్యదా
అ.ప సర్వభూతాంతరాత్మా
చ.1
శాస్త్రపాండిత్యాల యజ్ఞయాగాలతో
వేదాలు వల్లించ ముక్తిపొందగలేము
నీనామకీర్తనతో నీధ్యానముతో
భవబంధవిముక్తి కలుగునేతల్లీ॥
చ.2
మూగజీవులకు ముక్తినిచ్చెను శివుడు
మూఢభక్తియెచాలు మంత్రతంత్రములేల
నీపదధ్యానమే ముక్తిసోపానము
మల్లికాసుమగానమేపావనము ॥
737. ముక్తిరూపిణీ
ప. ముక్తిరూపిణీ మోక్షస్వరూపిణీ
అ.ప ఆశ్రిత భవబంధ నిర్మూలినీ
చ.1
ధర్మశాస్త్రములు ఎన్నిచదివినను
ఉత్తమవంశ సంజాతులైనను
నిను సేవించని నిను అర్చించని
వారి జన్మమే నిష్ప్రయోజనము
చ. 2
నీపదధ్యానము చేసినచాలును
వారిజన్మలే ధన్యములగును
నీపదములే మోక్షప్రదములు
మల్లికాకుసుమపరాగ గానములు
738. లాస్యప్రియా
ప లాస్యప్రియా నటనప్రియా
అ.ప. శృంగార రస ప్రియా
చ.1
ప్రదోషకాలమున శంకరుడడుగో
తకధిమి తకధిమి నాట్యము చేయుచు
వీరము రౌద్రము తాండవించగా
పేరిణీ నృత్య తాండవ లోలుడు ॥
చ.2
లలిత లలిత పదఝుణుంఝుణులతో
మల్లికాకుసుమ గానమాధురితో
పరమేశుని క్రీగంటచూచుచు
లాస్యనృత్యమును చేతువు సమయా ॥
739. లయకరీ
ప. లయకరీ సకలశుభంకరీ
అ.ప. సలలిత సుగుణాసాగరీ
చ.1
సకలశుభములనుఒసగెడిదేవీ
నిను నమ్మినవారికినాశములేదే
నీకుసాటి లోకాన ఎవరే
నతవరదాయకి లయస్వరూపిణీ ॥
చ. 2
కాయజ వైరీప్రణయలోలినీ
ప్రమధ గణార్చిత హ్రీంకారీ
రాగ తాళ లయస్వరూపిణి
మల్లికాకుసుమ గానలయకరీ ॥
740. లజ్జా
ప. యాదేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థితా
అ.ప. నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
చ.1
నిరహంకారా లజ్జారూపా సౌమ్యా
మందస్మిత సరళా సర్వమంగళా
ముగ్ధమోహన సౌందర్యరూపిణీ
శృంగార రస భర లీలా విలాసిని ॥
చ.2
లావణ్యామృత లసితా హసితా
సురగణసేవిత శుభ చరితా
శ్రీవిద్యా సారధి కల్పవల్లీ
మల్లికాకుసుమ గానవల్లీ ॥
741. రంభాదివందితా
ప. రంభాదివందితా హ్రీంకార వాసితా
అ.ప. యతిజన హృదయ నివాసితా ॥
చ.1
రంభా ఊర్వశి మేనకా తిలోత్తమ
అప్పరాంగనలు నృత్యగీతాదుల
దివ్యగానములతో సేవించుచుందురే
అభయవరదానైక రసికా హంసికా ॥
చ.2
సర్వార్ధసాధకా శ్రీ చక్రనిలయా
అనుపమాన సౌందర్య తేజస్వినీ
మదనాంతకురాణి హిమగిరినందినీ
మల్లికాకుసుమగాన సౌగంధినీ ॥
742. భవదావసుధావృష్టిః
ప. భవదావసుధావృష్టి
అ.ప. మముదయగనవే నిర్మల దృష్టి ॥
చ. 1
భవార్తి భయ నాశనీ భవానీ
అభవుని రాణీభావనాగమ్యా
మాతా మంగళగుణజాలా
కల్పకవల్లీమతల్లి హిమబాలా ॥
చ. 2
దుష్ప్రభావముల మనముననుంచక
సద్భక్తి నీయవే శరణ్యావరేణ్యా
వామాచరణీ గాన విహారిణీ
మల్లికాకుసుమ గానావలోకినీ ॥
743. పాపారణ్యదవానలా
ప. పాపారణ్యదవానలా శ్యామలా
అ.ప.సుహేశ హృదయ వాసినీ
చ.1
సంచితకర్మములను దహించి
స్వయంకృత అపరాధములు మన్నించి
నీసుందర చరణానందమునీయవె
శుంభవిదారిణి సుగుణమనోహరి ॥
చ.2
అజ్ఞాన నాశిని విజ్ఞాన దాయిని
వాగీశ్వరి జగదీశ్వరిజయజయ
పన్నగవేజీ నగేంద్ర నందినీ
మల్లికాకుసుమగాన స్పందినీ।
744. దౌర్భాగ్యతూల వాతూలా
ప. దౌర్భాగ్యతూల వాతూలా శక్తిశాలినీ
అ.ప రమ్యగుణాలంకృతా రాజేశ్వరీ ॥
చ.1
ప్రచండ మారుతము వంటి నీశక్తికి
నగములుకూడా కదలిపోవునే
ఋణము యాచనము జరారోగమను
దౌర్భాగ్యములను దూరముచేయనే
చ.2
ఇంద్రాదిదేవతలు నీకు దాసోహమన
నిన్నుకొలువని వారు సృష్టిలో ఎవరే
మనోజ్ఞసుమనామందస్మిత సరళా
మల్లికాసుమగాన సుఖదాయినీ ॥
745. జరాధ్యంత రవిప్రభా
ప. జరాధ్వంత రవిప్రభా
అ.ప కృపను చూపవే సకలార్ధ చంద్రికా
చ.1
పరులధనమును ఆశించుట లేదు.
ఖలజనులను సేవించుటలేదు.
చపలభావమును పొందుటలేదు
జరాభయముతో పరితపించితిమి ॥
చ2.
కనులు కనపడక వీనులు వినపడక
వృద్ధాప్యముతో కృంగుజీవులను
రక్షణ చేయవే కృపాంబురాశీ
మల్లికా కుసుమగానసుధామ
746. భాగ్యాబ్ధిచంద్రికా
ప. భాగ్యాళి చంద్రికా
అ.ప. భాగ్యము నీయవే సర్వమంగళా
చ.1
నీపదసేవయే పరమావధిగా
నిరతము తలచే భాగ్యమునీయవే
పరమ లోభులగు జనులను పొగడక
నిన్ను స్తుతించే భాగ్యము నీయవే ॥
చ.2
నీభక్తులను భక్తితో పూజించి
నీగాధలనే సతతము వినుచూ
నీనామ ధ్యానమే మననముచేసెడి
మల్లికాసుమగాన భాగ్యము నీయవే
747. భక్తచిత్తకేకి ఘనా ఘనా
ప. భక్తచిత్తకేకి ఘనా ఘనా
అ.ప ఊహాతీత ప్రభావశాలినీ
చ.1
పరిపరివిధముల నిను వేడుకొన్నను
దయచూపవేలనే మంత్రప్రియంకరీ
రక్షణభారము సర్వమునీరే
సర్వదా భవదీయ చరణములేశరణము ॥
చ.2
ఎన్నిమారులు నిన్ను ఎలుగెత్తి పిలిచినా
కనులముందర నిలచి ఆదుకోవేమి?
భక్తాసురక్తా సంగనాశనకరీ
మల్లికాసుచుగాన ప్రియ మోహినీ
748. రోగపర్వతదంభోళి:
ష రోగపర్వత దంభోళీ
అ.ప నరక క్లేశ శమనీ
చ1.
అపార సంసార సాగరమును
దాటించు పెనునౌక నీవేగడా
మానసిక రోగములు దీర్ఘ రోగములు
సంతాపములు బాపు సర్వరోగహరిణీ ॥
చ.2
సర్వసత్వగుణ విశేషణా
జీవనోపాయ రూపిణీ దయాధికా
పర్వతనందినీ మంగళదాయినీ
మల్లికాకుసుమగాన మంగళా ||
749 మృత్యుదారుకుఠారికా
ప, మృత్యుదారుకుఠారికా,
అ.ప. ఇంద్రాక్షి ఇంద్రరూపిణీ
చ.1
సదాసమ్మోహినీ దేవీ
సుందరీ భువనేశ్వరీ
అపమృత్యు భయము బాపవె
స్థూల సూక్ష్మ ప్రవర్తినీ ॥
చ.2
అరివర్గము నడగింపుము
లోకహితము చేకూర్చుము
దురితములను హరియింపుము
మల్లికాకుసుమగాన సుభాషిణి ॥
750. మహేశ్వరీ
ప. శ్రీ మంగళగౌరీ మహేశ్వరి
అ.ప. అంగనలపాలిటి శుభకల్పవల్లి ॥
చ.1
పంచవర్షమ్ముల నియమమ్ముతో
పూజించుచుందుమే ప్రతి శ్రావణమున
నీమహిమలెంచగా మాతరమౌనా
రాజరాజేశ్వరీ రక్షింపవమ్మా!
చ.2
బ్రహ్మేంద్రాది సకలదేవతలు
మనమున నిన్నే ధ్యానించుచుందురే
సౌభాగ్యములనిచ్చి కాపాడుతల్లీ
శ్రీమాత శ్రీలలిత విశ్వేశురాణి॥
751. మహాకాళీ
ప. మహాకాళీ సర్వాంగభూషా వృతా
అ.ప. మధుకైటభసంహారీ రుద్రశక్తి '
చ.1
ఇంద్రనీలద్యుతీ చతుర్భుజా
ఘోరదంష్ట్రా దరహాసముఖీ
ముండమాలాధరీ శవారూఢా
స్మశాననిలయా మహా భీమా ॥
చ.2
మహాకాళేశ్వరుని రాణీ
కాలచక్ర నియమాను సారిణి
చరాచర జగన్మయీ దక్షిణకాళికే
మల్లికా కుసుమగంధ పంకాంకితే ॥
752 మహాగ్రాసా
ప. మహాగ్రాసా మహాదేవి
అ.ప మాతా అన్నపూర్ణేశ్వరీ
చ.1
అన్నపూర్ణపై అన్నిజీవులకు
ఆహారమును అందించుదేవీ
కాశీపురాధీశ్వరివై
జనులను కృపజూచు తల్లీ
చ.2
ఆదిభిక్షువే నీబిక్షకొరి
నీ ఇంటి ముందు నిలుచుండుకాదా
భక్తి బిక్షను మాకు దయచేయవే
మల్లికాకుసుమగానభిక్ష ప్రదాయినీ ॥
753. మహాశనా
ప. మహాశనా మహా మహితాత్మ
అ.ప. మాయాతీతస్వరూపిణీ
చ.1
ఈచరాచర జగతి యంతా నీరూపమే
ప్రతి జీవి ఇంకొక జీవికాహారమే
ఇది అంతా నీలీలా నాటకమే
అనంతకోటి బ్రహ్మాండములు నీఅశనమే ॥
చ.2
నీగొప్పతనమును వర్ణించలేము
నీ మహిమలను మేము తెలియంగము
నీ పదసేవా భాగ్యానురక్తులము
మల్లికాసుమగాన సంశోభితా ॥
754 అపర్ణా
ప. అపర్ణా మేనకా హిమవంతుల పుణ్యమా
అ.ప. కైలాసవాసుని కళత్రమా
చ.1
పర్వత రాజుకు పుత్రికవై
లోకేశ్వరుని వలచినావు
ఆకులనైనా భుజించననుచు
మృష్టాన్నములను వీడినావు
చ.2
తాపసోత్తములు విస్మయము చెందగా
నియమనిష్టలతో కఠోరతపసుతో
కామేశ్వరునే మెప్పించినావు
మల్లికాకుసుమ గాన పెన్నిధీ ॥
755. చండికా
ప. చండికా సప్తవర్ష ప్రాయ బాలికా
అ.ప. అగ్ని వాయు సర్వతత్వా ॥
చ.1
మధుకైటభ ప్రశమనీ
మహిషోన్మూలినీ దుర్గా
చండముండ దమనీ
ధూమ్రాక్ష సంహారిణీ ॥
చ.2
శుంభ నిశుంభాది దైత్య దమనీ
ధూమ్రలోచన వధే విశ్వేశ్వరీ
శుంభ ధ్వంసినీ సింహవాహినీ
మల్లికాకుసుమగానాంబికే ॥
756. చండముండాసురనిషూదినీ
ప. చండముండాసురనిషూదినీ
అ.ప చాముండేశ్వరీ దుర్గాంబికే ॥
చ.1
దానధర్మములు ఎన్నిచేసినా
యజ్ఞయాగాదులు ఒనర్చినా
నీపూజచేయక నిన్నుకొలువక
నిష్ప్రయోజనములే సౌభాగ్యమానినీ
చ.2
మహిషాసుర ప్రాణాపహారీ
సర్వాసుర భంజనకారీ
మల్లికాకుసుమ గాన విహారీ ॥
757. క్షరాక్షరాత్మికా
ప. క్షరాక్షరాత్మికా మునిధ్యేయా
అ.ప అక్షర మాలారూపిణీ
చ.1
సమస్త జీవనాధార వేద సంచారా
పరతత్వవిహార విచారదూరా
నాజన్మము ధన్యము చేయవే
సాక్షరతా కుసుమములనీయవే ॥
చ.2
జలజదళాక్షి ముఖ్యసుర సన్నుత
అప్రతిభా కల్పనాశక్తి సమన్విత
బ్రహ్మజ్ఞాన విశారదా సమస్వభావ
"మల్లికా కుసుమగానానురక్త ॥
758. సర్వలోకేశీ
ప. సర్వలోకేశీ ఈశా మహేశీ
అ.ప. సర్వదేవతా పూజ్యా వహ్నిమండల వాసీ ॥
చ.1
సర్వలోకప్రియా వజ్రేశ్వరీ
సర్వకర్మవివర్జితా సర్వలోకారాధ్యా
సర్వగర్వవిమర్దినీ ప్రకటయోగినీ
సర్వజ్ఞానప్రదా మహామహేశ్వరీ ||
చ.2
రహస్యయోగినీ సర్వేశ్వరీ
సర్వవశంకరీ సౌభాగ్య దాయినీ
సర్వాంగసుందరీ త్రిపురేశ్వరీ
మల్లికాకుసుమగాన నివాసినీ ||
759. విశ్వధారిణీ
ప. విశ్వధారిణీ విశ్వమోహినీ
అ.ప. సకలజగతికీ కారణభూతా ॥
చ.1
పదునాలుగులోకాలు జయహారతులు పట్ట
బ్రహ్మాదిదేవతలు భృత్యులై సేవింప
విశ్వమంతయునీవె విశ్వమందుననీవె
లీలాకల్పిత సర్వలోక సురమౌళీ ॥
చ.2
విశ్వమంతనిండియుండి కనపడవేలనే
వేయివిధముల వేడుకున్నను వినవదేలనే
మావంటివారిని విడనాడగాతగునే
మల్లికాసుమగాన విశ్వంభరీ ॥
760. త్రివర్గధాత్రీ
ప. త్రివర్గధాత్రీ త్రిలోచనీ
అ.ప ధర్మార్ధ కామదా త్రిదశాలయా ॥
చ.1
సిరిసంపదలను ప్రసాదించును
సౌభాగ్యములను వెదజల్లును
కల్పవృక్షపు పూలగుత్తివలె
అందము చిందును నీపదకమలము ॥
చ.2
ఆరుపాదముల తుమ్మెదనేనై
నీపాదములచెంత విహరింతునే
సద్భక్ష పాలినీ శ్రీ భ్రామరీ
మల్లికాకుసుమగాన వైఖరీ ॥
761 సుభగా
ప. సుభగా జయమంగళా
అ.ప. సౌభాగ్యదాయినీ శోభాయమానా ॥
చ.1
నీచరణ సారసము మదినమ్మియుంటి
నాపాపములెల్ల పరిమార్చమంటి
నీవుకాక మరేది శాశ్వతము కాదంటి
వేవేల ప్రణతులను గైకొన రమ్మంటి ॥
చ.2
నీనామస్మరణమే నేసలుపుచుంటి
నిరుపమ నిర్గుణా నను మరువకంటి
నీదివ్యపాదములె శరణుశరణంటి
మల్లికాసుమగాన నుతులు వినమంటి ॥
762. త్ర్యంబకా
ప. త్ర్యంబకా త్రైలోక్యజననీ
అ.ప. మృత్యుంజయ స్వరూపిణి ॥
చ.1
మూడు మూర్తులకు ముఖ్యమై నిలచిన
దివ్యమోహనరమ్యమూర్తి
శ్రీచక్ర సింహాసనా చక్రవర్తి
త్ర్యంబకేశ్వరుని హృదయానువర్తి ॥
చ.2
అఖిలాండనాయకి నవశక్తిదాయినీ
లీలాతరంగిత కటాక్ష రుచిరమ్యా
జ్యోతిర్మండల మధ్యగా శివాత్మికా
మల్లికాసుమగాన రసబంధురా॥
763. త్రిగుణాత్మికా
ప. త్రిగుణాత్మికా శృంగార విభ్రమా
అ.ప. ఇచ్ఛా జ్ఞాన శక్తియుతా సమరోద్దండా ॥
చ.1
వీణా గాన వినోద సంభరిత
సమ్మోహనకారిణి సరస్వతి
క్షీరసాగర పుత్రీ విష్ణువక్షస్థలీ
నవనిధిదాయిని శ్రీమహాలక్ష్మీ ॥
చ.2
సౌభాగ్యములనిచ్చు కల్పకమతల్లీ
గిరిరాజతనయా మంగళగౌరీ
ముగ్గురమ్మలకు మూలపుటమ్మా
మల్లికాసుమగానామృతవర్షిణి |
764. స్వర్గాపవర్గదా
ప. స్వర్గాపవర్గదా పాటల వర్ణా
అ.ప ఉపాసనా ఫలదాన సమర్థా ॥
చ.1
సిరిసంపదలు భోగభాగ్యములు
ఇచ్చే తల్లీ నారీవశంకరీ
సర్వానందమయీ సిద్ధిదాయినీ
జప ధ్యాన పూజా ఫలదాయినీ ॥
చ.2
సకలాధిష్టాన రూపా కళ్యాణకారిణీ
శారదా పరివీజిత చామరహస్తా
లబ్దాతిశయ రూపా మోక్షప్రదాయినీ
మల్లికాసుమగాన వీణా వినోదినీ
765. శుద్ధా
శుద్ధా శృతి పూజితా
అ.ప మర్మభేదినీ సర్వజ్ఞవల్లభా॥
చ.1
బ్రహ్మజ్ఞాన విశారదా శారదా
శుద్ధ సత్వ స్వరూపిణీ నిరంజనీ
సంసార పాశా భేదినీ మోదినీ
శాశ్వత గుణానురంజనీ విశుద్ధా॥
చ. 2
నీపాదములే నమ్మియుంటిని
అసహాయుల బ్రోవ జాగేలనే
నీచరణములే శరణము శరణము
మల్లికాకుసుమ గాన మాతృకా ॥
766. జపాపుష్ప నిభాకృతి
ప. జపాపుష్ప నిభాకృతీ
అ.ప. మందారపూవంటి సౌందర్య రాశీ
చ.1
సిందూర తిలకముతో నీఫాలమే ఎరుపు
తాంబూలరసముతో అధరములు ఎరుపు
అందాలనీ చుబుకము పగడాల ఎరుపు
కుంకుమ రసముతో స్తనభరము ఎరుపు ॥
చ.2
పద్మరాగ మణిభూషణములు ఎరుపు
ప్రపదము ముద్దాడు చీనాంబరములెరువు
లత్తుక పారాణితో నీపాదములే ఎరుపు
మల్లికా సుమగానానంద రక్తాక్షీ ॥
767. ఓజోవతీ
ప. ఓజోవతీ పరతేజ ప్రకాశినీ
అ.ప ఆదిత్య పధ గామినీ సర్వ వ్యాపికా ॥
చ.1
అతులిత బలముతో అసురశక్తుల నణచి
అనుపమ కాంతితో అంధకారము బాపి
అపూర్వతేజముతో భక్తి భావమునింపు
భక్తానుగ్రహ అద్భుత విగ్రహా ॥
చ.2
ప్రళయాంబుధి సన్నిభా
తేజోగుణ సమన్వితా
అమలయశోవిమలాంచితా
మల్లికాసుమగాన ఫలితా ॥
768. ద్యుతిధరా
ప. ద్యుతిధరా జగజ్జననీ
అ.ప. తప్తకాంచన సన్నిభా
చ.1.
