Showing posts with label అమ్మవారి స్తోత్రాలు. Show all posts
Showing posts with label అమ్మవారి స్తోత్రాలు. Show all posts

September 22, 2025

దసరా నవరాత్రులలో అమ్మవారి అవతారాలు, అమ్మకు పెట్టవలసిన నైవేద్యాలు

దసరా నవరాత్రులలో అమ్మవారి అవతారాలు


దసరా నవరాత్రుల లో అమ్మవారి అవతారాలు, అమ్మకు పెట్టవలసిన నైవేద్యాలు, శ్లోకాలు, ఆశ్వయుజ శుద్ద పాడ్యమి నుండి శుద్ధ దశమి వరకు దేవీ నవరాత్రులలో రోజుకొక దుర్గా రూపమును ఉపాసించ వలెను.

నవదుర్గలు :

ప్రథమా శైలపుత్రీచ| 

ద్వితీయా బ్రహ్మచారిణీ|

తృతీయా చంద్రఘంటేతి| 

కూష్మాండేతి చతుర్థికీ|

పంచమా స్కందమాతేతి| 

షష్ఠా కాత్యాయనేతిచ|

సప్తమా కాళరాత్రీచ| 

అష్టమాచేతి భైరవీ|

నవమా సర్వసిద్ధిశ్చాత్| 

నవదుర్గా ప్రకీర్తితా||

నవరాత్రులలో ఈ తొమ్మిది రూపాలలో అమ్మవారిని పూజించాలి.


నవదుర్గా ధ్యాన శ్లోకములు

శైలపుత్రీ : (బాలా త్రిపుర సుందరి)


నైవేద్యం : కట్టు పొంగలి

శ్లో|| వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతశేఖరాం| 

వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ||

బ్రహ్మ చారిణి ( గాయత్రి ):


నైవేద్యం : పులిహోర

శ్లో|| దధానా కరపద్మాభ్యాం అక్షమలాకమండలూ | 

దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||

చంద్రఘంట ( అన్నపూర్ణ )


 నైవేద్యం : కొబ్బరి అన్నము

శ్లో|| పిండజప్రవరూరుఢా చంద్రకోపాస్త్ర కైర్యుతా| 

ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ||

కూష్మాండ ( కామాక్షి )


నైవేద్యం : చిల్లులులేని అల్లం గారెలు

శ్లో|| సురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ| 

దధానా హస్త పద్మభ్యాం కూష్మాండా శుభ దాస్తుమే ||

స్కందమాత ( లలిత )


నైవేద్యం : పెరుగు అన్నం

శ్లో|| సంహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా| 

శుభదాస్తు సదాదేవీ స్కందమాతా యశస్వినీ ||

కాత్యాయని(లక్ష్మి)


నైవేద్యం : రవ్వ కేసరి

శ్లో|| చంద్రహాసోజ్జ్వలకరా శార్దూల వరవాహనా | 

కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినీ ||

కాళరాత్రి ( సరస్వతి )


నైవేద్యం : కూరగాయలతో వండిన అన్నాన్ని

శ్లో|| ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నాఖరాస్థితా| 

లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ |

వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా| 

వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ ||

మహాగౌరి( దుర్గ )


నైవేద్యం : చక్కెర పొంగలి (గుఢాన్నం)

శ్లో|| శ్వేతే వృషే సమారూడా స్వేతాంబరధరా శుచిః| 

మహాగౌరీ శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా ||

సిద్ధిధాత్రి ( మహిషాసుర మర్దిని ) ( రాజ రాజేశ్వరి ) 


నైవేద్యం : పాయసాన్నం

శ్లో|| సిద్ధ గంధర్వ యక్షాద్యైరసురైరమరైరపి | 

సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ||

దుర్గా ధ్యాన శ్లోకము :


శ్లో|| ఓం హ్రీం కాలాభ్రాభాం కటాక్షైరరికులభయదాం మౌలిబద్ధేందురేఖాంశంఖం 

చక్రం కృపాణం త్రిశిఖమపి కరైరుద్వహంతీం త్రినేత్రామ్ |

సింహస్కంధాధిరూఢాం త్రిభువనమఖిలం తేజసా 

పూరయంతీం ధ్యాయేద్ దుర్గాం జయాఖ్యాం త్రిదశ పరివృతాం సేవితాం సిద్ధికామైః ॥


May 2, 2024

అపీత కుచాంబ ఎవరు?

 అపీత కుచాంబ ఎవరు?

శ్రీ శివాయ గురవేనమః  -------- అపీతకుచాంబాస్తవము 


(మొత్తం 08 శ్లోకాలు మూలం & తాత్పర్యంతో)

ముత్తుస్వామి దీక్షితుల వారి కీర్తనల వివరణాయజ్ఞంలో..

రాసినవారు ------ 

“అరుణాచల నాథం స్మరామి అనిశం-అపీత కుచాంబా సమేతమ్ “

అని ఆ కృతి మొదలు. ఆగిపోయాను. అపీత కుచాంబ ఎవరు? ఆమె వివరాల ఆరాధనలో- అప్పయ్య దీక్షితులవారి అపీతకుచాంబాస్తవము కనబడింది. దానికి తెలుగులో తాత్పర్యం వ్రాయాలని ప్రేరణ కలిగింది.దాని ఫలితమే ఇది.

ఒకసారి శ్రీ అప్పయ్య దీక్షితులు అరుణచలేశ్వర దర్శనం కోసం తిరువన్నామలై వెళ్ళారు. అక్కడ వారికి తీవ్రమైన జ్వరం వచ్చింది. ఆ సమయంలో ఆయన ఈ స్తవాన్ని రచించి అపీతకుచాంబాదేవిని ప్రార్థించారు. వారికి వెంటనే ఉపశమనం లభించింది. ఇప్పుడు కూడా భక్తితో ఈ స్తవాన్ని పఠించడం ద్వారా జ్వరం మరియు ఇతర రోగాల నుండి ఉపశమనం పొందవచ్చు. మూలపాఠాన్ని , తెలుగు అనువాదాన్ని అమ్మవారి దయతో అందిస్తున్నాను.

 01

ఆనంద సింధు లహరీ మమృతాంశుమౌలే- 

రాసేవినామమృత-నిర్మిత-వర్తిమక్ష్ణోః . 

ఆనందవల్లివితతేరమృతార్ద్రగుచ్ఛం

 అంబ స్మరామ్యహమపీతకుచే వపుస్తే

తాత్పర్యం

అరుణాచలేశ్వరుని పట్టమహిషి అయిన అపీతకుచాంబ అమ్మవారియొక్క దివ్య దేహాన్ని స్మరిస్తున్నాను. అమ్మవారు చంద్రశేఖరుని ఆనంద సముద్రము యొక్క ప్రవాహం. ఎప్పుడూ తనను పూజించే వారికి కరుణామృతం నిండిన కళ్ళు గల తల్లి. ఆనందమనే తీగకు కలిగి, అమృతముచే తడిసి ఆర్ద్ర్రంగా ఉన్న పూలగుత్తి.

02 

నిర్నిద్ర-కోకనద-కోమలకాంతమంబ

 నిత్యం సుధానికరవర్షి పదం త్వదీయం .

 మూర్ఛాకరజ్వరరుజా మమ తాపితస్య

 మూర్ధ్ని క్షణం సకృదపీతకుచే నిధేహి

తాత్పర్యం

ఓ తల్లి ! ఓ అపీత కుచాంబా ! మృదువైన మరియు మెరిసే నీ పాదాలు అప్పుడే వికసించిన కమలాలు మరియు ఎప్పటికీ అమృతాన్ని వర్షించేవి . నేను మూర్ఛపోతున్నాను. జ్వరం మరియు అనారోగ్యం యొక్క వేడితో బాధపడుతున్నాను.దయచేసి నీ పాదాలను నా తలపై కనీసం క్షణం సేపు ఉంచు.

03

 శీతాంశుకోటి సుషమాశిశిరైః కటాక్షైః 

అవ్యాజభూత కరుణారస పూరపూర్ణైః .

కర్పూరధూలిమివ దిక్షు సమాకిరద్భిః

 అంబ క్షణం స్నపయ మామరుణాద్రిమాన్యే

తాత్పర్యం

అమ్మా! నీయొక్క చూపులు వేలాది చంద్రుల నుండి వెలువడే వెన్నెల జల్లుల వంటివి. ప్రతిఫలాపేక్ష లేని కరుణారసంతో పూర్ణంగా నిండినవి. దిక్కులన్నిటా కర్పూరపు ధూళి వలె వెదజల్లబడుచున్నవి. అమ్మా! అటువంటి నీ యొక్క చూపులు ఒక్క క్షణం నా పైన వర్షింపజేసి నన్ను తడుపు

04

ఆవిర్భవ క్షణమపీతకుచే పురస్తాత్

 అంబ జ్వరేణ మహతా మమ తాపితస్య .

 యేన త్వదంఘ్రిరుచిజాల-సుధాప్రవాహే

 మగ్నస్తదైవ తనుతాపమముం త్యజేయం

తాత్పర్యం

అమ్మా! నా శరీరము జ్వరము వలన చాలా తాపముతో ఉంది. నువ్వు ఒక్క క్షణమైనా నా ముందు కనబడి నీ పాదాలనుండి జాలువారే అమృత సముద్రాన్ని నా పైనుండి ప్రవహింపజేయుము. నేను ఆ ప్రవాహంలో మునకలువేసి నా శరీరములో ఉన్న తాపమును పోగొట్టుకొంటాను.

05

నానావిధైర్నలిన-జాతలిపిప్రకౢప్తైః

 ఆనీతమూర్ఛమధికం క్షుభితైర్జ్వరాద్యైః .

 ఆశ్వాసయ క్షణమపీతకుచే కరాగ్ర-

 క్రీడాకనత్కనకహల్లకసౌరభేణ

తాత్పర్యం

అనేక రకాలయిన పద్మ దళాలతో చికిత్స ఉన్నప్పటికీ నా మతిమరుపుతో పాటు నా జ్వరం పెరుగుతున్నది, ఓ అపీత కుచాంబా ! నీ చేతిలో ఆడుతున్న ఆ బంగారు తామరసౌరభాన్ని నాకు అనుగ్రహిస్తూ ఒక్క క్షణం నాకు భరోసా ఇవ్వు. ఆశ్వాసించు.

06

కంఠే విషం విషముచో భుజగాః కపర్దే

 పార్శ్వే చ భూతపతయః ప్రమథాశ్చ భీమాః .

 శోణాచలేశముపసృత్య భజేత కో వా

 న స్యాత్తవాంబ సవిధే యది సన్నిధానం

తాత్పర్యం

ఓ అపీత కుచాంబా ! నీ భర్త శివుని గొంతులో విషం; జుట్టులో విషం-వెలువడే సర్పాలు; పక్కపక్కనే భయంకరమైన భయంకరమయిన భూతాలు. నువ్వు గనుక అతని పక్కన లేకపోతే ఆ అరుణాచల ప్రభువును ఎవరు ఆరాధిస్తారు? ”

07

శక్తిర్జగజ్జననపాలన-భంజనేషు

 భోగేషు దివ్యమహిషీ తరుణేందుమౌలేః .

 సిద్ధిఃకరప్రణయినీ తవ సన్నిధానం

 యన్నాసి తస్య తదపీతకుచే న జానే

తాత్పర్యం

ఓ అపీత కుచాంబా ! సృష్టి, రక్షణ మరియు విధ్వంసానికి కారణమయిన శక్తిదాయినీ! చంద్రుని తలపై ధరించిన శివుని యొక్క గొప్పరాణీ! కోరిన కోరికలు ప్రేమతో నెరవేర్చు నీ యొక్క గొప్ప దయకు మించి- నాకు ఇంకా ఏమీ తెలియదు

08

త్వం సాక్షిణీ ప్రళయ భైరవతాండవానాం

త్వం శేషిణీ సహరిధాతృ చరాచరాణాం .

త్వం మోచినీ సకల సంసృతి జాలకానాం

త్వాం బ్రహ్మసంవిదమపీతకుచే నమామి

తాత్పర్యం

ఓ అపీత కుచాంబా! శివుడి విధ్వంస నృత్యానికి నువ్వు సాక్షి. సృష్టి వినాశనంలో విష్ణువు, బ్రహ్మ మరియు ఇతరుల అంతర్థానం తరువాతకూడా మిగిలి ఉన్నదానివి. నువ్వు అనేక రూపాల్లో మోక్షాన్ని అందిస్తావు. నువ్వు బ్రహ్మజ్ఞాన స్వరూపిణివి.


