September 15, 2021

కాశీలో ఉన్న 56 గణపతి నామాలు

కాశీ .... కాశీ అని పేరు వినగానే అందరికీ కాశీ విశ్వనాథుడే గుర్తుకు వస్తాడు. కాశీ వెళ్ళాము అక్కడ 9 నిద్రలు చేసాము, వీరభద్రుడిని దర్శించాము, అటు ఇటు ఉండే గయా - ప్రయాగ కూడా వెళ్ళాము అక్కడ ఉన్న ఆలయాలని దర్శించాము అని అందరూ చెబుతూ ఉండటం మనం వింటూ ఉంటాం.  

   కాశీలో ఉన్న 56 గణపతి నామాలు

1 అభయ వినాయక      

2  అర్కరీ వినాయక   

3 ఆశ వినాయక  

4 అవిముక్త వినాయక  

5 భీమచండి వినాయక  

6 చతుర్దంత వినాయక  

7 చింతామణి వినాయక  

8 చిత్రఘంట వినాయక  

9 దంతహస్త వినాయక  

10 దేహళీ వినాయక  

11 డుంఠి వినాయక          

12  ద్వాదశ వినాయక  

13 ద్వితుండ వినాయక  

14 ఏకదంత వినాయక  

15 గజకర్ణ వినాయక  

16 దండముండి వినాయక  

17 గణనాథ  వినాయక  

18 జ్ఞాన వినాయక  

19 హేరంబ  వినాయక  

20 జ్యేష్ఠ వినాయక  

21 కాలకంఠ వినాయక  

22 కరిప్రియ వినాయక  

23 ఖర్వ  వినాయక  

24 కూణితాక్ష వినాయక  

25 కూష్మాండ  వినాయక  

26 కూటదండ వినాయక  

27 క్షిప్ర ప్రసాద వినాయక  

28 లంబోదర వినాయక  

29 మంగళ వినాయక  

30 మణికర్ణికా వినాయక  

31 మిత్ర వినాయక  

32 మూఢ వినాయక  

33 మోదకప్రియ వినాయక  

34 ముండ వినాయక  

35 నాగ వినాయక  

36 పాశపాణి వినాయక  

37 పంచాస్య వినాయక  

38 పిచండిల వినాయక  

39 ప్రమోద వినాయక  

40 ప్రణవ వినాయక  

41 రాజపుత్ర వినాయక  

42 shal kant 

43 సృష్టి వినాయక  

44 సిద్ధ వినాయక

45 సింహతుండ వినాయక  

46 స్థూలదంత వినాయక  

47 సుముఖ వినాయక  

48 త్రిముఖ వినాయక  

49 ఉద్దండముండ వినాయక  

50 కపిసింహద్విపత్రిమ

51 వక్రతుండ (badaganesh) వినాయక  

52 వరద వినాయక  

53 విఘ్నరాజ వినాయక  

54 వికటద్విజ వినాయక  

55 యక్ష వినాయక  

56 దుర్ముఖ  వినాయక    

July 23, 2021

శ్రీ జగన్నాథ అక్షర సుమమాలిక 101 To 108

 శ్రీ జగన్నాథ అక్షర సుమమాలిక 101 To 108

101 

తిరుమేని సౌందర్యము కనుల నిండగ 

స్వామి సామీప్యమే షడ్రసోపేత రుచుల నొసగ 

మరివేరు రుచులేల వేగిరమున కొల్తుము 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

102 

గొల్లవారల డొల్లతనమునకు స్వామి చేరువై 

యాడి పాడి క్షమా దయాది గుణము లెల్ల 

తేజరిల్లగా కొనియాడిరా రేపల్లె వాసుని 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

103 

శ్రీ హరిని ధ్యానింప వీక్షింప భజియింప

హంగు పొంగులేల నిర్మల తటాకంబు పోలు 

నిజాంతఃకరణమ్మున వేడుము 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

104 

అనిత్య వస్తువులే నిత్యమని నమ్మి 

పైని తళుకుబెళుకలే సత్యమని నమ్ము వారికి

భ్రాంతులను తొలగింపుమయా మాయా వినోదా !

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

105

ఆధారము నీవే ఆధారము నీవే 

ప్రాపకత్త్వము ప్రాప్యము నొసగునది నీవే !