అత్యద్భుత సుందర రవితేజా
బహురత్న మనోహర కాంతియుతా
అతిరమ్యతరా చిరశాంతియుతా
పరమార్ధ విచార వివేకనిధీ ॥
చ.2.
రాక్షస సంహర పరాక్రమతేజా
జగదోద్భవ పాలన నాశకరీ
తాపస మునిజన హృదయవిహారీ
మల్లికాకుసుమ గాన సహచరీ ॥
769. యజ్ఞరూపా
ప విష్ణురూపిణీ
అ.ప అంతర్యాగ బహిర్యాగ రూపిణీ ॥
చ.1
చిదగ్ని కుండ సంభూతా
అఖిలాపద హారి
నయనత్రయ భూషితా
ఘృణిమంత్ర మయీ భర్గా ॥
చ.2
యజ్ఞఫలదాయిని యజ్ఞేశ్వరి
అగస్త్యాది ముని గణ పూజిత
చండీయాగకుండ నిలయినీ
మల్లికాకుసుమగాన శక్తిమయీ ||
770. ప్రియప్రకా
ప. శివశక్తిమయీ
అ. సదాశివ ప్రియవ్రతా ॥
చ.1
భాగ్యములిచ్చే లక్ష్మీ వ్రతములు
సౌభాగ్యములిచ్చు గౌరీవ్రతములు
సకలదేవతల సంపదవ్రతములు
భక్తి ప్రపత్తులు ఆచరింతుము ॥
చ. 2
అన్నిప్రతములకు ఆదిదైవము
పతివ్రతాంగనా ఇష్టదైవము
సన్మంగళముల నిచ్చు దైవము
మల్లికాకుసుమగాన దైవము ॥
771. దురారాధ్యా
ప. దురారాధ్యా శ్రీవిద్యేశ్వరీ
అ.ప సాధకజన మానస విహారీ ॥
చ.1
ఇంద్రియలోలుర బుద్ధికి అందనిదీ
మందబుద్ధులకు వశ్యముకానిది
చపలచిత్తులు పూజించలేనిది
వేదదూరులకు దూరమైనదీ ॥
చ.2
స్థిర భావనతో నమ్మినవారికి
హృదయకుహరమున నివసించునదీ
శివారాధ్యులకే కనిపించునదీ
మల్లికా కుసుమగానారాధ్యా ॥
772. దురాదర్షా
ప. దురాదర్షా మహిమాన్వితా
అ.ప ఊహాతీత ప్రభావశాలిని ॥
చ.1
సమస్త విశ్వసమ్మోహినీ
పాలనసేయవేదయామయీ
కరుణారస ప్రవాహమాధురీ
సకలకలాకదంబ మంజరీ
చ. 2
నీవేలేవని అందురుకొందరు
నేను వాడి అని అహంకరింతురు
రాగాది దోషరహితముచేయవే
మల్లికా కుసుమరాగ రాగిణీ ॥
773 పాటలీ కుసుమప్రియా
ప. పాటలీ కుసుమప్రియా సౌభాగ్యమాలినీ
అ.ప మన్మధారి ప్రియంకరీ ॥
చ.1
అందాల పెన్నిధీ సోయగాలవారానిధి
నీచరణమందారము ఎదలోన నిలిపితి
నిరవశేషముగా ఆపదలను బాపవే
నవరాత్రిపూజితా దరహాసవదనా ॥
చ.2
హారనూపుర శోభినీ శేఖరీ పరమాత్మికా
పంచరత్న పద పీఠికా పాటలాక్షీ
నైమిశారణ్య వాసినీ ప్రణవ రూపిణీ
మల్లికాకుసుమగాన వివేకినీ ॥
774. మహతీ
ప: మహతీ మహనీయ గుణా
అ.ప మల్లికా సురభి గానసౌరభా॥
చ:1
కళాకదంబ మంజరీ
విశ్వగానవినోదినీ
నారదవీణానినాదినీ
భువనగానమయీ ॥
2.
నీమనోహరగానమునకు
పూలవానలు కురియగా
పరవశించెను ప్రకృతీ
పులకరించెను శివహృదీ॥
775, మేరునిలయా
ప: మేరునిలయా ఢమరుకప్రియా
అ.ప. పంచదశీమంత్రనిలయా
చ1.
నవార్ణవమంత్రప్రియా
మహాత్రిపురసుందరీ
కామేశ్వరప్రాణనాడీ
హంసమంత్రార్దరూపిణీ II
చ2.
నీకృపారసము చిలకరించవే
నాపాపములను పరిహరించవే
మారుత వేగినీ కావగరావే
మల్లికా కుసుమ గాన కళాధరీ ॥
776. మందార కుసుమప్రియా
ఫ: మందార కుసుమప్రియా త్రిపురాంబికా
అప. హేమభూషణ భూషితా ॥
చ1.
సంగీతాలంకృతా సాహిత్యమోదితా
సామగాన వినోదితా పరమేశసుకృతా
వ్రతదానఫలితా కుంకుమ విలేపితా
జపాకుసుమ మోహితా సువాసినీ వందితా ॥
చ2.
మందార పూవులు మంకెన పూవులు
దాసాని పూవులు రక్తచందనము
రక్త వస్త్రములు ప్రీతికారకమైన
మల్లికా కుసుమ వేణి శోభితా ॥
777. వీరారాధ్యా
ప: వీరారాధ్యా శంభుప్రియా
అ.ప: పరమమహేశ్వర ఆరాధ్యా ||
చ:1
ఆత్మానందము అనుభవించెడివారు
జ్ఞానానందము పొందినవారు
ద్వైత భావములు లేనట్టివారు
నిను ఆరాధించు పుణ్యాత్ములు||
చ2.
మహావీరేంద్రవర దా శర్మదా
వీరభద్ర గణపూజితా మహితా
ప్రమధనాధ హృదయరంజితా
మల్లికాకుసుమ గాన మోహితా ॥
778. విరాడ్రూపా
ప. విరాడ్రూపా విశ్వహితరూపా
అ.ప సర్వదేవతా విగ్రహరూపా ||
చ.1
నీరూపమే బ్రహ్మాండాకారము
సూర్య బింబమే రజతఛత్రము
దేవతలందరూ నీకు సేవకులు
భూవలయమంతయు నీపాదపీఠము ॥
చ. 2
చంద్రకాంతివై సూర్యతేజమై
పావకభ్రాంతిపై అష్టదిగ్ధంతిపై
షోడశభువనాలు కుక్షినుంచుకొను
మల్లికాకుసుమగాన విశ్వంభరీ ॥
779. విరజా
ప. విరజా తేజస్వినీ
అ.ప బ్రహ్మప్రతిష్ఠా విరజా మాతా ॥
చ.1
సత్వగుణాలయ త్రిగుణా తీతా
నిరహంకార నిర్వికారిణీ
పాపరహితా పావనచరితా
అమోఘస్వరూపా శ్రీ మాతా |
చ.2
కవిజనకల్పక కలుష దమనీ
తాంబూలారుణపల్లవాధర
పంచకోశాత్మికా నీలీ నీలాంబరీ
మల్లికాకుసుమగాన మంజరి ॥
780. విశ్వతోముఖీ
ప. విశ్వతోముఖీ విశ్వాత్మికా
అ.ప విశ్వగమ్యా గణనీయచరితా ॥
చ.1
దివ్యమంగళా జగదానందా
విశ్వ భర్తా విశ్వవిధానా
మృష్టాన్నప్రీతా హిమాద్రిజాతా
పుళిందినీశ్వరీ పర్వతవాసినీ ॥
చ.2
విశ్వవ్యాపినీ మాయాప్రభంజనీ
విశ్వకారిణీ విశ్వేశ్వరీ
అష్టాంగయోగినీ వేదగోచరీ
మల్లికాకుసుమగాన సాక్షిణీ ||
781. ప్రత్యగ్రూపా
ప. ప్రత్యగ్రూపా అంతర్ముఖా
అ.ప మూలకారణా నిశ్చలాత్మా ||
చ.1
సుప్రసాదినీ ప్రసన్నాత్మా
భూతభావనా విశుద్ధాత్మా
అనంతరూపా విజితాత్మ
అనేకమూర్తీ విధేయాత్మా ॥
చ.2
అప్రమేయా ప్రమేయాత్మా
అనామయా అఖిలాత్మా
అధిష్టానా అమేయాత్మా
మల్లికాకుసుమగానాత్మా ॥
782 పరాకాశా
ప. పరాకాశా స్వప్రకాశా
అ.ప సర్వవ్యాపిని సర్వాత్మికా ॥
చ.1
సత్వగుణాన్విత విబుధ ప్రియ
రత్నభూషణా సదా షోడశీ
లోకచూడామణీ రమ్యరసనిధి
షడ్గుణ ఐశ్వర్య విరజా వినయా |
చ.2
నక్షత్ర మాలినీ వ్యోమకేశీ
రుద్రరూపిణీ శత్రుహారిణీ
సృష్టి కారిణీ పరంజ్యోతీ
మల్లికాకుసుమ గానదీపా ॥
783. ప్రాణదా
ప. ప్రాణదా శుభకామదా
అ.ప సుజన రక్షా దీక్షితా ||
చ.1
పంచభూతములయందున నిలచి
పాంచభౌతికదేహములందున
పంచప్రాణముల దీపమునిలిపే
ప్రాణదాయినీ శుభకామినీ ॥
చ.2
సర్వ జనులకు ఆహారమును
నియమబద్ధముగ ఏర్పరచినావు
అన్నదాతవు ప్రాణదాతవు
మల్లికాకుసుమగాన ప్రాణదా ॥
784. ప్రాణ రూపిణీ
ప. ప్రాణరూపిణీ భక్త హృదయ నివాసి
అ.ప మార్తాండ భైరవ పూజితా ॥
చ.1
పంచభూతముల పంచప్రాణముల
పంచశక్తుల ప్రణవరూపిణీ
జీవులయందున ప్రాణరూపముగ
నిలచియుండే గుప్తరూపిణీ |
చ.2
నీవులేనిదే జీవములేదు
జీవములేక జీవియుండదు
జీవితచక్రము నడిపే శక్తి
మల్లికాకుసుమగాన ప్రేరణా॥
785. మార్తాండ భైరవారాధ్యా
ప. మార్తాండ భైరవారాధ్యా
అ.ప. ఆదిత్య మండలాంతర్వర్తి ॥
చ.1
మార్తాండ భైరవుడు నిను ఆరాధించి
సూర్యతేజమును పొందకలిగెను
ప్రాణశక్తిని ప్రసాదించే పావనీ
అష్టభైరవ వందితా శ్రీశాంకరీ ॥
చ. 2
జలము తేజము నింగియు నీవే
వాయువు నీవే పృధ్వీ నీవే
పంచభూతముల ప్రాణశక్తివి
మల్లికాకుసుమగాన ప్రాణహిత ||
786. మంత్రిణీ స్వస్థరాజ్యధూః
ప. మంత్రిణీన్యస్త రాజ్యధూ
అ.ప. మంత్రిణీ పరివార పూజితా ॥
చ.1
శ్యామరూపిణీ శ్యామలాదేవీ
గేయచక్రరూఢ మంత్రిణీదేవీ
అమితశక్తి సైన్య వారాహిదేవీ
షోడశమంత్రిణీ పరిసేవితా
చ.2
లోకపాలనచే విశ్వశ్రేయము కూర్చి
సంకల్పసిద్ధిని కలిగించు మంత్రిణీ
పరివారసేవితా రాజరాజేశ్వరి
మల్లికాకుసుమగాన సంతోషిణీ
787. త్రిపురేశీ
ప. త్రిపురేశీ అమేయకృపాన్విత
అ.ప. సర్వలోకహిత మునిజనసన్నుత
దివ్యకళామయ రూపశోభిత ॥
చ1.
షోడశదళనివాసినీ షోడశాక్షరీ
సర్వాంశాపరిపూరక చక్రవాసినీ
వాంచితార్ధ ప్రదాయిని కామిని
మల్లికాకుసుమ గంధ సురుచిరవేణీ ॥
చ2.
నవరాత్రిసంచారిణి నవయవ్వన శాలినీ
నవావరణ పూజిత నవనిధి సంధాయినీ
శరశ్చంద్ర నిభాననా త్రిపురేశీవజ్రనీ
యంత్రమంత్రస్వరూపిణి భవసాగరతారిణీ
788. జయత్సేనా
ప. జయత్సేనా జయమునీయవే
అ.ప అనంతశక్తి సేనాసమన్వితా ॥
చ.1
అసురులను సంహరించు శక్తి సేనలతో
విజయమును సాధించు మంత్రిణీగణముతో
నిరతము సేవించుయోగిణీ గణముతో
తేజోవిలాసినీ విజయాంబికే ॥
చ. 2.
సప్తకోటి మహామంత్రములు
సర్వదేవతలూ నీఆధీనమే
నిన్నునమ్మినచో అన్నిజయములే
మల్లికాకుసుమ గాన యోగినీ ॥
789. నిమ్రోగుణ్యా
ప. నిమ్రోగుణ్యా లీలావినోదినీ
అ.ప సప్తకోటి మహామంత్రా॥
చ.1
ప్రణవాది అక్షరాత్మికా
సుధాంశు బింబవదనా
నిర్గుణ చరితా శ్రీలలితా
సర్వ జయకరీ జయ జయ గౌరీ ॥
చ.2
ఖడ్గభేటకధారిణీ
ఘోరాసుర ధ్వంసినీ
మధురాలాప సంతోషిణీ
మల్లికాసుమగాన వర్ధినీ ॥
790. పరాపరా
ప, పరాపరా యోగవిద్యా పరా
అ.ప. విశ్వవ్యాప్త ఆత్మతత్వా
చ.1
జ్యోతిష్యాది అపరా విద్యలు
జపతపాది పరావిద్యలు
భోగమోక్షపర సాధనలు
ముక్తిజ్ఞాన సోపాన హేతువులు ॥
చ.2
సమస్త విశ్వము నీఆధీనము
హృదయాంతరాళముల సత్యదర్శనము
నీపూజనమే శాశ్వతానందము
మల్లికాకుసుమగాన సత్యము ॥
791. సత్యజ్ఞానానందరూపా
ప. సత్యజ్ఞానానందరూపా
అ.ప. సర్వలోకాఁ ధ్య నిత్య సౌభాగ్యా ॥
చ.1
వృద్ధిక్షయములేని నిత్యమై సత్యమై
సంకల్ప వికల్పములేని ఏకాకియై
కాలాతీతమై స్వప్రకాశమై
సర్వజీవులకు సాక్షీభూతము
చ.2
శాశ్వతానందము కైవల్యము
సాయుజ్యమార్గము మోక్షదాయకము
అనిర్వచనీయ అనుభవానందము
మల్లికాసుమగాన చైతన్యము నీ రూపము ॥
792. సామరస్య పరాయణా
ప. సామరస్య పరాయణా సమరస భావనా
అ.ప. శివశక్తిసమ్మేళనా ||
చ.1
ఆదిపురుషుడతడు ఆదిపరాశక్తి నీవు
మీ ఇద్దరి జంట మాకన్నుల పంట
పశుమలేశుడతడు పాశవిమోచనినీవు
మీకలయికే విశ్వశాంతికి కారణము ॥
చ.2
కాలకంఠుడు అతడు కలకంఠి కాళి నీవు
మీ ఇద్దరి అనురాగము లోకాలకు ఆదర్శము
మంగళరూపుడు అతడు మంగళగౌరివి నీవు
మీ ఇద్దరి రూపము మంగళ ప్రదము ॥
793. కపర్దినీ
ప. కపర్దినీ శైలరాజసుతా
అ.ప కపర్దినీ విద్యారూపిణీ ॥
చ.1.
సకలభూతప్రేత నాశినీ దుర్లభా
అష్టత్రింశతి రూప కైవల్య రేఖా
శివశక్త్యాత్మికే త్రికోణ మధ్యమా
మహిషమర్దనీ రమ్యకపర్దినీ ॥
చ. 2.
సింహేద్ర వాహనా శాశ్వత శరణ్యా
నిత్యనిరహంకార శివవల్లభా
శశిఖండ మండిత జటాజూటా
మల్లికాకుసుమగా స్మిత శోభితా।
794. కలామాలా
ప. లావణ్య శోభినీ కలామాలా
అ.ప చతుష్షష్ట్యాది కలారూపిణీం ॥
చ.1
పంకేరుహ చరణం
సకలకలా భరణం
కుంకుమ పంకిల వదనం
మణిమయ సదనం ॥
చ.2.
ఇంద్రాది సన్నుతం
హరిద్రాన్నభక్షణం
కదంబవన వాసినం
మల్లికాసుమ గాన మోహం ॥
795. కామధుక్
ప. కామధుక్ కామేశ్వరి
అ.ప. కొర్కెలను తీర్చేటి కామధేను స్వరూపా ॥
చ.1.