October 9, 2023

బ్రహ్మచారిణి

బ్రహ్మచారిణి ( గాయత్రి )

దధానా కరపద్మాభ్యాం అక్షమలా కమండలః | 

దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||




'బ్రహ్మచారిణి' యనగా తపమాచరించు తల్లి. బ్రహ్మమునందు చరించునది.కుడి చేతియందు జపమాలను, ఎడమచేతియందు కమండలువును ధరించును. పరమేశ్వరుని పతిగా బడయుటకు తీవ్రమైన తపమొనర్చి ఉమ యని ప్రసిద్ధి వహించెను. ఈ దేవి స్వరూపము జ్యోతిర్మయము. మిక్కిలి శుభంకరము. భక్తులకును, సిద్ధులకును అనంత ఫలప్రథము. బ్రహ్మచారిణీ దేవి కృపవలన ఉపాసకులకు నిశ్చలమగు దీక్ష, సర్వత్ర సిద్ధి, విజయము ప్రాప్తించును.

నైవేద్యం : పులిహోర

శైలపుత్రి

 దసరా నవరాత్రులలో అమ్మవారి అవతారాలు, అమ్మకు పెట్టవలసిన నైవేద్యాలు, శ్లోకాలు మనం తెలుసుకుందాం…. ….   

ఆశ్వయుజ శుద్ద పాడ్యమి నుండి శుద్ధ దశమి వరకు దేవీ నవరాత్రులలో రోజుకొక దుర్గా రూపమును ఉపాసించాలి.



శైలపుత్రి (బాలా త్రిపుర సుందరి)

వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతశేఖరాం| 

వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ||


సతీదేవి యోగాగ్నిలో తనువును త్యజించి, పిదప పర్వతరాజైన హిమవంతుని యింట పుత్రికయై అవతరించినందున ఆమెకు శైలపుత్రి అను నామము. వృషభవాహనారూఢయైన ఈ మాతకు కుడిచేతిలో త్రిశూలము, ఎడమచేతిలో కమలము విరాజిల్లుచుండును. తలపై చంద్రవంకను ధరించియుండును. పార్వతి, హైమవతి అనునవియు ఆమె పేర్లే. శైలపుత్రి మహిమలు, శక్తులు అనంతములు. వాంఛితములను ప్రసాదించు తల్లి. .......  

నైవేద్యం : కట్టు పొంగలి

September 26, 2023

రాధాష్టకం

 రాధాష్టకం


నమస్తే శ్రియ రాధికాయై పరాయై

నమస్తే నమస్తే ముకున్ద ప్రియాయై ।

సదానంద రూపే ప్రసీద త్వమన్తః-

ప్రకాశే స్ఫురన్తి ముకున్దేన సార్ధమ్ ॥ 


స్వవాసోప హారం యశోదా సుతం వా

స్వదధ్యాది చౌరం సమారాధ యంతీం ।

స్వదామ్నోదరే యా బన్ధాశు నీవ్యా

ప్రపద్యే ను దామోదర ప్రేయసీం తామ్ ॥


దురారాధ్య మారాధ్యా కృష్ణం వశే తం

మహా ప్రేమ పూరేణ రాధాభి ధాభూః ।

స్వయం నామకీర్త్యా హరౌ ప్రేమ యచ్ఛత్

ప్రపన్నాయ మే కృష్ణరూపే సమక్షమ్ ॥


ముకుంద స్త్వయా ప్రేమ దోరేణ బద్ధః

పతంగో యథా త్వా మనుభ్రామ్య మాణః ।

ఉప క్రీడయన్ హార్దమేవాను గచ్ఛన్

కృపావర్తతే కారయాతో మయీష్టిమ్ ॥


వ్రజన్తీం స్వవృన్దావనే నిత్యకాలం

ముకున్దేన్ సాకం విధా యఙ్కమాలమ్ ।

సమామోక్ష్య మానాను కంపా కటాక్షైః

శ్రియం చిన్తయే సచ్చిదానన్ద రూపామ్ ॥ 


ముకుందాను రాగేణ రోమాఞ్చితాంగై-

రహం వేప్యమానం తను స్వేద బిన్దుమ్ ।

మహా హార్ద వృష్ట్యా కృపా పాంగ దృష్ట్యా

సమాలోక యంతీం కదా మాం విశక్తం ॥ 


యద్ అఙ్కావలోకే మహా లాలసౌఘం

ముకున్దః కరోతి స్వయం ధ్యేయ పాదః ।

పదం రాధికే తే సదా దర్శయన్తర్-

హృదిస్థం నమన్తం కిరద్రోచిశం మామ్ ॥ 


సదా రాధికానాం జిహ్వాగ్రతః స్యాత్

సదా రాధికా రూప మక్ష్యాగ్ర ఆస్తామ్ ।

శ్రుతౌ రాధికా కీర్తిరన్తః స్వభావే

గుణ రాధికాయః శ్రియా ఏతద్ ఈహే ॥


ఇదం త్వష్టకం రాధికాయః ప్రియాయాః

పఠేయుః సదైవం హి దామోదరస్య ।

సుతిష్ఠన్తి వృన్దావనే కృష్ణధామ్ని

సఖీమూర్తయో యుగ్మ సేవానుకూలాః ॥


ఇతి శ్రీ నింబార్కాచార్య విరచితం రాధాష్టకం సంపూర్ణమ్ ।

July 30, 2022

శ్రీ లలితా సహస్ర నామావళి

శ్రీ లలితా సహస్ర నామావళి


॥ ధ్యానమ్ ॥
సిందూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌలిస్ఫురత్
తారానాయకశేఖరాం స్మితముఖీమాపీనవక్షోరుహామ్ ।
పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం
సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరామంబికామ్ ॥

అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపామ్ ।
అణిమాదిభిరావృతాం మయూఖైరహమిత్యేవ విభావయే భవానీమ్ ॥

ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం
హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమపద్మాం వరాంగీమ్ ।
సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం
శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీమ్ ॥

సకుంకుమవిలేపనామలికచుంబికస్తూరికాం
సమందహసితేక్షణాం సశరచాపపాశాంకుశామ్ ।
అశేషజనమోహినీమరుణమాల్యభూషాంబరాం
జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికామ్ ॥


॥అథ శ్రీ లలితా సహస్రనామావలీ ॥
ఓం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః ।
ఓం శ్రీమహారాజ్ఞై నమః ।
ఓం శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః ।
ఓం చిదగ్నికుండ సంభూతాయై నమః ।
ఓం దేవకార్య సముద్యతాయై నమః ।
ఓం ఓం ఉద్యద్భాను సహస్రాభాయై నమః ।
ఓం చతుర్బాహు సమన్వితాయై నమః ।
ఓం రాగస్వరూప పాశాఢ్యాయై నమః ।
ఓం క్రోధాకారాంకుశోజ్జ్వలాయై నమః ।
ఓం మనోరూపేక్షు కోదండాయై నమః । 10
ఓం పంచతన్మాత్ర సాయకాయై నమః ।
ఓం నిజారుణ ప్రభాపూర మజ్జత్బ్రహ్మాండ మండలాయై నమః ।
ఓం చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచాయై నమః ।
ఓం కురువింద మణిశ్రేణీ కనత్కోటీర మండితాయై నమః ।
ఓం ఓం అష్టమీచంద్ర విభ్రాజదళికస్థల శోభితాయై నమః ।
ఓం ముఖచంద్ర కలంకాభ మృగనాభి విశేషకాయై నమః ।
ఓం వదన స్వర మాంగళ్య గృహతోరణ చిల్లికాయై నమః ।
ఓం వక్త్రలక్ష్మీ పరీవాహచలన్మీనాభలోచనాయై నమః ।
ఓం నవ చంపక పుష్పాభ నాసాదండ విరాజితాయై నమః ।
ఓం తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురాయై నమః । 20

