December 13, 2016

History Of Malluru Hemachala Nrusimhaswamy

History Of Malluru Hemachala Nrusimhaswamy
మల్లూరు హేమాచల నృసింహస్వామివారి ఆలయచరిత్ర

Simhachalam Giri Pradakshina

Simhachalam Giri Pradakshina

December 12, 2016

Tirupati Venkanna Uregimpu Utsavam

Tirupati Madaveedhullo Venkanna Uregimpu Utsavam

About Gurupournami ......By Satuluri Ravi,

About Gurupournami ......By Satuluri Ravi
గురుపౌర్ణమి గురించి సాతులూరి రవి (మా బావ) చెప్పిన వాక్యాలు


My Brother's Speech About Gurupournami

My Brother's Speech About Gurupournami
 గురుపౌర్ణమి గురించి మా అన్నయ్య చెప్పిన వాక్యాలు

History Sri Muktikaantaa Mukteeswaraswamy ...... Mukteeswaram

History Sri Muktikaantaa Mukteeswaraswamy ...... Mukteeswaram
శ్రీ ముక్తీకాంతా క్షణముక్తీశ్వరస్వామి చరిత్ర ..... ముక్తీశ్వరమ్

History Of Mangalagiri Nrusimhaswamy

History Of Mangalagiri Nrusimhaswamy
పానకాల నృసింహస్వామి ఆలయ చరిత్ర మంగళగిరి

History Of Sri Shakteeswara Swamy .......Yanamadurru

History Of Sri Shakteeswara Swamy .......Yanamadurru
శ్రీ శక్తీశ్వరస్వామివారి ఆలయ చరిత్ర ..... యనమదుర్రు

December 11, 2016

దివ్యక్షేత్రం వాడపల్లి

దివ్యక్షేత్రం వాడపల్లి - వాడనిమల్లి దివ్యచరిత్ర 

ఒకానొకసారి సనకసనందాది మహర్షులందరూ వైకుంఠంలోని శ్రీమన్నారయణున్ని దర్శించుకున్నారు. ఆయనను అనేక విధములుగా స్తుతించి తరవాత వారు వచ్చిన పనిని తెలిపారు. కలియుగంలో ధర్మం ఒంటిపాదంలో నడుస్తుంది.ప్రజలు ఆహార విహారాలకే ప్రాధాన్యతనిస్తూ ఆచారహీనులుగా జీవిస్తూ కామక్రోధాలకు వశులై, అధర్మ జీవితం గడుపుతున్నారు. ఉపేక్షిస్తే అధర్మం మిగిలిన యుగాలకు కూడా ప్రాప్తిస్తుంది. కనుక ప్రజల్ని చక్కదిద్ది ధర్మాన్ని ఉద్ధరించే ఉపాయం సెలవిమ్మని ఋషులు మహావిష్ణువుని అర్చించారు. అప్పుడు విష్ణువు ఈవిధంగా చెప్పాడు. 
అధర్మం ప్రబలినప్పుడు స్వయంగా యుగయుగమందున అవసరాలకు అనుగుణంగా వివిధ 
అవతారాలు ధరించాను. కానీ కలియుగంలో పాపభూయిష్టము ఎక్కువ అయ్యింది. కొద్ధి మాత్రమే పుణ్యాన్వితం. కావున కలియుగంలో అర్చాస్వరూపుడనై భూలోకమున లక్ష్మీక్రీడాస్థానమై మానవుల యొక్క ఘోర సంసార బాధలను సాగరమున నౌకవలె దరిచేర్చునది అగు  గౌతమీ తీరమున నౌకపురమును (వాడపల్లి) పురమందు వెలుస్తాను. 

లక్ష్మీదేవితో పాటు ఒక చందన వృక్ష పేటికలో గౌతమీ ప్రవాహ మార్గంలో నౌకపురి(వాడపల్లి) చేరుకుంటాను. ఈ వృత్తాంతం అంతా తెలిసిన నారదుడు పురజనులకు తెలియపరుస్తాడు. 