భక్త మనోరధ పూరణ చతురా
హేమమణిమయ సుందర హారా
తాంబూలారుణ పల్లవాధరా
సర్వగుణాశ్రయ ముని మనోహరా ॥
చ. 2
దివ్యదరహాస భాసురా
నిరంతరానంద ప్రదాయకా
వాగమృతానంద తరంగితా
మల్లికాకుసుమగానహితా ॥
796. కామరూపిణీ
ప. కామరూపిణీ కామేశ మనోహరీ
అ.ప. కామదాయిని కామేశ్వరీ ||
చ.1
వాగీశ్వరి వాచకరీ యోగీశ్వరీ
పశుమలేశుని' రాణి గీర్వాణీ
తెలియకచేసిన తప్పులు ఎంచుట తగునా
నేరములను మన్నింపలేవా ॥
చ. 2
వాగ్దేవి కరుణించి యిచ్చినవరము
మల్లికాకుసుమ గాన పరిమళము
నీకేయిచ్చి నిను ఆనందింపగచేయ
ఏనోములు నేను నోచుకుంటినో తల్లీ॥
797. కలానిధీ
ప. సకల కలానిధి కామేశీ
అ.ప. షోడశ కళానిలయినీ
చ.1
చంద్ర కళాధరి శ్రీ నిధి
మధుర సంగీత కళానిధి
సులలిత కవిత్వ వారధి
చిరునవ్వుల శాంతిసుధా నిధి ॥
చ. 2.
మాపాలిటి సాహిత్య పెన్నిధి
కోరుకొందు నిత్యము నీసన్నిధి
శ్రీ లలితా సౌభాగ్య విద్యానిధి
మల్లికాకుసుమగాన దీక్షానిధి ॥
798. కావ్యకలా
ప. చతుషష్టి కళామయీ కావ్యకలా
అ.ప. మృతసంజీవనీ విద్యాకళారూపిణీ
చ.1
చైతన్యకలా బ్రహ్మకలా విలాసిని
సాహిత్య సంగీత వికాసిని
వాగర్ధముల విభూతి ప్రసాదము
సారస్వత విజ్ఞానము నొసగవే ॥
చ.2
వేదవ్యాస వాల్మీకి కాళిదాసాది
కవిజన కావ్యరస ప్రవాహినీ
సరస శృంగార కావ్య కళామయీ
మల్లికాకుసుమగాన ప్రసాదిని ॥
799. రసజ్ఞా
వ. రసజ్ఞ శివుని శృంగారమా
అ.ప. భక్తుల పాలిటి శాంతమా ॥
చ.1
అసుర గణములను త్రుంచు వీరమా
కుజనులను శిక్షించు రౌద్రమా
గిరీశు చరితవిని విస్మయమా
హరుమేని సర్పముగని చిరుభయమా ||
చ. 2.
సఖురాండ్ర యందు దరహాసమా
రక్తబీజు సంహార భీభత్సమా
ఈదీనురాలిపై కరుణ చూపుమా
మల్లికాసుమగాన భక్తి మకరందమా॥
800. రసశేవధిః
ప. బ్రహ్మమృత రసశేవధీ
అ.ప.బ్రహ్మానంద రసనిధీ II
చ.1
శృంగార రసశేవధీ
నవరసానంద రధసారధీ
సరససంగీతామృత వారధీ
సకల కళాకావ్యనిధీ ॥
చ. 2.
సకలాగమ స్థితా సమరసా
స్వప్రకాశ చైతన్య రసా
ముగ్ధమోహన లావణ్య రసా
మల్లికాకుసుమ దివ్యగాన రసా ॥
801. పుష్టా
ప. సకల కలా రూపిణీ పుష్టా
అ.ప సకలతత్వ రూపిణీ ॥
చ.1
బ్రహ్మానంద శేవధీ
సకలాగమ పరమావధి
సంగీత స్వర గాన నిపుణా
అఖండైక చైతన్య రూపా ||
చ.2
మనః పధదవీయసీ
మహాగుణ గరీయసీ
సలలిత లావణ్య రాశీ
మల్లికాసుమ గానవానీ ॥
802 పురాతనా
ప. ఆదిదేవీపురాతనా
అ.ప నిరాకారానిర్గుణా ||
చ.1
ఆద్యంతరహితా ఆదిశక్తి
ఏకార రూపా ఏకరసా
ఏలాసుగంధి చికురా
కాలస్వరూపా శాశ్వతా ||
చ.2
నవనాదమయీ శక్తిమయీ
దనుజదండినీ తంత్రమయీ
ఆధ్యాత్మ తేజోవిలాసిని
మల్లికాకుసుమ గానమయీ||
803. పూజ్యా
ప. సకల దేవతా పూజ్యా
అ. ప యక్షకిన్నెరపూజా యోగ్యా ॥
చ.1
సకలఋషివరులు కొలువగా
సద్గుణ కీర్తుల నాలపించగా
కమలజాదిసురలు నుతింపగా
మణిమంటపమున కొలువుతీరెను
చ. 2
మోహనాంగులౌసురలు ఆడగా
నారదాది మునిముఖ్యులు పాడగా
మేనుమరచినది చిరునవ్వులతో
మల్లికాకుసుమగానాహ్లాదిని ||
804 పుష్కరా
ప. సర్వవ్యాపిని పుష్కరా
అ.ప యోగకాలస్వరూపిణీ II
చ.1
నాపాలి భాగ్యమా నాకంటి వెలుగా
మాఇంటి దీపమా గతజన్మ ఫలమా
మాపైనదయచూపి మాపూజకొనుమా
నీదివ్యదర్శనము మాకుదుర్లభమా॥
చ.2
నీదరహాసపు మొలకలలో '
స్నానమాడింపవే విశ్వసాక్షిణీ
సర్వమును పోషించు సారసాక్షి
మల్లికాకుసుమగాన సుందరీ ॥
805. పుష్కరేక్షణా
ప. మనోహర పుష్కరేక్షణా
అ.ప కరుణా కటాక్షీ పద్మాక్షీ ॥
చ.1
బ్రహ్మాది దేవతలు భృత్యులై సేవింప
పద్నాలులో కాలు జయహారతులు పలుకు
శుభఫల వర్షిణీ కరుణామృతవల్లీ
కామేశమానస ప్రియతమభామినీ
చ.2.
అనాద్యంతా ఆత్మరూపిణీ
విశ్వవిధాత్రీ హరాధీనా
కవులవాక్కుల కల్పవల్లీ
మల్లికాసుమగాన కమలాక్షీ ॥
806 పరంజ్యోతి
ప. పరంజ్యోతి పరాత్పరీ
అ.ప మదనశాసన ప్రేయసీ ॥
చ. 1
గహరాబ్జ గేహినీ
జ్వాలాంబికే శ్రీ జగదంబికే
రూపలావణ్య విగ్రహా॥
చ.2
ఖండేందుమౌళి మానస విహారిణి
మహాభాగిని మహాభోగినీ
గీర్వాణ సంసేవిని లోకపాలినీ
మల్లికా కుసుమగాన పాలినీ ॥
807. పరంధామా
ప. పరంధానూ ప్రకీర్తితా
అ.ప న ప్రసాదా పుష్టివర్ధని II
చ.1
రజనీశ కలారమ్యా
షడాధారా షడాశ్రయా
సకలాగమ పారగాయ
మనోరధ ఫలప్రదా ॥
చ.2
తురీయపద గామిని
పరాశక్తి గౌరి మహేశ్వరి
ఋణత్రయ విమోచనీ
మల్లికాకుసుమగాన ధారిణీ ॥
808. పరమాణు:
ప. అడోరణీయ పరమాణు
అ.ప బ్రహ్మాండాకారిణి శ్రీలలితా ॥
చ.1
లోకోత్తర గుణాన్వితా
భవతాప ప్రశమనీ
యాతనారహితా వరిష్టా
జగదానంద జననీ
చ.2
అణిమాది గుణాగ్రణీ
మంజుమంజీర పదాబ్జ
కీరాలాపవినోదినీ
మల్లికా సుమగానాగ్రణీ ॥
809. పరాత్పరా
వ. పరాత్పరా శ్రీమయీ
అ.ప గురుస్వరూప విభవా॥
చ.1
విద్యుల్లతా విగ్రహా
శ్రీదానవిద్యామయీ
కళ్యాణ కాంచీరవా
కామ్య ప్రదాన వ్రతా ॥
చ. 2
కౌమారీ గురురూపిణీ
గౌరీ కారుణ్య కల్లోలినీ
యాతనారహితాధృతివర్ధనీ
మల్లికాకుసుమగాన వర్ధనీ ॥
810. పాశహస్తా
ప. రాగే స్వరూప పాశహస్తా
అ.ప సర్వాయుధ ధారిణీ ॥
చ.1
జన జాడ్యాపహారిణీ
గీర్వాణ సంసేవినీ
షట్కోణమధ్య నిలయా
ఇంద్రభోగ ఫలప్రదా॥
చ.2
నిర్మలాత్మక నిశ్చలాత్మకా
రాగాది దోషవర్ణికా శ్రీ మాతా
కామారి కామా కనక ప్రభాసా
మల్లికాకుసుమగాన కీర్తిదా॥
811. పాశహంత్రీ
వ. పాశహంత్రీ సనాతనీ
అ.ప భవపాశవిమోచనీ జయభవానీ ॥
చ. 1
పశుపాశము భవపాశము
బంధపాశము మోహపాశము
దుఖః పాశము ఆశాపాశాది
పాశములను తొలగచేయుము॥
చ.2
కామేశుని వలపుసీమలను
ఏలు ప్రియతమ భామినీ
మనోరధములుతీర్చుతల్లీ
మల్లికాసుమగానవల్లీ ॥
812. పరమంత్రవిభేదినీ
ప పరమంత్రవిభేదినీ కపర్దినీ
అ.ప భండాసుర వినాశినీ ॥
చ.1
పంచదశీ మహామంత్రోపాసినీ
శివపద రాజీవ మధుపమా
విభుదాశ్రయా భాగ్యవర్ధినీ
రసభావక హసితాననా ॥
చ.2
ఏణాంకధరీ ఉత్సవప్రియా
పాశాంకుశధారిణీ మదంబా
పరమేశ్వరీ అమితతేజసా
మల్లికాసుమగానమానసా ॥
813.మూర్తా
ప. మూర్తాస్థూలరూపిణీ
అ.ప నామరూపాత్మక దివ్యమూర్తి ॥
చ.1
అన్ని భాషలు అన్నిభావములు
కళలు కాంతులు వింతలు వంతలు
అందచందములు దశలు దిశలు
నీ అధీనమై అలరుచున్నవి ॥
చ.2
స్వప్న సుషుప్తుల సాక్షీభూతా
సర్వలోకహిత శివసన్నుత
కైమోడ్పులివే శ్రీపురవాసిని
మల్లికకుసుమగాన నివాసిని ॥
814. అమూర్తా
ప. అనిర్వచనీయా అమూర్తా
అ.ప భక్తహృదయారవిందా నిరాకారమూర్తీ ॥
చ. 1
భవబంధ మోచనా వేదస్వరూపా
ఉపనిషత్సారా ధృవకలారూపా
కార్యకారణ నిర్ముక్తా నిరాధారా
కంటికి
కనపడని అమృతంగమా ॥
చ.2
యోగులమనమున హంసరూపము
మెరుపుకాంతివలె అగ్నిజ్వాలవు
చిదాకాశమువాయువునీపు
5 మల్లికాకుసుమగానపూరితా॥
815. నిత్యతృప్తా
ప. నిత్యతృప్తా శివంకరీ
అ.ప తృప్తిరూపిణీ అప్రమేయా॥
చ.1
ధ్యానావహనాది షోడశపూజలతో
స్నానము పానము గంధాక్షలతో
చతుష్షష్టి ఉపచారములతో
నిత్యాలంకారా నిత్యతృప్తా ॥
చ. 2
తాంబూలపూరిత వదన ప్రియా
యజ్ఞయాగ ఫల దానప్రియా
అరవిందాసనా అర్చన ప్రియా
మల్లికాకుసుమ గానప్రియా॥
816. మునిమానసహంసికా
ప మునిమానసహంసికా
అ.ప. హ్రీంకారదీర్ఘకాహంసీ ॥
చ.1
యోగిజన హృదయకమల మకరంద రసిక
మునిమానససరోవర పరమహంసికా
నిటలనేత్ర హృదిరంజని గురుపాదుకా
హ్రీంకారవాచ్యా హ్రీంకారపూజ్యా ॥
చ.2
సకలశుభకరీ వైష్ణవీజ్వాలా
మన్మధ హేలా కరధృతిశీలా
బ్రహ్మానందామృత సాగరహేలా
మల్లికా కుసుమగాన హంసికా ॥
817. సత్యవ్రతా
ప సత్యవ్రతా పరమేశ్వరి
అ.ప నిత్య సత్య సాహిత్య రూపిణీ ॥
చ.1
సర్వమంగళ కారిణీ
పుణ్యరూపిణి పురాణీ
కలాత్మికా ఇంద్రరూపిణీ
హేమభూషిణి సత్యస్వరూప ॥
చ.2
సత్యశోధిని సత్యవాదిని
సత్యమోహిని సత్యవాహినీ
సత్యోపాసనా ఫలదాయిని
మల్లికా కుసుమగానవ్రతా॥
818. సత్యరూపా
ప. సత్యరూపా సత్యవతీ
అ.ప త్రికాలజ్ఞా సర్వాంతర్యామీ ॥
చ.1
సత్యపాలన చక్రవర్తీ
ధర్మపాలన సత్యమూర్తీ
నిత్యనిర్మల బ్రహ్మమూర్తీ
కామేశహృదయానువర్తి ॥
చ.2
సధర్మదీక్షతో సత్కర్మలు చేసి
దేవతలను గురువులను ఆదరించెడి
సత్యసంకల్పమును మాకీయవే
మల్లికాసుమగాన సత్యరూపా ॥
819. సర్వాంతర్యామినీ
ప. సర్వాంతర్యామినీ శ్రీ లలితా
అ.ప పరమేశ్వర ప్రకృతి శబళ బ్రహ్మా ॥
చ.1
అన్ని మంత్రముల రూపము జ్ఞానము
అన్నిశాస్త్రముల సారము పారము
భక్తుల పాలిటి ఇహ పర దైవము
కలదన్నవారికి కనుపించుదైవము ॥
చ. 2
పాహి పాహి యని ఎంతపిలిచినా
మనసుకరుగదా మాపాలిదైవమా
యోగసదాశివ మానస విహారిణీ
మల్లికాకుసుమగాన భృంగికా ॥
820. సతీ
ప సదాశివ సతీ సర్వాంతర్యామి నీసతీ
అ.ప సతతము చేసెద సన్నుతీ ॥
చ.1
నీకనుసన్నల మెలిగెడివారికి
దుఃఖములేవీ లేవని తెలిసి
నీపూజలనే మరిమరి సలిపెద
జాగుచేయకే మమ్ముకావవే ॥
చ. 2
దాక్షాయణిపై భవునిసతివై
చిదగ్నిలోనే ఆహుతియై
అష్టాదశ పీఠముల వెలసిన
మల్లికా కుసుమ గాన శాశ్వతీ ||
821. బ్రహ్మాణీ
ప. మానస సంచరిణీ బ్రహ్మాణీ
అ.ప చతుర్దశ భువనాధారిణీ ॥
చ.1
అంతట తానై శ్రీకరమై
ఆనందమయకోశ నిధియై
అలడుచున్నది బ్రహ్మమై
బ్రాహ్మణీ మనోన్మణీ ॥
చ. 2
బ్రహ్మపద మార్గదర్శిని
సత్కవులు రసచింతామణి
పంచభూతాంతర్యామిని
మల్లికాసుమగాన కర్మణీ ॥
822. బ్రహ్మజననీ
ప, బ్రహ్మజననీ హ్రీంచూడామణీ
అ.ప హ్రీం మధ్యా లకులేశ్వరీ ॥
చ.1
సకల జననీ హంసవాహినీ
వినయసులభా వేదగులికా
వ్యోమాకారా పరానందా
తరుణార్కశోడీ రాగార్థవీ
చ.2
విశ్వస్వరూపిణి సనాతని
సచ్చిదానంద బ్రహ్మమయీ
ఈశ్వరానుగ్రహాత్మికా
మల్లికాసుమగాన వీచికా॥
823. బహురూపా
వ. ఉమాదేవీ బహురూపా
అ.ప ఉమా మహేశ్వరి మంగళరూపా ||
చ.1
శక్తిస్వరూపిణీ మహేశ్వరీ
నామరూపాత్మిక సృష్టి కారిణీ
సర్వవిద్యాదాయినీ శివయువతీ
పుణ్యజనపూజిత పదా ॥
చ.2
సత్కవులెల్లరు నిన్నుపొగడంగ
హిమగంగతో నీపాదాలు కడుగంగ
వాగ్దేవి మహలక్ష్మి నినుకొలువంగ
మల్లికాకుసుమాల నిను సేవింతునే ॥
824. బుధార్చితా
ప. బుధార్చితా శ్రీ లలితా
అ.ప విబుధాశ్రయా సుచరితా ॥
చ.1
దేవతలు మునులు యోగినులు
పుణ్యచరితులు నినుపూజింతురే
ఐహిక సుఖములనిచ్చు శాంకరీ
సాయుజ్య మిచ్చేటి శాంతిదాయినీ ॥
చ.2
బాల పంచదశీ సౌభాగ్య విద్యా
షోడశీ శుద్ధ మహావిద్యా
వారాహి బగళా నీరూపములే
మల్లికాకుసుమ గానార్చితా ॥
825. ప్రసవిత్రీ
ప. ప్రసవిత్రీ సవితాదేవీ
అ.ప సకలజగతి సృష్టికారిణీ ॥
చ.1
సూక్ష్మము నుంచి బ్రహ్మము వరకు
అండము మొదలు బ్రహ్మాండము వరకు
పదునాలుగు లోకముల సృష్టికారిణీ
సర్వభూతహిత కారణభూతా ॥
చ.2
దానవ విద్రావినీ దేవలోకవిహారిణీ
కలిదోషహరా క్షీర పాయినీ
కాళిదాసాది కవివర పూజితా
మల్లికాకుసుమ గాన సమావృతా ॥
826. ప్రచండాజ్ఞా
ప. ప్రచండాజ్ఞా సర్వజ్ఞా
అ.ప హూంకారాలయ నాయికా ॥
చ.1
లిప్తచందన పంకిలా
షట్కార పీఠ నిలయా
స్వాహాకార స్వరూపిణీ
స్వకృతాఖిల వైభవా ॥
చ.2
నిశాచరకుల ధ్వంసీ
దుర్మదా దురితాపహా
నవరాత్రి దినారాధ్యా
మల్లికాసుమగాన దేవతా ॥
827. ప్రతిష్ఠా
ప. ప్రతిష్ఠా పరమేశ్వరీ
అ.ప నీతిశాస్త్ర స్వరూపిణీ ॥
చ.1
స్వాదిష్టానాంబుజారూఢా శోభనా
లలితాక్షర మంత్రస్థా విజయప్రదా
ఫలదాన ప్రదాయనీ ఫలాశినీ
హ్రీంకారాలయ నాయికా గిరిసుతా॥
చ.2
కుంకుమారుణ కంధరా సురపాలినీ
శంఖతాటంక శోభినీజనమోహినీ
శిష్టాచార పరాయణీ మృదుహాసినీ
మల్లికాకుసుమగాన సువాసినీ ॥
828. ప్రకటాకృతీ
ప శ్రీకరీ ప్రకటాకృతీ
అ.ప పార్వతీ పావనకృతీ ॥
చ.1
కాళీ హైమవతీ కపాల ధారిణీ
శృంగార సామ్రాజ్య పట్టాభిషేకినీ
హిరణ్మయ పురాంతస్ధా బీజరూపిణి
త్రైలోక్యమోహన చక్రవాసినీ ॥
చ.2
ప్రకటిత మోహన రూపిణీ
నిరంతర సుఖ ప్రదాయినీ
సంగీతానంద సంతోషిణీ
రీధరు మల్లికాకుసుమగాన తోషిణీ ॥
829. ప్రాణేశ్వరీ
ప. చంద్రశేఖరుని ప్రాణేశ్వరి
అ.ప జయజయ శ్రీరాజరాజేశ్వరి
చ. 1 చిత్కళామయ చిదానంద ఘన
మాయాతత్వ ప్రాణస్వరూపిణీ
రాగ కాలం నియతి కలా విద్యా
పంచకంచుకా కళ్యాణీ
చ.2
సర్వరూపా సర్వప్రాణాధారా
సర్వయుక్తా సర్వజీవాధారా
బారూపైకరసికా రసాత్మికా
మల్లికాకుసుమగాననాయికా ॥
830. ప్రాణదాత్రీ
ప. ప్రాణదాత్రీ ఫలదాత్రీ
అ.ప అనంగాంకుశాది పరివారసేవితా|
చ.1
చంద్రకళాధర కాంతికాంతా
ప్రాణి జనకా ప్రాణదాయిని
గూఢరూపీ అమంగళహంత్రీ
బ్రహ్మేశ్వరీ షడూర్మిహంత్రీ ॥
చ. 2
మృత్యుంజయ ప్రాణేశ్వరీ
హ్రీంకార తరుమంజరీ
అకాలమృత్యుహరిణీ హ్రీంకారీ
మల్లికాసుమగాన ప్రాణధాత్రీ ॥
831. పంచాశత్పీర రూపిణీ
ప. పంచాశత్పీరరూపిణీ శ్రీమహారాజ్ఞి
అ.ప. ఆదిక్షాంతమూర్తీ కామరూపనివాసినీ ॥
చ.1
దాక్షాయణివై సతివై చిదగ్నియందులీనమై
మాతృకాపీఠములలో పూజలందుకొను తల్లీ
శాంకరీ చాముండీ దుర్గా మాంగళ్య గౌరీ
వైష్ణవీ మాణిక్యాంబా శృంఖలా పురుహూతికా||
చ.2
విశాలాక్ష్మీ కామాక్షీ జోగులాంబా భ్రామరీ
మహాకాళీ మహాలక్ష్మీ మాధవేశ్వరీ పార్వతీ
వింధ్యావాసినీ అన్నపూర్ణా జ్వాలాంబా జాలంధరీ
మల్లికాసుమగానమానస అనఘా భువనేశ్వరీ।
832. విశృంఖలా
ప. విశృంఖలా సర్వస్వతంత్రా
అ.ప సంసారశృంఖలములను త్రెంచవే ॥
చ.1
తత్వప్రకాశముగశబ్దబంధురముగా
భక్తజన సేవ్యముగ మృదుమధురముగా
శుభాంచితముగ జనరంజకముగా
నీదివ్యకీర్తనలు మేముపాడెదమే ||
చ. 2
అరమోడ్పు కనుగవతో నీవు ఆలకింపగా
నాగాన మాధురికి ప్రకృతి పులకింపగా
గేయరసాస్వాదనమున మేనుపరవశింపగా
మల్లికాసుమగాన గీతమాలపించెదనే ॥
833. వివిక్తస్థా
ప. వివిక్తస్థా స్వైరవిహారిణీ
అ.ప విశృంఖలా తపశ్శాలినీ ॥
చ.1
నీవెక్కడ ఉంటివో తెలుపుమమ్మా
పంచభూతముల మధ్యన గలవో
నిర్జన దేశ ప్రదేశములందునో
జనులులేని పవిత్ర దేశములనుంటివో ॥
చ.2
ఆకారములు ఉన్నవో నిరాకారివో
నామములున్నవో నామరహితవో
జడవదార్దమో ఆపదుద్దరవో
మల్లికాకుసుమగాననిలయవో॥
834. వీరమాతా
ప. వీరమాతా దిక్పాలకుల తల్లి.