ఓం కదంబమంజరీ క్లప్తకర్ణపూర మనోహరాయై నమః ।
ఓం తాటంక యుగళీభూత తపనోడుప మండలాయై నమః ।
ఓం పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలభువే నమః ।
ఓం నవవిద్రుమబింబశ్రీ న్యక్కారి రదనచ్ఛదాయై నమః ।
ఓం శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వలాయై నమః ।
ఓం కర్పూరవీటికామోద సమాకర్షి దిగంతరాయై నమః ।
ఓం నిజసల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్ఛప్యై నమః ।
ఓం మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసాయై నమః ।
ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయై నమః ।
ఓం కామేశబద్ధ మాంగళ్యసూత్ర శోభిత కంధరాయై నమః । 30
ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయై నమః ।
ఓం రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్వితాయై నమః ।
ఓం కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతి ఫణస్తన్యై నమః ।
ఓం నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయ్యై నమః ।
ఓం లక్ష్యరోమ లతాధార తాసమున్నేయ మధ్యమాయై నమః ।
ఓం స్తనభార దళన్మధ్య పట్టబంధ వళిత్రయాయై నమః ।
ఓం ఓం అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వ త్కటీతట్యై నమః ।
ఓం రత్న కింకిణి కారమ్య రశనాదా మభూషితాయై నమః ।
ఓం కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్వితాయై నమః ।
ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః । 40
ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణా భజంఘికాయై నమః ।
ఓం గూఢగూల్ఫాయై నమః ।
ఓం కూర్మ పృష్ఠజయిష్ణుప్రపదాన్వితాయై నమః ।
ఓం నఖదీధితిసంఛన్ననమజ్జనతమోగుణాయై నమః ।
ఓం పదద్వయప్రభాజాలపరాకృతసరోరుహాయై నమః ।
ఓం శింజానమణిమంజీరమండితశ్రీపదాంబుజాయై నమః ।
ఓం మరాలీమందగమనాయై నమః ।
ఓం మహాలావణ్యశేవధయే నమః ।
ఓం సర్వారుణాయై నమః ।
ఓం అనవద్యాంగ్యై నమః । 50
ఓం సర్వాభరణభూషితాయై నమః ।
ఓం శివకామేశ్వరాంకస్థాయై నమః ।
ఓం శివాయై నమః ।
ఓం స్వాధీనవల్లభాయై నమః ।
ఓం సుమేరుమధ్యశృంగస్థాయై నమః ।
ఓం శ్రీమన్నగరనాయికాయై నమః ।
ఓం చింతామణిగృహాంతస్థాయై నమః ।
ఓం పంచబ్రహ్మాసనస్థితాయై నమః ।
ఓం మహాపద్మాటవీసంస్థాయై నమః ।
ఓం కదంబవనవాసిన్యై నమః । 60
ఓం సుధాసాగరమధ్యస్థాయై నమః ।
ఓం కామాక్ష్యై నమః ।
ఓం కామదాయిన్యై నమః ।
ఓం దేవర్షిగణసంఘాతస్తూయమానాత్మవైభాయై నమః ।
ఓం భండాసురవధోద్యుక్తశక్తిసేనాసమన్వితాయై నమః ।
ఓం సంపత్కరీసమారూఢసిందురవ్రజసేవితాయై నమః ।
ఓం ఓం అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటికోటిభిరావృతాయై నమః ।
ఓం చక్రరాజరథారూఢసర్వాయుధపరిష్కృతాయై నమః ।
ఓం గేయచక్రరథారూఢమంత్రిణీపరిసేవితాయై నమః ।
ఓం కిరిచక్రరథారూఢదండనాథాపురస్కృతాయై నమః । 70
ఓం జ్వాలామాలినికాక్షిప్తవహ్నిప్రాకారమధ్యగాయై నమః ।
ఓం భండసైన్యవధోద్యుక్తశక్తివిక్రమహర్షితాయై నమః ।
ఓం నిత్యాపరాక్రమాటోపనిరీక్షణసముత్సుకాయై నమః ।
ఓం భండపుత్రవధోద్యుక్తబాలావిక్రమనందితాయై నమః ।
ఓం మంత్రిణ్యంబావిరచితవిషంగవధతోషితాయై నమః ।
ఓం విశుక్రప్రాణహరణవారాహీవీర్యనందితాయై నమః ।
ఓం కామేశ్వరముఖాలోకకల్పితశ్రీగణేశ్వరాయై నమః ।
ఓం మహాగణేశనిర్భిన్నవిఘ్నయంత్రప్రహర్షితాయై నమః ।
ఓం భండాసురేంద్రనిర్ముక్తశస్త్రప్రత్యస్త్రవర్షిణ్యై నమః ।
ఓం కరాంగులినఖోత్పన్ననారాయణదశాకృత్యై నమః । 80
ఓం మహాపాశుపతాస్త్రాగ్నినిర్దగ్ధాసురసైనికాయై నమః ।
ఓం కామేశ్వరాస్త్రనిర్దగ్ధసభాండాసురశూన్యకాయై నమః ।
ఓం బ్రహ్మోపేంద్రమహేంద్రాదిదేవసంస్తుతవైభవాయై నమః ।
ఓం హరనేత్రాగ్నిసందగ్ధకామసంజీవనౌషధ్యై నమః ।
ఓం శ్రీమద్భాగవ కూటైక స్వరూప  ముఖపంకజాయై నమః ।
ఓం కంఠాధః కటిపర్యంతమధ్యకూటస్వరూపిణ్యై నమః ।
ఓం శక్తికూటైకతాపన్నకట్యధోభాగధారిణ్యై నమః ।
ఓం ఓం మూలమంత్రాత్మికాయై నమః ।
ఓం మూలకూటత్రయకలేబరాయై నమః ।
ఓం కులామృతైకరసికాయై నమః । 90
ఓం కులసంకేతపాలిన్యై నమః ।
ఓం కులాంగనాయై నమః ।
ఓం కులాంతఃస్థాయై నమః ।
ఓం కౌలిన్యై నమః ।
ఓం కులయోగిన్యై నమః ।
ఓం అకులాయై నమః ।
ఓం సమయాంతస్థాయై నమః ।
ఓం సమయాచారతత్పరాయై నమః ।
ఓం మూలాధారైకనిలయాయై నమః ।
ఓం బ్రహ్మగ్రంథివిభేదిన్యై నమః । 100
ఓం మణిపూరాంతరుదితాయై నమః ।
ఓం విష్ణుగ్రంథివిభేదిన్యై నమః ।
ఓం ఆజ్ఞాచక్రాంతరాలస్థాయై నమః ।
ఓం రుద్రగ్రంథివిభేదిన్యై నమః ।
ఓం సహస్రారాంబుజారూఢాయై నమః ।
ఓం సుధాసారాభివర్షిణ్యై నమః ।
ఓం తటిల్లతాసమరుచ్యై నమః ।
ఓం షట్చక్రోపరిసంస్థితాయై నమః ।
ఓం మహాసక్త్యై నమః ।
ఓం ఓం కుండలిన్యై నమః । 110
ఓం బిసతంతుతనీయస్యై నమః ।
ఓం భవాన్యై నమః ।
ఓం భావనాగమ్యాయై నమః । 113
ఓం భవారణ్యకుఠారికాయై నమః ।
ఓం భద్రప్రియాయై నమః ।
ఓం భద్రమూర్త్యై నమః ।
ఓం భక్తసౌభాగ్యదాయిన్యై నమః ।
ఓం భక్తిప్రియాయై నమః ।
ఓం భక్తిగమ్యాయై నమః ।
ఓం భక్తివశ్యాయై నమః । 120
ఓం భయాపహాయై నమః ।
ఓం శాంభవ్యై నమః ।
ఓం శారదారాధ్యాయై నమః ।
ఓం శర్వాణ్యై నమః । 124
ఓం శర్మదాయిన్యై నమః ।
ఓం శాంకర్యై నమః । 126
ఓం శ్రీకర్యై నమః । 127
ఓం సాధ్వ్యై నమః । 128
ఓం శరచ్చంద్రనిభాననాయై నమః । 129
ఓం శాతోదర్యై నమః । 130
ఓం శాంతిమత్యై నమః । 131
ఓం ఓం నిరాధారాయై నమః । 132
ఓం నిరంజనాయై నమః । 133
ఓం నిర్లేపాయై నమః । 134
ఓం నిర్మలాయై నమః । 135
ఓం నిత్యాయై నమః । 136
ఓం నిరాకారాయై నమః । 137
ఓం నిరాకులాయై నమః । 138
ఓం నిర్గుణాయై నమః ।
ఓం నిష్కలాయై నమః । 140
ఓం శాంతాయై నమః । 141
ఓం నిష్కామాయై నమః । 142
ఓం నిరుపప్లవాయై నమః । 143
ఓం నిత్యముక్తాయై నమః । 144
ఓం నిర్వికారాయై నమః । 145
ఓం నిష్ప్రపంచాయై నమః । 146
ఓం నిరాశ్రయాయై నమః । 147
ఓం నిత్యశుద్ధాయై నమః । 148
ఓం నిత్యబుద్ధాయై నమః । 149
ఓం నిరవద్యాయై నమః । 150
ఓం నిరంతరాయై నమః ।
ఓం నిష్కారణాయై నమః ।
ఓం నిష్కలంకాయై నమః ।
ఓం ఓం నిరుపాధయే నమః ।
ఓం నిరీశ్వరాయై నమః ।
ఓం నీరాగయై నమః ।
ఓం రాగమథన్యై నమః ।
ఓం నిర్మదాయై నమః ।
ఓం మదనాశిన్యై నమః ।
ఓం నిశ్చింతాయై నమః । 160
ఓం నిరహంకారాయై నమః ।
ఓం నిర్మోహాయై నమః ।
ఓం మోహనాశిన్యై నమః ।
ఓం నిర్మమాయై నమః ।
ఓం మమతాహంత్ర్యై నమః ।
ఓం నిష్పాపాయై నమః ।
ఓం పాపనాశిన్యై నమః ।
ఓం నిష్క్రోధాయై నమః ।
ఓం క్రోధశమన్యై నమః ।
ఓం నిర్లోభాయై నమః । 170
ఓం లోభనాశిన్యై నమః ।
ఓం నిఃసంశయాయై నమః ।
ఓం సంశయఘ్న్యై నమః ।
ఓం నిర్భవాయై నమః ।
ఓం భవనాశిన్యై నమః ।
ఓం ఓం నిర్వికల్పాయై నమః ।
ఓం నిరాబాధాయై నమః ।
ఓం నిర్భేదాయై నమః ।
ఓం భేదనాశిన్యై నమః ।
ఓం నిర్నాశాయై నమః । 180
ఓం మృత్యుమథన్యై నమః ।
ఓం నిష్క్రియాయై నమః ।
ఓం నిష్పరిగ్రహాయై నమః ।
ఓం నిస్తులాయై నమః ।
ఓం నీలచికురాయై నమః ।
ఓం నిరపాయాయై నమః ।
ఓం నిరత్యయాయై నమః ।
ఓం దుర్లభాయై నమః ।
ఓం దుర్గమాయై నమః ।
ఓం దుర్గాయై నమః । 190
ఓం దుఃఖహంత్ర్యై నమః ।
ఓం సుఖప్రదాయై నమః ।
ఓం దుష్టదూరాయై నమః ।
ఓం దురాచారశమన్యై నమః ।
ఓం దోషవర్జితాయై నమః ।
ఓం సర్వజ్ఞాయై నమః ।
ఓం సాంద్రకరుణాయై నమః ।
ఓం ఓం సమానాధికవర్జితాయై నమః ।
ఓం సర్వశక్తిమయ్యై నమః ।
ఓం సర్వమంగలాయై నమః । 200
ఓం సద్గతిప్రదాయై నమః ।
ఓం సర్వేశ్వయై నమః ।
ఓం సర్వమయ్యై నమః ।
ఓం సర్వమంత్రస్వరూపిణ్యై నమః ।
ఓం సర్వయంత్రాత్మికాయై నమః ।
ఓం సర్వతంత్రరూపాయై నమః ।
ఓం మనోన్మన్యై నమః ।
ఓం మాహేశ్వర్యై నమః ।
ఓం మహాదేవ్యై నమః ।
ఓం మహాలక్ష్మ్యై నమః । 210
ఓం మృడప్రియాయై నమః ।
ఓం మహారూపాయై నమః ।
ఓం మహాపూజ్యాయై నమః ।
ఓం మహాపాతకనాశిన్యై నమః ।
ఓం మహామాయాయై నమః ।
ఓం మహాసత్వాయై నమః ।
ఓం మహాశక్త్యై నమః ।
ఓం మహారత్యై నమః ।
ఓం మహాభోగాయై నమః ।
ఓం ఓం మహైశ్వర్యాయై నమః । 220
ఓం మహావీర్యాయై నమః ।
ఓం మహాబలాయై నమః ।
ఓం మహాబుద్ధ్యై నమః ।
ఓం మహాసిద్ధ్యై నమః ।
ఓం మహాయోగేశ్వరేశ్వర్యై నమః ।
ఓం మహాతంత్రాయై నమః ।
ఓం మహామంత్రాయై నమః ।
ఓం మహాయంత్రాయై నమః ।
ఓం మహాసనాయై నమః ।
ఓం మహాయాగక్రమారాధ్యాయై నమః । 230
ఓం మహాభైరవపూజితాయై నమః ।
ఓం మహేశ్వరమహాకల్పమహా తాండవసాక్షిణ్యై నమః ।
ఓం మహాకామేశమహిష్యై నమః ।