ప్రాప్యా ప్రాప్య ఫలదాయక !

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

106

భయమెందుకు అండగ నీవుండగ 

భయమెందుకు అంతట నీవుండగ నీయందు మేముండగ 

మాయందు నీవుండగ  అఖిల లోకమ్ములనేలు

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

107

పరి పరి విధముల నొసగు పరీక్షల ప్రహ్లాద వరదా ! 

గజరాజ రక్షకా! మా భవబంధముల భారముల 

తొలగించు భారము నీదే భావనారాయణా !

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

108

సర్వాలంకార భూషితుడై సమస్త లోకమ్ములు పాలించుస్వామి 

ఏతెంచె గరుడారూఢుడై గతి తప్పిన జీవుల నుద్ధరించ 

సంసిద్ధుడై వేంచేసే వేదములతో 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

ఫలశృతి:- 

శత సుమముల నాఘ్రాణించు వారలకు 

జగన్నాథుడొసగు దివ్యానుగ్రహమును 

ఇలయందు సుఖసౌఖ్యములు కలిగి 

దివియందు చేరుదురు శ్రీ చరణముల!

శ్రీ జగన్నాథ అక్షర సుమమాలిక 91 To 100

 శ్రీ జగన్నాథ అక్షర సుమమాలిక 91 To 100

91. 

భగవత్ సాన్నిధ్యమునకు పరితపించు 

పరమభక్తులు జన్మ సాఫల్యత నందె 

నొందెదరు ప్రహ్లాదుని వోలె!

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

92. 

పరమాత్మ గుణవైభవమ్ము  నిరతము 

తలుచు నిరంజనులు వాయువుతోడి 

సుమ సౌరభంభు రీతిగా నిను చేరరా !

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

93. 

దిక్కు దిక్కున జూచితి దిక్కెవ్వండని 

దిక్కులకు దిక్కు నీవుండగా వెరవేల 

వేణుగాన ప్రియా! దీనజనోద్ధారకా!

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

94.

నవ విధ ద్వారమ్ములు కలిగిన 

పురమందు వసియించు వారిమి పురము 

పురము నందు నిను గాంచు మానస మొసగుము 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

95. 

జీవాత్మ పరమాత్మ  సంయోగమ్మె 

పరమోత్కృష్టము పరమధర్మము 

చూపుమయా అంతరంగ ప్రేమను 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

96. 

లేదు దుఃఖమ్ము ఆత్మఙ్ఞునికి 

ఆత్మ ఙ్ఞానమే యక్షయంబుగా యదియే 

శుభ సౌఖ్యంబు లొసగగా శుభకర! 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

97. 

గర్వంబు కర్మంబు పరిహరింప నీవుండగ 

అండగ కాచగా దిగులేల దుఃఖ పరిహారా!

 పరివార సమ్ముఖ పారిజాతా! అనంతానంత విభవా !

 లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

98.  

చెంతనే చేరి చూపునెటనో నిలిపితివి 

మానస చోరుల యాగడమా ? 

దుఃఖార్తుల కలవరమా ? సుకుమార! నీ త్వరయేమి ?

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

99. 

గోపికలు నింద చేసిరి దధిచోరాగ్రేసరుడవని 

పడుచుంటివి నేటికిని యా నిందను మాయని 

చిరు సుమధుర హాసముల మాయావిలోలా!

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

100. 

హరి వాసమె ప్రియమని 

శ్రీ హరి నిలయమె హితమని మెలిగే 

 అనపాయని అనవరతము నిను వీడక 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

శ్రీ జగన్నాథ అక్షర సుమమాలిక 81 To 90

 శ్రీ జగన్నాథ అక్షర సుమమాలిక 81 To 90

81. 

డాంబికమ్ములు వలయు 

డాబు దర్పంబులు వలయు 

ఆత్మసంశోధనమ్మసలు లేక ఇది ఏమి మాయనో 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్ 

82. 

కల్ల కపటమ్ముల జిక్కి లేమిని 

పరిహసింతురేల మేలమాడుదురేల 

ఈ అసమతుల్యతలేల మేలైన నాయకా!

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్ 

83. 

ఓపగలేను సైపగలేను భారమ్ములు   

బ్రహ్మాండనాయకా! బ్రహ్మాండమే కేశమ్ము నీకు 

దయాసాగరా! మదీయ ఆత్మభారంబేపాటిది 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

84. 