అ.ప బ్రహ్మాది మూర్తులకు కన్నతల్లీ॥
చ.1
గణాధిపతికి సేనాపతికి
శ్రీ విద్యాశ్రిత దీక్షాపరులకు
సర్వసేనలకు ఇంద్రాది వీరులకు
కన్నతల్లివై సాకెడి వీరాంబా
చ.2
దేహి దేహియన వరమిచ్చెదవు
పాహి పాహి యన పోషించెదవు
త్రాహి త్రాహి యన కరుణించెదవు
మల్లికాసుమగాన స్వర మాలకించెదవు ॥
835. వియత్ప్రసూః
ప. వియత్ప్రసూ ఆకాశప్రసవినీ
అ.ప ఆదినిలయినీ ఆదిశక్తీ ॥
చ.1
అండ పిండ నిలయినీ
బ్రహ్మాండ తేజోరూపిణి
ఆదివిద్యా నగరవాసినీ
సర్వలోకాధిపా పరా
చ. 2
పంచవింశతితత్వ
దూర్వాసముని పూజితా
అనాహత చక్ర సంస్థితా
మల్లికాసుమగాన స్థితా ॥
836. ముకుందా
ప. ముకుందా ముక్తినిలయినీ
అ.ప జ్ఞాన దాయినీ యోగీశ్వరీ ॥
చ.1
యశోద గర్భాన నందగోపుని ఇంట
కృష్ణునిగా జన్మించి కారణ జన్మవై
శుంభ నిశుంభులను సంహరించిన
వింధ్యాచలవాసినీ లలితాంబికా ॥
చ.2
నామరూపాత్మికా సృష్టిస్వరూపిణీ
ఆమందానంద నిలయా ముకుందా
బృందారక హితబృందా వనస్థితా
మల్లికాకుసుమగానముకుందా ॥
837. ముక్తినిలయా
ప్ర. ముక్తినిలయా పరమేశ్వరీ
అ.ప మోక్షప్రదాయిని రాజేశ్వరీ ||
చ.1
స్వార్షిముక్తిదాయినీ మణిపూరనివాసినీ
సాలోక్యముక్తిదా అనాహతాబ్ద్బనిలయా
సామీప్య ముక్తిప్రద విశుద్ధచక్రస్థితా
సారూప్యముక్తినొసగు ఆజ్ఞాచక్రాబ్జా ॥
చ.2
జన్మరాహిత్యమిచ్చి నీలోనజేర్చి
సాయుజ్యమొసగవే చక్రరాజనిలయా
కైలాసగిరినిలయుని వామాంబికా
మల్లికాసుమగాన స్వరదీపికా ॥
838, మూలవిగ్రహరూపిణీ
ప. మూలవిగ్రహరూపిణీ బాలాబగళా
అ.ప ప్రపంచనిర్మాత్రీ సారసనేత్రీ ॥ .
చ.1
కాళీ హైమవతీ రమా శారదా
వింధ్యవాసినీ వైష్ణవీ జ్వాలా
సర్వదేవతా సర్వమంత్రస్థితా
సృష్టి స్థితి లయ మూలకారిణీ ॥
చ.2
విశ్వమూలకారిణీ విశ్వసంభవీ
నారాయణీ సకల దేవతారూపిణీ
కామేశ్వరాహ్లాదకరీ శ్రీవిద్యా
మల్లికాసుమగాన కాంక్షితార్ధదా॥
839. భావజ్జా
ప. భావజ్ఞా విశ్వభావనామయీ
అ.ప ఆత్మస్వరూపా చేతనామయీ ||
చ.1
భావములోనా మననములోనా
బాహ్యములోనా భాష్యములోనా
విశ్వమందునా సూక్ష్మమందునా
లలితరూపమే నిండియుండుకదా ॥
చ.2
జగములంతటా నిండియున్ననూ.
కనులకు సత్యము కనబడకున్నదీ
జ్ఞానహీనులము సుజ్ఞానమునీయవే
మల్లికాకుసుమగాన సుధామయీ ॥
840. భవరోగఘ్నీ
ప. భవబంధ నిర్మూలినీ
అ.ప బంధనముల త్రుంచి మమ్ముకాపాడగదే ॥
చ.1
నాదినాదనుకున్నదీ నాదికాకవేదనలా
నీవేనేనన్ననిజము తెలియలేకబాధలా
నిన్నుచేరుమార్గమేదో ఎరుగలేక చింతలా
సంసారము నీదలేని భవరోగపువంతలా ॥
చ. 2
మందస్మిత శ్రీసుధా మధ్యాంతరా దీపికా
నాపైనీదయచూపవే భవసాగర తారిణీ
మల్లికాసుమ గాన కీర్తనలను పాడి
నీపదములు పూజింతునే పావనీ భవానీ ॥
841. భవచక్రప్రవర్తినీ
ప. భవచక్రప్రవర్తినీ శ్రీ రాజరాజేశ్వరి
అ. పరశివ ఆజ్ఞానువర్తినీ
చ.1
దురాశల వీడగలనా
నీలీలలు నేపొగడగలనా
ప్రపంచముఖములు విష మనితలచి
పంచేంద్రియములనణచగలనా ॥
చ.2
నీ సేవలనే మరి మరి చేసి
భవసాగరమును దాటగలనా
నీనిజభక్తుల నిరతము కొలిచే
మల్లికా సుమగానము చేయగలనా ॥
842. ఛందస్సారా
ప ఛందస్పారా మంత్రరూపిణీ
అ.వ వైఖరీరూపిణీ ఉపనిషత్సారా ॥
చ.1
గాయత్రీ మంత్రసారాంశా
ఛందోబద్ద వేదసారాంశా
నియమబద్ధ మంత్రసారాంశా
రహస్య నామకీర్తనా సారాంశా ॥
చ. 2
అగణితములైన శిల్పాది కర్మలు
నీప్రసాదములే శ్రీమహారాజ్జీ
అసదృశ మహాశక్తి ప్రశంశా
మల్లికాకుసుమ గాన సారాంశా ॥
843. శాస్త్రసారా
ప. శాస్త్రసారా సరగున బ్రోవవే
అ.ప విశ్వవాఙ్మయ మూలసారా ॥
చ.1
న్యాయ శాస్త్ర ధర్మ శిక్షానిరుక్తము
యోగజ్ఞానముసాంఖ్య తర్కాది
శాస్త్రములన్నీ నీకల్పితములే
భక్తిభావము పెంచుప్రీతివర్ధనీ ॥
చ.2
శాస్త్ర శోభలయందు వెలుగొందు
ద్యుతిధరా శివరమ్య దివ్యజ్యోతి
ఊహలకందని మహామహితాత్మా
మల్లికాసుమగాన సంతోషమానసా ||
844. మంత్రసారా
ప. మంత్రసారా బీజాశక్తి
అ.ప వైదికమంత్ర స్వరూపిణీ ॥
చ.1
జ్ఞాన ప్రద వైదికమంత్రములు
కామ్యప్రద తాంత్రికమంత్రములు
బీజమంత్రములు మూలమంత్రములు
అన్ని మంత్రములసారమునీవే ॥
చ.2
బీజాక్షర ఉపాసనామంత్రములు
పురుషమంత్రములు - మంత్రములు
నీరూపములే అన్నిటనీవే
మల్లికాకుసుమగానమంత్రితా ॥
845. తలోదరీ
ప, విరాడ్రూపిణీ తలోదరీ
అ.ప బ్రహ్మాండభాండోదరీ ||
చ.1
హ్రీంకారాసన గర్భితా మౌనదా
చతుర్దశభువన పాలినీ
నీగుణములనే మరి మరి తలచి
ముక్తిగానములు అల్లెదనమ్మా ॥
చ.2
హృత్సరోజమున నిన్నే నిలిపి
సతతము నీపద ధ్యానము చేసి
మల్లికాకుసుమగానమాలికతో
నీనామ సంకీర్తనలు చేతునమ్మా ॥
846. ఉదారకీర్తీ
ష ఉదారకీర్తి మహిమాన్విత కీర్తీ
అ.ప శాశ్వతకీర్తి దాయినీ ఆశ్రిత జనావనీ ॥
చ.1
సంవిత్కళాకలిత
కావ్యరస భారతీ
కుందేందు స్మితసహిత
సుందరసుధాస్రవంతీ ॥
చ.2
సౌభాగ్యధాత్రి యశోవిదాత్రీ
సుకవితావిధాన శక్తి దాత్రీ
విద్యావిజ్ఞాన సుఖశాంతి ధాత్రీ
మల్లీ కాసుమగాన శాశ్వత కీర్తీ ॥
847. ఉద్దామవైభవా
ప. ఉద్దామవైభవా మహదైశ్వర్యా
అ.ప. స్తవజన సమ్మిళితే శ్రీలలితే ॥
చ.1
తలచినంతనే దురితములను త్రుంచి
ప్రాపు నీవే గాన పాప కర్మలు బాపి
కనికరముచూపకున్న ఓర్వజాలనే
జగములన్నీ నిండియున్న పల్లవపాణీ ॥
చ.2
బాలచంద్ర కపోలలో రా
నీలవినీల వేజీలోలా
కామేశ్వర మాననలోలా
మల్లికాకునుము గాన విలోలా
848. వర్ణరూపిణీ
ప. వర్ణరూపిణీ వాగ్దేవీ
అ.ప బ్రాహ్మీ వైష్ణవి కౌమారీ ॥
చ.1
నామరూపాత్మక సృష్టి ఆరంభమున
గుణకర్మ విభాగ గణసమూహముల
బ్రహ్మదర్శన కొరకు రక్షణకొరకు
వర్ణములనేర్పరచిన పరమేశ్వరీ ॥
చ.2
అక్షరరూపిణీ క్షరాక్షరాత్మికా
అక్షరదోషములను రాగహీనమును
దయతోక్షమింపవే విస్ఫులింగినీ
మల్లికాకుసుమరాగ మంచీ
849. జన్మమృత్యుజరాతప్తజనవిశ్రాంతిదాయినీ
ప. జన్మమృత్యుజరాతప్తజనవిశ్రాంతిదాయినీ |
అ.ప భక్తజనతతి సులభా అకళంక తేజస్వినీ
చ.1
రోగార్తులు జరాదుఃఖ పీడితులు
నీసంకీర్తనతో విముక్తులగుదురు
అన్యచింతలులేని భక్తాళికెల్లరలకు
స్మరణమాత్రముచేత చేకూరుపుణ్యములు ॥
చ.2
తలచినంతనే దురితములను తుంచు
సత్వగుణసంపదాసహిత సాత్విక వర్తీ
సుగతి నిర్వాణసుఖ విశ్రాంతిదాయినీ
మల్లికాసుమగాన శక్తి నమోస్తుతే ॥
850. సర్వోపనిషదుద్ఘుష్టా
ప. సర్వోపనిషదుద్ఘుష్టా
అ.ప ఆదిమధ్యాంతరహితా ॥
చ.1
త్రిగుణాతీతవై త్రికాలజ్ఞవై
పూజలందుకొను త్రిభువన పాలినీ
కావుమమ్మా కోపమేలా
కనికరము చూపవేలా ॥
చ.2
సర్వ ఉపనిషత్ సారణీ
శృతమయీ కవితారస సారణీ
మంజీరహార భూషణీ
మల్లికాసుమగాన రసమణీ ॥
851. శాంత్యతీత కలాత్మికా
వ. శాంత్యతీత కలాత్మికా భువనేశ్వరీ
అ.ప ద్వైత నిర్వాణానందబోధదా ॥
చ.1
నాసల్లాపమే నీకు జపమై
హస్తన్యాసమే నీకుముద్రలై
స్వేచ్ఛా గమనమే నీప్రదక్షణమై
నాచేష్టావిలాసమంత నీపూజనమే ॥
చ.2
నావర్తనలే నీకుసపర్యలు
నాసుఖమెల్లను ఆత్మార్పణము
తృప్తినిపొంది శాంతిప్రదాయిని
మల్లికాకుసుమగానము వినుమా ॥
852. గంభీరా
ప. గంభీరా మహాహ్రదా
అ.ప జ్ఞానైశ్వర్య బలవీర్యా ॥
చ.1
తుషారహారవిలసితా గభీరాత్మా
మణికంకణగణాంచితా మోహనాంగీ
తాళీదళ కర్ణపత్ర మణిహారలసితా
సుదుకూల వసనప్రియా హిరణ్మయీ ॥
చ.2
శతకోటిమండలాకారిణీ
తామసహారిణీ మృదుభాషిణీ
త్రిభువన భూతకరీ అనంతరూపిణీ
మల్లికాకుసుమ గానభోగదా॥
853. గగనాంతస్థా
ప. గగనాంతస్థా దహరాకాశస్థితా
అ.ప పంచభూతస్ధా పరమేశ్వరీ ॥
చ.1
శతకోటి మండలాకారిణీ శివానీ
శీతాంశుమౌళిరాణి జయశర్వాణీ
మాతాస్వరూపిణీ దోషాపహారిణీ
లలితపల్లవపాణి ఘనసుభాషిణీ ॥
చ2
మహాయోగి హృదయాకాశభాసినీ
జ్యోతిర్మండలద్యుతీ జ్యోత్స్నా
చారునయనారుణీ నారీశిరోమణీ
మల్లికాసుమగాన విదుషీమణీ॥
854. గర్వితా
ప. గర్వితా పీతవర్ణితా
అ.ప హృదయస్థా అతిగర్వితా ॥
చ.1
నేరములెంచకనామొర వినవే
సుగుణాలజాల కరుణాలవాల
కాదంబవనమున స్థిరముగనెలకొన్న
ఆగమశాస్త్రార్ధ మంత్రాత్మికా ॥
చ.2
సావధానముతోడ మముసాకుమమ్మా
లోకైకరక్షావతీ శాంతిమతీ
ముల్లోకములకు ఊర్జిత శాశనీ
మల్లికాకుసుమగానగర్వితా|
855, గానలోలుపా
ప. గానలోలుపా సంగీత రసికా
అ.ప సరస సంగీత సమరసా॥
చ.1
సంగీత సాహిత్యాలంకృతా
మోహనమురళీ జ్ఞానఖనీ
వీణానాదాను సంధాయినీ
శృతి లయ తాళ గాన సుధా ॥
చ.2
సంగీత మార్గ స్వరగాన నిపుణా
సామగానవినోదినీ నాదమయీ
నారద తుంబుర గాన సంసేవితా
మల్లికాసుమగాన మకరందభ్రామరీ ॥
856. కల్పనారహితా
ప. కల్పనారహితా అప్రమేయా
అ.ప అనితర కళా కల్పనా చాతురీ ॥
చ.1
మంత్ర తంత్రములు ఎన్నినేర్చినా "
భాగవతాది పురాణములను విన్న
ఆవగింజంతైనా శంకలు తీరవు
సుస్థిర జ్ఞానపు మార్గము చూపవే ॥
చ.2
సంకల్ప వికల్ప గుణములు ఉండవు
-రూపభావనా కల్పములు ఉండవు
కల్పాంతమున హితము చేసెదవు
మల్లికాసుమగాన కల్పనా చాతురీ॥
857. కాష్టా
ప. కాష్టా కాలరూపిణీ
అ.ప ముక్తిమార్గ మోక్షగమ్యా ॥
చ.1
పరిణామ ప్రదాయినీ
వ్యోమాత్మక భీమదేవ
పరమేశ్వర మనోహారిణీ
విదితపావన చరిత ॥
చ.2
మహామహితాత్మా దారుస్వరూపిణీ
శ్రీమాతా వేదవాక్య నిరూపిణీ
సువాసినీ అర్చనప్రీతా నారాయణీ
మల్లికాకుసుమగాన స్వరూపిణి |
858. అకాంతా
|
ప. అకాంతా దుఃఖనాశినీ
అ.ప భక్తజన సంతాపహారిణీ
చ.1
అనితరమగు భక్తిప్రపత్తుల
దేవీస్తవమును ఎవరుచేసెదరో
ఆపదతొలగును ఆపన్నులకు
దుఃఖరహితులై సుఖము కాంచెదరు॥
చ.2
రోగులు రోగ విముక్తులగుదురు
వీరులు జగతిలో కీర్తికాంచెదరు
మల్లికాసుమగాన సంకీర్తనలచే
జయమును కలిగించు మంగళమూర్తి॥
859. కాంతార్ధవిగ్రహా
ప. కాంతార్ధవిగ్రహా ఉమామహేశ్వరీ
అ.ప రజతాద్రి వాసినీ అర్ధాంగినీ ॥
చ.1
కాదంబమాలికల కొప్పు ఒకప్రక్కన
గంగాజటాజూటము ఒకప్రక్కన
కఠినమౌ పాలిండ్ల సొంపులు ఒకవైపు
రుద్రాక్షపేరుల ఉరము ఇంకొకవైపు ||
చ.2
చందనగంధములు విభూతి పూతలు
పీతాంబరములు వ్యాఘ్రచర్మములు
కన్నులకే విందుచేయు మోహనరూపము
మల్లీకాసుమగాన శోభాయమానము ॥
860. కార్యకారణనిర్ముక్తా
ప. కార్యకారణ నిర్ముక్తా శ్రీవిద్యా
అ.ప నిర్వికార చైతన్యస్వరూపా ॥
చ.1
సర్వమునకు తానే కార్యకారణము
రాగద్వేష చింతాశోకములు
దూరము చేసెడి ప్రత్యక్ష దైవము
దివ్యలక్షణశోభ దీపించు సుశ్రీ ॥
చ.2
దుష్టులదానవుల దునిమెడి దుర్గ
దిక్పతుల శాసించు దేవదేవేరి
ఖలులకు భయమును కలిగించుకాళి
మల్లికాసుమగానదా పుణ్యదా ॥
861. కామకేళితరంగితా
రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి
గానం - శ్రీనందిగామరవిశంకర్
రాగం - సురటి
ప. కామకేళితరంగితా శ్రీలలితా
అ.ప కామేశ్వర క్రీడావిలాసా ॥
చ.1
జగత్ సృష్టి సంకల్ప స్వరూపా
పరమేశ్వరుని భావనాసంకల్పా
పంచకృత్యపరాయణా ప్రవీణా
పాశాంకుశ పుష్పబాణలసితా ॥
చ. 2
భక్తులపాలిటి ఇహపరదైవమా
కామేశ్వర గృహేశ్వరీ కావ్యలో లా
హ్రీంకార శృంగార కపోతికా
మల్లికాకుసుమగాన మనఃప్రియా||
862. కనత్కనక తాటంకా
రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి
గానం - ముదిగొండ నాగలక్ష్మి
రాగం - చక్రవాకం
ప. కనత్కనక తాటంకా
అ.ప కనకతాటంకా కర్ణాభరణా విశేషా ॥
చ.1
సూర్యచంద్రులే కర్ణాభరణము
నవరత్నకిరీటి వయ్యారీ
శింజన్మణి నూపురాంచితపదా
మంజీరహార శోభితా ॥
చ.2
గంభీరసునాభికా కటితటా
కిసలయారుణచరణపాపహరణా
కాంచనాంగినా
పైకరుణ చూపరావే
మల్లికాకుసుమగాన పూర్ణకళా ||
863, లీలావిగ్రహ దారిణీ
రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి
గానం - శ్రీనందిగామరవిశంకర్
రాగం - సావేరి రాగం
ప. లీలావిగ్రహ ధారిణీ శ్రీలలితా
ఆ స అనాయాస అవతారవిశేషా ॥
చ.1
సృష్టి చేయునపుడు విధాతవే నీవు
సకల కార్యనిర్వహణా శ్రీపతివి
లయము చేయు వేళ కాలరుద్రునివి
కైవల్యము నిచ్చు ఈశ్వరుని రూపిణి ॥ .