ఓం మహాత్రిపురసుందర్యై నమః ।
ఓం చతుఃషష్ట్యుపచారాఢ్యాయై నమః ।
ఓం చతుఃషష్టికలామయ్యై నమః ।
ఓం మహాచతుఃషష్టికోటి యోగినీగణసేవితాయై నమః ।
ఓం మనువిద్యాయై నమః ।
ఓం చంద్రవిద్యాయై నమః ।
ఓం ఓం చంద్రమండలమధ్యగాయై నమః । 240
ఓం చారురూపాయై నమః ।
ఓం చారుహాసాయై నమః ।
ఓం చారుచంద్రకలాధరాయై నమః ।
ఓం చరాచరజగన్నాథాయై నమః ।
ఓం చక్రరాజనికేతనాయై నమః ।
ఓం పార్వత్యై నమః ।
ఓం పద్మనయనాయై నమః ।
ఓం పద్మరాగసమప్రభాయై నమః ।
ఓం పంచప్రేతాసనాసీనాయై నమః ।
ఓం పంచబ్రహ్మస్పరూపిణ్యై నమః । 250
ఓం చిన్మయ్యై నమః ।
ఓం పరమానందాయై నమః ।
ఓం విజ్ఞానఘనరూపిణ్యై నమః ।
ఓం ధ్యానధ్యాతృధ్యేయరూపాయై నమః ।
ఓం ర్ధ్మాధర్మవివర్జితాయై నమః ।
ఓం విశ్వరూపాయై నమః ।
ఓం జాగరిణ్యై నమః ।
ఓం స్వపత్న్యై నమః ।
ఓం తైజసాత్మికాయై నమః ।
ఓం సుప్తాయై నమః । 260
ఓం ప్రాజ్ఞాత్మికాయై నమః ।
ఓం ఓం తుర్యాయై నమః ।
ఓం సర్వావస్థావివర్జితాయై నమః ।
ఓం సృష్ఠికర్త్ర్యై నమః ।
ఓం బ్రహ్మరూపాయై నమః ।
ఓం గోప్త్ర్యై నమః ।
ఓం గోవిందరూపిణ్యై నమః ।
ఓం సంహారిణ్యై నమః ।
ఓం రుద్రరూపాయై నమః ।
ఓం తిరోధానకర్యై నమః । 270
ఓం ఈశ్వర్యై నమః ।
ఓం సదాశివాయై నమః ।
ఓం అనుగ్రహదాయై నమః ।
ఓం పంచకృత్యపరాయణాయై నమః ।
ఓం భానుమండలమధ్యస్థాయై నమః ।
ఓం భైరవ్యై నమః ।
ఓం భగమాలిన్యై నమః ।
ఓం పద్మాసనాయై నమః ।
ఓం భగవత్యై నమః ।
ఓం పద్మనాభసహోదర్యై నమః । 280
ఓం ఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావల్యై నమః ।
ఓం సహస్రశీర్షవదనాయై నమః ।
ఓం ఓం సహస్రాక్ష్యై నమః ।
ఓం సహస్రపదే నమః ।
ఓం ఆబ్రహ్మకీటజనన్యై నమః ।
ఓం వర్ణాశ్రమవిధాయిన్యై నమః ।
ఓం నిజాజ్ఞారూపనిగమాయై నమః ।
ఓం పుణ్యాపుణ్యఫలప్రదాయై నమః ।
ఓం శ్రుతిసీమంతసిందూరీకృత పాదాబ్జధూలికాయై నమః ।
ఓం సకలాగమసందోహశుక్తిసంపుటమౌక్తికాయై నమః । 290
ఓం పురుషార్థప్రదాయై నమః ।
ఓం పూర్ణాయై నమః ।
ఓం భోగిన్యై నమః ।
ఓం భువనేశ్వర్యై నమః ।
ఓం అంబికాయై నమః ।
ఓం అనాదినిధనాయై నమః ।
ఓం హరిబ్రహ్మేంద్రసేవితాయై నమః ।
ఓం నారాయణ్యై నమః ।
ఓం నాదరూపాయై నమః ।
ఓం నామరూపవివర్జితాయై నమః । 300
ఓం హ్రీంకార్యై నమః ।
ఓం హ్రీమత్యై నమః ।
ఓం ఓం హృద్యాయై నమః ।
ఓం హేయోపాదేయవర్జితాయై నమః ।
ఓం రాజరాజార్చితాయై నమః ।
ఓం రాజ్ఞై నమః ।
ఓం రమ్యాయై నమః ।
ఓం రాజీవలోచనాయై నమః ।
ఓం రంజన్యై నమః ।
ఓం రమణ్యై నమః । 310
ఓం రస్యాయై నమః ।
ఓం రణత్కింకిణిమేఖలాయై నమః ।
ఓం రమాయై నమః ।
ఓం రాకేందువదనాయై నమః ।
ఓం రతిరూపాయై నమః ।
ఓం రతిప్రియాయై నమః ।
ఓం రక్షాకర్యై నమః ।
ఓం రాక్షసఘ్న్యై నమః ।
ఓం రామాయై నమః ।
ఓం రమణలంపటాయై నమః । 320
ఓం కామ్యాయై నమః ।
ఓం కామకలారూపాయై నమః ।
ఓం కదంబకుసుమప్రియాయై నమః ।
ఓం కల్యాణ్యై నమః ।
ఓం ఓం జగతీకందాయై నమః ।
ఓం కరుణారససాగరాయై నమః ।
ఓం కలావత్యై నమః ।
ఓం కలాలాపాయై నమః ।
ఓం కాంతాయై నమః ।
ఓం కాదంబరీప్రియాయై నమః । 330
ఓం వరదాయై నమః ।
ఓం వామనయనాయై నమః ।
ఓం వారుణీమదవిహ్వలాయై నమః ।
ఓం విశ్వాధికాయై నమః ।
ఓం వేదవేద్యాయై నమః ।
ఓం వింధ్యాచలనివాసిన్యై నమః ।
ఓం విధాత్ర్యై నమః ।
ఓం వేదజనన్యై నమః ।
ఓం విష్ణుమాయాయై నమః ।
ఓం విలాసిన్యై నమః । 340
ఓం క్షేత్రస్వరూపాయై నమః ।
ఓం క్షేత్రేశ్యై నమః ।
ఓం క్షేత్రక్షేత్రజ్ఞపాలిన్యై నమః ।
ఓం క్షయవృద్ధివినిర్ముక్తాయై నమః ।
ఓం క్షేత్రపాలసమర్చితాయై నమః ।
ఓం విజయాయై నమః ।
ఓం ఓం విమలాయై నమః ।
ఓం వంద్యాయై నమః ।
ఓం వందారుజనవత్సలాయై నమః ।
ఓం వాగ్వాదిన్యై నమః । 350
ఓం వామకేశ్యై నమః ।
ఓం వహ్నిమండలవాసిన్యై నమః ।
ఓం భక్తిమత్కల్పలతికాయై నమః ।
ఓం పశుపాశవిమోచిన్యై నమః ।
ఓం సంహృతాశేషపాషండాయై నమః ।
ఓం సదాచారప్రవర్తికాయై నమః ।
ఓం తాపత్రయాగ్నిసంతప్తసమాహ్లాదనచంద్రికాయై నమః ।
ఓం తరుణ్యై నమః ।
ఓం తాపసారాధ్యాయై నమః ।
ఓం తనుమధ్యాయై నమః । 360
ఓం తమోపహాయై నమః ।
ఓం చిత్యై నమః ।
ఓం తత్పదలక్ష్యార్థాయై నమః ।
ఓం చిదేకరసరూపిణ్యై నమః ।
ఓం స్వాత్మానందలవీభూత-బ్రహ్మాద్యానందసంతత్యై నమః ।
ఓం పరాయై నమః ।
ఓం ఓం ప్రత్యక్ చితీరూపాయై నమః ।
ఓం పశ్యంత్యై నమః ।
ఓం పరదేవతాయై నమః ।
ఓం మధ్యమాయై నమః । 370
ఓం వైఖరీరూపాయై నమః ।
ఓం భక్తమానసహంసికాయై నమః ।
ఓం కామేశ్వరప్రాణనాడ్యై నమః ।
ఓం కృతజ్ఞాయై నమః ।
ఓం కామపూజితాయై నమః ।
ఓం శ్రృంగారరససంపూర్ణాయై నమః ।
ఓం జయాయై నమః ।
ఓం జాలంధరస్థితాయై నమః ।
ఓం ఓడ్యాణపీఠనిలయాయై నమః ।
ఓం బిందుమండలవాసిన్యై నమః । 380
ఓం రహోయాగక్రమారాధ్యాయై నమః ।
ఓం రహస్తర్పణతర్పితాయై నమః ।
ఓం సద్యః ప్రసాదిన్యై నమః ।
ఓం విశ్వసాక్షిణ్యై నమః ।
ఓం సాక్షివర్జితాయై నమః ।
ఓం షడంగదేవతాయుక్తాయై నమః ।
ఓం షాడ్గుణ్యపరిపూరితాయై నమః ।
ఓం నిత్యక్లిన్నాయై నమః ।
ఓం ఓం నిరుపమాయై నమః ।
ఓం నిర్వాణసుఖదాయిన్యై నమః । 390
ఓం నిత్యాషోడశికారూపాయై నమః ।
ఓం శ్రీకంఠార్ధశరీరిణ్యై నమః ।
ఓం ప్రభావత్యై నమః ।
ఓం ప్రభారూపాయై నమః ।
ఓం ప్రసిద్ధాయై నమః ।
ఓం పరమేశ్వర్యై నమః ।
ఓం మూలప్రకృత్యై నమః ।
ఓం అవ్యక్తాయై నమః ।
ఓం వ్క్తావ్యక్తస్వరూపిణ్యై నమః ।
ఓం వ్యాపిన్యై నమః । 400
ఓం వివిధాకారాయై నమః ।
ఓం విద్యావిద్యాస్వరూపిణ్యై నమః ।
ఓం మహాకామేశనయనకుముదాహ్లాదకౌముద్యై నమః ।
ఓం భక్తాహార్దతమోభేదభానుమద్భానుసంతత్యై నమః ।
ఓం శివదూత్యై నమః ।
ఓం శివారాధ్యాయై నమః ।
ఓం శివమూర్త్యై నమః ।
ఓం శివంకర్యై నమః ।
ఓం ఓం శివప్రియాయై నమః ।
ఓం శివపరాయై నమః । 410
ఓం శిష్టేష్టాయై నమః ।
ఓం శిష్టపూజితాయై నమః ।
ఓం అప్రమేయాయై నమః ।
ఓం స్వప్రకాశాయై నమః ।
ఓం మనోవాచామగోచరాయై నమః ।
ఓం చిచ్ఛక్త్యై నమః ।
ఓం చేతనారూపాయై నమః ।
ఓం జడశక్త్యై నమః ।
ఓం జడాత్మికాయై నమః ।
ఓం గాయత్ర్యై నమః । 420
ఓం వ్యాహృత్యై నమః ।
ఓం సంధ్యాయై నమః ।
ఓం ద్విజవృందనిషేవితాయై నమః ।
ఓం తత్త్వాసనాయై నమః ।
ఓం తస్మై నమః ।
ఓం తుభ్యం నమః ।
ఓం అయ్యై నమః ।
ఓం పంచకోశాంతరస్థితాయై నమః ।
ఓం నిఃసీమమహిమ్నే నమః ।
ఓం నిత్యయౌవనాయై నమః । 430
ఓం ఓం మదశాలిన్యై నమః ।
ఓం మదఘూర్ణితరక్తాక్ష్యై నమః ।
ఓం మదపాటలగండభువే నమః ।
ఓం చందనద్రవదిగ్ధాంగ్యై నమః ।
ఓం చాంపేయకుసుమప్రియాయై నమః ।
ఓం కుశలాయై నమః ।
ఓం కోమలాకారాయై నమః ।
ఓం కురుకుళ్ళాయై నమః ।
ఓం కుళేశ్వర్యై నమః ।
ఓం కులకుండాలయాయై నమః । 440
ఓం  కౌళమార్గ తత్పర సేవితాయై నమః ।
ఓం కుమారగణనాథాంబాయై నమః ।
ఓం తుష్ట్యై నమః ।
ఓం పుష్ట్యై నమః ।
ఓం మత్యై నమః ।
ఓం ధృత్యై నమః ।
ఓం శాంత్యై నమః ।
ఓం స్వస్తిమత్యై నమః ।
ఓం కాంత్యై నమః ।
ఓం నందిన్యై నమః । 450
ఓం విఘ్ననాశిన్యై నమః ।
ఓం తేజోవత్యై నమః ।
ఓం ఓం త్రినయనాయై నమః ।
ఓం లోలాక్షీకామరూపిణ్యై నమః ।
ఓం మాలిన్యై నమః ।
ఓం హంసిన్యై నమః ।
ఓం మాత్రే నమః ।
ఓం మలయాచలవాసిన్యై నమః ।
ఓం సుముఖ్యై నమః ।
ఓం నళిన్యై నమః । 460
ఓం సుభ్రువే నమః ।
ఓం శోభనాయై నమః ।
ఓం సురనాయికాయై నమః ।
ఓం కాలకంఠ్యై నమః ।
ఓం కాంతిమత్యై నమః ।
ఓం క్షోభిణ్యై నమః ।
ఓం సూక్ష్మరూపిణ్యై నమః ।
ఓం వజ్రేశ్వర్యై నమః ।
ఓం వామదేవ్యై నమః ।
ఓం వయోఽవస్థావివర్జితాయై నమః । 470
ఓం సిద్ధేశ్వర్యై నమః ।
ఓం సిద్ధవిద్యాయై నమః ।
ఓం సిద్ధమాత్రే నమః ।
ఓం యశస్విన్యై నమః ।
ఓం ఓం విశుద్ధిచక్రనిలయాయై నమః ।
ఓం ఆరక్తవర్ణాయై నమః ।
ఓం త్రిలోచనాయై నమః ।
ఓం ఖట్వాంగాదిప్రహరణాయై నమః ।
ఓం వదనైకసమన్వితాయై నమః ।
ఓం పాయసాన్నప్రియాయై నమః । 480
ఓం త్వక్స్థాయై నమః ।
ఓం పశులోకభయంకర్యై నమః ।
ఓం అమృతాదిమహాశక్తిసంవృతాయై నమః ।
ఓం డాకినీశ్వర్యై నమః ।
ఓం అనాహతాబ్జనిలయాయై నమః ।
ఓం శ్యామాభాయై నమః ।
ఓం వదనద్వయాయై నమః ।
ఓం దంష్ట్రోజ్వలాయై నమః ।
ఓం అక్షమాలాదిధరాయై నమః ।
ఓం రుధిరసంస్థితాయై నమః । 490
ఓం కాళరాత్ర్యాదిశక్త్యౌఘవృతాయై నమః ।
ఓం స్నిగ్ధౌదనప్రియాయై నమః ।
ఓం మహావీరేంద్రవరదాయై నమః ।
ఓం రాకిణ్యంబాస్వరూపిణ్యై నమః ।
ఓం మణిపూరాబ్జనిలయాయై నమః ।
ఓం ఓం వదనత్రయసంయుతాయై నమః ।
ఓం వజ్రాధికాయుధోపేతాయై నమః ।
ఓం డామర్యాదిభిరావృతాయై నమః ।
ఓం రక్తవర్ణాయై నమః ।
ఓం మాంసనిష్ఠాయై నమః । 500