కొంతకాలానికి నౌకపురి ప్రజలకు గౌతమీ ప్రవాహంలో కొట్టుకువస్తున్న చందాన వృక్షం కనిపించింది. తీరా ఒడ్డుకు తీసుకువద్దామని వెళ్ళినంతలో అదృశ్యమైపోవడం ప్రారంభించింది. ఒకరోజు గ్రామంలోని వృద్ధ బ్రాహ్మణులకు కలలో కనిపించి కాలికల్మషం వల్ల జ్ఞానం లోపించి మీరు నన్ను కనుగొనలేకపోతున్నారు. కనుక పురజనులందరూ వేకువనే గౌతమీ స్నానంతో పవిత్రులై మనగళవాయిద్యాలతో నౌకలో నది గర్భంలోకి వెళితే కృష్ణగరుడ వాలిన చోట నేనున్నచందన పేటిక దొరుకుతుందని చెబుతాడు. పురజనులు స్వామి ఆదేశాన్ని పాటించి నౌకలో నదీగర్భంలోనికి వెళ్ళగా చందన పేటిక లభిస్తోంది. దానిని ఒడ్డుకు తీసుకువచ్చి నిపుణుడైన శిల్పితో తెరిపించగా అందులో శంఖు చక్ర గదలతో ఒప్పుతున్న స్వామి దివ్యమంగళ విగ్రహం కనిపించింది. 

అంతలో అక్కడికి దేవర్షి నారదుడు విచ్చేశాడు. గతంలో ఋషులు వైకుంఠానికి వెళ్ళి ప్రజలకు ధర్మాన్ని ఉద్ధరించడానికి ఉపాయం చూడవలిసిందిగా విష్ణువును ప్రార్థించటం, విష్ణువు నౌకపురిలో అర్చావతారంగా వెలుస్తానని చెప్పడం మొదలైన విషయాలు నారదుడు పురజనులకు చెబుతాడు. తరవాత మూడు మండపాలలో ఎత్తైన ప్రాకార గోపురాలతో దేవాలయం కట్టించేడు. "వేం" అంటే పాపాలను "కట" అంటే పోగొట్టేవాడు కనుక స్వామికి వేంకటేశ్వరుడని నారదుడే స్వయంగా నామకరణం చేసి ప్రతిష్ఠింప చేసాడు. 

వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి నిలువెత్తు రూపం చూడగానే కళ్ళకు ఆకట్టుకుని తిరుమలేశుని దర్శించిన అనుభూతి కలిగిస్తుంది. భారతదేశంలో అశేష భక్తజనం సందర్శించే ఆరాధ్య దేవాలయాల్లో వాడపల్లి ఒకటి. వాడపల్లి తీర్థం అంటే వాడవాడలా ఉత్సవమే. ప్రతీఏటా చైత్రశుద్ధ ఏకాదశినాడు శ్రీ స్వామివారి తీర్థం, కల్యాణోత్సవం వైభవోపేతంగా  జరుగుతాయి. స్వామివారి బ్రహ్మోత్సవ, కల్యాణోత్సవ కార్యక్రమములను వేలాది మంది భక్తులు కన్నులపండుగగా భక్తితో తిలకిస్తారు.

 స్వయంభూక్షేత్రమైన వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామివారిని వరుసగా 7 శనివారాలు ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసి, స్వామిని దర్శిస్తే, భక్తుల కోరికలు తప్పక నెరవేరుతాయట. 7 శనివారాలు దర్శనాలు, ప్రదక్షిణలు పూర్తి అయిన తరవాత స్వామి ఆలయంలో అన్నదానం కోసం బియ్యం, పప్పులు, నూనెలు వారి స్థోమతను బట్టి 7 కుంచాలైనా, 7 కేజీలైనా, అదీ కాకపోతే 7 గుప్పెళ్ళు ఐనా సరే స్వామికి సమర్పించాలంట. 