చ. 2
దుష్టశిక్షణ చేయ దుర్గరూపివై
శిష్టరక్షణ చేయ శ్రీలలితమై
కలదన్నవారికి కనుపించుదైవమా
మల్లికాసుమగాన మధురామృతా ॥
864 అజా
రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి
గానం - శ్రీమతి వల్లూరి రాజేశ్వరి
రాగం - ముఖారి రాగం
ప. సుజనసేవ్యా అజాద్రిజా
అ.ప కరుణలేశముచూపవే ॥
చ.1
దురితములను బాపవే
శత్రువర్గమునణచవే
నీధ్యానమును కలిగించవే
ముక్తిసంపద నీయవే ॥
సర్వశుభములు కలుగచేసే
చ.2.
సర్వ శుభములు కలుగచేసే
నిన్ను భక్తితోకొలుతుమే
భవాంభోధిని దాటించవే
మల్లికా కుసుమగానసుందరీ ॥
865. క్షయవినిర్ముక్తా
రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి
గానం - శ్రీనందిగామరవిశంకర్
రాగం - శుద్ధ సన్యాసి రాగం
ప. క్షయవినిర్ముక్తా శ్రీకరీ
అ.ప నిరూఢకరుణాఝరీ ॥
చ.1
నిత్యమునిన్ను భజించుభక్తులకు
ఎన్నడుకలుగనీయవు పరాభవము
ప్రాణమై పోషించి ఘనవిభూతులు కల్గి
సాటియేలేనట్టి మేటి అతులాత్మా ॥
చ.2
నిత్యసత్యమై శాశ్వతముగానిలిచి
నిత్యమునిన్నేఉపాసించుజనులకు
అంతర్యామియై ప్రత్యక్షదైవమైన
మల్లికా కుసుమగాన సౌందర్యమా॥
866. ముగ్ధా
రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి
గానం - శ్రీమతి వల్లూరి సరస్వతి
రాగం - ఖరహరప్రియ రాగం
ప. ముగ్ధ సౌందర్యవతీ
అ.ప మంగళము జయమంగళము ||
చ.1
లాస్యముచేసే హాస్యవదనకు
సదాషోడశ వర్ష విలసితకు
నారదాదిముని సంసేవితకు
పంచదశాక్షర నామమంత్రితకు॥
చ.2
పాలితజన శృంగార మూర్తికి
నిత్యయవ్వనికి కలిమిజవ్వనికి
చంద్రశేఖరుని ప్రాణేశ్వరికి
మల్లికా కుసుమగానారా
867. క్షిప్రప్రసాదినీ
రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి
గానం - శ్రీ నందిగామ రవిశంకర్
రాగం - సింధుభైరవి రాగం
ప. సుప్రసన్నా క్షిప్రప్రసాదినీ
అ.ప. క్షిప్రానదీతీరవాసినీ ||
చ.1
పసుపు కుంకుమతో పచ్చనక్షతలతో
సువాసనాభరిత కుందమల్లికలతో
నిత్యార్చనలు చేతుమమ్మా
జగములన్నీ నిండియున్న పల్లవపాణీ||
చ.2
అడిగినంతనే వరములిత్తువని నమ్మితిని
వంచనచేయకు వాంఛితఫలప్రదా
శ్రీచక్రపురవాసి చిదానందకందా
మల్లికాకుసుమగాన వీణాపాణీ ॥
868. అంతర్ముఖసమారాధ్యా
రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి
గానం - శ్రీమతి ఆచంట శ్రీదేవి
రాగం - మాధ్యమావతి రాగం
ప. అంతర్ముఖసమారాధ్యా రాజరాజేశ్వరీ
అ.ప రాజోపచారములతో పూజింతుమమ్మా ॥
చ.1
అర్ఘ్యము పాద్యము సింహాసనమిచ్చి
గంగాజలముతో స్నానమును చేయించి
ఆభరణములనిచ్చి చందనముపూసి
బంతిచామంతులతో పూజింతుమమ్మా !॥
చ.2'
పసుపుకుంకుమలతో ధూప దీపములతో
షడ్రసోపేతమైన నైవేద్యములతో
షోడశపూజలను భక్తితో చేసెదము
.... మల్లికాసుమగాన గీతములు పాడెదము
869. బహిర్ముఖసుదుర్లభా.
రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి
గానం - శ్రీమతి చింతలపాటి రమామహేశ్వరి
రాగం - హంసానందిని రాగం
ప. బహిర్ముఖసుదుర్లభా మాతా
అ.ప నీనామమే కడుపావనము ॥
చ.1
పుణ్యాత్ములకే దొరుకునది
పాపకర్ములకు లభించనిది
పలికినవారికి పరమపదము
పండిత పామర హృదయరంజకము॥
చ.2
పారాయణచేసిన పరమపుణ్యము
ఆలకించినచాలు అమితవైభవము
పాడినవారికి నిరతానందము
మల్లికాకుసుమ గానసులభము ॥
870. త్రయీ
రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి
గానం - శ్రీమతి వేమూరు విజయభారతి
స్వరకర్త - శ్రీమతి కొమ్మూరి రాజేశ్వరి
రాగం - చక్రవాక రాగం
ప. త్రయీ త్రయీవిద్యారూపిణీ
అ.ప పరాశక్తీ పురాతనీ॥
చ.1
ఐం వాగ్బీజస్వరూపిణీ
అకారాది సామరుక్ వేదము
ఇకారాది యజుర్వేదము
మూడువేదముల స్వరూప త్రయీ॥
చ.2
శాస్త్రవాదములందు వేద పఠనములందు
వాక్ పటుత్వమునిచ్చి వేదవిద్యలనిచ్చి
భక్తులను బ్రోచేటి కరుణారసార్ణవా
మల్లికాసుమగాన పూర్ణామృతా ॥
871. త్రివర్గనిలయా
రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి
గానం - శ్రీమతి రాకా జ్యోత్స్నా
స్వరకర్త - శ్రీమతి కొమ్మూరి రాజేశ్వరి
రాగం - ఆరభి రాగం
ప, "త్రివర్గనిలయా హ్రీంకారాత్మికా
అ.ప దివ్యలక్షణశోభ దీపించు శేఖరీ ॥
చ.1
పరహితముకొరకుసలుపు
సత్కార్యములకధిపతి
జగద్వర్తనకారణా చతుర
ధర్మార్ధ కామనిలయా॥
చ.2
తానె భోజనము అన్నాదులు తానెభోక్త
అన్నమైపోషించు ప్రాణమిడుజీవులకు
తానొకతె తల్లియై లోకమున భాసించు
మల్లికాసుమగాన సౌందర్య భాసినీ ॥
872. త్రిస్థా
రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి
గానం - శ్రీమతి ముదిగొండ నాగలక్ష్మీ
రాగం - రాగం
ప. త్రైలోక్యసంచారిణీ త్రిస్థా
అ.ప త్రైలోక్య రసవాహినీ II
చ.1
త్రిమూర్తులు త్రిగుణములు త్రిలోకాలు
త్రివేదములు త్రికాలములు త్రివర్గములు
జ్యోతిశ్రయము అవస్థా త్రయము
ఆశ్రమత్రయము నీదురూపములు
చ.2
కంచికామాక్షి మధురమీనాక్షి
కాశీవిశాలాక్షివే శుభంకరీ
వాణీ లక్ష్మీ త్రిపుర సుందరీ
మల్లికాకుసుమ గానవిలక్షిణీ ॥
873. త్రిపురమాలినీ
రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి
గానం - శ్రీమతి గొట్టుముక్కుల లీల
స్వరకర్త - శ్రీమతి కొమ్మూరి రాజేశ్వరి
రాగం - సింధుభైరవి రాగం
ప. శ్రీచక్రాంకిత వాసినీ దూర్వాసార్చిత గుప్తయోగినీ
అ.ప చంద్రసహోదరి రాశిస్వరూపిణి
సుందరవదనీ కమలానిలయినీ॥
చ.1
కామకళాధరి పంచదశాక్షరి
సర్వరక్షాకరి శివంకరీ
సర్వవిద్యామయి ఐశ్వర్యమయీ
సర్వశక్తిమయీ త్రిపురమాలిని||
చ.2
దశకోణార్చిత క్రోధినిరౌద్రిని
రత్నసింహాసినీ రాక్షసదమనీ
శక్తి యుక్తిగుణ కర్మ విధాయిని
అణిమాగరిమాది సిద్ధి దాయిని ||
874. నిరామయా
రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి
గానం - శ్రీమతి చల్లపల్లి సుభద్ర
స్వరకర్త - శ్రీమతి కొమ్మూరి రాజేశ్వరి
రాగం - శివరంజని రాగం
ప. నిరామయా నిరంజనీ
అ.ప నిరాసక్తా నిరాశ్రయా॥
చ.1
సంసారతీర్ధాంఘిపోతా మాతా
కుందాబ్జ తుషార హార లసితా
విశ్వవాఙ్మయ సౌందర్యరాశీ
సరసకావ్యరస మాధురీ ॥
చ.2
త్రికాలైకరూపా యోగీంద్రపూజ్యా
అనాద్యా ముక్తిమార్గప్రదాత్రీ
పుణ్యజనపూజితా మహాదేవీ
మల్లికాసుమగాన పరిసేవితా !