501. 

గుడాన్నప్రీతమానసాయై నమః ।
ఓం సమస్తభక్తసుఖదాయై నమః ।
ఓం లాకిన్యంబాస్వరూపిణ్యై నమః ।
ఓం స్వాధిష్టానాంబుజగతాయై నమః ।
ఓం చతుర్వక్త్రమనోహరాయై నమః ।
ఓం శూలాద్యాయుధసంపన్నాయై నమః ।
ఓం పీతవర్ణాయై నమః ।
ఓం అతిగర్వితాయై నమః ।
ఓం మేదోనిష్ఠాయై నమః ।
ఓం మధుప్రీతాయై నమః । 510
ఓం బందిన్యాదిసమన్వితాయై నమః ।
ఓం దధ్యన్నాసక్తహృదయాయై నమః ।
ఓం కాకినీరూపధారిణ్యై నమః ।
ఓం మూలాధారాంబుజారూఢాయై నమః ।
ఓం పంచవక్త్రాయై నమః ।
ఓం అస్థిసంస్థితాయై నమః ।
ఓం అంకుశాదిప్రహరణాయై నమః ।
ఓం ఓం వరదాది నిషేవితాయై నమః ।
ఓం ముద్గౌదనాసక్తచిత్తాయై నమః ।
ఓం సాకిన్యంబాస్వరూపిణ్యై నమః । 520
ఓం ఆజ్ఞాచక్రాబ్జనిలాయై నమః ।
ఓం శుక్లవర్ణాయై నమః ।
ఓం షడాననాయై నమః ।
ఓం మజ్జాసంస్థాయై నమః ।
ఓం హంసవతీముఖ్యశక్తిసమన్వితాయై నమః ।
ఓం హరిద్రాన్నైకరసికాయై నమః ।
ఓం హాకినీరూపధారిణ్యై నమః ।
ఓం సహస్రదలపద్మస్థాయై నమః ।
ఓం సర్వవర్ణోపశోభితాయై నమః ।
ఓం సర్వాయుధధరాయై నమః । 530
ఓం శుక్లసంస్థితాయై నమః ।
ఓం సర్వతోముఖ్యై నమః ।
ఓం సర్వౌదనప్రీతచిత్తాయై నమః ।
ఓం యాకిన్యంబాస్వరూపిణ్యై నమః ।
ఓం స్వాహాయై నమః ।
ఓం స్వధాయై నమః ।
ఓం అమత్యై నమః ।
ఓం మేధాయై నమః ।
ఓం ఓం శ్రుత్యై నమః ।
ఓం స్మృత్యై నమః । 540
ఓం అనుత్తమాయై నమః ।
ఓం పుణ్యకీర్త్యై నమః ।
ఓం పుణ్యలభ్యాయై నమః ।
ఓం పుణ్యశ్రవణకీర్తనాయై నమః ।
ఓం పులోమజార్చితాయై నమః ।
ఓం బంధమోచన్యై నమః ।
ఓం బర్బరాలకాయై నమః ।
ఓం విమర్శరూపిణ్యై నమః ।
ఓం విద్యాయై నమః ।
ఓం వియదాదిజగత్ప్రసువే నమః । 550
ఓం సర్వ వ్యాధిప్రశమన్యై నమః ।
ఓం సర్వ మృత్యునివారిణ్యై నమః ।
ఓం అగ్రగణ్యాయై నమః ।
ఓం అచింత్యరూపాయై నమః ।
ఓం కలికల్మషనాశిన్యై నమః ।
ఓం కాత్యాయన్యై నమః ।
ఓం కాలహంత్ర్యై నమః ।
ఓం కమలాక్షనిషేవితాయై నమః ।
ఓం తాంబూలపూరితముఖ్యై నమః ।
ఓం దాడిమీకుసుమప్రభాయై నమః । 560
ఓం ఓం మృగాక్ష్యై నమః ।
ఓం మోహిన్యై నమః ।
ఓం ముఖ్యాయై నమః ।
ఓం మృడాన్యై నమః ।
ఓం మిత్రరూపిణ్యై నమః ।
ఓం నిత్యతృప్తాయై నమః ।
ఓం భక్తనిధయే నమః ।
ఓం నియంత్ర్యై నమః ।
ఓం నిఖిలేశ్వర్యై నమః ।
ఓం మైత్ర్యాదివాసనాలభ్యాయై నమః । 570
ఓం మహాప్రలయసాక్షిణ్యై నమః ।
ఓం పరాశక్త్యై నమః ।
ఓం పరానిష్ఠాయై నమః ।
ఓం ప్రజ్ఞానఘనరూపిణ్యై నమః ।
ఓం మాధ్వీపానాలసాయై నమః ।
ఓం మత్తాయై నమః ।
ఓం మాతృకావర్ణ రూపిణ్యై నమః ।
ఓం మహాకైలాసనిలయాయై నమః ।
ఓం మృణాలమృదుదోర్లతాయై నమః ।
ఓం మహనీయాయై నమః । 580
ఓం దయామూర్త్యై నమః ।
ఓం మహాసామ్రాజ్యశాలిన్యై నమః ।
ఓం ఓం ఆత్మవిద్యాయై నమః ।
ఓం మహావిద్యాయై నమః ।
ఓం శ్రీవిద్యాయై నమః ।
ఓం కామసేవితాయై నమః ।
ఓం శ్రీషోడశాక్షరీవిద్యాయై నమః ।
ఓం త్రికూటాయై నమః ।
ఓం కామకోటికాయై నమః ।
ఓం కటాక్షకింకరీభూతకమలాకోటిసేవితాయై నమః । 590
ఓం శిరఃస్థితాయై నమః ।
ఓం చంద్రనిభాయై నమః ।
ఓం భాలస్థాయై​ఐ నమః ।
ఓం ఇంద్రధనుఃప్రభాయై నమః ।
ఓం హృదయస్థాయై నమః ।
ఓం రవిప్రఖ్యాయై నమః ।
ఓం త్రికోణాంతరదీపికాయై నమః ।
ఓం దాక్షాయణ్యై నమః ।
ఓం దైత్యహంత్ర్యై నమః ।
ఓం దక్షయజ్ఞవినాశిన్యై నమః । 600
ఓం దరాందోలితదీర్ఘాక్ష్యై నమః ।
ఓం దరహాసోజ్జ్వలన్ముఖ్యై నమః ।
ఓం గురూమూర్త్యై నమః ।
ఓం ఓం గుణనిధయే నమః ।
ఓం గోమాత్రే నమః ।
ఓం గుహజన్మభువే నమః ।
ఓం దేవేశ్యై నమః ।
ఓం దండనీతిస్థాయై నమః ।
ఓం దహరాకాశరూపిణ్యై నమః ।
ఓం ప్రతిపన్ముఖ్యరాకాంతతిథిమండలపూజితాయై నమః । 610
ఓం కలాత్మికాయై నమః ।
ఓం కలానాథాయై నమః ।
ఓం కావ్యాలాపవిమోదిన్యై నమః ।
ఓం సచామరరమావాణీసవ్యదక్షిణసేవితాయై నమః ।
ఓం ఆదిశక్తయై నమః ।
ఓం అమేయాయై నమః ।
ఓం ఆత్మనే నమః ।
ఓం పరమాయై నమః ।
ఓం పావనాకృతయే నమః ।
ఓం అనేకకోటిబ్రహ్మాండజనన్యై నమః । 620
ఓం దివ్యవిగ్రహాయై నమః ।
ఓం క్లీంకార్యై నమః ।
ఓం కేవలాయై నమః ।
ఓం ఓం గుహ్యాయై నమః ।
ఓం కైవల్యపదదాయిన్యై నమః ।
ఓం త్రిపురాయై నమః ।
ఓం త్రిజగద్వంద్యాయై నమః ।
ఓం త్రిమూర్త్యై నమః ।
ఓం త్రిదశేశ్వర్యై నమః ।
ఓం త్ర్యక్షర్యై నమః । 630
ఓం దివ్యగంధాఢ్యాయై నమః ।
ఓం సిందూరతిలకాంచితాయై నమః ।
ఓం ఉమాయై నమః ।
ఓం శైలేంద్రతనయాయై నమః ।
ఓం గౌర్యై నమః ।
ఓం గంధర్వసేవితాయై నమః ।
ఓం విశ్వగర్భాయై నమః ।
ఓం స్వర్ణగర్భాయై నమః ।
ఓం అవరదాయై నమః ।
ఓం వాగధీశ్వర్యై నమః । 640
ఓం ధ్యానగమ్యాయై నమః ।
ఓం అపరిచ్ఛేద్యాయై నమః ।
ఓం జ్ఞానదాయై నమః ।
ఓం జ్ఞానవిగ్రహాయై నమః ।
ఓం సర్వవేదాంతసంవేద్యాయై నమః ।
ఓం ఓం సత్యానందస్వరూపిణ్యై నమః ।
ఓం లోపాముద్రార్చితాయై నమః ।
ఓం లీలాక్లృప్తబ్రహ్మాండమండలాయై నమః ।
ఓం అదృశ్యాయై నమః ।
ఓం దృశ్యరహితాయై నమః । 650
ఓం విజ్ఞాత్ర్యై నమః ।
ఓం వేద్యవర్జితాయై నమః ।
ఓం యోగిన్యై నమః ।
ఓం యోగదాయై నమః ।
ఓం యోగ్యాయై నమః ।
ఓం యోగానందాయై నమః ।
ఓం యుగంధరాయై నమః ।
ఓం ఇచ్ఛాశక్తిజ్ఞానశక్తిక్రియాశక్తిస్వరూపిణ్యై నమః ।
ఓం సర్వాధారాయై నమః ।
ఓం సుప్రతిష్ఠాయై నమః । 660
ఓం సదసద్రూపధారిణ్యై నమః ।
ఓం అష్టమూర్త్యై నమః ।
ఓం అజాజైత్ర్యై నమః ।
ఓం లోకయాత్రావిధాయిన్యై నమః ।
ఓం ఏకాకిన్యై నమః ।
ఓం ఓం భూమరూపాయై నమః ।
ఓం నిద్వైతాయై నమః ।
ఓం ద్వైతవర్జితాయై నమః ।
ఓం అన్నదాయై నమః ।
ఓం వసుదాయై నమః । 670
ఓం వృద్ధాయై నమః ।
ఓం బ్రహ్మాత్మైక్యస్వరూపిణ్యై నమః ।
ఓం బృహత్యై నమః ।
ఓం బ్రాహ్మణ్యై నమః ।
ఓం బ్రాహ్మయై నమః ।
ఓం బ్రహ్మానందాయై నమః ।
ఓం బలిప్రియాయై నమః ।
ఓం భాషారూపాయై నమః ।
ఓం బృహత్సేనాయై నమః ।
ఓం భావాభావవిర్జితాయై నమః । 680
ఓం సుఖారాధ్యాయై నమః ।
ఓం శుభకర్యై నమః ।
ఓం శోభనాసులభాగత్యై నమః ।
ఓం రాజరాజేశ్వర్యై నమః ।
ఓం రాజ్యదాయిన్యై నమః ।
ఓం రాజ్యవల్లభాయై నమః ।
ఓం రాజత్కృపాయై నమః ।
ఓం ఓం రాజపీఠనివేశితనిజాశ్రితాయై నమః ।
ఓం రాజ్యలక్ష్మ్యై నమః ।
ఓం కోశనాథాయై నమః । 690
ఓం చతురంగబలేశ్వర్యై నమః ।
ఓం సామ్రాజ్యదాయిన్యై నమః ।
ఓం సత్యసంధాయై నమః ।
ఓం సాగరమేఖలాయై నమః ।
ఓం దీక్షితాయై నమః ।
ఓం దైత్యశమన్యై నమః ।
ఓం సర్వలోకవంశకర్యై నమః ।
ఓం సర్వార్థదాత్ర్యై నమః ।
ఓం సావిత్ర్యై నమః ।
ఓం సచ్చిదానందరూపిణ్యై నమః । 700
ఓం దేశకాలాపరిచ్ఛిన్నాయై నమః ।
ఓం సర్వగాయై నమః ।
ఓం సర్వమోహిన్యై నమః ।
ఓం సరస్వత్యై నమః ।
ఓం శాస్త్రమయ్యై నమః ।
ఓం గుహాంబాయై నమః ।
ఓం గుహ్యరూపిణ్యై నమః ।
ఓం సర్వోపాధివినిర్ముక్తాయై నమః ।
ఓం ఓం సదాశివపతివ్రతాయై నమః ।
ఓం సంప్రదాయేశ్వర్యై నమః । 710
ఓం సాధునే నమః ।
ఓం యై నమః ।
ఓం గురూమండలరూపిణ్యై నమః ।
ఓం కులోత్తీర్ణాయై నమః ।
ఓం భగారాధ్యాయై నమః ।
ఓం మాయాయై నమః ।
ఓం మధుమత్యై నమః ।
ఓం మహ్యై నమః ।
ఓం గణాంబాయై నమః ।
ఓం గుహ్యకారాధ్యాయై నమః । 720
ఓం కోమలాంగ్యై నమః ।
ఓం గురుప్రియాయై నమః ।
ఓం స్వతంత్రాయై నమః ।
ఓం సర్వతంత్రేశ్యై నమః ।
ఓం దక్షిణామూర్తిరూపిణ్యై నమః ।
ఓం సనకాదిసమారాధ్యాయై నమః ।
ఓం శివజ్ఞానప్రదాయిన్యై నమః ।
ఓం చిత్కలాయై నమః ।
ఓం ఆనందకలికాయై నమః ।
ఓం ప్రేమరూపాయై నమః । 730
ఓం ఓం ప్రియంకర్యై నమః ।
ఓం నామపారాయణప్రీతాయై నమః ।
ఓం నందివిద్యాయై నమః ।
ఓం నటేశ్వర్యై నమః ।
ఓం మిథ్యాజగదధిష్ఠానాయై నమః ।
ఓం ముక్తిదాయై నమః ।
ఓం ముక్తిరూపిణ్యై నమః ।
ఓం లాస్యప్రియాయై నమః ।
ఓం లయకర్యై నమః ।
ఓం లజ్జాయై నమః । 740
ఓం రంభాదివందితాయై నమః ।
ఓం భవదావసుధావృష్ట్యై నమః ।
ఓం పాపారణ్యదవానలాయై నమః ।
ఓం దౌర్భాగ్యతూలవాతూలాయై నమః ।
ఓం జరాధ్వాంతరవిప్రభాయై నమః ।
ఓం భాగ్యాబ్ధిచంద్రికాయై నమః ।
ఓం భక్తచిత్తకేకిఘనాఘనాయై నమః ।
