August 30, 2013

శ్రీ సూక్తం

శ్రీ సూక్తం

ఓం || హిర’ణ్యవర్ణాం హరి’ణీం సువర్ణ’రజతస్ర’జామ్ |
చంద్రాం హిరణ్మ’యీం లక్ష్మీం జాత’వేదో మ ఆవ’హ ||

తాం మ ఆవ’హ జాత’వేదో లక్ష్మీమన’పగామినీ”మ్ |
యస్యాం హిర’ణ్యం విందేయం గామశ్వం పురు’షానహమ్ ||

అశ్వపూర్వాం ర’థమధ్యాం హస్తినా”ద-ప్రబోధి’నీమ్ |
శ్రియం’ దేవీముప’హ్వయే శ్రీర్మా దేవీర్జు’షతామ్ ||

కాం సో”స్మితాం హిర’ణ్యప్రాకారా’మార్ద్రాం జ్వలం’తీం తృప్తాం తర్పయం’తీమ్ |
పద్మే స్థితాం పద్మవ’ర్ణాం తామిహోప’హ్వయే శ్రియమ్ ||

చంద్రాం ప్ర’భాసాం యశసా జ్వలం’తీం శ్రియం’ లోకే దేవజు’ష్టాముదారామ్ |
తాం పద్మినీ’మీం శర’ణమహం ప్రప’ద్యే‌உలక్ష్మీర్మే’ నశ్యతాం త్వాం వృ’ణే ||

ఆదిత్యవ’ర్ణే తపసో‌உధి’జాతో వనస్పతిస్తవ’ వృక్షో‌உథ బిల్వః |
తస్య ఫలా’ని తపసాను’దంతు మాయాంత’రాయాశ్చ’ బాహ్యా అ’లక్ష్మీః ||

ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణి’నా సహ |
ప్రాదుర్భూతో‌உస్మి’ రాష్ట్రే‌உస్మిన్ కీర్తిమృ’ద్ధిం దదాదు’ మే ||

క్షుత్పి’పాసామ’లాం జ్యేష్ఠామ’లక్షీం నా’శయామ్యహమ్ |
అభూ’తిమస’మృద్ధిం చ సర్వాం నిర్ణు’ద మే గృహాత్ ||

గంధద్వారాం దు’రాధర్షాం నిత్యపు’ష్టాం కరీషిణీ”మ్ |
ఈశ్వరీగ్‍మ్’ సర్వ’భూతానాం తామిహోప’హ్వయే శ్రియమ్ ||

మన’సః కామమాకూతిం వాచః సత్యమ’శీమహి |
పశూనాం రూపమన్య’స్య మయి శ్రీః శ్ర’యతాం యశః’ ||

కర్దమే’న ప్ర’జాభూతా మయి సంభ’వ కర్దమ |
శ్రియం’ వాసయ’ మే కులే మాతరం’ పద్మమాలి’నీమ్ ||

ఆపః’ సృజంతు’ స్నిగ్దాని చిక్లీత వ’స మే గృహే |
ని చ’ దేవీం మాతరం శ్రియం’ వాసయ’ మే కులే ||

ఆర్ద్రాం పుష్కరి’ణీం పుష్టిం సువర్ణామ్ హే’మమాలినీమ్ |
సూర్యాం హిరణ్మ’యీం లక్ష్మీం జాత’వేదో మ ఆవ’హ ||

ఆర్ద్రాం యః కరి’ణీం యష్టిం పింగలామ్ ప’ద్మమాలినీమ్ |
చంద్రాం హిరణ్మ’యీం లక్ష్మీం జాత’వేదో మ ఆవ’హ ||

తాం మ ఆవ’హ జాత’వేదో లక్షీమన’పగామినీ”మ్ |
యస్యాం హిర’ణ్యం ప్రభూ’తం గావో’ దాస్యో‌உశ్వా”న్, విందేయం పురు’షానహమ్ ||

ఓం మహాదేవ్యై చ’ విద్మహే’ విష్ణుపత్నీ చ’ ధీమహి |
తన్నో’ లక్ష్మీః ప్రచోదయా”త్ ||

శ్రీ-ర్వర్చ’స్వ-మాయు’ష్య-మారో”గ్యమావీ’ధాత్ పవ’మానం మహీయతే” | ధాన్యం ధనం పశుం బహుపు’త్రలాభంశతసం”వత్సరం దీర్ఘమాయుః’ ||

ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||


మహాలక్ష్మీ అష్టకం

మహాలక్ష్మీ అష్టకం


నమస్తే‌உస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే |
శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమో‌உస్తు తే ||

నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరి |
సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమో‌உస్తు తే ||

