Showing posts with label Sivanandalahari. Show all posts
Showing posts with label Sivanandalahari. Show all posts

April 27, 2023

శివానందలహరి పాటలు 02

 శివానందలహరి పాటలు 02

గలంతీ శంభో త్వచ్-చరిత-సరితః కిల్బిశ-రజో
దలంతీ ధీకుల్యా-సరణిశు పతంతీ విజయతాం
దిశంతీ సంసార-భ్రమణ-పరితాప-ఉపశమనం
వసంతీ మచ్-చేతో-హృదభువి శివానంద-లహరీ ||2||

శంభోమహాదేవ శివశంకరా ॥

అ.ప. జయ నిఖిలాధార అభయంకరా ॥ 

చ. 1 

నామదినిప్రవహించు నీచరితామృతము 

పాపములుపోగొట్టి జ్ఞానమును కలిగించు 

జననమరణాది భవభయములనుతొలగించి 

శాంతిని కలిగించు శివానందలహరీ 

చ. 2 

శంభో శివనామ స్మరణము శివచరిత పఠనము 

శివపాద భజనము హృదయానందము 

శివపద ధ్యానమే శివసన్నిధికి త్రోవ 

మల్లికాసుమగాన ఆనందలహరి శంభో

శివానందలహరి పాటలు 01

 శివానందలహరి పాటలు 01

కలాభ్యాం చూడాలంకృత-శశి కలాభ్యాం నిజ తపః-
ఫలాభ్యాం భక్తేశు ప్రకటిత-ఫలాభ్యాం భవతు మే ।
శివాభ్యాం-అస్తోక-త్రిభువన శివాభ్యాం హృది పునర్-
భవాభ్యాం ఆనంద స్ఫుర-దనుభవాభ్యాం నతిరియమ్ ॥ 

అర్ధనారీశులకువందనం వందనం॥ 

అ.ప. జ్ఞానప్రదాతలకువందనచందనం ॥ 

చ. 1 

ఒకరితపమునకు ఒకరుఫలముగ 

భక్తులమనమున నిరతమునిలచి 

త్రిభువనములకుశుభములనొసగే 

ఆదిదంపతులు జననీజనకులు 

చ. 2 

శివశివా అనెడి ఒకేనామముతో 

మంగళకరులు మంగళరూపులు 

చంద్రశేఖరులు వాగర్ధములు

మల్లికాసుమగానసుమనోహరులు | 

శివానందలహరి పాటలు ప్రార్థనా గీతం 03

 శివానందలహరి పాటలు ప్రార్థనా గీతం 03


అర్ధనారీశుని భజియించరే 

ఆ ఉమా మహేశులను సేవించరే 

శివశక్తిమయమైచిచ్చక్తి నిలయమౌ

చ 1

వాలుకన్నులతూపులు సోయగములు చిలుక 

బేసికన్నుల చూపులు కారుణ్యములొలుక 

హేమంపు కలువల భూషణములు మెరయ 

క్రూరంపు చిలువల పూత్కారము కురిసె 

శివశక్తిమయమై చిచ్చక్తి నిలయమౌ ॥

చ 2.

మెరిసేటిపట్టు పీతంబరములొకవంక 

బిరిసైన గజచర్మాంబరములొకవంక 

స్తనభరములొకవంక కరకుటురమొకవంక

నెలవంక ఒక వంక సూర్యవంక ఇటువంక 

శివశక్తిమయమై చిచ్ఛక్తి నిలయమౌ ||

చ 3

ఇటుగంధపుసేతలు అటుబూడిదపూతలు 

ఇటుముత్యాలసౌరు అటు రుద్రాక్షపేరు 

ఒకవంకనల్లనై ఒకవంకతెల్లనై 

శివశక్తిమయమై చిచ్చక్తి నిలయమౌ ||


శివానందలహరి పాటలు ప్రార్థనా గీతం 02

 శివానందలహరి పాటలు 

ప్రార్థనా గీతం 02


గురుభ్యోః నమః

ప : శంకరం ఆదిశంకరం

అప: నమామి భక్తవశంకరం

చ.1 

అద్వైతామృతబోధకం యోగవిద్యాసాధకం 

శ్రీలలితా సౌందర్య ఆరాధకం అఖిలజనపూజ్య పాదుకం

చ.2 

శివభక్తి రసప్రధానం ఆనందలహరీవినోదం

నిత్యసత్యాన్వేష చతురంమల్లికాసుమగాన పూజితం

శివానందలహరి పాటలు .... ప్రార్థనా గీతం 01

 శివానందలహరి పాటలు 

కలాభ్యాం చూడాలంకృత-శశి కలాభ్యాం నిజ తపః-
ఫలాభ్యాం భక్తేశు ప్రకటిత-ఫలాభ్యాం భవతు మే ।
శివాభ్యాం-అస్తోక-త్రిభువన శివాభ్యాం హృది పునర్-
భవాభ్యాం ఆనంద స్ఫుర-దనుభవాభ్యాం నతిరియమ్ ॥ 1 ॥

ప్రార్థనా గీతం 01 

ఓం గణపతయేనమః

పాహిపాహి గౌరినందనా
అప : నీకు మా వేలవేల వందనములురా
చ.1

చిన్నచిన్నకళ్ళతోను చేటలంటి చెవులతోను

కుండవంటి బొజ్జతోను కొండంతదేవరా
చ 2.

చిట్టి ఎలుకమీదనెక్కి జగముతిరుగు పొట్టివాడ 

నిన్నుకోరినట్టివారికెల్ల విద్యలిచ్చువాడా
చ. 3 

కుడుములు ఉండ్రాళ్ళు పాలు పాయసముపెట్టెదము 

విఘ్నములను బాపుమయ్య ఏకదంతవిఘ్నరాజ ||