May 30, 2020

తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు

తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు



తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు

ప్రక్క తోడుగా భగవంతుడు తన
చక్రధారియై చెంతనె యుండగ

మ్రుచ్చు సోమకుని మును జంపిన యా
మత్స్యమూర్తి మన పక్షము నుండగ

సురల కొరకు మందర గిరి మోసిన
కూర్మావతారుని కృపమనకుండగ

హిరణ్యకశిపుని ఇరుచెక్కలుగా
పరచిన నరహరి ప్రక్కనే యుండగ

భూమి స్వర్గమును పొందుగ గొలిచిన
వామనుండు మనవాడై యుండగ

దశగ్రీవుమును దండించిన యా
దశరథ రాముని దయ మనకుండగ

దుష్ట కంసుని ద్రుంచినట్టి శ్రీ
కృష్ణుడు మనపై కృపతో నుండగ

రామదాసునిల రక్షించెదనని
ప్రేమతో పలికిన ప్రభువిటనుండగ

శ్రీభాగవత సుధాలహరి 2nd part

శ్రీ భాగవత సుధాలహరి ప్రవచనం ..... రెండవ భాగం .....By P.L.N.Prasad Garu

ప్రవచనం మధ్యలో పద్యాలు అందించినవారు.... శ్రీమతి యశోధర గారు & శ్రీమతి రామవల్లీ గారు


May 28, 2020

హరి హరి రామ నన్నరమర చూడకు

హరి హరి రామ నన్నరమర చూడకు


హరి హరి రామ నన్నరమర చూడకు

నిరతము నీ నామ స్మరణయే మరను  

దశరథ నందన దశముఖ మర్దన
పశుపతి రంజన పాప విమోచన                                            

మణిమయ భూషణ మంజుల భాషణ
రణజయ భీషణ రఘుకుల పోషణ   
                               
పతితపావన రామ భద్రశైల ధామ
సతతము శ్రీ రామదాసుడ నేను 

May 27, 2020

నిత్యానుసంధాన శ్లోకాలు

నిత్యానుసంధాన శ్లోకాలు 


కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ 

ఏహి సూర్య సహస్రాంశో తేజోరాశిః జగత్పతే 
అనుకమ్పయ మాం భక్త్యా గృహాణార్ఘ్యం ప్రసీదో 

ధ్యేయస్సదా సవితృ మండల మధ్య వర్తి 
నారాయణ సరసిజాసన సన్నివిష్టః 
కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీ 
హరీ హిరణ్మయ వపుర్ధృత శంఖ చక్రః 

అకాలమృత్యు హరణం సర్వవ్యాధి నివారణం 
సమస్తపాప హరణం విష్ణు పాదోదకం శుభం 

యుక్తాహార - విహారస్య - యుక్త - చేష్టస్య - కర్మసు
యుక్త - స్వప్నావ - బోధస్య - యోగః - భవతి - దుఃఖహా

అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహ-మాశ్రితః 
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్

శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయే‌உర్థినామ్ 
శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్
మంగళా శాసనపరైర్-మదాచార్య పురోగమైః
సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళమ్

క్షీర సాగర విహార అపరిమిత ఘోర పాతక విదార

క్షీర సాగర విహార అపరిమిత ఘోర పాతక విదార (త్యాగరాజ ఉత్సవ సంప్రదాయ కీర్తన)




క్షీర సాగర విహార అపరిమిత ఘోర పాతక విదార క్రూర జన గణ విదూర నిగమ సంచార సుందర శరీర శతమఖాహిత విభంగ శ్రీ రామ శమన రిపు సన్నుతాంగ శ్రిత మానవాంతరంగ జనకజా శృంగార జలజ భృంగ (క్షీ) రాజాధి రాజ వేష శ్రీ రామ రమణీయ కర సు-భూష రాజ నుత లలిత భాష శ్రీ త్యాగ- రాజాది భక్త పోష (క్షీ)


రామ జోగిమందు కొనరే ఓ జనులారా

రామ జోగిమందు కొనరే ఓ జనులారా




రామజోగి మందుమీరు - ప్రేమతో భుజియించరయ్యా కామ క్రోధముల నెల్ల కడకు పారద్రోలే మందు కాటుక కొండలవంటి కర్మములెడబాపే మందు సాటిలేని జగమునందు స్వామి రామజోగి మందు కోటి ధనములిత్తునని కొన్నను దొరకని మందు సాటిలేని భాగవతులు స్మరణ చేసి తలచు మందు వాదుకు చెప్పినగానీ వాని పాపములు గొట్టి ముదముతోనే మోక్షమిచ్చే ముద్దు రామజోగి మందు ముదముతో భద్రాద్రియందు - ముక్తిని పొందించే మందు సదయుడైన రామదాసు - సద్భక్తితో గొలిచే మందు

శ్రీరామ నామమే జిహ్వకు స్థిరమై ఉన్నది

శ్రీరామ నామమే జిహ్వకు స్థిరమై ఉన్నది 

శ్రీరామ నామమే జిహ్వకు స్థిరమై యున్నది
శ్రీరాముల కరుణయే లక్ష్మీ కరమై యున్నది

ఘోరమైన పాతకములు గొట్టేనన్నది
మమ్ము జేరకుండ ఆపదలను చెండేనన్నది

దారి తెలియని యమదూతల తరిమేనన్నది
శ్రీమన్నారాయణ దాసులకు చెలువైనది

మాయావాదుల పొందు మానుమన్నది
ఈ కాయ మస్థిరమని తలపోయు చున్నది

వదలని దుర్విషయ వాంచ వదలమన్నది
నా మదిలో హరి భజన సంపత్కరమైయున్నది

ముక్తిమార్గమునకిది మూలమన్నది
విరక్తుండు భద్రాచల రామదాసుడన్నది 

హరి హరి రామ నన్నరమర చూడకు

హరి హరి రామ నన్నరమర చూడకు
1
హరి హరి రామ నన్నరమర చూడకు
నిరతము నీ నామ స్మరణయే మరను
2
దశరథ నందన దశముఖ మర్దన
పశుపతి రంజన పాప విమోచన
3
మణిమయ భూషణ మంజుల భాషణ
రణజయ భీషణ రఘుకుల పోషణ
4
పతితపావన రామ భద్రశైల ధామ
సతతము శ్రీ రామదాసుడ నేను