April 25, 2014

Brahmotsav 2014

Jai Shri Radhe -- Radhe!! Radhe!!
(బృందావనం రాధామాధవ దివ్యదేశ్ లో నాన్నగారు - తమ్ముడు చేయించిన బ్రహ్మోత్సవాల కార్యక్రమం.... మా పెద్దబ్బాయి చేసిన వీడియో ఇది) 
Now we are watching Brahmotsav of sri Radha Madhav Divya Desh. It was established by his holiness of Sri Swamy Anantacharya ji in a peaceful location at Vrindavan, Chaitany Vihar, Burja road with divine purpose and noble cause.

April 23, 2014

Thiruppavai 3va pasuram ...... తిరుప్పావై మూడవరోజు పాశురం

Thiruppavai 3va pasuram ...... తిరుప్పావై మూడవరోజు పాశురం
వ్యాఖ్యాత ..... ఇరగవరపు పద్మహాస చక్రవర్తి

Thiruppavai 2va pasuram .... తిరుప్పావై రెండవరోజు పాశురం

Thiruppavai 2va pasuram...... తిరుప్పావై రెండవరోజు పాశురం

Thiruppavai 1va Pasuram.... తిరుప్పావై మొదటి పాశురం

తిరుప్పావై మొదటి పాశురం
వ్యాఖ్యాత .... ఇరగవరపు పద్మహాస చక్రవర్తి

Radhe Radhe Radheshyam

Radhe Radhe Radheshyam

April 22, 2014

నృసింహజయంతి

నృసింహజయంతి

"వృషభే స్వాతి నక్షత్రే చతుర్ధశ్యాం శుభేదినే l
సంధ్యాకాలేన సంయుక్తే స్తంభోద్భవ నృకేసరీ ll "

ఈరోజు నృసింహజయంతి...... అంటే హిరణ్యాక్షుని, నృసింహస్వామి సంహరించినరోజు. హిరణ్యాక్షుని అసురసంధ్యవేళ(సూర్యాస్తమయ సమయంలో) సంహరించెను కదా .....అంటే నృసింహస్వామి అవతారం ఈ సమయంలోనే జరిగింది కనుక .....ఈ రోజు ఈ సమయంలోనే నరసింహస్వామికి ప్రత్యేకపూజలు, అభిషేకాలు, ఈ అసురసంధ్యవేళలోనే జరుపుతారు.

ఈ నృసింహజయంతి అనేది సూర్యుడు వృషభరాశిలోకి ప్రవేశించినప్పుడు, శుద్ధ చతుర్ధశి నాడు జరుగుతుంది. ఒక్కొక్కసారి ఈ వృషభరాశి వైశాఖమాసంలో, ఒక్కొక్కసారి జ్యేష్ట మాసంలో వస్తుంది.

దేశంమొత్తంలో.... లేదా రాష్ట్రం మొత్తంలో ఉన్న అన్ని నారసింహ క్షేత్రాలలో ఈ రోజు ఈ వేడుకను కన్నులపండుగగా జరుపుతారు.

సుందరాయ సుభాంగాయ మంగళాయ మహౌజసేl
సింహసైల నివాసాయ శ్రీనృసింహాయ మంగళం ll  


బేలూరు

బేలూరు


బేలూరు నగరం--కర్ణాటక రాష్ట్రం లో......బెంగుళూరుకు సమీపంలో ఉంది...

దక్షిణ బెనారస్ గా పేరు గాంచిన బేలూరు-- శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. జైన మరియు వైష్ణవ సంస్కృతికి ప్రతీకమైన ఈ పురాతన నగరం "వేలాపురి" అని కూడా పిలవబడేది.

బేలూరు నందు చెన్నకేశవ ఆలయం శిల్పకళకు ముఖ్య ఆకర్షణగా నిలుస్తుంది. ఇక్కడ ఉన్న శిల్పకళ, కర్ణాటక రాష్ట్రంలోనే కాకుండా... భారతదేశంలోనే ఉత్తమ శిల్పకళగా పేరొందినది. విష్ణువర్ధనుడు అనే హొయసల రాజు 1117 లో తన దిగ్విజయములకు స్మారకంగా ఈ చేన్నకేశవ ఆలయమును నిర్మించాడు. అందుకే ఇక్కడ దేవుడిని విజయనారాయణ అని కూడా పిలుస్తారు. దీనిని పూర్తిచెయ్యటానికి 103 సంవత్సరాలు పట్టిందట.

ఈ దేవాలయానికి వెలుపలి భాగంలో ఉన్న చిన్న గుడిలో షట్కోణాకారం లో సుదర్శన విగ్రహం ఉంది.... ఈ దేవస్థానం లో రెండు గర్భగుడిలు ఉన్నాయి. ఈ దేవాలయం ముఖద్వారం పైన, ఎత్తైన గోపురం కట్టబడి ఉన్నది.  బలిష్టతకు మరియు భద్రతకు సంకేతమైన ఏనుగుల వరుస.... దానిపైన సింహాల వరస....ఆపైన  రామాయణ -- మహాభారత దృశ్యాలు.... మధ్య - మధ్యలో హంసలు.... వివిధ భంగిమలలో చెక్కబడిన చిన్న చిన్న విగ్రహాలు..... ఈ విధంగా గోడల మీద చాలా ఆకర్షణీయమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఈ దేవాలయానికి చుట్టూ 42 అందమైన శిల్పాలు మనం చూడవచ్చును.