875. నిరాలంబా
రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి
గానం - శ్రీమతి నందివాడ అన్నపూర్ణ
స్వరకర్త - శ్రీమతి కొమ్మూరి రాజేశ్వరి
రాగం - అఠాణ రాగం
ప. నిరాలంబాజగదంబా
అ.ప నిరాధారా సకలలోకాధారా ॥
చ.1
నిత్యమునిను భజించు భక్తులకు
ఎన్నడుకలుగదు పరాజయము
అనితరమగు భక్తితోకొలిచిన
మెండుగకలుగును శుభపరంపరలు ॥
చ.2
మాణిక్య రాజిత రాజమకుటా
జాగేలనమ్మా పాద సేవకురాలను
సారసలోచని అభిన్నాత్మికా
మల్లికాసుమగాన ఏకాత్మికా ॥
876. స్వాత్మా రామా
రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి
గానం - శ్రీమతి వల్లూరి సరస్వతి
రాగం - కాపీ రాగం
ప. స్వాత్మా రామా సర్వస్వతంత్రా
అ.ప సర్వజీవాత్మ విహారిణీ ॥
చ.1
బ్రహ్మాది దేవతలు నిన్ను ఆరాధింప
శ్రీలక్ష్మి శారదా వింజామరలు వీవ
నారదాదిమునులు గీతాగానముచేయ
భక్తజన హృదయ విస్తృత విహారిణి ॥
చ. 2
ఓంకారదీపికా సాకార ప్రణవా
హ్రీంకారలక్షణా హ్రీంపదారాధ్యా
మాణిక్యహారాభిరామా సురామా
మల్లికాసుమగాన మకరందమత్తా ॥
877. సుధాసృతిః
రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి
గానం - శ్రీమతి గొట్టుముక్కుల లీల
స్వరకర్త - శ్రీమతి కొమ్మూరి రాజేశ్వరి
రాగం - శహన రాగం
ప. సుధాసృతీ అమృతస్వరూపిణీ
అ.ప సౌభాగ్య రమామనోజ్జా ॥
చ.1
వారుణీ రస పానోల్లాసినీ
ధ్యానసంకీర్తన పూజార్చనలతో
సర్వవిధములైన కైంకర్యములతో
సంతృప్తిచెందేటి ఆనందసంధాత్రి ॥
చ. 2
మాయలుడిగినకదా మరిదొరకు శాంతి
శాంతిమార్గముచూపు ఆత్మజ్ఞానేష్టి
రసమయానంద మానస హ్రీంశీలా
మల్లికాసుమగాన లక్షణాగమ్య॥
878. సంసారపంకనిర్మగ్నసముద్ధరణ పండితా
రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి
గానం - శ్రీమతి రాకా జ్యోత్స్నా
స్వరకర్త - శ్రీమతి కొమ్మూరి రాజేశ్వరి
రాగం - సారంగ రాగం
ప. సంసారపంక నిర్మగ్న సముద్ధరణ పండితా
అ.ప. లలాటనయనార్చితా సముదారకరుణామృతా
చ.1
సంసార సాగరము దాటించునావు
సకలసంపదలిచ్చు చింతామణీ
జ్ఞానమును కలిగించు విజ్ఞాన దీపము
నీపాద పంకజముల ధూళిరేణువే ॥
చ.2
అసదృశభక్తితో స్తుతిచేయుపుణ్యులకు
ఇష్టకామ్యములనిచ్చు ఇష్టకామేశ్వరి
అఖిలాండకోటి అధిష్టాన సమాకృతీ
మల్లికాసుమగాన అనితరసాధ్యా ॥
879. యజ్ఞప్రియా
రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి
గానం - శ్రీమతి తరణి స్వాతి
రాగం - యాగప్రియ రాగం
ప. యజ్ఞప్రియా విష్ణుస్వరూపా
అ.ప జగదేక వంద్యా రాజరాజేశ్వరీ ॥
చ.1
నిత్యముచేసే కర్మల యందు
దేవపితృ యాగములందు
చండీ రుద్ర యాగములందు
ప్రీతికలిగియుండు కామసంజీవనీ ॥
చ.2
విష్ణువిలాసినీ జిష్ణుసహోదరీ
జగద్వ్యాపినీ యజ్ఞకర్మణీ
హ్రీంకార కుండాగ్ని శిఖా
మల్లికాసుమగాన హ్రీంకారిణీ ॥
880. యజ్ఞకర్త్రీ
రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి
గానం - శ్రీ నందిగామ రవిశంకర్
రాగం - జగన్మోహిని రాగం
ప. యజ్ఞకర్త్రీ శక్తిస్వరూపిణీ
అ.ప హ్రీం శిఖామణీ జ్యోత్స్నా రూపిణీ II
చ.1
యజ్ఞపురుషుడునీవే
యజ్ఞముచేయునది నీవే
సోమయాజివి నీవే శ్రీధరీ
సోమిదేవివి నీవే శ్రీపతీ
చ.2
యజ్ఞఫలధాత్రివి నీవే
యజ్ఞఫలమును నీవే
యాగక్రమారాధ్య శివసతీ
మల్లికాసుమగానయజ్ఞా నిధీ ॥
881. యజమానస్వరూపిణీ
రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి
గానం - శ్రీమతి ఆచంట శ్రీదేవి
రాగం - ద్విజావంతి రాగం
ప. యజమానస్వరూపిణీ పరమేశ్వరీ
అ.ప పరమేశ్వర స్వరూపదీక్షితా ॥
చ.1
యజ్ఞయజమానిపై ప్రజ్ఞానివై
బ్రాహ్మణ స్వరూపమై బ్రాహ్మణిపై
యజ్ఞదీక్షితుడైన సోమయాజివై
యాజ్ఞివైన రాజీ యజ్ఞకంకణధారీ ॥
చ.2
ఉగ్రప్రభువని పండితులు అందురు
ఈశానుడవని దీక్షితులందురు
అష్టమూర్తి రూపి దీక్షాదక్షిణీ
మల్లికాసుమగాన దీక్షితా ॥
882. ధర్మాధారా
రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి
గానం - శ్రీమతి ముదిగొండ నాగలక్ష్మీ
రాగం - రాగం
ప. ధర్మాధారా శ్రుతిసమ్మతా
అ.ప వేదశాస్త్ర నిర్మితా సకలశాస్త్ర నుతా ॥
చ.1
దేశకాలముననుసరించి
నీతినియమములు ఏర్పరచి
దేశహితమును కూర్చువిధముగ
ధర్మమును నెలకొల్పు బ్రహ్మీ ||
చ. 2
ధర్మసంస్థాపనము చేయగ
అవతరింతువు ప్రతియుగమున
ధర్మ సంవర్ధనీధర్మనందినీ
మల్లికాసుమగాన ధార్మికా॥
883. ధనాధ్యక్షా
రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి
గానం - శ్రీ నందిగామ రవిశంకర్
రాగం - షణ్ముఖప్రియ రాగం
ప. ధనాధ్యక్షా ధనలక్ష్మీ
అ.ప కుబేరస్వరూపా ధననిధీ॥
చ.1
పంచదశీమంత్రము
జపియించిన కుబేరుడు
నవనిధులకు అధికారియై
ధనాధిపతియై తరించెను ॥
చ.2
కనకధారాస్తోత్రముచేసి
అష్టలక్ష్మియైన నినుధ్యానించి
కనకవర్షమును కురిపించె శంకరులు
మల్లికాకుసుమగాన సంపదలక్ష్మీ॥
884. ధనధాన్యవివర్ధినీ
రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి
గానం - శ్రీమతి కొటికలపూడి వాణి
రాగం - భాగ్యశ్రీ రాగం
ప. ధనధాన్యవివర్దినీ ధర్మిణీ
అ.ప నవనిధిసంధాయిని ధారుణీ ॥
చ.1
యజ్ఞఫలరూపిణీ దక్షిణా దేవి
ధనధాన్యవివర్ధినీ సంపదలక్ష్మీ
ధనలక్ష్మీ ధాన్యలక్ష్మీ
అష్టలక్ష్మీరూపిణీ శ్రీమాతా ॥
చ.2
భూదేవిస్వరూపిణివై
సకలజీవుల కడుపునింపే
సకలసంపదకారిణీ
మల్లికాసుమగానవర్ధినీ ॥
885. విప్రప్రియా
రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి
గానం - శ్రీమతి వల్లూరి సరస్వతి
రాగం - శంకరాభరణ రాగం
ప. విప్రప్రియా వేదధారిణీ
అ.ప వేదజననీ వేదచారిణీ॥
చ.1
వేద పఠనాసక్త యోగీంద్ర పుణ్య
''...ద్విజ బ్రాహ్మణప్రియా విద్యాధరీ
సర్వసారస్వతపదా హిరణ్మయీ
శ్రోత్రీయపూజితా కృపామతీ॥
చ.2
బ్రహ్మరూపిణీ(బ్రాహ్మణీ
నీఅడుగులకు మ్రొక్కి కొలిచెదము
శంభులోక నిలయా శర్వప్రియా
మల్లికాకుసుమగాన ధారిణీ ॥
886. విప్రరూపా
రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి
గానం - శ్రీ నందిగామ రవిశంకర్
రాగం - అమృతవర్షిణి రాగం
ప విప్రరూపా వేదవేత్తా
అ.ప జ్ఞానాంబోనిధి వీచికా॥
చ.1
ఆగమాంత అవగత ప్రబోధ
వేద విప్రజనానురాగ గాయత్రీ
సకలోకవిధాత్రీ భవ్యగాత్రీ
దివ్యమహోన్నత పూతచరిత్రీ॥
చ.2
పరమయోగులను మురిపించుమాతృకా
యోగఋషి పూజితా బ్రహ్మవిద్యా
సు కవిజనావన పాలినీ వాగీశ్వరీ
మల్లికాకుసుమగాన సుగాత్రీ ॥
887. విశ్వభ్రమణకారిణీ
రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి
గానం - శ్రీమతి వల్లూరి సరస్వతి
రాగం - బహుదారి రాగం
ప. విశ్వభ్రమణకారిణీవిశ్వమయీ
అ.ప నిత్య కర్మానుష్టానకారిణీ II
చ.1
త్రిభువనోన్నత గుణగణచరితా
మహనీయ దివ్య కరుణోదధి
భువనసృజనావలంబా మదంబా
సంధ్యాదీధితిరంజితా విశ్వహితా ॥
చ.2
చరాచరములకు నిత్యము హర్షము
ఇచ్చెడిదాతవు సదయ కరుణా హృదయా
విశ్వమనోహరి ఆజాండేశ్వరీ
మల్లికాకుసుమమధుర గానమయీ ॥
888. విశ్వగ్రాసా
రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి
గానం - శ్రీమతి ఆచంట శ్రీదేవి
రాగం - కాఫీ రాగం
ప. విశ్వగ్రాసా విశ్వజనపాలినీ
అ.ప విశ్వమాతృకావిశ్వేశీ
చ.1
ఈజగమంతా నీవిలాసమే
విశ్వమంతయు నీస్వరూపమే
ప్రపంచమంతయు నీభ్రమణమే
లోకమంతయు నీప్రకాశమే॥
చ.2
చరాచరములన్నీ నీకు అశనమే
ప్రళయకాలమున నీవేగ్రహించి
లయమును చేసే ప్రళయకారిణీ
మల్లికాకుసుమగాన నిలయా ॥
889. విద్రుమాభా
రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి
గానం - శ్రీమతి వల్లూరి సరస్వతి
రాగం - చక్రవాక రాగం
ప. విద్రుమాభా జ్ఞానప్రకాశినీ.
అ.ప మాణిక్య విరాజమాన మకుటా ॥
చ.1
పాటలీసుమపుచాయ పగడంపుచాయ
దానిమ్మపూచాయ కెందమ్మి చాయ
సందెవెలుగులు చాయ మంకెనపూ చాయ
వామాక్షీ జనమౌళిభూషణమణీ ॥
చ.2
మానికదివ్య వైభవ సమంచిత
నిత్యము భక్తులబ్రోచు శ్యామాభా
తేజోమయ విగ్రహా..
మల్లికాకుసుమగాన వల్లభా॥
890. వైష్ణవీ
రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి
గానం - శ్రీమతి గరిమెళ్ళ కళ్యాణి
రాగం - ఆనందభైరవి రాగం
ష. వైష్ణవీ నీకిచ్చేమమ్మా నక్షత్ర హారతీ
మల్లికా కుసుమగానహారతీ
అ.ప అశ్వని భరణి కృత్తికలిచ్చే నీలాలహారతీ ||
చ.1
రోహిణి మృగశిర ఆరుద్ర లిచ్చే ముత్యాల హారతీ
పునర్వసు పుష్యమి ఆశ్లేషల పగడపుహారతీ
మఘ పుబ్బ ఉత్తర తెచ్చిన వైఢూర్య హారతీ
హస్తా చిత్తా స్వాతి విశాఖల గోమేధిక హారతీ॥
చ. 2
అనూరాధా జ్యేష్టా మూలల మరకత హారతీ
ఉత్తర పూర్వాషాఢలు ఇచ్చిన కెంపులహారతీ
శ్రవణ ధనిష్ట శతభిష మిచ్చే పచ్చలహారతీ
పూర్వఉత్తరాభాద్ర రేవతుల పుష్యరాగాలహారతీ ॥
891. విష్ణురూపిణీ
ష. విష్ణురూపిణీ నారాయణీ
అ.ప విశ్వవినోదినీ శివమోహినీ।।
చ1
ముగ్ద దరహాస సుధాశ్రవంతి
నవచక్ర షడాధార సురానీక వంద్యా
విష్ణురూపమున విశ్వరక్షణచేయు
భక్తజనావనరక్షా బద్ద కంకణీ ||
చ.2
పవనమై అనలమై పానీయమై
ఆత్మయై రవియై అంబరమై
మహీవలయమై అష్టమూర్తివైన
మల్లికాసుమగాన శ్రీవైష్ణవీ ॥
892 అయోనిః
ష. . అయోనీ జగత్ సృష్టి కారిణీ
అ.ప సకలచరాచర సృష్టి విధాయినీ ॥
చ.1
జననములేదు జన్మస్థానములేదు
తల్లిదండ్రులు లేరు రూపమేలేదు.
అన్నిజగములయందు నీవేయుందువు
అన్నికాలములందు నిలిచియుందువు ||
చ.2
సూర్యచంద్రులు తారకలు
ధరణియు సప్తసముద్రములు
సర్వజగములు నీవశమే
మల్లికాకుసుమ గానవశంకరీ ||
893. యోనినిలయా
ప. యోని నిలయా త్రికోణరూపిణీ
అ.ప సర్వసిద్ధిప్రద చక్రస్వామినీ ॥
చ.1
బిందురూపిణీ పరశివకామినీ
సమస్త జగతికి మూలధారిణీ
త్రిజగతీ కళ్యాణ సంధాయినీ
పరివారదేవతా వందితచరణీ॥
చ.2
శ్రీచక్రపురవాసి చిన్మయ రూపిణీ
రసమయానందమానసా శ్రీలలితా
త్రిభువనభూతకరీ శివకరీ
మల్లికాకుసుమగానతత్పరీ॥
894 కూటస్ధా
ఆచంట శ్రీదేవి
వరాళి రాగం
ప. కూటస్ధా భక్త హృదయవిహారిణీ
అ.ప శ్రీచక్రేశ్వరీ శ్రీమాతా||
చ.1
వాగ్భవకూటమినందు వాణీవిధాతలై
కామరాజకూటమి నందున లక్ష్మీనారాయణులై
శక్తికూటమునందు శివశక్తులరూపమైన
మేరుపర్వతనిలయినీ రాజరాజేశ్వరీ॥
చ.2
గతిగమకగీతైకనిపుణా
కర్పూరకుంకుమాలంకృత స్తనీ
విద్యా కవితావితానలహరీ
మల్లికాకుసుమ గాన ప్రవల్లికా ॥
895. కులరూపిణీ
వల్లూరి సరస్వతి
మాయామాళవగౌళ రాగం
ప. కులరూపిణీ కౌళమార్గపూజితా
అ.ప సాంప్రదాయ ప్రవర్తినీ ॥
చ.1
కుండలినీ శక్తిరూపిణీ
ముఖ్యప్రాణస్వరూపిణీ
సుషుమ్నా నాడి విహారిణీ
కులసంకేత పాలినీ కౌళినీ ॥
చ.2
అకాలమృత్యునివారిణీ
సర్వజ్వరార్తి శమనీ
దీర్ఘాయుష్యప్రదాయిని
మల్లికాసుమగాన వర్ధనీ॥
896. వీరగోష్ఠిప్రియా
వల్లూరి సరస్వతి
దుర్గ రాగం
ప. వీరగోష్ఠి ప్రియా జయ జయ దుర్గా
అ.ప దైత్యసంహారిణీ వీరమాతా ॥
చ.1
భండాసురులను సంహరించి
శుంభ నిశుంభుల మదమునణచి
మహిషాసురమర్దనిపై విహరించి
అసురులదునిమిన మహాకాళీ ॥
చ.2
శ్రీవిద్యావిశారదులు భక్తితత్పరులు
అరిషడ్వర్గములు జయించినవారు
నీధ్యానముతో పరవసించెదరు
మల్లికాకుసుమగాన ప్రియా ॥
897. వీరా
మండా విజయకుమారి
రాగం -
ప. వీరలక్ష్మీ
అ.ప వీరధీరగణపూజితా ॥
చ.1
ధర్మపరులను వీరులను
రక్షించేలోకనాయకి శంకరీ
శ్రీగణేశుని కార్తికేయుని
కన్నతల్లివి వీరమాతా॥
చ.2
సమస్త జగద్వంద్య పాదారవిందా
మావంటివారిని విడనాడదగునా
పాపసంచయము పరిహరించవే.
మల్లికాకుసుమ గాన వందితా ॥
898. నైష్కర్మ్యా
గానం - కొప్పర్తి ఇందిరా
రాగం -
ప. నైష్కర్మ్యా కృపాంబురాశీ
అ.ప ఉర్వారుక ఫలాననా బింబాననా॥
చ.1
నిన్నునమ్మినవారికి ఎన్నడు
లోటులేదని నమ్మితినమ్మా
భక్తులకభీష్టపరంపరలిచ్చు
నీకుజాగేలనే నన్నుబ్రోవగా ॥
చ.2
ప్రాపుకు జేరితిని ఆదరించవే
నీకృపారసము చిలకరించవే
కన్నతల్లివలె కావగరావే
మల్లికాసుమగాన కీర్తి రూపిణీ ॥
899. నాదరూపిణీ
గానం - శ్రీమతి చింతలపాటి రమామహేశ్వరి
రాగం -
ప. నాదరూపిణీ కారుణ్యనేత్రీ
అ.ప క్రీగంటచూడుమా ఒక్కసారి
చ.1
తత్వప్రకాశముగ శోభాంచితముగా
భక్తజన సేవ్యముగా నీమనసు రంజిల్ల
ఎండిన శబ్దబంధురముగా వీనులవిందుగా
నీనామకీర్తనాగీతములు వినిపింతు
చ.2
ఆజన్మ సహజమౌ మల్లికాసుమగాన
కృతులతోపూజింప నిత్యకృత్యమునాకు
జగములన్నీ నిండియున్న పల్లవపాణి
కృపచూడుమా నీపాదదాసినిగానః॥
900. విజ్ఞానకలనా
గానం - శ్రీమతి వల్లూరి సరస్వతి
రాగం - ధర్మవతి రాగం
ప. - విజ్ఞానకలనా జ్ఞానబోధినీ
అ.ప జ్ఞానాందరూపిణీ||
చ.1
ఈఘోరసంసారము నిస్సారమనితలచి
తమజన్మసఫలతకు అఖండభక్తితో
యతీంద్రులందరూ నిన్నుప్రార్ధింతురే
ఆదిత్యమార్గ సంచార కర్రీ భక్తానురక్తా॥
చ.2
మెరుపుతీగలవంటి నీసౌందర్య తేజమును
నీవిలాసభాగ్యములను తనివితీరగ చూచి
ఆనందడోలికల ఊగులాడెదరు జ్ఞానులు
మల్లికాసుమగాన జ్ఞానమకరందా ॥
901. కల్యా
ప. కల్యా సర్వకళానిధీ
అ.ప సకలశుభచరితశ్రీలలితా||
చ.1
భువనమోహన గాననిరతా
సర్వసంగీత సంధాన కరణా
నీ సంగీత సుధామధురిమలో
తేలియాడినే సకలజీవరాశి ॥
చ.2
చతుష్షష్టి కళామయీ శ్రీమయీ
మధురమనోజ్ఞమందహసితా
అవిరళమగు భక్తి ప్రపత్తుల
మల్లికాకుసుమగానముచేతునే ॥
902. విదగ్ధా
ప. విదగ్ధా సర్వకార్యనిపుణా
అ.ప సంభాషణాచాతురీ భారతీ ॥
చ.1
అశేష శేముషీవైభవీ
ఉద్దామమైన నీప్రభావమును
వర్ణించనాతరమా శరణుచేసెదను
ఘనతరచరితా సృష్టినిపుణా ||
చ.2
యోగశ్రీ ధురీణాకృతీ
అగణిత కళ్యాణ గుణవైభవా
లలితకృపాశ్రీ భాసురాలయా
మల్లికాకుసుమ గాన నిపుణా||
903. బైందవాసనా
వ. బైందవాసనా బిందురూపా
అ.ప శాంత్యాతీత మనోన్మణీ ॥
చ.1
సర్వానందమయ బిందుచక్రస్థితా
బ్రహ్మ హరి హర అవినావభావసంబధితా
పరమాదేవీ బిందుమధ్య ప్రతిష్టా
బీజరూపిణీ త్రిపురవాసినీ ||
చ.2
వామాదిత్రయ ఇచ్చాదిత్రయ
జగదాదిత్రయా రూపవిలసితా
శ్రీచక్రకారణ చిచ్చక్తిరూపిణీ
మల్లికాకుసుమగాన ప్రతిష్టా ॥
904. తత్వాధికా
ప. తత్వాధికా సర్వాధికా
అ.ప పంచకృత్యపరాయణా||
చ.1
నన్నేలుదొరనీవే ననుమెచ్చు చెలినీవే
నాదైవమునీవె నావిభవము నీవే
ననుగన్న తల్లినీవె ననుసాకు తండ్రినీవే
నాప్రాణమునీవె నాధనమునీవే ॥
చ.2
నీపదాబ్జములను అమితభక్తితో
సేవించుదానను నీదాననమ్మా
తడవేలరారమ్ము దాక్షిణ్యనిధీ
మల్లికాకుసుమగానవరనిధీ ॥
905. తత్వమయీ
ప. తత్వమయీ పరబ్రహ్మస్వరూపిణీ
అ.ప బ్రహ్మజ్ఞానస్వరూపిణీ బ్రాహ్మణీ ॥
చ.1
విష్ణుతత్వము రుద్రతత్వము
బ్రహ్మతత్వము మహేశ్వరతత్వము
సదాశివతత్వము జ్ఞానతత్వము
పరబ్రహ్మతత్వ రూపసుధాకరీ |
చ.2
నీనివాసమెక్కడో మణిద్వీపమెచ్చటో
కదంబ వనమున నీవెక్కడో నీకొలువెక్కడో
భక్తులు సలిపేటి నుతులేమిటో నేనెరుగనే
మల్లికాసుమగానములు పాడుచుందునే ॥
906. తత్వమర్ధస్వరూపిణీ
ప. తత్వమర్ధస్వరూపిణీ తత్వాత్మికా
అ.ప సచ్చిదానందరూపిణీ సావిత్రీ॥
చ.1
భక్తానుగ్రహ విగ్రహా
శుద్ధతత్వస్వరూపిణీ
శృతిసారా శృతిపూజితా
సూర్యామంత్రాధిష్టానదేవతా ॥
చ.2
సంగనాశకరీ సౌభాగ్యమాలినీ
భక్తానురక్తా తపః ఫలప్రదా
సకలనిష్కలమాత్మరూపా
మల్లికాకుసుమ గానభూషితా|
907. సామగానప్రియా
ప. సామగానప్రియా సంగీతలోలా.