భారతీయ ఔన్నత్యం Fritjof Capra

భారతీయ ఔన్నత్యం  Fritjof Capra

భారతీయ ఔన్నత్యం Alfred North Whitehead

భారతీయ ఔన్నత్యం Alfred North Whitehead

భారతీయ ఔన్నత్యం T.S.Eliot

భారతీయ ఔన్నత్యం T.S.Eliot

December 10, 2016

సుబ్భి గొబ్బెమ్మ సుబ్బడినివ్వవే

సుబ్బి గొబ్బెమ్మ  సుబ్బడినివ్వవే


సుబ్బి గొబ్బెమ్మ సుబ్బడి నీయ్యవే
అరటి పండు వంటి అమ్మ నీయ్యవే
నారింజ కాయంటి నాన్న నీయ్యవే
బంతిపువ్వంటి బావనీయ్యవే
తామరపువ్వంటి తమ్ముడినీయ్యవే
చేమంతి పువ్వంటి చెల్లెలినీయ్యవే
 అరటి పువ్వంటి అన్నయ్యనీయ్యవే
మల్లె పువ్వంటి మామనీయ్యవే
మొగలి పువ్వంటి మొగుడినీయ్యవే


శివకోడు

శివకోడు
ఈ ఆలయం రాజోలు నుండి పాలకొల్లు వెళ్ళే మార్గంలో జాతీయ రహదారి ప్రక్కన 2కిలోమీటర్ల దూరంలో ఉంది.  
శివకోడులో ఉన్న ఈ ఈశ్వర లింగాన్ని శ్రీఉమాశివలింగేశ్వర స్వామివారు అని అంటారు. రావణ సంహారం అనంతరం శ్రీరాముడు బ్రహ్మహత్యా దోషం నివారణకుగాను కోటి శివలింగాలని ప్రతిష్టించాలని అనుకున్నాడు. హనుమంతుని సహాయంతో శ్రీరాముడు కోటి శివలింగాల్ని ప్రతిష్టించాడంట. ఈ గ్రామంలో ప్రతిష్టించిన శివలింగంతో సంఖ్యామానం ప్రకారం కోటి పూర్తి అయ్యింది. అందువల్ల ఈ ప్రదేశాన్ని శివకోటిగా పిలిచేవారు. క్రమంగా ఈ పేరు రూపాంతరం చెందుతూ ప్రస్తుతం శివకోడుగా పిలవబడుతోంది.

ఎక్కడా మనం కనీవినీ ఎరుగనట్లుగా, ఇక్కడ శివలింగం మనకు అర్ధనారీశ్వరునిగా దర్శనమిస్తుంది. ఎక్కడైనా అర్ధనారీశ్వరుడు అంటే శివపార్వతులు ఉంటారు కదా! కానీ ఇక్కడ ఈ శివలింగం యొక్క  ఎడమభాగంలో పార్వతీదేవి, కుడిభాగంలో గంగాదేవి ఉంటారు. గంగమ్మతల్లి ఉన్న ప్రాంతంలో శివలింగంపై అడుగు లోతులో నీరు వస్తుంటుందని, అంటే నీరు ఊరుతూ ఉంటుందని చెబుతుంటారు. ఈ శివలింగంలోనే ఇద్దరు అమ్మవార్లు ఉండటంవల్ల కుంకుమపూజలు కూడా శివలింగం దగ్గరే చేస్తుంటారట. శివలింగాన్నైతే మేం దర్శించుకున్నాం కానీ, లింగంపై ఉన్న ఇద్దరి అమ్మవార్లను దర్శించుకోలేకపోయాం. ఎందుకంటే ఎప్పుడుపడితే అప్పుడు అమ్మవార్లను మనం దర్శించుకోలేం. ప్రతీరోజు ఉదయం 7గంటలకు స్వామివారికి అభిషేకం చేస్తారంట. ఆ సమయంలోనే శివలింగంపై ఉన్న అమ్మవార్లను మనం దర్శించుకునే అవకాశం ఉంటుంది. మేం వెళ్లేసరికి సాయంత్రం 6.15 అయ్యింది. అందువల్ల మేం miss అయ్యాం. దూరం నుండే శివలింగాన్ని దర్శించుకొని వచ్చేసాం.                           
    