ఓం రోగపర్వతదంభోలయే నమః ।
ఓం మృత్యుదారుకుఠారికాయై నమః ।
ఓం మహేశ్వర్యై నమః । 750
ఓం మహాకాళ్యై నమః ।
ఓం మహాగ్రాసాయై నమః ।
ఓం మహాశనాయై నమః ।
ఓం అపర్ణాయై నమః ।
ఓం చండికాయై నమః ।
ఓం చండముండాసురనిషూదిన్యై నమః ।
ఓం క్షరాక్షరాత్మికాయై నమః ।
ఓం సర్వలోకేశ్యై నమః ।
ఓం విశ్వధారిణ్యై నమః ।
ఓం త్రివర్గదాత్ర్యై నమః । 760
ఓం సుభగాయై నమః ।
ఓం త్ర్యంబకాయై నమః ।
ఓం త్రిగుణాత్మికాయై నమః ।
ఓం స్వర్గాపవర్గదాయై నమః ।
ఓం శుద్ధాయై నమః ।
ఓం జపాపుష్పనిభాకృతయే నమః ।
ఓం ఓజోవత్యై నమః ।
ఓం ద్యుతిధరాయై నమః ।
ఓం యజ్ఞరూపాయై నమః ।
ఓం ప్రియవ్రతాయై నమః । 770
ఓం దురారాధ్యాయై నమః ।
ఓం దురాధర్షాయై నమః ।
ఓం పాటలీకుసుమప్రియాయై నమః ।
ఓం మహత్యై నమః ।
ఓం మేరునిలయాయై నమః ।
ఓం మందారకుసుమప్రియాయై నమః ।
ఓం ఓం వీరారాధ్యాయై నమః ।
ఓం విరాడ్రూపాయై నమః ।
ఓం విరజసే నమః ।
ఓం విశ్వతోముఖ్యై నమః । 780
ఓం ప్రత్యగ్రూపాయై నమః ।
ఓం పరాకాశాయై నమః ।
ఓం ప్రాణదాయై నమః ।
ఓం ప్రాణరూపిణ్యై నమః ।
ఓం మార్తాండభైరవారాధ్యాయై నమః ।
ఓం మంత్రిణీన్యస్తరాజ్యధురే నమః ।
ఓం త్రిపురేశ్యై నమః ।
ఓం జయత్సేనాయై నమః ।
ఓం నిస్త్రైగుణ్యాయై నమః ।
ఓం పరాపరాయై నమః । 790
ఓం సత్యజ్ఞానానందరూపాయై నమః ।
ఓం సామరస్యపరాయణాయై నమః ।
ఓం కపర్దిన్యై నమః ।
ఓం కలామాలాయై నమః ।
ఓం కామదుఘే నమః ।
ఓం కామరూపిణ్యై నమః ।
ఓం కలానిధయే నమః ।
ఓం కావ్యకలాయై నమః ।
ఓం ఓం రసజ్ఞాయై నమః ।
ఓం రసశేవధయే నమః । 800
ఓం పుష్టాయై నమః ।
ఓం పురాతనాయై నమః ।
ఓం పూజ్యాయై నమః ।
ఓం పుష్కరాయై నమః ।
ఓం పుష్కరేక్షణాయై నమః ।
ఓం పరస్మై జ్యోతిషే నమః ।
ఓం పరస్మై ధామ్నే నమః ।
ఓం పరమాణవే నమః ।
ఓం పరాత్పరాయై నమః ।
ఓం పాశహస్తాయై నమః । 810
ఓం పాశహంత్ర్యై నమః ।
ఓం పరమంత్రవిభేదిన్యై నమః ।
ఓం మూర్తాయై నమః ।
ఓం అమూర్తాయై నమః ।
ఓం అనిత్యతృప్తాయై నమః ।
ఓం మునిమానసహంసికాయై నమః ।
ఓం సత్యవ్రతాయై నమః ।
ఓం సత్యరూపాయై నమః ।
ఓం సర్వాంతర్యామిణ్యై నమః ।
ఓం సత్యై నమః । 820
ఓం ఓం బ్రహ్మాణ్యై నమః ।
ఓం బ్రహ్మణే నమః ।
ఓం జనన్యై నమః ।
ఓం బహురూపాయై నమః ।
ఓం బుధార్చితాయై నమః ।
ఓం ప్రసవిత్ర్యై నమః ।
ఓం ప్రచండాయై నమః ।
ఓం ఆజ్ఞాయై నమః ।
ఓం ప్రతిష్ఠాయై నమః ।
ఓం ప్రకటాకృతయే నమః । 830
ఓం ప్రాణేశ్వర్యై నమః ।
ఓం ప్రాణదాత్ర్యై నమః ।
ఓం పంచాశత్పీఠరూపిణ్యై నమః ।
ఓం విశ్రృంఖలాయై నమః ।
ఓం వివిక్తస్థాయై నమః ।
ఓం వీరమాత్రే నమః ।
ఓం వియత్ప్రసువే నమః ।
ఓం ముకుందాయై నమః ।
ఓం ముక్తినిలయాయై నమః ।
ఓం మూలవిగ్రహరూపిణ్యై నమః । 840
ఓం భావజ్ఞాయై నమః ।
ఓం భవరోగధ్న్యై నమః ।
ఓం ఓం భవచక్రప్రవర్తిన్యై నమః ।
ఓం ఛందఃసారాయై నమః ।
ఓం శాస్త్రసారాయై నమః ।
ఓం మంత్రసారాయై నమః ।
ఓం తలోదర్యై నమః ।
ఓం ఉదారకీర్తయే నమః ।
ఓం ఉద్దామవైభవాయై నమః ।
ఓం వర్ణరూపిణ్యై నమః । 850
ఓం జన్మమృత్యుజరాతప్తజన
విశ్రాంతిదాయిన్యై నమః ।
ఓం సర్వోపనిషదుద్ ఘుష్టాయై నమః ।
ఓం శాంత్యతీతకలాత్మికాయై నమః ।
ఓం గంభీరాయై నమః ।
ఓం గగనాంతఃస్థాయై నమః ।
ఓం గర్వితాయై నమః ।
ఓం గానలోలుపాయై నమః ।
ఓం కల్పనారహితాయై నమః ।
ఓం కాష్ఠాయై నమః ।
ఓం అకాంతాయై నమః । 860
ఓం కాంతార్ధవిగ్రహాయై నమః ।
ఓం కార్యకారణనిర్ముక్తాయై నమః ।
ఓం కామకేళితరంగితాయై నమః ।
ఓం కనత్కనకతాటంకాయై నమః ।
ఓం లీలావిగ్రహధారిణ్యై నమః ।
ఓం అజాయై నమః ।
ఓం క్షయవినిర్ముక్తాయై నమః ।
ఓం ముగ్ధాయై నమః ।
ఓం క్షిప్రప్రసాదిన్యై నమః ।
ఓం అంతర్ముఖసమారాధ్యాయై నమః । 870
ఓం బహిర్ముఖసుదుర్లభాయై నమః ।
ఓం త్రయ్యై నమః ।
ఓం త్రివర్గనిలయాయై నమః ।
ఓం త్రిస్థాయై నమః ।
ఓం త్రిపురమాలిన్యై నమః ।
ఓం నిరామయాయై నమః ।
ఓం నిరాలంబాయై నమః ।
ఓం స్వాత్మారామాయై నమః ।
ఓం సుధాసృత్యై నమః ।
ఓం సంసారపంకనిర్మగ్న
సముద్ధరణపండితాయై నమః । 880
ఓం యజ్ఞప్రియాయై నమః ।
ఓం యజ్ఞకర్త్ర్యై నమః ।
ఓం యజమానస్వరూపిణ్యై నమః ।
ఓం ధర్మాధారాయై నమః ।
ఓం ఓం ధనాధ్యక్షాయై నమః ।
ఓం ధనధాన్యవివర్ధిన్యై నమః ।
ఓం విప్రప్రియాయై నమః ।
ఓం విప్రరూపాయై నమః ।
ఓం విశ్వభ్రమణకారిణ్యై నమః ।
ఓం విశ్వగ్రాసాయై నమః । 890
ఓం విద్రుమాభాయై నమః ।
ఓం వైష్ణవ్యై నమః ।
ఓం విష్ణురూపిణ్యై నమః ।
ఓం అయోన్యై నమః వర్ అయోనయే
ఓం యోనినిలయాయై నమః ।
ఓం కూటస్థాయై నమః ।
ఓం కులరూపిణ్యై నమః ।
ఓం వీరగోష్ఠీప్రియాయై నమః ।
ఓం వీరాయై నమః ।
ఓం నైష్కర్మ్యాయై నమః । 900
ఓం నాదరూపిణ్యై నమః ।
ఓం విజ్ఞానకలనాయై నమః ।
ఓం కల్యాయై నమః ।
ఓం విదగ్ధాయై నమః ।
ఓం బైందవాసనాయై నమః ।
ఓం తత్వాధికాయై నమః ।
ఓం ఓం తత్వమయ్యై నమః ।
ఓం తత్వమర్థస్వరూపిణ్యై నమః ।
ఓం సామగానప్రియాయై నమః ।
ఓం సౌమ్యాయై నమః । 910
ఓం సదాశివకుటుంబిన్యై నమః ।
ఓం సవ్యాపసవ్యమార్గస్థాయై నమః ।
ఓం సర్వాపద్వినివారిణ్యై నమః ।
ఓం స్వస్థాయై నమః ।
ఓం స్వభావమధురాయై నమః ।
ఓం ధీరాయై నమః ।
ఓం ధీరసమర్చితాయై నమః ।
ఓం చైతన్యార్ఘ్యసమారాధ్యాయై నమః ।
ఓం చైతన్యకుసుమప్రియాయై నమః ।
ఓం సదోదితాయై నమః । 920
ఓం సదాతుష్ఠాయై నమః ।
ఓం తరుణాదిత్యపాటలాయై నమః ।
ఓం దక్షిణాదక్షిణారాధ్యాయై నమః ।
ఓం దరస్మేరముఖాంబుజాయై నమః ।
ఓం కౌలినీకేవలాయై నమః ।
ఓం అనర్ధ్య కైవల్యపదదాయిన్యై నమః ।
ఓం స్తోత్రప్రియాయై నమః ।
ఓం స్తుతిమత్యై నమః ।
ఓం ఓం శ్రుతిసంస్తుతవైభవాయై నమః ।
ఓం మనస్విన్యై నమః । 930
ఓం మానవత్యై నమః ।
ఓం మహేశ్యై నమః ।
ఓం మంగలాకృత్యే నమః ।
ఓం విశ్వమాత్రే నమః ।
ఓం జగద్ధాత్ర్యై నమః ।
ఓం విశాలాక్ష్యై నమః ।
ఓం విరాగిణ్యై నమః ।
ఓం ప్రగల్భాయై నమః ।
ఓం పరమోదారాయై నమః ।
ఓం పరామోదాయై నమః । 940
ఓం మనోమయ్యై నమః ।
ఓం వ్యోమకేశ్యై నమః ।
ఓం విమానస్థాయై నమః ।
ఓం వజ్రిణ్యై నమః ।
ఓం వామకేశ్వర్యై నమః ।
ఓం పంచయజ్ఞప్రియాయై నమః ।
ఓం పంచప్రేతమంచాధిశాయిన్యై నమః ।
ఓం పంచమ్యై నమః ।
ఓం పంచభూతేశ్యై నమః ।
ఓం పంచసంఖ్యోపచారిణ్యై నమః । 950
ఓం ఓం శాశ్వత్యై నమః ।
ఓం శాశ్వతైశ్వర్యాయై నమః ।
ఓం శర్మదాయై నమః ।
ఓం శంభుమోహిన్యై నమః ।
ఓం ధరాయై నమః ।
ఓం ధరసుతాయై నమః ।
ఓం ధన్యాయై నమః ।
ఓం ధర్మిణ్యై నమః ।
ఓం ధర్మవర్ధిన్యై నమః ।
ఓం లోకాతీతాయై నమః । 960
ఓం గుణాతీతాయై నమః ।
ఓం సర్వాతీతాయై నమః ।
ఓం శామాత్మికాయై నమః ।
ఓం బంధూకకుసుమప్రఖ్యాయై నమః ।
ఓం బాలాయై నమః ।
ఓం లీలావినోదిన్యై నమః ।
ఓం సుమంగల్యై నమః ।
ఓం సుఖకర్యై నమః ।
ఓం సువేషాఢ్యాయై నమః ।
ఓం సువాసిన్యై నమః । 970
ఓం సువాసిన్యర్చనప్రీతాయై నమః ।
ఓం ఆశోభనాయై నమః ।
ఓం ఓం శుద్ధమానసాయై నమ
ఓం బిందుతర్పణసంతుష్టాయై నమః ।
ఓం పూర్వజాయై నమః ।
ఓం త్రిపురాంబికాయై నమః ।
ఓం దశముద్రాసమారాధ్యాయై నమః ।
ఓం త్రిపురాశ్రీవశంకర్యై నమః ।
ఓం జ్ఞానముద్రాయై నమః ।
ఓం జ్ఞానగమ్యాయై నమః । 980
ఓం జ్ఞానజ్ఞేయస్వరూపిణ్యై నమః ।
ఓం యోనిముద్రాయై నమః ।
ఓం త్రిఖండేశ్యై నమః ।
ఓం త్రిగుణాయై నమః ।
ఓం అంబాయై నమః ।
ఓం త్రికోణగాయై నమః ।
ఓం అనఘాయై నమః ।
ఓం అద్భుతచారిత్రాయై నమః ।
ఓం వాంఛితార్థప్రదాయిన్యై నమః ।
ఓం అభ్యాసాతిశయజ్ఞాతాయై నమః । 990
ఓం షడధ్వాతీతరూపిణ్యై నమః ।
ఓం అవ్యాజకరుణామూర్తయే నమః ।
ఓం అజ్ఞానధ్వాంతదీపికాయై నమః ।
ఓం ఆబాలగోపవిదితాయై నమః ।
ఓం ఓం సర్వానుల్లంఘ్యశాసనాయై నమః ।
ఓం శ్రీచక్రరాజనిలయాయై నమః ।
ఓం శ్రీమత్త్రిపురసుందర్యై నమః ।
ఓం ఓం శ్రీశివాయై నమః ।
ఓం శివశక్త్యైక్యరూపిణ్యై నమః ।
ఓం లలితాంబికాయై నమః । 1000
॥ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు ॥
॥ఇతి శ్రీలలితసహస్రనామావలిః సంపూర్ణా ॥