సర్వఙ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి |
సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమో‌உస్తు తే ||

సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని |
మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమో‌உస్తు తే ||

ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి |
యోగఙ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమో‌உస్తు తే ||

స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే |
మహా పాప హరే దేవి మహాలక్ష్మి నమో‌உస్తు తే ||

పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి |
పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమో‌உస్తు తే ||

శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే |
జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమో‌உస్తు తే ||

మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః |
సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ||

ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనమ్ |
ద్వికాల్ం యః పఠేన్నిత్యం ధన ధాన్య సమన్వితః ||

త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనమ్ |
మహాలక్ష్మీ ర్భవేన్-నిత్యం ప్రసన్నా వరదా శుభా ||

ఇంత్యకృత శ్రీ మహాలక్ష్మ్యష్టక స్తోత్రం సంపూర్ణమ్.

August 29, 2013

శ్రీ లలితా పంచరత్నం

శ్రీ లలితా పంచరత్నం 

ప్రాతః స్మరామి లలితావదనారవిందం
బింబాధరం పృథులమౌక్తికశోభినాసమ్ |
ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం
మందస్మితం మృగమదోజ్జ్వలఫాలదేశమ్ || 

ప్రాతర్భజామి లలితాభుజకల్పవల్లీం
రక్తాంగుళీయలసదంగుళిపల్లవాఢ్యామ్ |
మాణిక్యహేమవలయాంగదశోభమానాం
పుండ్రేక్షుచాపకుసుమేషుసృణీర్దధానామ్ ||

ప్రాతర్నమామి లలితాచరణారవిందం
భక్తేష్టదాననిరతం భవసింధుపోతమ్ |
పద్మాసనాదిసురనాయకపూజనీయం
పద్మాంకుశధ్వజసుదర్శనలాంఛనాఢ్యమ్ ||

ప్రాతః స్తువే పరశివాం లలితాం భవానీం
త్రయ్యంతవేద్యవిభవాం కరుణానవద్యామ్ |
విశ్వస్య సృష్టవిలయస్థితిహేతుభూతాం
విద్యేశ్వరీం నిగమవాఙ్మమనసాతిదూరామ్ ||

ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ
కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి |
శ్రీశాంభవీతి జగతాం జననీ పరేతి
వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి ||

యః శ్లోకపంచకమిదం లలితాంబికాయాః
సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే |
తస్మై దదాతి లలితా ఝటితి ప్రసన్నా
విద్యాం శ్రియం విమలసౌఖ్యమనంతకీర్తిమ్ ||




August 19, 2013

శ్రావణ పౌర్ణమి---హయగ్రీవ జయంతి----జంధ్యాల పౌర్ణమి --- రాఖీ పౌర్ణమి (రక్షా బంధనం)

శ్రావణ పౌర్ణమి---హయగ్రీవ జయంతి----జంధ్యాల పౌర్ణమి --- రాఖీ పౌర్ణమి (రక్షా బంధనం)

శ్రావణమాసంలో శ్రవణా నక్షత్రంతో కూడుకొని యున్న పౌర్ణమిని శ్రావణ పౌర్ణమి, --హయగ్రీవ జయంతి----జంధ్యాల పౌర్ణమి --- రాఖీ పౌర్ణమి (రక్షా బంధనం) అని వివిధ పేర్లతో చెప్పుకుంటూ ఉంటారు. 

హయగ్రీవ జయంతి

జ్ఞానానందమయం దేవం నిర్మలస్పటికాకృతిం |
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే || 

వ్యాఖ్యా ముద్రాం కరసరసిజైః పుస్తకం శంఖచక్రే
బిభ్రద్భిన్నస్పటికరుచిరే పుండరీకే నిషణ్ణః |
అమ్లానశ్రీరమృతవిశదైరంశుభిః ప్లావయన్ మాం
ఆవిర్భూయాదనఘ మహిమా మానసే వాగధీశః ||