December 9, 2016

దిగమర్రు ........ శ్రీ ఉమాసోమేశ్వరస్వామి

దిగమర్రు ........ శ్రీ ఉమాసోమేశ్వరస్వామి

పాలకొల్లు మరియు నర్సాపురం ప్రధాన రహదారిలో, పాలకొల్లుకి ఆరు కిలోమీటర్లదూరంలో ఈ ఆలయం ఉంది.
ఆలయ చరిత్ర 
రావణ సంహారం అనంతరం శ్రీరాముడు బ్రహ్మహత్యా దోషం నివారణకుగాను కోటి శివలింగాలని ప్రతిష్టించాలని అనుకున్నాడు. హనుమంతుని సహాయంతో శ్రీరాముడు కోటి శివలింగాల్ని ప్రతిష్టించాడంట. అందులో భాగంగా మొదటి శివలింగాన్ని రామేశ్వరంలో శ్రీరాముడు ప్రతిష్టించాడు. చివర మూడు శివలింగాలని తీసుకువస్తుంటే సూర్యోదయం అయ్యిందని సంధ్యావందనం చేసుకునే ఉద్దేశంతో హనుమంతుని భుజంపై ఉన్న శివలింగాన్ని ఒక ప్రదేశంలో కిందకు పెట్టాడు. ఆ సమయంలో ఈ ప్రాంతమంతా దండకారణ్య ప్రాంతమట. సంధ్య వార్చుకొని తిరిగి  వచ్చాక శివలింగాన్ని పైకి తీస్తుంటే ఎంతకీ రాలేదట. ఆ శివలింగం అక్కడే ప్రతిష్టించబడింది. మారుతి వచ్చి ఈ ప్రదేశంలో దిగాడు గనుక ఈ ప్రాంతానికి ''దిగుమారుతి'' అని పిలువబడింది. కాలక్రమేణా ఈ పేరు దిగమర్రుగా మార్పుచెందింది.

చిక్కాలలో ఉన్న శివదేవుడు మొదటి శివలింగంగానూ. రెండవ శివలింగం ఈ దిగమర్రులో ఉన్న శ్రీఉమాసోమేశ్వరస్వామివారి శివలింగంను, మూడవ శివలింగం శివకోడులోనూ ప్రతిష్టించబడ్డాయి. ఈ మూడు శివలింగాలని ఒకేరోజులో దర్శించినా, పూజలు చేయించినా, అభిషేకాలు చేయించినా.....శ్రీరాముడు భారతదేశం మొత్తంలో ప్రతిష్టించిన కోటి శివలింగాలని దర్శించినంత ఫలితం లభిస్తుందట.          
శ్రీ ఆదికేశవ ఎంబెరుమానార్ కోవెల (నరసాపురం)

శ్రీ ఆదికేశవ ఎంబెరుమానార్ కోవెల (నరసాపురం) 

ఆలయ చరిత్ర 
భారతదేశంలో గల వైష్ణవ దేవాలయాలలో మద్రాసుకు సమీపంలో విరాజిల్లే శ్రీ పెరుంబుదూరులోని శ్రీఆదికేశవ ఎంబెరుమానార్ స్వామివార్ల దేవాలయం ప్రశస్తమైనది. ఇందలి కేశవస్వామి భక్తుల క్లేశాలని తొలగిస్తాడు. సుందర కేశపాశం కలవాడు. బ్రహ్మరుద్రేంద్రాదులకు అధిపతి, పరమేశ్వర శాపానికి గురియైన భూతములు ఈ క్షేత్రంలో గల దేవాలయం చెరువులో స్నానం చేసి శాపాన్ని పోగొట్టుకున్నట్లు స్థల పురాణ ప్రవచనం. భక్తులకు ఉనికిని కలుగజేస్తుంది. కనుక దీనికి భూత పరిమని నామధేయమని వేదాంతుల నిర్వచనం. 