June 24, 2021

శ్రీ భ్రమరాంబికాష్టకము

 శ్రీ భ్రమరాంబికాష్టకము


రవిసుధాకర వహ్నిలోచన రత్నకుండల భూషిణీ

ప్రవిమలంబుగ మమ్మునేలిన భక్తజన చింతామణీ

అవని జనులకు కొంగుబంగారైన దైవశిఖామణీ

శివుని పట్టపురాణి గుణమణి శ్రీగిరి భ్రమరాంబికా ||


కలియుగంబున మానవులకును కల్పతరువై యుండవా

వెలయగును శ్రీ శిఖరమందున విభవమై విలసిల్లవా

ఆలసింపక భక్తవరులకు అష్టసంపద లీయవా

జిలుగు కుంకుమ కాంతిరేఖల శ్రీగిరి భ్రమరాంబికా ||


అంగ వంగ కలింగ కాశ్మీరాంధ్ర దేశములందునన్‌

పొంగుచును వరహాల కొంకణ పుణ్యభూముల యందునన్‌

రంగుగా కర్ణాట రాట మరాట దేశములందునన్‌

శృంగినీ దేశముల వెలసిన శ్రీగిరి భ్రమరాంబికా ||


అక్షయంబుగ కాశిలోపల అన్నపూర్ణ భవానివై

సాక్షిగణపతి కన్న తల్లివి సద్గుణావతి శాంభవీ

మొక్షమొసగెడు కనకదుర్గవు మూలకారణ శక్తివి

శిక్షజేతువు ఘోరభవముల శ్రీగిరి భ్రమరాంబికా ||


ఉగ్రలోచన వరవధూమణి కొప్పుగల్గిన భామినీ

విగ్రహంబుల కెల్ల ఘనమై వెలయు శోభనకారిణీ

అగ్రపీఠమునందు వెలసిన ఆగమార్ధ విచారినీ

శీఘ్రమేకని వరములిత్తువు శ్రీగిరి భ్రమరాంబికా ||


నిగమగోచర నీలకుండలి నిర్మలాంగి నిరంజనీ

మిగుల చక్కని పుష్పకోమలి మీననేత్ర దయానిధీ

జగతిలోన ప్రసిద్ధికెక్కిన చంద్రముఖి సీమంతినీ

చిగురుటాకులవంటి పెదవుల శ్రీగిరి భ్రమరాంబికా ||


సోమశేఖర పల్లవాధరి సుందరీమణీ ధీమణీ

కోమలాంగి కృపాపయోనిధి కుటిలకుంతల యోగినీ

నా మనంబున పాయకుండమ నగకులేశుని నందినీ

సీమలోన ప్రసిద్ధికెక్కిన శ్రీగిరి భ్రమరాంబికా ||


భూతనాథుని వామభాగము పొందుగా చేకొందువా

ఖ్యాతిగను శ్రీశైలమున విఖ్యాతిగా నెలకొంటివా

పాతకంబుల పాఱద్రోలుచు భక్తులను చేకొంటివా

శ్వేతగిరిపై నుండి వెలసిన శ్రీగిరి భ్రమారాంబికా ||


ఎల్లవెలసిన నీదు భావము విష్ణులోకము నందున

పల్లవించును నీ ప్రభావము బ్రహ్మలోకము నందున

తెల్లముగ కైలాసమందున మూడులోకము లందున

చెల్లునమ్మ త్రిలోకవాసిని శ్రీగిరి భ్రమరాంబికా ||


తరుని శ్రీగిరి మల్లికార్జున దైవరాయల భామినీ

కరుణతో మమ్మేలు మెప్పుడు కల్పవృక్షము భంగినీ

వరుసతో నీ యష్టకంబును వ్రాసి చదివిన వారికి

సిరులనిచ్చెద వెల్ల కాలము శ్రీగిరి భ్రమరాంబికా ||



July 3, 2020

గోదా చతు:శ్లోకి

గోదా చతు:శ్లోకి 

నీళా తుంగస్తనగిరితటి  సుప్త ముద్బోధ్య కృష్ణం 
పారార్థ్యం స్వం శ్రుతిశతశిరస్సిద్ద మధ్యాపయన్తీ| 
స్వోచ్చిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే 
గోదా తస్యై నమ ఇద మిదం భూయ ఏవాస్తు భూయః ||


నిత్యాభూషా నిగమశిరసాం నిస్సమోత్తుంగవార్తా
కాంతోయస్యా: కచవిలులితై:కాముకో మాల్యరత్నై:
సూక్త్యాయస్యా: శృతిశుభగయా సుప్రభాతా ధరిత్రీ
సైషాదేవీ సకలజననీ సించతాత్ మామపాంగై: 


మాచేత్తులసీ పితా యదితవ శ్రీవిష్ణుచిత్తో మహాన్
భ్రాతాచేద్యతిశేఖర: ప్రియతమ:శ్రీరంగధామా యది
జ్ఞాతారస్తనయా:త్వదుక్తి సరసస్తన్యేనసంవర్ధితా:
గోదాదేవి! కథంత్వమన్యసులభా సాధారణా శ్రీరసి

కల్పాదౌ హరిణాస్వయంజనహితం దృష్ట్వైవ సర్వాత్మ్నాం
ప్రోక్తం స్వస్య చ కీర్తనం ప్రపదనం స్వస్మై ప్రసూనార్పణం
సర్వేషాం ప్రకటం విధాతుమనిశం శ్రీధన్వినవ్యేపురే
జాతాం వైదిక విష్ణుచిత్తతనయాం గోదాముదారాంస్తుమ: 




ఆకూతస్యపరిష్క్రియాం అనుపమా మాసేచనం చక్షుషో:
ఆనందస్య పరంపరాం అనుగుణాం ఆరామశైలేశితు:
తధ్ధోర్మధ్య కీరీటకోటిఘటిత స్వోచ్చిష్ట కస్తూరికా
మాల్యామోదసమేధితాత్మ విభవాం గోదాముదారాంస్తుమ:




November 9, 2016

కనకధారా స్తోత్రం భావసహితం

కనకధారా స్తోత్రం ........ భావసహితం    
వందేవందారుమందారం ఇందిరానంద కందలం
అమందానంద సందోహం బంధురం సింధురాననం !!


కోరిన కోర్కెలు తీర్చు దేవతావృక్షము వంటి వాడు, తన భార్య శ్రీమహాలక్ష్మీదేవి యొక్క ఆనందమునకు కారణమైన వాడు, జ్ఞానులు - పండితులు అనుభవించు ఆనందమునకు మూలసూత్రధారి అయిన హయగ్రీవునికి నమస్కరిస్తున్నాను.


1 శ్లోకం 
అఙ్గం హరేః పులకభూషణ మాశ్రయంతీ
భృఙ్గాఙ్గనేవ ముకుళాభరణం తమాలం 
అఙ్గీకృతాఖిల విభూతి రపాఙ్గలీలా 
మాఙ్గళ్యదాస్తు మమ మఙ్గళదేవతాయాః !!

మొగ్గలతో నిండియున్న చీకటి కానుగ (చెట్టు) ను ఆడుతుమ్మెద వలె గగుర్పాటుతో ఉన్న విష్ణుదేవుని నాశ్రయించినదియు, సకలైశ్వర్యములకు స్థానమైనదియు అగు లక్ష్మీదేవి నాకు శుభములను ఇచ్చుగాక.  


2 శ్లోకం 
ముగ్ధాముహు ర్విదధతీ వదనే మురారేః 
ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని
మాలా దృశో ర్మధుకరీవ మహోత్పలేయా  
సా నే శ్రియం దిశతు సాగర సంభవాయః !!

పెద్ద నల్లకలువపై నుండు ఆడు తుమ్మెద వలె శ్రీహరి ముఖమునందు ప్రేమ లజ్జలచే ముందుకు వెనుకకు ప్రసరించుచున్నఆ లక్ష్మీదేవి దృష్టి  నాకు సంపదను ప్రసాదించుగాక. 