ఒక శిల్పము యొక్క విశిష్టత ఏమిటంటే--- సుందరి మరియు చిలుక----ఒక శిల్పం ఎడమ చేతిలో ఉన్న చిలుకతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఆమె కుడిచేతికి ఉన్న గాజులను మనం పైకి... క్రిందికి కదపవచ్చును. అంటే అప్పటి కాలంలో శిల్పుల నైపుణ్యం మనం చూసి తరించవలసిందే కానీ వర్ణించలేము.

చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రవేశించినంతనే జయవిజయుల విగాహాలను మనం చూడవచ్చును. గర్భగుడిలో ఉన్న రాళ్ళను...స్తంభాలను.... బంగారము మరియు రాగిరేకులతో  తాపడం చేసారు. గర్భగుడిలో ఉన్న చెన్నకేశవ స్వామి----మహావిష్ణువు అవతారములలో ఒకటైన -- మోహినీ అవతార రూపంలో... పట్టు చీర మరియు ముక్కుపుడక... పూలను ధరించిన రూపంలో మనకు దర్శనమిస్తాడు...స్వామికి ఇరుపక్కల దేవేరులు ఇద్దరూ కొలువు తీరి ఉన్నారు.

ఈ దేవాలయమునికి దక్షిణభాగంలో.... కప్పెచెన్నగరాయ అనే దేవాలయం ఉంది. చాలా ఆకర్షణీయంగా కనబడుతున్న కప్పెచెన్నగరాయ విగ్రహాన్ని విష్ణువర్ధన మహారాజు యొక్క పట్టపురాణి శాంతలాదేవి ప్రతిష్టించారు. ఈ దేవాలయానికి పేరు ఎలా వచ్చింది అనటానికి, ఒక చిన్న కథ ప్రచారంలో ఉంది.

అమరశిల్పి జక్కన్న తన స్వగ్రామాన్ని వదిలిపెట్టి దేశపర్యటన చేస్తూ బేలూరుకి చేరుకొని, అక్కడ జరుగుతున్న దేవాలయ నిర్మాణంలో కార్యక్రమంలో నిమగ్నుడై ఉంటాడు. అతని కుమారుడైన డంకణాచారి కూడా మంచి శిల్పి అని పేరు తెచ్చుకొని బెలూరుకి చేరుకుంటాడు...... ఐతే తనతండ్రి ఒక శిల్పి అని తెలియదు. జక్కన్న ఈ దేవుని విగ్రహాన్ని చెక్కుతున్న సమయంలో.....డంకణ ఈ విగ్రహంలో చిన్న లోపం ఉన్నదని తెలుసుకొని చెబుతాడు. కానీ జక్కన్న దీనిలో లోపంలేదు...... లోపాన్ని చూపితే తనచేతిని నరుక్కుంటాను అని అన్నాడు. అర్చకులు ఆ లోపాన్ని పరీక్షించుటకు విగ్రహానికి చుట్టూ గంధాన్ని పూసి ఎండబెడతారు. చివరకు గంధం అంతా ఎండిపోయి.... లోపం ఉన్నచోట ఎండకుండా తడిగా ఉంటుంది. అక్కడ పగులగొట్టగా జీవమున్న కప్పు కనిపిస్తుంది. అందువలన ఈ విగ్రహానికి కప్పెచెన్నగరాయ అని పేరు వచ్చింది.... దేవాలయానికి కూడా అదే పేరు సార్థకమయ్యింది. అనంతరం జక్కన్న తన చేతిని నరికించుకుంటాడు..... ఆపై ఆ యువశిల్పి తన కొడుకు అని తెలుసుకొని సంతోషపడతాడు....

తరవాత జక్కన్న-- కొడుకుతో  తన స్వగ్రామానికి తిరిగివచ్చి.... కొడుకు సాయంతో చెన్నకేశవ స్వామి విగ్రహాన్ని చెక్కుతాడు..... విగ్రహం పూర్తిఅయ్యిన వెంటనే జక్కన్నకు తనచెయ్యి తిరిగివచ్చిందని చెబుతుంటారు..... ఈ సందర్భంగా ఆ ఊరికి కైదాళ అనే పేరు వచ్చింది. కైదాళ అంటే పోయినచేయ్యి తిరిగివచ్చుట అని అర్థం.

ఈ చేన్నకేశవ ఆలయంలో చాలావరకు శిల్పాలు జక్కన్న చెక్కినవే అని చెబుతారు.