ఇట్టి క్షేత్రంలో భగవంతుని కోరిన మేరకు ఆదిశేషుడు రామానుజులుగా అవతరించి సంసారి చేతనులకు సులభమైన మోక్షోపాయాన్ని ప్రసాదించారు. ఇక్కడి శ్రీరామానుజులవారి విగ్రహం వారు జీవించి యున్న కాలంలోనే ప్రతిష్టింపబడింది. 

పరమపవిత్ర వశిష్టానది తీరవాసుల భాగ్యఫలంగా ఇప్పటికీ సుమారు 227 సంవత్సరాల పూర్వం 1786వ సంవత్సరంలో ప్రసన్నాగ్రేసర శ్రీ పుష్పాలరమణప్పనాయుడు గారు తమ గురువుగారైన ఉ..వే..శ్రీమాన్ ఈయుణ్ణి రామానుజాచార్యస్వామివారు కోరిన మీదట శ్రీపెరుంబుదూరు ఆలయ సంప్రదాయాన్ని పాటిస్తూ నరసాపురంలోని శ్రీ ఆదికేశవ ఎంబెరుమానార్ స్వామివారి దేవాలయాన్ని నిర్మించారు.                  

ఆలయానికి ఎదురుగా కోనేరు ...... కోనేరు నిండా తామరలు 
వైష్ణవ మతప్రచారకులు శ్రీ రామానుజులవారి విగ్రహం అతను జీవించి ఉన్నప్పుడే ఇక్కడ ప్రతిష్టింపబడిందట.  చిక్కాల శివదేవుడు

చిక్కాల శివదేవుడు 

పాలకొల్లుకి సుమారుగా 10 కిలోమీటర్ల దూరంలో చిక్కాల శివాలయం ఉంది. కోవెల ప్రాంగణం చాలా ప్రశాంతంగా ఉంది. ఈ శివాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. దేవాలయములోని లింగము మూడున్నర అడుగుల పొడవు, అడుగు వ్యాసార్ధము కలిగి తలభాగమునుండి చీల్చబడినట్లుగా చీలికతో ఉంటుందట.   
ఆలయ చరిత్ర 
రావణ సంహారం అనంతరం శ్రీరాముడు బ్రహ్మహత్యా దోషం నివారణకుగాను కోటి శివలింగాలని ప్రతిష్టించాలని అనుకున్నాడు. హనుమంతుని సహాయంతో శ్రీరాముడు కోటి శివలింగాల్ని ప్రతిష్టించాడంట. అందులో భాగంగా మొదటి శివలింగాన్ని రామేశ్వరంలో శ్రీరాముడు ప్రతిష్టించాడు. చివర మూడు శివలింగాలని తీసుకువస్తుంటే సూర్యోదయం అయ్యిందని సంధ్యావందనం చేసుకునే ఉద్దేశంతో హనుమంతుని చేతిలో ఉన్న ఒక శివలింగాన్ని దట్టమైన పొదవలె ఉన్న ప్రదేశంలో కిందకు పెట్టాడు. ఆ సమయంలో ఈ ప్రాంతమంతా దండకారణ్య ప్రాంతమట. సంధ్య వార్చుకొని తిరిగి  వచ్చాక శివలింగాన్ని పైకి తీస్తుంటే ఎంతకీ రాలేదట. ఆ శివలింగం అక్కడే ప్రతిష్టించబడింది. పొదల మధ్య చిక్కుకొని ఉండిపోవటం వలన ఇక్కడ శివదేవుణ్ణి చిక్కాల శివదేవుడు అని అంటున్నారు.