3 శ్లోకం 
ఆ మీలితాక్ష మధిగమ్య ముదా ముకుందం
ఆనందకంద మనిమేష మనఙ్గ తంత్రం 
ఆకేకర స్థిత కనీనిక పష్మ నేత్రం 
భూత్యై భవే న్మమ భుజఙ్గ శయాఙ్గనాయాః !!

మూసికొన్న కన్నులు గలవాడును, ఆనందమునకు కారణభూతుడయిన మురారిని సంతోషముతో గూడుటచే, ఱెప్పపాటు లేనిదియు, కామ వశమైనదియు, కుచితమైన కనుపాపలును, ఱెప్పలును గలదియు అగు లక్ష్మీదేవి దృష్టి  నాకు సంపద నొసంగునుగాక. 


4 శ్లోకం 
భాహ్వంతరే మధుజిథ శ్రితకౌస్తుభే యా 
హారావలీవ హరినీలమయీ విభాతి
కామప్రదా భగవతోపి కటాక్షమాలా 
కల్యాణమావహతు మే కమలాలయాః !!

మణిగల శ్రీహరిని వక్షస్థలమందలి నీలమణి కౌస్తుభము హారములాగ ప్రకాశించునదియు, భగవంతునికే కోర్కెలను ఇచ్చునట్టిదియు  అగు లక్ష్మీదేవి యొక్క కటాక్ష పరంపర నాకు శుభమును చేకూర్చుగాక.  


5 శ్లోకం 
కాలాంబుదాలళి  లలితోరసి కైటభారేః 
ధారా ధరే స్ఫురతి యా తటిదఙ్గ నేవ 
మాతు స్సమస్త జగతాం మహనీయ మూర్తిః 
భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః !!

కారుమబ్బులయందు మెరుపుతీగవలె, మేఘశ్యాముడగు విష్ణువు వక్షస్థలమందు ప్రకాశించుచున్న,  లోకమాత ఐనట్టి  లక్ష్మీదేవి నాకు శుభముల నిచ్చుగాక. 


6 శ్లోకం 
ప్రాప్తం పదం ప్రధమతః ఖలు యత్ప్రభావాత్
మాఙ్గల్యభాజి మధుమాధిని మన్మధేన
మయ్యాపతేత్తదిహ మంధర మీక్షణార్ధం
మందాలసం చ మకరాలయ కన్యకాయాః !!

ఏ దేవి దృష్టి మహిమవలన శుభమును పొందిన విష్ణునందు  మన్మధుడు నిలిచెనో అట్టి క్షీరాబ్ధి కన్యక అగు లక్ష్మీదేవి యొక్క మందమగు దృష్టి  నాయందు ప్రసరించునుగాక.
  
7 శ్లోకం 
విశ్వామరేంద్ర పదవిభ్రమ దాన దక్షం 
ఆనందహేతు రధికం మురవిధ్విషోపి
ఈషన్నిషీదతు మయి క్షణ మీక్షణార్ధం 
ఇందీ వరోదర సహోదర మిందిరాయాః !!

సకల దేవేంద్ర పదవి నీయగలదియు, విష్ణువు సంతోషమునకు కారణమైనదియు, నల్లకలువలను పోలునదియు అగు లక్ష్మీదేవి కటాక్షము క్షణకాలం నాపై నిలిచియుండును గాక.  


8 శ్లోకం 
ఇష్టా విశిష్టమతయోపి యయా దయార్ధ్ర
దృష్ట్యా  త్రివిష్టప పదం సులభం లభంతే
దృష్టిః ప్రవృష్ట కమలోదర దీప్తిరిష్టాం
పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరాయాః !!

హితులగు జ్ఞానులు ఎవరి దయాదృష్టిచే సులభముగా ఇంద్రపదవిని పొందుచున్నారో పద్మములోని భాగము వలె ప్రకాశించు అట్టి పద్మాసన(లక్ష్మీ) దృష్టి నేను కోరిన సంపదను నాకు అనుగ్రహించుగాక.  


9 శ్లోకం 
దద్యాద్దయానుపవనో ద్రవిణాంభుధారాం 
అస్మిన్నకించిన విహఞ్గశిశౌ విషణ్ణే
దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం
నారాయణ ప్రణయినీ నయనాంబువాహః !!

శ్రీమన్నారాయణుని శ్రీదేవి అనెడి మేఘము పేదవాడననెడి విచారము పొందిన చాతకపక్షినగు నా యందు చాలాకాలముగా ఉన్న దుష్కర్మమనెడి తాపమును తొలగించి, నాపై ధనవర్ష ధారను కురిపించునుగాక. 


 
10 శ్లోకం 
గీర్దేవ తేతి గరుడధ్వజ సుందరీతి 
శాకంభరీతి శశిశేఖర వల్లభేతి
సృష్టి స్థితి ప్రళయకేళిషు సంస్థితాయై 
తస్యై నమ స్త్రిభువనైక గురో స్తరుణ్యై !!

సృష్టి స్థితి ప్రళయ కార్యములందు గీర్దేవత(సరస్వతి) అనియు, విష్ణుపత్ని అనియు శాకాంభరి అనియు శివకళత్రము అనియు ఏ దేవత పిలువబడుచున్నదో అట్టి విష్ణుపత్ని అగు లక్ష్మీకి నమస్కరిస్తున్నాను.  


11 శ్లోకం 
శ్రుత్యైనమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై 
రత్యైనమోస్తు రమణీయ గుణార్ణవాయై
శక్త్యైనమోస్తు శతపత్ర నికేతనాయై 
పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై !!

పుణ్యకార్యములు ఫలము నొసగు శ్రుతిరూపిణియు, సౌందర్య గుణసముద్ర యగు రతిరూపిణియును, పద్మనివాసిని అగు శక్తి రూపిణియు అగు లక్ష్మీదేవికి నమస్కారము.


12 శ్లోకం 
నమోస్తు నాళీక నిభాననాయై 
నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై 
నమోస్తు సోమామృత సోదరాయై
నమోస్తు నారాయణ వల్లభాయై !!

పద్మమును బోలిన ముఖము గలదియు, క్షీరసముద్రమునందు జన్మించినదియు, చంద్రునికి, అమృతమునకు తోబుట్టువును, నారాయణుని పత్ని అగు లక్ష్మీదేవికి నమస్కారము.  


13 శ్లోకం 
నమోస్తు హేమాంభుజ పీఠికాయై 
నమోస్తు భూమణ్డల నాయికాయై 
నమోస్తు దేవాది దయాపరాయై
నమోస్తు శార్ఙ్ఙాయుధ వల్లభాయై !!

బంగారు పద్మము పీఠముగా గలదియు, భూమండలమునకు నాయిక అయినదియు, దేవతలలో దయయే ముఖ్యముగా గలదియు, విష్ణువునకు ప్రియురాలు  అయిన లక్ష్మీదేవికి నమస్కారము. 

14 శ్లోకం 
నమోస్తు దేవ్యై భృగు నందనాయై 
నమోస్తు విష్ణోరురసి స్థితాయై 
నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై 
నమోస్తు దామోదర వల్లభాయై !!

భృగుమహర్షి పుత్రికయును, దేవియు, విష్ణువక్షస్థలవాసినియు, పద్మనివాసినియు విష్ణువుకు ప్రియురాలు అయిన లక్ష్మీదేవికి నమస్కారము. 

 
15 శ్లోకం 
నమోస్తు కాంత్యై కమలేక్షణాయై 
నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై
నమోస్తు దేవాదిభి రర్చితాయై 
నమోస్తు నందాత్మజ వల్లభాయై !!

తామరపువ్వు వంటి కన్నులు గలదియు, ప్రకాశించునదియు లోకములకు తల్లియు, దేవతలచే పూజింపబడునదియు, విష్ణువుకు ప్రియురాలు అగు లక్ష్మీదేవికి నమస్కారము. 

 
16 శ్లోకం 
సంపత్కరాణి సకలేంద్రియ నందనాని 
సామ్రాజ్య దాన విభవాని సరోరుహాక్షి 
త్వద్వందనాని దురితా హరణోద్యతాని 
మామేవ మాత రనిశం కలయంతు మాన్యే !!

పద్మములవంటి కన్నులు గల పూజ్యురాలవగు నోయమ్మా, సంపదను కల్గించునవియు, ఇంద్రియములను సంతోషమును కలిగించునవి, చక్రవర్తిత్వము నొసగగలవియు, పాపములను తొలగించునవియు అగు నీకు చేయు వందనములు ఎల్లపుడును నన్నే కృతార్థునిజేయుగాక.   

17 శ్లోకం 
యత్కటాక్ష సముపాసనా విధిః 
సేవకస్య సకలార్ధ సంపదః
సంతనోతి వచనాఞ్గ మానసైః
త్వాం మురారి హృదయేశ్వరీం భజే !!

ఏ నీ కడగంటి చూపును సేవించుట సేవకునికి సకల సంపదలను కూర్చుచున్నదో అట్టి విష్ణుపత్నివగు నిన్ను మనోవాక్కాయములనెడి  త్రికరణములతో సేవించుచున్నాను.  

 
18 శ్లోకం 
సరసిజనిలయే సరోజహస్తే 
ధవళతమాం శుక గంధమాల్యశోభే
భగవతి హరివల్లభే మనోఙ్ఞే 
త్రిభువనభూతి కరి ప్రసీద మహ్యం !!

కమలములవంటి కన్నులు గలదానా! చేతియందు పద్మముగలదానా! తెల్లని వస్త్రగంధ పుష్పమాలికలచే ప్రకాశించుదానా! షడ్గుణములు గలదానా!  అందమైనదానా! ముల్లోకములకు ఐశ్వర్యము  కలిగించుదానా! ఓ విష్ణుపత్నీ! నన్ననుగ్రహింపుము.  

19 శ్లోకం 
దిగ్ఘస్తిభిః కనక కుంభ ముఖావసృష్ట
స్వర్వాహినీ విమలచారు జలాప్లుతాఙ్ఞీం 
ప్రాతర్నమామి జగతాం జననీ మశేష 
లోకాధినాధ గృహిణీం మమృతాబ్ధి పుత్రీం !!

దిగ్గజములచే బంగారు కుండలనుండి పోయబడిన నిర్మలములుగు ఆకాశ జలములచే తడుపబడిన శరీరము కలదియు, లోకములకు జననియు, లోకాధిపతికి భార్యయు, క్షీరసాగర పుత్రియు అగు లక్ష్మీదేవికి ఉదయమున నమస్కరించుచున్నాను. 

20 శ్లోకం 
కమలే కమలాక్ష వల్లభేత్వం
కరుణాపూర తరఙ్ఞితైరపాఙ్ఞైః
అవలోకయ మామకిఞ్చనానాం 
ప్రధమం పాత్రమ కృత్రిమందయాయాః !!

నారాయణునికి ప్రియురాలవగునో లక్ష్మీ! దరిద్రులలో ప్రధముడను, నీ దయకు యథార్థముగా తగిన వాడనగు నన్ను నీ కరుణాకటాక్షములతో చూడుముతల్లీ. 

21 శ్లోకం 
స్తువంతి యే స్తుతిభిరమీభిరన్వహం 
త్రయీమయీం త్రిభువనమాతరం రమాం 
గుణాధికా గురుతర భాగ్యభాగినో 
భవంతి తే భువి బుధ భావితాశయాః !!

ఎవరీ స్తోత్రములచే ప్రతిరోజు వేదరూపిణియు, త్రిలోకమాతయు అగు లక్ష్మీదేవిని స్తుతింతురో వారు గుణవంతులుగను మంచి భాగ్యవంతులలో గొప్ప భాగ్యవంతులుగను బుధులచే కొనియాడబడెడి  వారుగను అగుచున్నారు. 

సువర్ణధారా స్తోత్రం 
యచ్ఛంకరాచార్య నిర్మితం 
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం 
స కుబేరసమో భవేత్ !!

శంకరాచార్యులచే రచింపబడిన కనకధారాస్తోత్రమును ఎవరు నిత్యమూ త్రికాలములయందు పఠించునో వారు కుబేరునితో సమానులగుదురు.  



__/\__ ఇతి శ్రీ శంకర భగవత్పాద విరచితం కనకధారాస్తోత్రం సంపూర్ణం.__/\__