July 25, 2014
శ్రీనివాసుని సంకీర్తనలు.....13
శ్రీనివాసుని సంకీర్తనలు.....13
తిరుమల వచ్చాను రామాహరి
తిరుమలేశుని చూచాను రామాహరి
తలనీలాలు నిచ్చాను రామాహరి
చేతులెత్తి మ్రొక్కేను రామాహరి
నామొర నాలకించరా రామాహరి
నీ కరుణాకటాక్షాలు కలిగించారా రామాహరి
దయచూపి వరమివ్వరా రామాహరి
కనికరించి కరుణచూపరా రామాహరి
ఆశీర్వదించి అష్టాఐశ్వర్యాలివ్వరా రామాహరి
ఆయురారోగ్యాలను ప్రసాదించరా రామాహరి
ఈచిన్నివాని కోరికలు తీర్చరా శ్రీహరి
ఏడుకొండలవాడ వెంకటరమణా గోవిందా గోవిందా ..........!
తిరుమలేశుని చూచాను రామాహరి
తలనీలాలు నిచ్చాను రామాహరి
చేతులెత్తి మ్రొక్కేను రామాహరి
నామొర నాలకించరా రామాహరి
నీ కరుణాకటాక్షాలు కలిగించారా రామాహరి
దయచూపి వరమివ్వరా రామాహరి
కనికరించి కరుణచూపరా రామాహరి
ఆశీర్వదించి అష్టాఐశ్వర్యాలివ్వరా రామాహరి
ఆయురారోగ్యాలను ప్రసాదించరా రామాహరి
ఈచిన్నివాని కోరికలు తీర్చరా శ్రీహరి
ఏడుకొండలవాడ వెంకటరమణా గోవిందా గోవిందా ..........!
శ్రీనివాసుని సంకీర్తనలు......12
శ్రీనివాసుని సంకీర్తనలు......12
లచ్చుమక్క లచ్చుమక్క లచ్చుమక్కో
మాయదారి మలయప్పను చూసినానక్కో
కొండమీద నున్నాడు లచ్చుమక్క
కోనలోన దాగినాడు లచ్చుమక్క
వచ్చేవారు, పోయేవారు సందులేరక్క
ఇచ్చుకోనేవారు పుచ్చుకొనేవారు ఎందరోనక్క
కోరికలు కోరేవారు కోకల్లలక్కా
కొదువలేక కరిమేఘుడై కరుణిన్చుతున్నాడక్క
పరమాత్మాయని పాదాలకు మొక్కుతున్నారక్క
సర్వాంతరయామియని సకలసేవలు చేయుచున్నారక్క
హరివిల్లులతొ రంగవల్లులు వేసినారక్క
రంగరంగ వైభవంగా రంగనాధుని నలంకరించినారక్క
కోటికాంతులతో కమలనాధుడు కళకళలాడుచున్నాడు
వెండికొండలపై వెన్నలై విరాజిల్లుతున్నాడక్క
ఏమిసెప్పనక్కా వేంకటేశుని వింతవింతలక్క
ఎన్నిజన్మలైన చాలవు వర్ణిన్చడానికక్కా
ఏడుకొండలకు ఒక్కసారి వెళ్ళొద్దామక్కా
వెంకటవిభుని వైభవాలు చూసివద్దామక్కా......