ఇది మొదటి శివలింగం. రెండవ శివలింగం దిగమర్రులోనూ, మూడవ శివలింగం శివకోడులోనూ ప్రతిష్టించబడ్డాయి. ఈ మూడు శివలింగాలని ఒకేరోజులో దర్శించినా, పూజలు చేయించినా, అభిషేకాలు చేయించినా.....శ్రీరాముడు భారతదేశం మొత్తంలో ప్రతిష్టించిన కోటి శివలింగాలని దర్శించినంత ఫలితం లభిస్తుందట.  

కొన్నివందల సంవత్సరాల క్రితం ఈ అడవి ప్రదేశాన్ని రైతులు వారి పొలాలకి అనువైన ప్రదేశమని తలచి, ఆ ప్రాంతాన్ని బాగుచేద్దామనే ఉద్దేశంతో గడ్డపార భూమిలో దించగానే, ఎర్రగా మరుగుతున్న రక్తం పైకి చిమ్మిందట. అది చూసి రైతులు భయపడి, ఆ విషయాన్ని ఆ ప్రాంతానికి రాజైన మొగల్తూరు రాజావారికి తెలియచేసారు. వెంటనే ఆ రాజావారు వచ్చి, శివలింగాన్ని బయటకు తీయించే ప్రయత్నం చేసారు. కూలీలు ఎంత లోతు తవ్వినా ఆ శివలింగం యొక్క మొదలు కానరాలేదు. అది శివుని మహిమే అని రాజావారు తలచి ఆ శివలింగాన్ని అక్కడే ఉంచి పూజలు, అభిషేకాలు చేసారంట. నేటికీ శివరాత్రినాడు, కార్తీకమాసంలోనూ, శివదేవునికి ప్రత్యేక ఉత్సవాలు జరుపుతూ ఉంటున్నారు.       

ఆలయంలోకి వెళ్లేముందు నరనారాయణుల నిలువెత్తు విగ్రహాన్ని మనం దర్శించుకోవచ్చును.
ఆలయ ముఖద్వారం 
ఆలయ ప్రాంగణం 
ఆలయ చరిత్ర 

ఇంకా పూజారులు దేవాలయం తలుపులు తియ్యలేదు. కానీ మా అదృష్టం దేవాలయం చెక్కతలుపులు వెయ్యకుండా గ్రిల్స్ వేసి తాళాలు వేశారు. పూజారి లేకపోయినా మేము శివయ్యని దర్శించుకోవటానికి ఏ ఆటకం లేదు.                   
      
శివాలయానికి ఎడమవైపున పార్వతి అమ్మవారి ఆలయం ఉంది. 

క్షేత్రపాలకుడు విష్ణుమూర్తి ఆలయం శివాలయానికి కుడివైపున ఉంది.  
లక్ష్మీసమేత శ్రీమన్నారాయణుడు 

History Of Sree Jaganmohini Kesavaswamy Temple ...... Ryaali

History Of Sree Jaganmohini Kesavaswamy Temple ...... Ryaali
శ్రీ జగన్మోహినీ కేశవస్వామి వారి ఆలయ చరిత్ర..... ర్యాలి

History Of Vadapalli Venkateswaraswamy Temple

History Of Vadapalli Venkateswaraswamy Temple
వాడపల్లి వేంకటేశ్వరస్వామివారి ఆలయ చరిత్ర  

Sri Umasomeswara Swami Temple ...... Digamarru

Sri Umasomeswara Swami Temple ...... Digamarru
శ్రీ ఉమాసోమేశ్వరస్వామి ఆలయం ......దిగమర్రు  

Ksheraramam ...... In Palakollu

Ksheraramam ...... In Palakollu .........పంచారామాలు.......పాలకొల్లులో ఉన్న క్షీరారామం

krishnastakam By .....Ram & Lakshman

krishnastakam By .....Ram & Lakshman

Bhagavatgeeta By...... Ram & Lakshman

Bhagavatgeeta By...... Ram & Lakshman

Nrusimha Stotram By Ram & Lakshman

Nrusimha Stotram By Ram & Lakshman