Showing posts with label స్వామి వివేకానంద సూక్తులు. Show all posts
Showing posts with label స్వామి వివేకానంద సూక్తులు. Show all posts

July 27, 2014

స్వామీ వివేకానంద సందేశాలు

స్వామీ వివేకానంద సందేశాలు....... (కర్మ రహస్యం)

1. ప్రాణమున్నంతవరకు పని చెయ్యండి. నేను మీకు అండగా ఉన్నాను. నేను పోయిన తరవాత కూడా నా అంతరాత్మ మీ వెంటే ఉండి పని చేస్తుంది. ఈ జీవితం వస్తుంది. పోతుంది. సంపద, కీర్తి, భోగాలు మూడునాళ్ళ ముచ్చటే. ఒక ప్రాపంచిక క్షుద్రకీటకంవలె చనిపోవటంకన్నా సత్యాన్ని బోధిస్తూ కార్యరంలో మరణించటం ఉత్తమం. ముందంజ వెయ్యండి.

2. మీలో ప్రతీ ఒక్కరూ, కార్య భారమంతా మీపైనే ఉందన్న భావంతో పని చెయ్యండి.

3. ఏ ఘనకార్యాన్నీ మోసంతో సాధించలేం. అప్రతిహతమైన శక్తి ద్వారా మాత్రమే సమస్త కార్యాలు సాధించబడతాయి. కాబట్టి ధీరత్వాన్ని ప్రదర్శించండి.

4. జనసమూహం కాదు కావలసింది. పామరుల గుంపు ఒక శతాబ్దంలో చేసిన పనికంటే, నిష్కపటమైన హృదయపూర్వకంగా పనిచేసే కొద్దిమంది ఒక్క సంవత్సరంలోనే ఎక్కువగా సాధించగలరు.

5. నా ఆశ, విశ్వాసం మీ వంటివారి మీదనే ఉన్నాయి. యదార్థదృష్టితో నా మాటలను సరిగా అర్థం చేసుకొని, ఆ ప్రకారంగా మీరు కార్యోన్ముఖులవ్వండి. మీకు కావలసినంత సలహా ఇచ్చాను. కొంచమైన ఇప్పుడు ఆచరణలో పెట్టండి. నా మాటలు వినటం ఉపయొగకరమైనదని లోకానికి తెలియనీయండి.

6. ధైర్యంతో కర్తవ్యాన్ని నిర్వహించు. ఓర్పు స్థిరత్వాలతో పనిచేయి.....ఇదే ఏకైక మార్గము ఓర్మి, పవిత్రత, ధైర్యం, స్థిరత్వంతో పనిచేయాలని గుర్తుంచుకొని ముందుకు నడువు. పవిత్రంగా ఉండి నీ ఆదర్శాలకు కట్టుబడి ఉన్నంత కాలం నీకు అపజయం కలుగదు.

7. నీ ప్రతి పనిలోనూ ఆచరణాత్మకతను కనబరచు. ఆచరణ కొరవడిన అనేక సిద్ధాంతాల వల్లే దేశం పూర్తిగా నాసనమైంది.


స్వామి వివేకానంద యువతకు ఇచ్చిన సందేశాలు

స్వామి వివేకానంద యువతకు ఇచ్చిన సందేశాలు  :--

1. ఇప్పటి తరం వారిపై ఆధునిక యువతపైనే నాకు విశ్వాసం. వారి నుండే నా కార్యనిర్వాహకులు రాగలరు. సింహాలవలె వారు సమస్యనంతటిని పరిష్కరిస్తారు. నేను ఒక ఆదర్శన్ని నిర్మించుకొని దానికై నా జీవితాన్ని అంకితం చేశాను. యువకులంతా ఆ ఆదర్శాన్ని ప్రతీ కేంద్రానికి, చివరకు భారతదేశమంతా వ్యాప్తి చేస్తారు.

2. నేను ఈ యువకులను సంఘటిత పరచటానికే జన్మించాను. అంతేకాదు, ప్రతి నగరం నుండి వందలమంది నాతో చేరటానికి సంసిద్ధంగా ఉన్నారు. అప్రతిహతమైన తరంగాలవలె వారిని భారతదేశం పైకి పంపదలచాను. వారు అధమాధుల, పతితుల ఇంటికే వెళ్ళి, వారికి ఓర్పును, నీతిని, మతాన్ని,విద్యను బోధిస్తారు. నేను ఈ పనిని చేసి తీరుతాను లేక మరనించనైనా మరణిస్తాను.


స్వామీ వివేకానంద సందేశాలు

స్వామీ వివేకానంద సందేశాలు

1. సహనశీలురై ఒకరినొకరు విశ్వాసపాత్రులై ఉండండి. మీలో మీరు తగవులాడుకోవద్దు. ఆర్ధికలావాదేవీలలో పరిపూర్ణమైన పారదర్శకతను (స్వచ్ఛతను) కలిగి ఉండండి. మీకు విశ్వాసం, నిజాయితీ, శ్రద్ధాభక్తులు ఉన్నంత వరకు సర్వం వికాసాన్ని పొందుతుంది.