లచ్చుమక్క లచ్చుమక్క లచ్చుమక్కో
మాయదారి మలయప్పను చూసినానక్కో
కొండమీద నున్నాడు లచ్చుమక్క
కోనలోన దాగినాడు లచ్చుమక్క
వచ్చేవారు, పోయేవారు సందులేరక్క
ఇచ్చుకోనేవారు పుచ్చుకొనేవారు ఎందరోనక్క
కోరికలు కోరేవారు కోకల్లలక్కా
కొదువలేక కరిమేఘుడై కరుణిన్చుతున్నాడక్క
పరమాత్మాయని పాదాలకు మొక్కుతున్నారక్క
సర్వాంతరయామియని సకలసేవలు చేయుచున్నారక్క
హరివిల్లులతొ రంగవల్లులు వేసినారక్క
రంగరంగ వైభవంగా రంగనాధుని నలంకరించినారక్క
కోటికాంతులతో కమలనాధుడు కళకళలాడుచున్నాడు
వెండికొండలపై వెన్నలై విరాజిల్లుతున్నాడక్క
ఏమిసెప్పనక్కా వేంకటేశుని వింతవింతలక్క
ఎన్నిజన్మలైన చాలవు వర్ణిన్చడానికక్కా
ఏడుకొండలకు ఒక్కసారి వెళ్ళొద్దామక్కా
వెంకటవిభుని వైభవాలు చూసివద్దామక్కా......
శ్రీనివాసుని సంకీర్తనలు......11
శ్రీనివాసుని సంకీర్తనలు......11
సిరులుగిరుల సిన్నోడే సూడసక్కనోడే
సప్తలోక సుందరాంగుడే సప్తగిరి శ్రీనీవాసుడే
సూదంటి సూపులతో సక్కలిగింతలె పెడుతున్నాడే
సందేలకొచ్చినాడే సందమామను తెస్తనన్నాడే
ప్రేమ, ప్రణయమంటూ వెంటబడ్డాడే
సావాసమంటు సరసాలు సెయ్యమన్నాడే
సిగ్గాయెనే, మొగ్గాయెనే - బుగ్గేమో ఎరుపాయెనే
బెరుకాయెనే సురుకాయెనే మనసేమో బరువాయేనే
తప్పుతప్పురాసామినంటే తాళలేనన్నడే
కాదుగూడదంటే తిరుమలగిరులు రాసిస్తనన్నడే
మాఅయ్య ఒప్పుకోడంటే మంగా మనువాడతానన్నడే
ముత్యాలపందిరిలో ముచ్చటగా మూడుముళ్ళు వేసినాడే
మున్నాళ్లకే మూడునామాలవాడు మాయమై పోనాడే
ఏడేడుకొండలెక్కి ఏడుకొండలవాడై వెలిసినాడే!.......
సప్తలోక సుందరాంగుడే సప్తగిరి శ్రీనీవాసుడే
సూదంటి సూపులతో సక్కలిగింతలె పెడుతున్నాడే
సందేలకొచ్చినాడే సందమామను తెస్తనన్నాడే
ప్రేమ, ప్రణయమంటూ వెంటబడ్డాడే
సావాసమంటు సరసాలు సెయ్యమన్నాడే
సిగ్గాయెనే, మొగ్గాయెనే - బుగ్గేమో ఎరుపాయెనే
బెరుకాయెనే సురుకాయెనే మనసేమో బరువాయేనే
తప్పుతప్పురాసామినంటే తాళలేనన్నడే
కాదుగూడదంటే తిరుమలగిరులు రాసిస్తనన్నడే
మాఅయ్య ఒప్పుకోడంటే మంగా మనువాడతానన్నడే
ముత్యాలపందిరిలో ముచ్చటగా మూడుముళ్ళు వేసినాడే
మున్నాళ్లకే మూడునామాలవాడు మాయమై పోనాడే
ఏడేడుకొండలెక్కి ఏడుకొండలవాడై వెలిసినాడే!.......
శ్రీనివాసుని సంకీర్తనలు......10
శ్రీనివాసుని సంకీర్తనలు....... 10
రగడేలరా నాతో రామచంద్ర
రక్షించక నను రామచంద్ర
రామనామము జపించితిని
రామాలయము కట్టించితిని
రాముడే దేవుడని
శ్రీరాముడే సర్వమని
సర్వదా నిన్నే భజించితిని
సముద్రమంత కష్టాన్ని భరించితిని
ఇకనైనా ఇచ్చచూపరా ఇక్ష్వాకు చిలకా
జాగుచేయక జాలిచూపరా జానకినాయక
నీకు నే రామకోటి రాసి రణరంగధామా
రాగాల పల్లకిలో ఊరేగించెదను రవికులసోమా...