అ.ప భువనమోహన గాన మాధుర్యలోలా ॥
చ.1
సామవేద గానోపాసనావిలాసినీ
చతుర్వేద పఠనా సంతోషిణీ
పంచవిధసామోపాసనా ప్రియంకరీ
రాగతాళసప్తస్వర మోహినీ ॥
చ.2
కర్ణపేయముగా సమ్మోహనముగా
వీణా మురళీగానము విందువు
సంగీతసాహిత్యసంధాన కారణా
మల్లికాకుసుమగాన నిధానా॥
908. సౌమ్యా
ప. సోమాలంకృతా సౌమ్యా
అ.ప సోమలతారూపిణీ॥
చ.1
కమళదళ నేత్రీ ఘనాకారవేణీ
కేయూరయుక్తా యోగీంద్ర హృద్యా
సోమార్ధాలంకృత నీలవేణీ
సోమేశ్వరాంక నిలయినీ ||
చ.2
పరమేశహృదయాను రంజనకరీ
మోహపాశముతెంచి మోక్షమునీయవే
అతులితానంద సంధాయినీ ఆర్యా
మల్లికాకుసుమగాన మాతృకా ॥
909. సదాశివకుటుంబినీ
ప. సదాశివకుటుంబినీ శివవిలాసినీ
అ.ప పతివ్రతాంగనాభీష్ట ఫలదాయినీ।
చ. 1
చంద్రకళా సుశోభిత ఫాలా
కందరమండిత కపాలమాలా
లాస్యతాండవ మృదుపద యుగళా
భక్తమనోరధ పూరణశీలా॥
చ.2
శుద్దవిద్యా అశ్వారూఢా శివరూపిణీ
శంకరార్ధశరీరిణీ ఉమామహేశ్వరీ
5. మల్లికాకుసుమ సహజసౌరభము
నీకేశపాశములను ఆశ్రయించునే ॥
910. సవ్యాపసవ్య మార్గస్థా
ప. సవ్యాపసవ్య మార్గస్టా శ్రీనిలయా
అ.ప సమయాచార వామాచార పూజితా॥
చ.1
వేదసమ్మతమైన శిష్టాచారముతో
సవ్యమార్గమున పూజలుచేతురు
తాంత్రికపూజల జంతుబలులతో
వేదబాహ్యమగు పూజలు చేతురు ॥
చ.2
ఏవిధములుగా నిను అర్చించినా
ఏమంత్రములు పూజించినా
కరుణించెదవే సదమల హృదయినీ
మల్లికా కుసుమగాననిలయినీ ॥
911. సర్వాపద్వినివారిణీ
ష. సర్వాపద్వినివారిణీ గుణమణీ
అ.ప సంకటహరిణీ శోధనకారిణీ॥
చ.1
అవిరళభక్తి ప్రపత్తులతో
సదాస్మరించి శరణుకోరి
మనసారమదిలోనమ్మినవారికి
విశేషసుఖసంపదలనిత్తువే॥
చ.2
నిత్యము నిన్ను భజించు భక్తులకు
ఆపదలన్నియు తీరిపోవును
ఎన్నడులేవు పరాజయములు
మల్లికాకుసుమగానసేవితా॥
912. స్వస్థా
ప. స్వస్థా చాంచల్యరహితా
అ.ప రాగద్వేషాతీత విమోహితా||
చ.1
భక్తులహృదయములందుననిల్చి
చిత్తచాంచల్యము కలుగనీయక
శాంతిసుఖములను ప్రసాదించే
దహరాకాశరూపిణి రాజరాజేశ్వరి||
చ.2
సమధికాతత సత్కరుణావలంబా
మధురస్వభావా విదుషీమణీ
మధురగాన సంతుష్టాంతరంగా
మల్లికాకుసుమగానప్రవీణా॥
913. స్వభావమధురా
ప స్వభావమధురా మధురం మధురం
అ. నీనామమే మధురం మధురం
చ1
వదనమే మధురం సదనమే మధురం
మాధుర్య భరితరూపమే మధురం
హాసము మధురం లాస్యం మధురం
పరశివుగెలిచినవిలాసమే మధురం॥
చ. 2
రోషము మధురం వేషము మధురం
కరుణాతరంగిత భావమేమధురం
గానం మధురం నాట్యం మధురం
మల్లికాకుసుమగానమే మధురం॥
914: ధీరా
ప. ధీరా భక్తమందారా
అ.ప వింధ్యగిరి వాసనిరతా॥
చ.1
ఎల్లలోకములకు హేతువై
భక్తుల దుఃఖములు పోద్రోలెడుతల్లి
తల్లులకెల్లను తల్లియైచరించి
ధైర్యము బలమును కలిగించెదవు||
చ.2
ప్రాణులకెల్లను బుద్ధియైపరగు
విస్తారణ కరుణాతిరేకమున
వాక్చాతుర్యము విద్యలనిత్తువు
మల్లికాకుసుమగానపోషిణీ ॥
915. ధీరసమర్చితా
ప. ధీరసమర్చితా శ్రీమాతా
అ.ప వేదపండితపూజితా ॥
చ.1
సర్వకార్యములు నిర్విఘ్నముగా
చెసెడిశక్తిని యిచ్చెడిదైవము
పంచప్రకాశము పెంచెడిదేవీ
సమర విజిత రమణీశిరోమణీ ॥
చ.2
వామాక్షీ జనమౌళిభూషణీ
మాతల మాతవు హేమదంబికా
భావభక్తినియిచ్చి మముకావరావే
మల్లికాకుసుమగానార్చితా ॥
916. చైతన్యార్హ్య సమారాధ్యా
ప చైతన్యార్ఘ్య సమారాధ్యా
అ.ప విశేషఫలప్రద శ్రీదేవీ ||
చ.1
గంగతీర్ధముతెచ్చి అర్ఘ్యమిచ్చెదమమ్మా
ఆత్మయే అర్ధము పరమార్ధమని తలచి
బ్రహ్మానంద సంధానము చేసెదము
అర్చనప్రీతా చైతన్య చిద్రూపిణీ ||
చ.2
జ్ఞానమే అర్హ్యము చైతన్యభావమే అర్ఘ్యము
ఆత్మార్పణము గావించుటే అర్ధ్వము
శోభనప్రద పుష్ప బిల్వ శోభితా
మల్లికాసుమ గాన సమారాధ్యా ॥
917. చైతన్యకుసుమప్రియా
ప. చైతన్యకుసుమప్రియా దేవీ
అ.ప శ్రీవాణీ శ్రీలక్ష్మీ ఆరాధితా ॥
చ.1
అవిరళభక్తియను అష్టపుష్పములు
నీపాదకమలములకర్పింతునే
నాహృదయకుసుమమున స్థిరముగానుండవే
చైతన్య కుసుమ మకరందభ్రామరీ ॥
చ.2
సత్వపుష్పముతో ధ్యానపుష్పముతో
ఇంద్రియనిగ్రహమనెడి చైతన్యపుష్పముతో
నీ పాదాంబుజములు పూజింతునే
మధుమల్లికాగాన కుసుమప్రియా ॥
918 సదోదితా
ప. సదోదితా స్వయంప్రకాశా
అ.ప సర్వార్ధసాధికాస్వర్గాప వర్గదా ॥
చ.1
సర్వకాలములందు సర్వావస్థలయందు
భక్తులహృదయముల నిలచి ఉండేదేవి
స్మరియించినంతనే చెంతనిలిచేవు
ప్రత్యక్షదైవమై వరములిచ్చేవు ||
చ,2
పూర్వకృత పుణ్యములచే
సర్వవ్యాపిని సదాతలచెదరో
వారిదే యశము వారిదే సుఖము
మల్లికాకుసుమగాన ప్రకాశినీ ॥
919. సదాతుష్టా
ప. సదాతుష్టా నిత్యానందస్వరూపిణీ
అ.ప సజ్జనప్రీతా నిర్మలకృతమూర్తి
చ.1
ససద్భక్తులు సంతుష్టాంత రంగులై
సంతృప్తితో జీవించునటులా
కీర్తి ధన సంపదలిచ్చు తుష్టిరూపిణీ
కమనీయతరంగి కామసుందరీ ॥
చ. 2
ఉద్దామమైన నీప్రభావమును
వర్ణించనాతరమా శరణుచేసెదను
అంజలిఘటింతునో దివ్యవిగ్రహా
మల్లికాకుసుమగాన సంతుష్టా ॥.
920. తరుణాదిత్య పాటలా
ప. తరుణాదిత్య పాటలా సర్వవర్ణ ప్రకాశా
అ.ప మధ్యందిన మార్తాండతేజా ॥
చ.1
రాజ జనవశ్య పాటలవర్ణా
ధనసంపత్తులనిచ్చు పీతవర్ణా
మోక్షమిచ్చునపుడు శ్వేతవర్ణా
లలితాపరమేశ్వరి అరుణవర్ణా ॥
చ.2
విద్వేషములయందు కపిలవర్ణా
మారణకర్మలలోన కృష్ణవర్ణా
సౌభాగ్య సంపదల గౌరవర్ణా
మల్లికాసుమగాన సర్వవర్ణా ॥
921. దక్షిణా
ప. దక్షిణా యజ్ఞసఫలీకృతా
అ.ప దక్షిణా రపిణీ పరదేవతా
చ.1
మంత్ర తంత్ర యాగాదిక్రతువులలో
దక్షిణ రూపమున యజ్ఞపురుషునకు
వశిష్టులకువేదబ్రహ్మలకు
సంతృప్తినికలిగింతువు పరమేశ్వరీ ॥
చ. 2
దక్షిణలేని పూజలులేవు
దక్షిణలేని యాగములేదు
దక్షిణలేని కర్మసఫలతలేదు
మల్లికాసుమగాన శుభయోగినీ।।
922. దక్షిణారాధ్యా
ప. దక్షిణారాధ్యా సమయాచార తత్పరా
అ.ప యజ్ఞసాఫల్య మోక్షదాయనీ ॥
చ.1
యాగఫలదాయనీ పరమేశ్వరీ
దక్షిణాచార పూజావిధాయినీ
కవచమువలె ఋత్విక్కులబ్రోచే
దాక్షిణ్యరూపిణీ కామితఫలదా ॥
చ.2
చారుతర రత్నకంకణ సంకలిత
భువన సృజనావలంబా మదంబా
నేత్రత్రయీ ఆనందవీచీమయీ
మల్లికాకుసుమ గానారాధ్యా!
923. దరస్మేర ముఖాంబుజా
ష. ధర స్మేరముఖాంబుజా శ్రీదేవీ
అ.ప మృదుల స్మితాంశు లహరీ శ్రీదేవీ ॥
చ.1
చంపకములతో కదంబములతో
మల్లికాకరవీర జాతికుసుమములతో
మాలతీ మాధవీ ఉత్సలములతో
పూజింతుసర్వదా దేవదేవీ ||
చ2.
తులసీమాలలతో కల్హారములతో
మారేడుదళముతో లేతమరువముతో
మల్లికాసుమగాన కీర్తనావళితో
పూజింతుసర్వదా మహాదేవీ ॥
924. కౌళినీ
ప కౌళినీ శివయోగినీ
అ.ప శివశంకరీ అభయంకరీ ॥
చ.1
శితికంఠ కుటుంబినీ శ్రీకరీ
ధూమ్రలోచని శుభకరీ
విజ్ఞాన దీపాంకురీ శ్రీ రాజ రాజేశ్వరి
కోటికందర సుందరి కామారి హృదయేశ్వరీ॥
చ.2
కాళీ భవానీ సుందరేశ్వరి
పంచదశాక్షర మంత్ర విభావరి
'మహా సంపత్తి దాయిని ఈశ్వరీ
శ్రీ యోగపీఠేశ్వరి మల్లికాసుమమంజరీ ॥
925. కేవలా
ప ఏకానేకరూపిణీ కేవలా
అ.ప ఆధారచక్రనివాసినీ ॥
చ.1
జ్ఞానులకే జ్ఞానమొసగు ముక్తిదీపమా
భక్తుల కోర్కెలను తీర్చు వరదదీపమా
వెలుగులకే వెలుగునిచ్చు భావదీపమా
రజ్జుసర్ప భ్రాంతి తొలగు భక్తిదీపమా ॥
ఛ.2
చీకటిలో దారిచూపు దివ్యదీపమా
అజ్ఞానతిమిరాంధకా జ్ఞాన దీపమా
సాయుజ్యమునందించే అమరదీపమా
మల్లికాసుమగాన కాంతిదీపమా ॥
926. అనర్హ్యకైవల్యపదదాయినీ
ప. అనర్ఘ్యకైవల్యపదదాయినీ
అ.ప ముక్తిదాయినీ ముక్తేశ్వరీ ||
చ.1
అవిచ్ఛిన్నమై అమూల్యమైన
సాన్నిధ్యమును సాన్నిహిత్యమును
నీపదసేవాభాగ్యము నొసగవె
అమందానందము నీయవే ॥
చ.2
మరుజన్మమన్నది లేకనే
ఆత్మసాక్షాత్కారము కలిగించి
శివ సాయుజ్యమొసగవె
మల్లికాకుసుమగాన దాయినీ ॥
927. స్తోత్రప్రియా
ప. జయజననీ జయజననీ స్తోత్రప్రియా
అ. ఎ త్రిజగద్వంద్యా నిరుపమసులభా ॥
చ.1
అర్ఘ్యపాద్యములిచ్చిన అనందమునొందెదవు
పసుపు కుంకుమలొసగిన సౌభాగ్యమిచ్చెదవు
పూవులతోపూజచేయ ఆయురారోగ్యమిచ్చి
పాయసాన్నములిచ్చిన అభయమొసగెదవు ||
చ.2
ధూపదీపములతో తిమిరాలు తొలగింతువు
కర్పూరహారతుల సంతుష్టిచెందెదవు
శిరసు వంగిపాదాలకు ప్రణతిచేతునమ్మా
మల్లికాకుసుమగాన స్తోత్రప్రియా ||
928. స్తుతిమతీ
ప.. స్తుతిమతీ అతులధీమతీ
అ.ప నామపారాయణప్రీతా కాంతిమతీ
చ.1
నీగాధలను వినుచు నీలీలపొగడుచూ
అహరహము సేవించి దాస్యమును చేసేము
నీస్మరణచేయుచూ అర్చనలు చేసెదము
వివిధోపచారములతో ఆత్మార్పణగా వింతుము ॥
చ.2
నామపారాయణతో పొంగిపోయెడితల్లి
మాజన్మ తరియించ స్తుతులు సలిపెదము
‘మాపాలిదైవమా వందనము గైకొనుము
మల్లికాసుమగాన కీర్తనా తన్మయీ ॥
929. శృతీ
ప. శృతి సంస్తుత వైభవా
అ. సకలాగమ ప్రాభవా ॥
చ.1
నాల్గువేదములందలి తేజోరాశీ .
సామవేదగాన సంతోషినీ
నిగమాగమ సకలవంద్య
అష్టాదశ పురాణ పూజితా ॥
చ.2
వేదమంత్రరాజిత పదా
ఆగమనిధానపదా సుపధా
సర్జనతేజోమయ విగ్రహా
మల్లికా కుసుమగాన వైభవా ॥
930. మనస్వినీ
ప. మనస్వినీ తురీయాతీతస్వరూపిణీ
అ.ప చిదానంద సంధాయినీ 1
చ.1
యోగలబ్ధి పరమార్ధసదంబా
ఎల్లజగములు నిన్ను కొనియాడునమ్మా
మనోవికృతులు అంటక కాపాడవమ్మా
సర్వకర్మలసాక్షి పరమేశ్వరీ ॥
చ. 2
సత్కృపావిశాలా భువనైకమాతా
అతిరుచిర మనోజ్ఞయోగవిద్యాశంకరీ
ఘనకరుణానిధాన సర్వస్వతంత్రీ
మల్లికాకుసుమగాన మనస్వినీ ॥
931. మానవతీ
ప. మానవతీ దైత్యహంత్రీ
అ.ప మహాపతివ్రతా శిరోమణీ ॥
చ.1
లక్ష్మీభ్రూవల్లరీ వశకరీ
చందనగంధ సుగంధ మాధురీ
లీలానాటక సూత్రధారిణీ
ఘనాఘన వినోదకర పాణీ ॥
చ.2
నీలకంఠేశ్వర మనోమయీ
సర్వప్రపంచ నియామకమయీ
సదాశివ వాక్పరిపాలనామయీ
మల్లికాకుసుమగాన శిరోమణీ ॥
932 మహేశీ
ప. మహేశీ పాపవినాశనీ
అ.ప కైలాస వాసినీ ఈశ్వరీ
చ.1
అన్యదైవములను కొలువనమ్మా. .
నీపాదములే మాకు నిలయమమ్మా
నీహారగిరినందినీ శివహృదయ స్పందినీ
మల్లికాసుమగంధినీ పురహర పురంధ్రీ
చ.2
సామరస్య విభవా సదాశివవ్రతా
శశాంకశేఖర ప్రాణవల్లభా ..
శివానందభరితా శ్రీచక్రస్థితా
మల్లికాకుసుమగాన, సమాహితా||
933. మంగళాకృతీ
ప. మంగళాకృతీ మంగళరూపిణీ
అ.ప మంగళదాయినీ మంగళగౌరీ ॥
చ.1
నీరూపము సమ్మోహనము
నీస్మితవదనము మంగళకరము
నీనామము దురిత భంజనము
నీచరితము సుజనరంజనము ॥
చ. 2
నీవీక్షణము శోభనకరము
నీస్మరణమే సుమధుర భరితము
నీకటాక్షముతో మాజన్మ ధన్యము
మల్లికాకుసుమ గాన పూజితము ॥
934. విశ్వమాతా
ప. ఈదేవి విశ్వమాతా
అ.ప ఈదేవి విశ్వాత్మ విశ్వంభరీ ॥
చ.1
ఈదేవియోగీంద్రమనములను విహరించు
ఈదేవి భక్తులకు ఈప్సితార్ధములిచ్చు
ఈదేవి కళ్యాణ మూర్తియై విలసిల్లు
ఈదేవి బాలేందు శేఖరుని అర్ధాంగి ॥
చ2.