2. మీరందరూ స్వలాభాన్ని, వర్గకీచులాటలను, అసూయను విడిచిపెట్టండి. భూమాతవలె ఓర్మి కలిగి ఉండండి. దీనిని మీరు సాధించగలిగితే లోకమే మీకు పాదాక్రాంతమవుతుంది.

3. విమర్శించటం విడిచిపెట్టండి. ఎదుటివారు చేసే పని మంచిదైతే మీకు చేతనైన సహాయం చేయండి. వారు తప్పుద్రోవ పడుతున్నారనిపిస్తే వారి తప్పులను సున్నితంగా తెలియచేయండి. ఒకరినొకరు తప్పుపట్టుకోవటమే అన్ని అనర్థాలకు మూలం. సంస్థల వినాశనానికి ముఖ్యకారణం కూడా ఇదే.

4. సంఘటితంగా పనిచెయ్యటం కావాలి. నీవు నన్ను అర్థంచేసుకుంటావా? మీకెవరికైనా బుర్రలో ఈ పాటి మేథాశక్తి ఉందా ? ఉంటే మీ మనస్సును పనిచేయనివ్వండి.

5. నిస్స్వార్థంగా పని చెయ్యండి. మరొకరిని చాటుగా దూషిస్తున్న మిత్రుని మాటలను ఎన్నడూ వినవద్దు.

6. కపటం, దుర్మార్గం ఎంత మాత్రం ఉండకూడదు. అల్పశ్వాస పాటి అనైతికత, నలుసంత చెడు విధానం కూడా తగదు.


స్వామీ వివేకానంద సందేశాలు....... (కర్మ రహస్యం)

స్వామీ వివేకానంద సందేశాలు....... (కర్మ రహస్యం)

1. నైతిక ధైర్యంతో ప్రారంభించిన మంచిపనికి ప్రతికూలత ఉంటే, అది ప్రారంభించిన వాళ్ళ నైతిక బలాన్ని మరింత ఉత్తేజ పరుస్తుంది. ప్రతిఘటన, ఆటకం దేనికి ఉండదో అది మానవులను  మృత్యుసదృశ నైతిక పతన మార్గానికి కొనిపోతుంది.

2. మనకు కావలసింది స్పందించే హృదయం. ఆలోచించే మెదడు, పనిచేసే బలిష్టమైన హస్తం. కర్మ చేసే యోగ్యతను సంపాదించు. హృదయానికి --మనసుకి సంఘర్షణ జరిగినపుడు హృదయాన్ని అనుసరించు.

3. మీకు కొద్దిపాటి కల్పనాశక్తి లేకపోతె, మార్గదర్శకమైన ఆదర్శం లేకపోతె, మీరు కేవలం పసుతుల్యులే. కాబట్టి మీ ఆదర్శాన్ని తగ్గించుకోకూడదు. అలా అని అసాధ్యమైన దాన్ని ప్రయత్నించరాదు. ఈ రెండూ విసర్జనీయాలే ! ఉన్నత ఆదర్శంతో ఉత్తమ ఆచరణాన్ని మీ జీవితంలో సమన్వయపరచటానికి ప్రయత్నించండి.

4. మనదేశపు ఆసలన్నీ మీపైనే ఉన్నవి. సోమరులుగా మీరు కాలం గడపటం నాకు బాధను కలిగిస్తోంది. కార్యదీక్షాపరులు కండి. ఆలస్యం చేయవద్దు. అంతా సరియైన సమయంలో జరుగుతుందని సోమరులుగా కూర్చోవద్దు. ఆ విధంగా ఏ పనీ నేరవేరదని గుర్తుంచుకోండి.

5. వ్యర్థకాలయాపన పనికి రాదు. అసూయ, అహంకారం అనే భావాలను పూర్తిగా విడిచిపెట్టండి. అప్రతిహతమైన శక్తితో కార్యరంగంలోకి దూకి సాహసవంతులుగా పని చెయ్యండి.

6. నా ఉద్వేగం మీకింకా ఒంటబట్టలేదు. నన్ను మీరు అర్థం చేసుకోలేదు. సోమరితనం, సుఖనుభవం అనే పాతపంథాలలోనే మీరింకా పరుగెత్తుతున్నారు. ఈ అలసత్వం ఇక చాలు. ఇహపర ఫలభోగాసక్తి ఇక చాలు.

7. మీరు నా ఉద్వేగాని అందుకోవాలని, అత్యంత నిష్కపటవర్తనులవ్వాలని నా నిరంతర ప్రార్థన.