శ్రీ మహావిష్ణువు అవతారములలో 24 అవతారములు ముఖ్యమైనవి. ఈ అవతారములలోకేల్ల ముఖ్యాతిముఖ్యమైన, ఆద్యావతరమైన అవతారమే "హయగ్రీవావతరము". ఈ అవతారము విశ్వవిరాట్ స్వరూపుని(శ్రీమన్నారాయణుని) ఉఛ్వాసావతారమే అని, ఇది సృష్టి ఆరంభమునకు పూర్వమే జరిగినదని పెద్దలు చెబుతారు. శ్రీమన్నారాయణుని నాభి కమలము నుండి బ్రహ్మదేముడు ఉద్భవించాడు. విష్ణుమూర్తి కర్ణములు (చెవులు) నుండి మధుకైఠభులు అనే రాక్షసులు అవతరించి, తమజన్మకారకులెవరో తెలియక మూల ప్రకృతియైన ఆది పరాశక్తిని గూర్చి తపస్సు చేసి, జగన్మాత వలన తమ జన్మ రహస్యం తెలుసుకొని, ఎవరిచే కూడా మరణం జరగనట్లుగా వరం ప్రసాదించమని కోరిరి. జగన్మాత అట్లు జరగదని చెప్పి, విచిత్ర దివ్య వైష్ణవ తేజో విశేషంతో తప్ప, ఇతరుల వలన మృత్యుభయం లేదని దేవి వలన వరం పొందిరి.


వరగర్వితులై అజేయులుగా ఉన్న మధుకైఠభులు బ్రహ్మ వద్ద నుండి వేదములనపహరించి, బ్రహ్మాండమంతా జలమయం గావించి, పాతాళమున దాగియుండిరి. మధ్య మధ్య బ్రహ్మను యుద్దమునకు రమ్మని బాధించు చుండిరి. బ్రహ్మ వారితో యుద్ధము చేయలేక, వారు పెట్టె బాధలు సహించలేక, పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీవిష్ణువుకి మొరపెట్టుకొనెను. నారాయణుడు బ్రహ్మ ప్రార్థనను విని, తనదివ్యదృష్టితో సర్వం తెలుసుకొని, "ఐదు రోజులలో ఆ దైత్యులను సంహరించి, వేదములను తెచ్చి నీకు అప్పగించెదను. వేదములందిన తరవాత సృష్టిని ప్రారంభించుము. అంతవరకూ నన్ను ఆరాధించుము" అని విష్ణువు, బ్రహ్మను ఓదార్చి పంపెను. 

వెంటనే శ్రీమన్నారాయణుని ఉచ్ఛ్వాస విశ్వాసముల నుండి శుద్ధస్ఫటిక సంకాశమైన శంఖ, చక్ర, గదా, అక్షరమాల పుస్తక శ్రీ ముద్రాది సంశోభితుడైన అశ్వముఖధారి అయినటువంటి "హయగ్రీవ స్వామి" అవతారం చంద్రమండలం మధ్య నుండి అవతరించి, అసురులను హతమార్చి, వేదములను, వేదవిద్యలను ఉద్ధరించి, బ్రహ్మకప్పగించెను. వేదాధిపత్యమును బ్రహ్మకును, సకలవిద్యాధిపత్యమును సరస్వతికిని అప్పగించెను. అప్పటినుండి బ్రహ్మ వేదప్రతిపాదకంబైన సృష్టికి కర్తయై, వేదములకు అధినాయకుడయ్యెను. సరస్వతి సకల విద్యాధిపత్యంబు వహించి, విద్యాప్రదాయినిగా ప్రసిద్ధిగాంచిందని మన పురాణాలు తెలుపుతున్నాయి.


ఈ హయగ్రీవ జయంతి నాడు విద్యార్థులు ఈ స్వామిని పూజించినచో మంచి విద్యావంతులు కాగలరు.


జంధ్యాల పౌర్ణమి

శ్రావణ పౌర్ణమి నాడు యజ్నోపవీతధారులందరూ నూతన యజ్ఞోపవీతం ధరిస్తారు. ఎందుకంటే సంవత్సరం అంతా ఏమైనా గాయత్రీ జపలోపం జరిగినా, అనుష్టాన లోపాలేమైనా ఉన్నా వాటికి ప్రాయశ్చిత్తంగా  ఉపాకర్మ చేసి నూతన యజ్ఞోపవీతధారణ జరుపుతారు. 

విద్యాధిపతి హయగ్రీవుడు కనుక వేదవిద్యను అభ్యసించేవారు స్వరలోపం, ఉచ్ఛారణ లోపం జరిగినా దాని ప్రాయశ్చిత్తార్థం గురుహోమం, ఉపాకర్మ జరిపి యజ్ఞోపవీతధారణ చేస్తారు. 

ఉపవీతుల యజ్ఞోపవీతాలు దారపు పోగులే. అనుపవీతుల రక్షలూ దారపు పోగులే. స్త్రీల వ్రత తోరాలూ దారపు పోగులే. మంగళ సూత్రాలూ దారపు పోగులే. ఇలా హిందువు ఎంతటి వారైనా ధర్మం కోసం దారపు పోగుకి కూడా జీవితాంతం కట్టుబడి ఉంటారనే ఉదాత్త భావం ఈ పర్వ దినాల్లో ఇమిడి ఉంది.  