అభిమానముతోఆరాధించితిని
అంతఃపురమునకు ఆహ్వానించితిని
జగడమాడక జతచేరరా జానకీరమణ
దయతో దర్శనంబివ్వర దశరధనందన.......
రగడేలరా నాతో రామచంద్ర
రక్షించక నను రామచంద్ర
రామనామము జపించితిని
రామాలయము కట్టించితిని
రాముడే దేవుడని
శ్రీరాముడే సర్వమని
సర్వదా నిన్నే భజించితిని
సముద్రమంత కష్టాన్ని భరించితిని
ఇకనైనా ఇచ్చచూపరా ఇక్ష్వాకు చిలకా
జాగుచేయక జాలిచూపరా జానకినాయక
నీకు నే రామకోటి రాసి రణరంగధామా
రాగాల పల్లకిలో ఊరేగించెదను రవికులసోమా...
అభిమానముతోఆరాధించితిని
అంతఃపురమునకు ఆహ్వానించితిని
జగడమాడక జతచేరరా జానకీరమణ
దయతో దర్శనంబివ్వర దశరధనందన.......
శ్రీనివాసుని సంకీర్తనలు.....09
శ్రీనివాసుని సంకీర్తనలు.....09
దండాలు దశరధరామ
వేయి దండాలు నీకు కోదండరామా
రామపాదుకలతో భరతుడేలిన రాజ్యమున
రావణాసురుల రాక్షసకేళిలుతో
నవనారి సీతల మానాలు మంటకలిసిపోతుంటే
అక్షయపాత్రతో పంచభక్ష్యపరమాన్నాలు వడ్డించిన
కాశీ అన్నపూర్ణేశ్వరి దయగల్గిన పవిత్ర భారతాన
అన్నమో రామచంద్రా అన్న
ఆకలికేకలుతో అలమటించి పోతుంటే
ఆదుకొనేవాడు లేక ఆపేవాడు లేక
పాలించేవాడు లేక పట్టించుకొనేవారు లేక
రక్షించు రామచంద్రప్రభోనన్న రక్షించేవారు లేక
దయచూపు ధర్మప్రభోనన్న దారిచూపేవారు లేక
భయంతో బిక్కుబిక్కుమంటోంది నా భారతమాత
విన్నా వినరాని న్యాయగాంధారిలా
కన్నా కనరాని కలియుగగాంధారిలా
నాకేంటినన్న నవభారతనవయుగ సమాజామును చూచి
వేదనతో విలవిలలాడుతోంది నా భారతమాత
రా కన్నభూమికై కదలిరా కౌసల్యరామ
రా దివినుంచి భువికేగరా దశరధారామ
ధర్మాన్ని రక్షించరా రామ
నాదేశాన్ని కాపాడరా రామ
శరణుశరణు శ్రీరామ
ధర్మమో దశావతారకరామ
దండమో దశరధరామ
వేయి దండాలు నీకు కోదండరామా.......