ఈదేవి అఖిలవిశ్వమునకు మాత
ఈదేవి అఖిలబ్రహ్మాండమ్మునకు నేత
ఈదేవి కల్పాంతమందు లయమునుచేయు
ఈదేవి మల్లికాసుమగాన మోహినీ ॥
935. జగద్ధాత్రీ
ప పుణ్యశ్రవణకీర్తనా త్రిపురాంబికే
అ.ప శివవానుభాగనిలయే అంబికే ॥ .
చ.1
శ్రీ చక్రాంకిత బిందుమధ్యమా
విఘ్నరాజ జననీ జ్వాలాంబికే
ముక్తి గేహినీ భ్రాంతి నాశినీ
పరంజ్యోతిశ్రీజగన్మాతృకే |॥
చ.2
సర్వవిద్యవిశేషాన్వితే
సర్వమంత్రాత్మికే యంత్రాత్మికే
సర్వ బీజాత్మికే యోగాత్మికా
మల్లికాకుసుమగానాసక్తికే ॥
936 విశాలాక్షి
ప. కాశీవిశాలాక్షీ కామితదాయినీ
అ.ప విశ్వేశ్వరుని ప్రియదేవేరీ ॥
చ.1
అష్టాదశపీఠములందు ప్రఖ్యాతిచెంది
భూతనాధునివామభాగము ఖ్యాతిగానంది
డుండి విఘేశ్వరుని వరపుత్రునిగాపొంది
వాసిగాకాశిలో వెలసినట్టి దైవమా॥
చ.2
కాలభైరవుడు సేవలుచేయగా
వారాహి కాశికాపురి కాచుచుండగా
అండచేరే భక్తజనులకు అండగానుందువే
మల్లికాసుమగాన కీర్తనలందుకోవమ్మా ॥
937. విరాగిణీ
ప. విరాగిణీ అనురాగహృదయినీ
అ.ప జ్ఞానవైరాగ్య గుణమణీ ॥
చ.1
భేదా భేద రహిత వేదాంత రసభరిత
రవి కోటిసన్నిభ రాగమోహవినాశ
విషయవాంఛారహిత కరుణభరితా
అరిషడ్వర్గాతీతా నిర్గుణ తత్వా ॥
చ.2
నిజసేవకులపాలి కల్పతరువా
యాచించుదీనులకు కామధేనువా
సకలసద్గుణ నిరాలంబా
మల్లికాసుమగాన గుణకదంబా ॥
938. ప్రగల్భా
ప ప్రగల్భా చైతన్యమోహినీ
అ.ప శ్రితమానవ హితకరీ ॥
చ.1
ఘోర రాక్షస సంహారమందున
అనన్యమైన నేర్పుచూపితివీ
పంచకృత్యములందు నేర్పుతో
ఎదురులేని ప్రతిభ చూపితివీ ॥
చ. 2
భక్తాళి కోర్కెలు తీర్చెటితల్లీ
నీకుసాటి ఎవరుకలరమ్మా
సర్వజగతికీ మూలాధారమైన
మల్లికాకుసుమగాన సుందరీ ॥
939. పరమోదారా
ప. పరమోదారా ఉదారస్వభావినీ
అ.ప కరుణాన్వితా శ్రీలలితా ||
చ.1
దేశకాలములకన్న గొప్పమహిమకలది
అమితానందమునిచ్చి శాంతినిచ్చునది
ధ్యానించువారిని కాచి రక్షించునది
పరమ భక్తుల కోరికలు తీర్చు వరదా ॥
చ.2
ఆర్తితో పిలచిన ఆదరమ్మునచేరి
అండగానిలిచేటి ఉదారహృదయిని
శిరసు నంజలి చేర్చి భక్తితో వినతింతు
మల్లికాసుమగాన హృదయరంజనీ ॥
940. పరామోదా
ప. పరామోదా పరమేశీ
అ.ప వారేధన్యులు ఓ మనసా
చ.1
కర్మనిష్టులై ధర్మశీలురై
శాంభవి నామము మదిలోమరువని వారే ॥
అమ్మమనసు రంజిల్లునటుల
నామకీర్తనము భక్తితో చేసెడివారే ॥
చ. 2
నారదతుంబురు మౌనివరులవలె
నీనామ గానము నిరతము సలిపెడి వారే ॥
కాసులకోసము ఆశచెందక
మల్లికాకుసుమగానము చేసేడివారే ॥
941 మనోమయీ
ప. సుద్ద బ్రహ్మమయీ
అ.ప మాయాస్వరూపమయీ చిన్మయీ ॥
చ.1
తత్వమయీ ప్రకాశాత్మకమయీ
నిరామయీ నిశ్చలచిత్తమయీ
హాసమయీ దాక్షిణ్యమయీ
కాంతిమయీ నిత్యసుందరమయీ ॥
చ. 2
శుభమయీ శోభనమయీ
పవనమయీ పావకమయీ
సత్య మయీ శాశ్వతమయీ
మల్లికాసుమగాన కళామయీ ॥
94. వ్యోమకేశీ
ప. వ్యోమకేశీ మహాకాళీ
అ.ప కపాలమాలీ కదంబవనవాసినీ॥
చ.1
సుందరతాండవ పదజాలా
నీపదములను విడజాలా
కరుణచూపవే కరుణాల వాలా
ఆకాశకేశా గానవిలోలా ॥
చ.2
నానాకృతి క్రియారూపా
నానావృత్తీ లీలాపరయా
సత్వరజస్తమత్రిగుణాలయా
మల్లికాకుసుమ గానలయా॥
943. విమానస్థా
ష. విమానస్థా చంద్రమండల వాసినీ
అ.వ మేరుపర్వత శిఖరాగ్రనివాసినీ ॥
చ.1
అమందానంద సింధురాననా
అప్రమేయఅప్రతిహతబాహువీరా
అన్నిలోకములకు ఆవలిలోకమున
నివసించియుండే అగమ్యగోచరా
చ.2
నవవ్యూహాత్మిక మునివరసేవిత
అజ్ఞానధ్వంస దీపకళికా
రాజరాజేశ్వరీ త్రిపురాసురవైరీ
మల్లికాసుమగాన సుఖదాయినీ ॥
944. వజ్రిణీ
ప. వజ్రిణీ వజ్రాయుధ ధారిణీ
అ.ప ఇంద్రాణీ ఇంద్రశత్రుపలాయనీ ॥ -
చ.1
భువనేశ్వరీ మహావజ్రేశ్వరీ
ఏకాక్షరీ స్థూల సూక్ష్మ ప్రవర్తినీ
వారాహీ నారసింహీ భవానీ అపరాజితా
అనంతా విజయాపర్ణా భీమ భైరవనాదినీ II
చ.2
ఐరావతగజారూఢా వజ్రహస్తా వరప్రదా
రక్తలోచనా రక్తాంబరీ రక్తాభరణభూషితా
జ్వలంతీ జ్వరనాశినీ శివా సర్వార్ధసాధకీ
మల్లికాకుసుమగానభూషితా వజ్రేశ్వరీ ॥
945. వామకేశ్వరి
ప. వామకేశ్వరీ దాసోహం
అ.ప దాసోహం తవ దాసోహం ॥
చ.1
పంకజనేత్రి పరమపవిత్రీ
కరుణాధరిత్రీ శ్రీలలితా
మనవిని వినుమా కరుణను గనుమా
నీదానననుమా శ్రీలలితా |
చ.2
సుజన జనహితా శంకర సన్నుతా
గానమోహితా శ్రీలలితా
కుంకుమ శోభితా శివసమేతా
మల్లికాసుమ గానవినుతా శ్రీలలితా ॥
946. పంచయజ్ఞప్రియా
ప పంచయజ్ఞప్రియా యాగసంరక్షణీ
అ.ప సదాసదాశివ మంచాధిశయనీ॥
చ. 1
తెలిసి తెలియక హింసలుచేసేము
ప్రాయశ్చిత్తమునకై యాగాలు చేసేము
పంచయజ్ఞములు చేయుట ఎరుగము
కరుణమాపై చూపి కనికరించవే ॥
చ. 2
పాలనుపితికి పూలనుకోసీ
గోపుల చెట్లను హింసించేము
మాపాపములను పరిహరించవే
మల్లికాకుసుమగానప్రియా ॥
947 పంచప్రేత మంచాధిశాయినీ
వ. పంచప్రేత మంచాధిశాయినీ
అ.ప పంచప్రేతారోహా నిశ్చలా ॥
చ.1
బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వరులు
సింహాసనమునకు కోళ్ళుకాగా
మహాకామేశ్వరుని వామాంకమందు
రత్నకాంతులతో వెలుగొందుమహేశ్వరి ॥
చ.2
మనమున దేవిని ఎవరు నిలిపెదరో
సర్వవ్యాపినీ సదా తలచెదరో
జగమునవారే శక్తియుక్తులు
మల్లికా కుసుమగానచతురులు ॥
948 పంచమీ
ప. పంచమీ చారుహాసినీ
అ.ప. సదాశివ వామభాగినీ ॥
చ.1
బ్రాహ్మీ మహేశ్వరి కౌమారీ
వైష్ణవీ వారాహి బ్రహ్మశక్తులతో
పంచమరూపిణీ వారాహిదేవతా
ఆనందామృత వర్షిణీ ॥
చ.2
తురియాతీత స్వభావా
ముక్తినిలయా సాయుజ్య ప్రదా
షడ్గుణ ఐశ్వర్యసంధాయినీ
మల్లికాకుసుమగాన ప్రదా॥
949. పంచభూతేశీ
ప. పంచభూతేశీ పరమాత్మికా
అ.ప. వైజయంతీ మాలాలంకృతా ॥
చ.1
ఇంద్రనీలమణి మంచిముత్యములు
వైడూర్యములు పుష్యరాగములు
కౌస్తుభములతో వైజయంతియై
నీవక్షముపై నిరతము మెరయును ॥
చ.2
పంచభూతముల వశముచేసుకొని
భక్తులముంగిట కామధేనువై
కోర్కెలతీర్తువు శాంతిదాయినీ
మల్లికాకుసుమగాన శాలినీ ॥
950. పంచసంఖ్యోపచారిణీ.
ప పంచసంఖ్యోపచారిణీ శ్రీలలితా
అ.ప షోడశోపచారప్రియా శివప్రియా ॥
చ.1
పృధ్వీతత్త్వాత్మికా గంధంసమర్పయామి
ఆకాశతత్త్వాత్మికా పుష్పంసమర్పయామి
వాయు తత్త్వాత్మికా ధూపమాఘ్రాపయామి
"తేజో తత్త్వాత్మికా దీపం సమర్పయామి ॥
చ.2
అమృత తత్త్వాత్మికా నైవేద్యం సమర్పయామి
సర్వతత్త్వాత్మికా సర్వోపచారములను
భక్తితోసమర్పింతు ప్రణతులివే గైకొనుమా
మల్లికాకుసుమగాన ఉపచారసంతుష్టా ॥
951. శాశ్వతీ
ప. శాశ్వతీ హైమవతీ
అ.ప నిన్నేనమ్మితినే శివసతీ శరణాగతీ ॥
చ.1
భక్తపాలినీ పాపవిమర్దినీ
ముక్తాహార సమూహశోభినీ
పన్నగభూషణుని భామినీ
మంగళ కారిణీ మధుశాలినీ ॥
చ.2
వినుతపదయుగళ రంజనీ
మహిషాసురభంజనీ నిరంజనీ
మదనాంతక వామభాగినీ
మల్లికాసుమగాన వాహినీ ॥
952. శాశ్వతైశ్వర్యా
ప. శాశ్వతైశ్వర్యా మంగళవిగ్రహా
అ.ప జయమంగళం నిత్యశుభమంగళం ॥
చ.1
సుందరవదనికీ అరవిందనేత్రికీ
అద్భుతచరిత్రికీ గిరిరాజపుత్రికీ
ఓంకార రూపిణికీ యోగిజనవంద్యకీ
చంద్రార్ధచూడకీ రాజరాజేశ్వరికీ ||
చ.2
సింహాసనేశ్వరికీ ఇష్టకామేశ్వరికీ
భక్తవరదాయినికీ సామజవరగమనికీ
ఐశ్వర్య ప్రదాయినికీ పరమేశురాణికీ
మల్లికాకుసుమగాన శుభదాయనికీ ||
926, అవసరాల గాయత్రి అంజని
స్వరకర్త - కొమ్మూరు రాజేశ్వరి
927, వేమూరు విజయభారతి
స్వరకర్త - కొమ్మూరు రాజేశ్వరి
లలిత రాగం
928. గాయత్రీ లక్కరాజు
స్వరకర్త - కొమ్మూరు రాజేశ్వరి
హిందోళ రాగం
929. ముదిగొండ నాగలక్ష్మి.
రేవతీ రాగం,
930, వల్లూరి సరస్వతి
శ్రీరాగం
931. చింతలపూడి రమామహేశ్వరి
బహుదారి రాగం
932 ఆచంట శ్రీదేవి
చక్రవాకం రాగం
933 డా. ప్రత్తిపాటి ఉమాసుందరి
మధ్యమావతి రాగం
934
935,నందివాడ అన్నపూర్ణ
స్వరకర్త - కొమ్మూరు రాజేశ్వరి
అభేరి రాగం
936,రుక్మిణీకృష్ణ
సామరాగం
937,వల్లూరిసరస్వతి
కాపీ రాగం
938.చల్లపల్లి సుభద్ర
స్వరకర్త - కొమ్మూరు రాజేశ్వరి
శివరంజని రాగం
939. కొప్పర్తిఇందిర
బేహాగ్ రాగం
940. రుక్మిణీకృష్ణ
బిళహరి రాగం
941. వల్లూరిసరస్వతి
కాపీ రాగం
942. చింతలపాటి రమామహేశ్వరి
మోహన రాగం
943. వేమూరు విజయభారతి
స్వరకర్త - కొమ్మూరు రాజేశ్వరి
హంసధ్వని రాగం
944 గొట్టుముక్కుల లీల
స్వరకర్త - కొమ్మూరు రాజేశ్వరి
వసంత రాగం
945,వల్లూరి సరస్వతి
సెంఝురిటి రాగం
946, లక్కరాజు గాయత్రీ
స్వరకర్త - కొమ్మూరు రాజేశ్వరి
రేవతి రాగం
947, వల్లూరి సరస్వతి
హమీర్ కళ్యాణి రాగం
948. హరిప్రియ
స్వరకర్త - కొమ్మూరు రాజేశ్వరి
అమృతవర్షిణి రాగం
949, Ch. రమామహేశ్వరి
చారుకేశి రాగం
950. గరిమెళ్ళ కళ్యాణి
లలిత రాగం
951. వల్లూరి సరస్వతి
అభేరి రాగం
952, వేమూరు విజయభారతి
స్వరకర్త - కొమ్మూరు రాజేశ్వరి
మాధ్యమావతి రాగం
953. గరిమెళ్ళ కళ్యాణి
హమీర్ కళ్యాణి రాగం
954, రుక్మిణీకృష్ణ
హంస రాగం
955, ఆచంట శ్రీదేవి
ధన్యాసి రాగం
956. చల్లపల్లి సుభద్ర
స్వరకర్త - కొమ్మూరు రాజేశ్వరి
సింధుభైరవి రాగం
957, తరణి స్వాతి
ధన్యాసి రాగం
958 ఆచంటశ్రీదేవి
రాగం - ధర్మావతి రాగం
959. వల్లూరి సరస్వతి
కీరవాణి రాగం
960. రుక్మిణీ శ్రీకృష్ణ
ధర్మావతి రాగం
961. కొప్పర్తిఇందిర
962, వల్లూరి సరస్వతి
అభోగి రాగం
963. వల్లూరి సరస్వతి
భైరవి రాగం
964, రాకా జ్యోత్స్న
స్వరకర్త - కొమ్మూరు రాజేశ్వరి
రేవగుప్తి రాగం
965 ముదిగొండ మల్లీశ్వరి
రాగం - హిందోళ
966, గరిమెళ్ళ కళ్యాణి
సింధుభైరవి రాగం
967. రుక్మిణీకృష్ణ
(సుమంగళి) లలితా రాగం
968. ఆచంట శ్రీదేవి
లలితా రాగం
969, వల్లూరి సరస్వతి
రేవతి రాగం
970. వల్లూరి సరస్వతి
చక్రవాక రాగం
971. ఆచంటశ్రీదేవి
హంసానంది
972, రుక్మిణీశ్రీకృష్ణ
బృందావన శారంగా రాగం
973. వల్లూరిసరస్వతి
సెంఝురిటి రాగం
974, రుక్మిణీ శ్రీకృష్ణ
తనజీ రాగం
975, వల్లూరిసరస్వతి
శంఖరాభరణం రాగం
976. ముదిగొండ మల్లీశ్వరి
రాగం,వరాళి
977, ఇందిర కొప్పర్తి
చక్రవాక రాగం
978. రమామహేశ్వరీ
భాగేశ్రీ రాగం
979. గరిమెళ్ళ కళ్యాణి
శ్రీరాగం
980, వల్లూరి సరస్వతి
సింధుభైరవి రాగం
981,వల్లూరిసరస్వతి
రంజని రాగం
982మండావిజయకుమారి
983,తాడేపల్లిరుక్మిణీకృష్ణ
భాగేశ్వరి or భాగేశ్రీ
984,వల్లూరిసరస్వతి
ఆరభి రాగం
985.ఆచంటసరస్వతి
బాహుదారి
986.లక్కరాజు గాయత్రి
987,వల్లూరి సరస్వతి
కీరవాణి రాగం
988, వల్లూరి సరస్వతి
భైరవి రాగం
989.గరిమెళ్ళకల్యాణి
భాగేశ్వరి or భాగేశ్రీ రాగం
990. ఇందిరకొప్పర్తి
కాంభోజిరాగం
991 వల్లూరి సరస్వతి
రేవతి రాగం
992,తాడేపల్లిరుక్మిణీకృష్ణ
సహాన రాగం
993.ఆచంటశ్రీదేవి
దీపకం రాగం
994.గరిమెళ్ళకల్యాణి
బిళహరి రాగం
995,వల్లూరిసరస్వతి
హంసానంది రాగం
996, ముదిగొండ మల్లీశ్వరి.
హిందోళ రాగం
997 Ch. రమామహేశ్వరీ
ఖరహరప్రియరాగం
998గరిమెళ్ళకల్యాణి
తిల్లాంగ్ రాగం
999,కొప్పర్తి ఇందిర
1000,కొప్పర్తి ఇందిర
965 బాలరావే