రాఖీ పౌర్ణమి (రక్షా బంధనం)

 రక్ష కట్టుకునేటప్పుడు చదివే  శ్లోకం:-- 

“యేన బద్ధో బలీ రాజా – దానవేంద్రో మహాబలః
తేనత్వాం అభి బధ్నామి – రక్షే మాచల మాచల”

భావం:--
ఓ రక్షబంధమా ! మహా బలవంతుడూ, రాక్షసరాజు అయిన బలిచక్రవర్తిని బంధించినావు. కాబట్టి నేను నిన్ను ధరిస్తున్నాను.

రాఖీ కట్టే విధానం---పళ్ళెంలో రాఖీ, కుంకుమా, కర్పూరం, స్వీట్స్, మొదలైనవి ఉంచుతారు. సోదరునికి నుదుట బొట్టుపెట్టి, హారతిచ్చి, రక్షకట్టి, తీపి తినిపిస్తారు. సోదరుడు అప్పుడు అక్కచెల్లెళ్ళకు బహుమతులు ఇస్తారు.            

రక్షాబంధన్ కు భారతీయ సంస్కృతిలో ఎంతో ప్రాధాన్యం ఉంది.  ఈ రోజు రాఖీ పండుగను సోదరసోదరీమణుల అన్యోన్యతకు గుర్తుగా జరుపుకుంటారు. అక్కచెల్లెళ్ళు తమ సోదరుల నుండి రక్ష కోరుతూ, సోదరులకు రక్ష కడతారు. పదికాలాలు తమను చల్లగా కాపాడమని కోరుకుంటారు. ఇంతే కాక ఈ రక్షవలన సోదరునికి అపమృత్యుదోషాలు పూర్తిగా తొలగింపబడుతాయని, ఆయురారోగ్యాలు, ఐశ్వర్య సుఖ సిరిసంపదలు కలగాలని కోరుకుంటూ కూడా ఈ రక్ష కడతారు. తమ క్షేమాన్ని ఎల్లపుడూ కోరుకునే సోదరీమణులకు, సోదరులు తమ శక్తి కొలది బహుతములు ఇచ్చి కృతజ్ఞతలు తెలుపుకుంటారు.దీనికి రక్తసంబంధంతో పనిలేదు, ఎవరైనా సరే, తన సోదరుడిగా భావించుకునే సోదరి కేవలం రక్షాబంధనంతో ఆ బంధాన్ని శాశ్వితం చేసుకుంటుంది. 

"సర్వ రోగోపశమనం సర్వాశుభ వినాశకమ్
సకృత్కృతే నాబ్దమేకం యేన రక్షా కృతాభవేతీ"

పూర్ణిమ రోజున కట్టిన రక్షా సూత్రం సమస్త రోగాలను, అశుభాలను నశింపజేస్తుంది. ఏడాదిలో ఒకసారి దీనిని ధరిస్తే సంవత్సరమంతా రక్షణ లభిస్తుంది. జన్మతః సోదరులు కాని వారందరినీ ఏకత్రాటిపైకి తెచ్చే సౌభ్రాతృత్వం ‘రక్షాబంధన్’లో ఇమిడి ఉంది.










పౌరాణిక చరిత్రలు

(1)

శ్రీకృష్ణుడికి ఒకసారి మణికట్టు వద్ద దెబ్బ తగిలి రక్తం కారుతుంటే ద్రౌపది తన చీర పమిటకొంగును చింపి, కట్టుకడుతుంది. కౌరవ సభలో దుశ్శాసనుడు ద్రౌపదిని చీరలాగుతుండగా శ్రీకృష్ణుడు తన శ్రేయస్సు కోరిన సోదరికి నిండుసభలో అవమానము జరగకుండా చీరలను ఇచ్చి ఆమె గౌరవాన్ని కాపాడేడు. ఇంకా వివిధ సందర్భాల్లో ఆమెకు రక్షణను కలిగించేడు.  


(2)

వామనుడిగా వచ్చిన శ్రీ మహావిష్ణువు బలిని పాతాళానికి తొక్కగా, అతని మనవి మేరకు రాజ్యానికి రక్షగా అక్కడే ఉన్నాడట. లక్ష్మీదేవి ఈ విషయం తెలుసుకుని బ్రహ్మణ స్ర్తి రూపంలో పాతాళానికి వెళ్లి శ్రావణ పౌర్ణమి రోజునే బలికి రక్ష కట్టగా, దీంతో ఏమి బహుమతి కావాలో కోరుకోమని చక్రవర్తి  అడుగగా,  వెంటనే మహాలక్ష్మి తన నిజస్వరూపంలోకి వచ్చి తన స్వామిని విడిచి పెట్టాలని కోరుతుంది. దీంతో బలిచక్రవర్తి,  శ్రీహరిని విడిచిపెడతాడు. 