దండాలు దశరధరామ
వేయి దండాలు నీకు కోదండరామా
రామపాదుకలతో భరతుడేలిన రాజ్యమున
రావణాసురుల రాక్షసకేళిలుతో
నవనారి సీతల మానాలు మంటకలిసిపోతుంటే
అక్షయపాత్రతో పంచభక్ష్యపరమాన్నాలు వడ్డించిన
కాశీ అన్నపూర్ణేశ్వరి దయగల్గిన పవిత్ర భారతాన
అన్నమో రామచంద్రా అన్న
ఆకలికేకలుతో అలమటించి పోతుంటే
ఆదుకొనేవాడు లేక ఆపేవాడు లేక
పాలించేవాడు లేక పట్టించుకొనేవారు లేక
రక్షించు రామచంద్రప్రభోనన్న రక్షించేవారు లేక
దయచూపు ధర్మప్రభోనన్న దారిచూపేవారు లేక
భయంతో బిక్కుబిక్కుమంటోంది నా భారతమాత
విన్నా వినరాని న్యాయగాంధారిలా
కన్నా కనరాని కలియుగగాంధారిలా
నాకేంటినన్న నవభారతనవయుగ సమాజామును చూచి
వేదనతో విలవిలలాడుతోంది నా భారతమాత
రా కన్నభూమికై కదలిరా కౌసల్యరామ
రా దివినుంచి భువికేగరా దశరధారామ
ధర్మాన్ని రక్షించరా రామ
నాదేశాన్ని కాపాడరా రామ
శరణుశరణు శ్రీరామ
ధర్మమో దశావతారకరామ
దండమో దశరధరామ
వేయి దండాలు నీకు కోదండరామా.......
శ్రీనివాసుని సంకీర్తనలు.....08
శ్రీనివాసుని సంకీర్తనలు......08
ఓరోరీ దేవుడా వేంకటేశుడా
వద్దొద్దురో దేవుడా వేంకటేశుడా
నీవరములు నాకొద్దు వేంకటేశుడా
ఊరువాడ వదిలినాను వేంకటేశుడా
వేవేలఆమడ దూరమాయే వేంకటేశుడా
ఏడేడుకొండలు ఎక్కినాను వేంకటేశుడా
దారిపొడుగు ఖర్చులాయె వేంకటేశుడా
వడ్డికాసులు ఏమీలేవ్ వేంకటేశుడా
కానీ అటుకులు తెచ్చినాను వేంకటేశుడా
సంతకు వెళ్ళలేదు వేంకటేశుడా
పువ్వులైన తేలేదు వేంకటేశుడా
కానీ పాటలు పాడుతాను వేంకటేశుడా
వరములు నాకొద్దు , వరహాలు నాకొద్దు
సొమ్ములు నాకొద్దు , పుణ్యమూ నాకొద్దు
ఓరోరీ దేవుడా వేంకటేశుడా....
నీదర్శనము నాకివ్వు వేంకటేశుడా
సర్వదర్శనము చూపించు వేంకటేశుడా
సంబరమాయెనూ నామనసు వేంకటేశుడా!
ఏడుకొండలవాడా వెంకటరమణ
గోవిందా గోవింద.....
వద్దొద్దురో దేవుడా వేంకటేశుడా
నీవరములు నాకొద్దు వేంకటేశుడా
ఊరువాడ వదిలినాను వేంకటేశుడా
వేవేలఆమడ దూరమాయే వేంకటేశుడా
ఏడేడుకొండలు ఎక్కినాను వేంకటేశుడా
దారిపొడుగు ఖర్చులాయె వేంకటేశుడా
వడ్డికాసులు ఏమీలేవ్ వేంకటేశుడా
కానీ అటుకులు తెచ్చినాను వేంకటేశుడా
సంతకు వెళ్ళలేదు వేంకటేశుడా
పువ్వులైన తేలేదు వేంకటేశుడా
కానీ పాటలు పాడుతాను వేంకటేశుడా
వరములు నాకొద్దు , వరహాలు నాకొద్దు
సొమ్ములు నాకొద్దు , పుణ్యమూ నాకొద్దు
ఓరోరీ దేవుడా వేంకటేశుడా....
నీదర్శనము నాకివ్వు వేంకటేశుడా
సర్వదర్శనము చూపించు వేంకటేశుడా
సంబరమాయెనూ నామనసు వేంకటేశుడా!
ఏడుకొండలవాడా వెంకటరమణ
గోవిందా గోవింద.....
Subscribe to:
Posts (Atom)
.jpg)

.jpg)
.jpg)



.jpg)