చెన్నకేశవ ఆలయ ప్రాంగణంలో విచిత్రమైన  42 అడుగుల ఎత్తు ఉన్న ఒక స్తంభం ఉన్నది. ఇది ఏకశిలతో చెక్కబడినది. మరియు తనభారాన్ని తానే మోసుకుంటున్నది. దీనిని గురుత్వాకర్షణ స్థంభం అంటారు.


శ్రీ హనుమత్ జయంతి:--

శ్రీ హనుమత్ జయంతి


ఆంజనేయ స్వామి జననం----వైశాఖమాసం... కృష్ణపక్షం.... దశమి.... శనివారం.... పూర్వాభాద్ర నక్షత్రం లో జరిగింది..... అంజనాదేవి---కేసరీ దంపతులకు.... వాయుదేవుని వరప్రభావముచే ఆంజనేయుడు జన్మించాడు.

వైశఖమాసి కృష్ణాయాం - దశమ్యాం మందవాసరే!
పూర్వాభాద్రాభ్య నక్షత్రే - వైధ్రుతౌ హనుమా నభూతే||

అంజనానందం వీరం జానకీ శోకనాశనం l
కపీసమక్ష హంతారం వందే లంకా భయంకరం ll  

ఆంజనేయుడు పుట్టిన కొద్ది దినములలోనే సూర్యుని పండుగా భ్రమించి, మింగబోవగా... ఇంద్రుడు వజ్రాయుధముతో అనువు(దవడ) మీద కొట్టగా స్పృహ కోల్పోగా.... వాయుదేవునికి కోపంవచ్చి.... ఆంజనేయుని తీసుకొని ఎవరికీ కానరాక దాగియుండెను.... ఆ సమయంలో లోకములలో గాలి ఆడక.... జీవులన్నీ.....కటకటలాడిపోవగా,  అప్పుడు బ్రహ్మాది దేవతలంతా ప్రత్యక్షమయ్యి......ఆంజనేయుడు చిరంజీవి అనియు---విశేష పరాక్రమశాలి అనియు వరములిచ్చి "హనుమ" అని పిలిచి--- వాయుదేవుని శాంతింపజేసిరి.... అప్పటినుండి ఆంజనేయునుని.... హనుమంతుడు అని పిలిచారు. ఇంకా వాయునందనుడు, పవనపుత్రుడు, కేసరీతనయుడు, అంజనా నందుడు, రామబంటు, మొదలైన పేర్లతో పిలవబడతాడు.



హనుమాన్ అంజనాసూనుహు వాయుపుత్రో మహా బలహ l
రామేస్ట ఫల్గుణ సఖః పింగాక్షో అమిత విక్రమః l
ఉదధిక్రమణేశ్చైవ సీతాశోక వినాశకః l  
లక్ష్మణప్రాణదాతాచ దశగ్రీవస్య  దర్పహా ll

ఈ ద్వాదశ నామాలు అనునిత్యం త్రికాలములలో జపిస్తే శత్రుభయం అనేది ఉండదు.  

హనుమంతుడు... సూర్య భగవానుని వద్ద శిష్యునిగా చేరి... చతుర్వేదాలు నేర్చుకున్నాడు. సుగ్రీవునికి మంత్రిగా ఉండి, రామ--సుగ్రీవులకు మైత్రిని నెలకొల్పాడు. సీతాన్వేషణకు కూడా ముఖ్య పాత్రధారి ఇతనే.


హనుమకి సింధూరం అంటే ప్రీతి...... ఎందుకంటే....ఒకనాడు  సీతమ్మవారు నుదిటన సింధూరం ధరించగా హనుమ ఇలా అడిగాడంట.... అమ్మా నుదిటన సింధూరం ఎందుకు ధరించారు అని...... అప్పుడు సీతమ్మ ఈ విధంగా సమాధానం ఇచ్చారు......నుదిటన సింధూరం ధరిస్తే నా పతికి మంచి జరుగుతుంది అని. వెంటనే హనుమ---ఐతే నేను నా వళ్ళంతా సింధూరం పూసుకుంటాను అలా ఐతే నాస్వామికి ఎప్పుడూ మంచే జరుగుతుంది అని అన్నాడు.... అదిగో అప్పటినుండి హనుమకు వాళ్ళంతా సింధూరం పూస్తారు. స్వామికి తమలపాకులన్నా ప్రీతి ఎక్కువ....


హనుమకు వాహనం 'ఒంటె".

ఆంజనేయ పూజితస్చేత్  పూజితా సర్వదేవతాః l
హనుమన్మహిమా శక్యో  బ్రహ్మణాపిన వర్ణితుమ్ ll

భావం:-
ఆంజనేయస్వామిని పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్లే. బ్రహ్మ దేవుడు కూడా వర్ణింపజాలని మహిమ హనుమన్మహిమ.

హనుమ గూర్చి మనమెంత చెప్పుకున్నా తక్కువే.... అతని గురించి చెప్పుకుంటే.... అతనిముందు మనం కుప్పిగంతులేసినట్లే...


శ్రీరామ జయరామ జయజయరామ