చారిత్రక కథనాలు

(1) 

గ్రీకు దేశస్తుడు అలేగ్జాందర్ భార్య , మన భారత దేశమును పరిపాలిస్తున్న రాజైన పురుషోత్తమునికి రాఖీ కడుతుంది. ఇది ఆ దేశపు రాచరిక సాంప్రదాయము.అన్నా చెల్లెళ్ళ సంబందమును నిశ్చయముగా తెలియ చెప్పే పండుగ.
(2)

కర్ణావతి అనే మహిళ చిత్తోర్‌గడ్‌ రాణిగా ఉండేవారు. భర్త అకాల మరణంతో రాజ్యభారం ఆమె మీద పడుతుంది. అది అవకాశంగా భావించిన గుజరాత్‌ సుల్తాన్‌ బహుదూర్‌ షా చిత్తోర్‌ గడ్ పై తన సేనలతో దండెత్తుతాడు. అతనిని ఎదుర్కొనేందుకు ఏమి చేయాలో పాలుపోని కర్ణావతి సాయం కోరుతూ మొఘల్‌ చక్రవర్తి అయిన హుమాయూన్‌కు ఒక రాఖీని పంపి తనను, తన రాజ్యాన్ని రక్షించమని కోరింది. ఈ రాఖీతో కర్ణావతిని తన సోదరిగా భావించి చక్రవర్తి ఆమెకు అండగా నిలువడమే కాకుండా బహుదూర్‌షాను యుద్ధంలో ఓడిస్తాడు. 

ఈవిధంగా దేశం నలుమూలలా కులమతాలకతీతంగా అందరూ ఎంతో ఆనందంగా జరుపుకొనే పండుగ ఇది.  


సోదరులందరకు రాఖీ (రక్షాబంధన) శుభాకాంక్షలు  

August 17, 2013

కనకధారా స్తోత్రం .......... శ్రీ ఆదిశంకరాచార్య విరచితము

కనకధారా స్తోత్రం .......... శ్రీ ఆదిశంకరాచార్య విరచితము




అంగం హరేః పులక భూషణ మాశ్రయన్తీ బృంగాంగనేవ ముఖళాభరణం తమాలమ్! అంగీకృతాఖిల విభూతి రసంగలీలా మాంగల్యదాస్తు మమ మంగళ దేవతాయాః !!

మొగ్గలతో నిండియున్న చీకటి కానుగ (చెట్టు) ను ఆడుతుమ్మెద వలె గగుర్పాటుతో ఉన్న విష్ణుదేవుని నాశ్రయించినదియు, సకలైశ్వర్యములకు స్థానమైనదియు అగు లక్ష్మీదేవి నాకు శుభములను ఇచ్చుగాక.  

ముగ్దా ముహుర్విదధతీ వదనే మురారేః ప్రేమత్ర పాప్రిణి హితాని గతా గతాని !
మాలాదృశోర్మధు కరీవ మహోత్ప లేయా సామే శ్రియం దిశతు సాగర సంభావా యాః !!

పెద్ద నల్లకలువపై నుండు ఆడు తుమ్మెద వలె శ్రీహరి ముఖమునందు ప్రేమ లజ్జలచే ముందుకు వెనుకకు ప్రసరించుచున్నఆ లక్ష్మీదేవి దృష్టి  నాకు సంపదను ప్రసాదించుగాక.  

3
విశ్వా మరేంద్ర పదవిభ్రమదానదక్ష మానంద హేతురదికం మురవిద్విషోపి. ఈషన్నీషీదతుమయి క్షణ మీక్షణార్థ మిందీవరోదర సహోదర మిందియా యాః !!

సకల దేవేంద్ర పదవి నీయగలదియు, విష్ణువు సంతోషమునకు కారణమైనదియు, నల్లకలువలను పోలునదియు అగు లక్ష్మీదేవి కటాక్షము క్షణకాలం నాపై నిలిచియుండును గాక. 

4
అమీలితాక్ష మధిగ్యమ ముదా ముకుంద మానంద కంద మనిషేష మనంగ తంత్రం!
అకేకరస్థిత కనీనిక పక్ష్మనేత్రం భూత్యై భవన్మమ భుజంగ శయాంగనాయాః !!

మూసికొన్న కన్నులు గలవాడును, ఆనందమునకు కారణభూతుడయిన మురారిని సంతోషముతో గూడుటచే, ఱెప్పపాటు లేనిదియు, కామ వశమైనదియు, కుచితమైన కనుపాపలును, ఱెప్పలును గలదియు అగు లక్ష్మీదేవి దృష్టి  నాకు సంపద నొసంగునుగాక. 

5
బాహ్వంతరే మధుజితశ్శ్రిత కౌస్తు భేయా హారావళీవ మరి నిలమయీ విభాతి !
కామ ప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణ మావహతుమే కమలాల యామాః !!

మణిగల శ్రీహరిని వక్షస్థలమందలి నీలమణి కౌస్తుభము హారములాగ ప్రకాశించునదియు, భగవంతునికే కోర్కెలను ఇచ్చునట్టిదియు  అగు లక్ష్మీదేవి యొక్క కటాక్ష పరంపర నాకు శుభమును చేకూర్చుగాక.  

6
కాలాంబు దాళి లలితో రసి కైటభారేః ర్దారాధరే స్ఫురతి యా తటిదంగనేవ !
మాతుస్సమస్త జగతాం మహనీయమూర్తిః భద్రాణి మే దిశతు భార్గవ నందనాయాః !!

కారుమబ్బులయందు మెరుపుతీగవలె, మేఘశ్యాముడగు విష్ణువు వక్షస్థలమందు ప్రకాశించుచున్న,  లోకమాత ఐనట్టి  లక్ష్మీదేవి నాకు శుభముల నిచ్చుగాక. 

7
ప్రాప్తం పదం ప్రథమతఃఖలు యత్ప్రభావాత్ మాంగల్య భాజి మధుమాథిని మన్మథేన!! మయ్యపతే త్తదిహ మంథర మీక్షణార్థం మందాల సంచ మకరాలయ కన్యకాయాః !

ఏ దేవి దృష్టి మహిమవలన శుభమును పొందిన విష్ణునందు  మన్మధుడు నిలిచెనో అట్టి క్షీరాబ్ధి కన్యక అగు లక్ష్మీదేవి యొక్క మందమగు దృష్టి  నాయందు ప్రసరించునుగాక.  

8
దద్యాద్దయాను పవనోద్రవిణాంబు ధారా మస్మిన్న కించన విహంగ శిశౌ విషణ్ణే !!
దుష్మర్మ ఘర్మమపనీయ చిర్టయదూరం నారాయణ ప్రణయనీ నయనాంబువహః !

శ్రీమన్నారాయణుని శ్రీదేవి అనెడి మేఘము పేదవాడననెడి విచారము పొందిన చాతకపక్షినగు నా యందు చాలాకాలముగా ఉన్న దుష్కర్మమనెడి తాపమును తొలగించి, నాపై ధనవర్ష ధారను కురిపించునుగాక.  

9
ఇష్టా విశిష్ట మతయోపి యయా దయార్ద్ర దృష్ట్యా త్రివిష్టప పదం సులభం లభంతే !
దృష్టిః ప్రహృష్ట కమలోదర దీప్తి రిష్టాం పుష్టి కృషీష్ట మమ పుష్కర విష్టరాయాః !!

హితులగు జ్ఞానులు ఎవరి దయాదృష్టిచే సులభముగా ఇంద్రపదవిని పొందుచున్నారో పద్మములోని భాగము వలె ప్రకాశించు అట్టి పద్మాసన(లక్ష్మీ) దృష్టి నేను కోరిన సంపదను నాకు అనుగ్రహించుగాక.

10
గీర్ధవ తేతి గరుడద్వజ సుందరీతి శాకంభరీతి శశశేఖర వల్లభేతి !
సృష్టి స్థితి ప్రళయకేళిషు సంస్థితాయై తస్యై నమ స్త్రిభువనైక గురో స్తరుణ్యై !!

సృష్టి స్థితి ప్రళయ కార్యములందు గీర్దేవత(సరస్వతి) అనియు, విష్ణుపత్ని అనియు శాకాంభరి అనియు శివకళత్రము అనియు ఏ దేవత పిలువబడుచున్నదో అట్టి విష్ణుపత్ని అగు లక్ష్మీకి నమస్కరిస్తున్నాను.  

11
శ్రుత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రశూత్యే రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై !
శక్త్యై నమోస్తు శతపత్రనికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై !!

పుణ్యకార్యములు ఫలము నొసగు శ్రుతిరూపిణియు, సౌందర్య గుణసముద్ర యగు రతిరూపిణియును, పద్మనివాసిని అగు శక్తి రూపిణియు అగు లక్ష్మీదేవికి నమస్కారము.

12
నమోస్తు నాళిక నిభాననాయై నమోస్తు దుగ్దోదధి జన్మభూమ్యై !
నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై !!

పద్మమును బోలిన ముఖము గలదియు, క్షీరసముద్రమునందు జన్మించినదియు, చంద్రునికి, అమృతమునకు తోబుట్టువును, నారాయణుని పత్ని అగు లక్ష్మీదేవికి నమస్కారము.  

13 
నమోస్తు హేమాంభుజ పీఠికాయై  నమోస్తు భూమణ్డల నాయికాయై 
నమోస్తు దేవాది దయాపరాయై నమోస్తు శార్ఙ్ఙాయుధ వల్లభాయై !!

భావం 
బంగారు పద్మము పీఠముగా గలదియు, భూమండలమునకు నాయిక అయినదియు, దేవతలలో దయయే ముఖ్యముగా గలదియు, విష్ణువునకు ప్రియురాలు  అయిన లక్ష్మీదేవికి నమస్కారము. 

14 
నమోస్తు దేవ్యై భృగు నందనాయై నమోస్తు విష్ణోరురసి స్థితాయై 
నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై నమోస్తు దామోదర వల్లభాయై !!

భావం 
భృగుమహర్షి పుత్రికయును, దేవియు, విష్ణువక్షస్థలవాసినియు, పద్మనివాసినియు విష్ణువుకు ప్రియురాలు అయిన లక్ష్మీదేవికి నమస్కారము.  

15 
నమోస్తు కాంత్యై కమలేక్షణాయై నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై
నమోస్తు దేవాదిభి రర్చితాయై నమోస్తు నందాత్మజ వల్లభాయై !!

భావం 
తామరపువ్వు వంటి కన్నులు గలదియు, ప్రకాశించునదియు లోకములకు తల్లియు, దేవతలచే పూజింపబడునదియు, విష్ణువుకు ప్రియురాలు అగు లక్ష్మీదేవికి నమస్కారము.  

16
సంపత్కరాణి సకలేంద్రియనందనాని సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి !
త్వద్వందనాని దురితాహరణోద్యతాని మామేవ మాతరనిశం కలయంతు మాన్యే !!

పద్మములవంటి కన్నులు గల పూజ్యురాలవగు నోయమ్మా, సంపదను కల్గించునవియు, ఇంద్రియములను సంతోషమును కలిగించునవి, చక్రవర్తిత్వము నొసగగలవియు, పాపములను తొలగించునవియు అగు నీకు చేయు వందనములు ఎల్లపుడును నన్నే కృతార్థునిజేయుగాక.

17
యత్కటాక్ష సముపాసనావిధిః సేవకస్య సకలర్థ సంపదః !
సంతనోతి వచనాంగ మానసైః త్వాం మురారి హృదయేశ్వరీం భజే !!

ఏ నీ కడగంటి చూపును సేవించుట సేవకునికి సకల సంపదలను కూర్చుచున్నదో అట్టి విష్ణుపత్నివగు నిన్ను మనోవాక్కాయములనెడి  త్రికరణములతో సేవించుచున్నాను.  

18
సరసిజనిలయే ! సరొజహస్తే ! దవళత మాంశుక గందమాల్య శోభే !
భగవతి ! హరివల్లభే ! మనోజ్ఞే ! త్రిభువన భూతకరీ ! ప్రసీద మహ్యం !!

కమలములవంటి కన్నులు గలదానా! చేతియందు పద్మముగలదానా! తెల్లని వస్త్రగంధ పుష్పమాలికలచే ప్రకాశించుదానా! షడ్గుణములు గలదానా!  అందమైనదానా! ముల్లోకములకు ఐశ్వర్యము  కలిగించుదానా! ఓ విష్ణుపత్నీ! నన్ననుగ్రహింపుము.  

19
దిగ్ఘస్తభిః కనక కుంభముఖావ సృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగిం !
ప్రాత ర్న మామి జగతాం జననీ మశేష లోకధినాథ గృహిణీ మమృతాబ్ది పుత్రిం !!

దిగ్గజములచే బంగారు కుండలనుండి పోయబడిన నిర్మలములుగు ఆకాశ జలములచే తడుపబడిన శరీరము కలదియు, లోకములకు జననియు, లోకాధిపతికి భార్యయు, క్షీరసాగర పుత్రియు అగు లక్ష్మీదేవికి ఉదయమున నమస్కరించుచున్నాను. 

20
కమలే ! కమలాక్ష వల్లభే !త్వం కరుణాపూర తరంగితై రపాంగైః !
అవలోకయ మా మకించనానం ప్రథమం పాత్ర మకృతిమం దయాయాః !!

నారాయణునికి ప్రియురాలవగునో లక్ష్మీ! దరిద్రులలో ప్రధముడను, నీ దయకు యథార్థముగా తగిన వాడనగు నన్ను నీ కరుణాకటాక్షములతో చూడుముతల్లీ. 

21
స్తువంతి యే స్తుతిభి రమూభి రన్వహం త్రయీ మయీం త్రిభువనమాత్రం రమాం !
గుణాధికా గురుతుర భాగ్యభాజినో భవంతి తే భువి బుధ భావితాశయాః !!

ఎవరీ స్తోత్రములచే ప్రతిరోజు వేదరూపిణియు, త్రిలోకమాతయు అగు లక్ష్మీదేవిని స్తుతింతురో వారు గుణవంతులుగను మంచి భాగ్యవంతులలో గొప్ప భాగ్యవంతులుగను బుధులచే కొనియాడబడెడి  వారుగను అగుచున్నారు. 


సువర్ణధారా స్తోత్రం యచ్ఛంకరాచార్య నిర్మితం
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స కుబేరసమో భవేత్ 
!!

శంకరాచార్యులచే రచింపబడిన కనకధారాస్తోత్రమును ఎవరు నిత్యమూ త్రికాలములయందు పఠించునో వారు కుబేరునితో సమానులగుదురు.  

__/\__ ఇతి శ్రీ శంకర భగవత్పాద విరచితం కనకధారాస్తోత్రం సంపూర్ణం.__/\__     




August 12, 2013

శ్రీ సుదర్శనాష్టకం

 శ్రీ సుదర్శనాష్టకం

(నేడు సుదర్శన పెరుమాళ్ళు తిరునక్షత్రం(పుట్టినరోజు) 

ప్రతిభటశ్రేణిభీషణ,వరగుణస్తోమభూషణ,
జనిభయస్థానతారణ,జగదవస్థానకారణ,
నిఖిలదుష్కర్మకర్మన,నిగమ సద్ధర్మదర్శన,
జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన ll

శుభజగద్రూపమణ్డన,సురజనత్రాసఖణ్డన,
శతమఖమ్రహ్మవన్దిత,శతపథబ్రహ్మనన్దిత,
ప్రథితవిద్వత్సపక్షిత,భజదహిర్బుధ్న్యలక్షిత
జయజయ శ్రీ సుదర్శన, జయజయ శ్రీ సుదర్శన ll

స్ఫుటతటిజ్జాలపిఞ్జర,పృథుతరజ్వాలపఞ్జర,
పరిగతప్రత్నవిగ్రహ,పటుతరప్రజ్ఞదుర్గ్రహ,
ప్రహరణగ్రామమణ్డిత,పరిజనత్రాణపణ్డిత
జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన ll

నిజపదప్రీతసద్గుణ,నిరుపధిస్ఫీతషడ్గుణ,
నిగమనిర్వ్యూఢవైభవ,నిజపరవ్యూహవైభవ,
హరిహయద్వేషిదారణ,హరపుర ప్లోషకారణ,
జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన ll

దనుజవిస్తారకర్తన,జనితమిస్రావికర్తన,
దనుజవిద్యా నికర్తన,భజదవిద్యానివర్తన,
అమరదృష్టస్వవిక్రమ,సమరజుష్ట భ్రమిక్రమ,
జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన ll

ప్రతిముఖాలీఢబన్ధుర,పృథుమహాహేతిదన్తుర,
వికటమాయాబహిష్కృత,వివిధమాలా పరిష్కృత,
స్థిరమహాతన్త్రయన్త్రిత,దృఢదయాతన్త్రయన్త్రిత,
జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన ll

మహితసంపత్సదక్షర,విహితసంపత్షడక్షర,
షడరచక్రప్రతిష్ఠిత,సకలతత్వప్రతిష్ఠిత,
వివిధసంకల్పకల్పక,విబుధసంకల్పకల్పక,
జయజయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన ll

భువననేతస్త్రయీమయ,సవనతేజస్త్రయీమయ,
నిరవధిస్వాదుచిన్మయ,నిఖిలశక్తే జగన్మయ,
అమితవిశ్వక్రియామయ,శమితవిష్వగ్బయామయ
జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన ll



https://www.youtube.com/watch?v=W3R5Gcfynmc

August 8, 2013

శ్రీ ఆండాళ్ తనియ

శ్రీ ఆండాళ్ తనియ-----

కర్కటే పూర్వఫల్గున్యాం తులసికాననోద్భవామ్ |
పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీమ్||

నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర సిద్ధ మధ్యాపయంతీ
స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భూంక్తే
గోదా తస్యై నమ ఇద మిదం భూయ ఏవాస్తు భూయః ||