బధిరునికడ వేణుగానమ్ము చందమున 

అంధునికి చిత్రకూడ్య వీక్షణ ఎటులనో 

మూఢునికి ఙ్ఞానభోధలా రామచంద్రా 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్ 

85.

వేదనల్ కలిగించు విషయాంతరమ్ముల 

విష వలయుమ్ముల విముక్తి నొసగుము 

నందనందనా! విదుర వరదా! విమల వరదా! 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

86.

భోధించె సత్ భోధనలు గురుతరముగ 

జగత్ గురువువై గుహ్యాంతరంగా 

శాంతి ప్రదాయకా చిరు నగుమోమున సిరిగల 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

87. 

వాక్ మనమ్ములు ఏకమయి 

ఏకైక నాథునేకరీతి గొలిచి       

విధివ్రాతలు వ్రాయు విరించి తండ్రీ!  

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

88. 

ఆత్మ ఙ్ఞానమ్మే సత్ సంపదనీ 

అక్షయ సుఖమ్మని తెలివి కల్గిన

తెరువరికి కల్గు మోక్ష ఫథమ్ము 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

89. 

చరాచర జగత్తున నిండిన వాసుదేవ 

నిను గాంచిన కల్గు సత్ గతులు 

తొలగు వికారమ్ములు సరళాత్మా!

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

90. 

నిష్కామ భక్తిని మెచ్చి 

పరమపదము చేర్చు త్రిగుణాతీతుడు 

తనరూపు వానికిచ్చు జీవి ధన్యమవ్వగా

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

శ్రీ జగన్నాథ అక్షర సుమమాలిక 71 To 80

 శ్రీ జగన్నాథ అక్షర సుమమాలిక 71 To 80

71. 

అణిమాద్యష్టైశ్వర్యములే కడకు 

మౌనధ్యాన సాధనలే కడకు ఆత్మనందు 

పరమాత్మ సందర్సనమే మేలౌను 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

72.

పరధర్మము వలదు వలదని యదియే 

ప్రాణాంతకమని స్వధర్మమే మేలుమేలను 

ధర్మాధర్మ నిర్ణయాధికారా ధర్మభోధకా!

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

73. 

ధీనిధుల్ చేతురు యోగాచరణంబులు 

పొందుదురు శాశ్వత మోక్షఫధమ్మును 

నిత్యసూరుల సమక్షమున అనురక్తిన వేడెదరు 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

74. 

సంపదలకు జిక్కక విరాగియయి 

ఆచరణాత్మక ఆత్మఙ్ఞానియయీ 

శ్రీ చరణమ్ములే పరమపెన్నిధి గాగ

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

75. 

నవనవోన్మేష  నళినీధర నీలమేఘ

నిరంజన పురంజన పురుషోత్తమ

 నీలో నేను నాలోన నీవు నెలకొనిన హంసాత్మక! 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

76. 

అభిషేకమ్ములు చేయ మాకు ప్రియము 

అభిషేకమ్ములు నీకు ప్రియము 

నిరవధిక అభిషేక అభిలాష ఆది నారాయణా!

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

77. 

ఈప్సితములు నెరవేర్చు రంగరాయా 

మనోరథమ్ములు ఈడేర్చ వెడలినవి 

మహారథమ్ములు జైజై జగన్నాథ థ్వనుల 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

78. 

సంసార బంధనమ్ములు సడలించు 

సాగరనిలయ క్షీరసాగరశయన

వ్యూహవిభవ శ్రీ మన్నారాయణా!

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

79. 

వినుతిజేసి విరాట్ పురుషుని 

విమలముగ విఖ్యాత విశ్వరూపుని 

విమలాంతరంగ రంగని రంగరంగా 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

80. 

కట్టెనందు జీవము కొట్టుమిట్టాడే 

వెడలనీయక వుండనీయక 

జీవశ్చవంబువోలె మరి ఎన్ని నాళ్ళయా 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

శ్రీ జగన్నాథ అక్షర సుమమాలిక 61 To 70

  శ్రీ జగన్నాథ అక్షర సుమమాలిక 61 To 70

61. 

సర్వలాంఛనమ్ములు నీవే 

సకల కళలు నీవె ధరణీధర దనుజారి 

సర్వ సుగంధములు నీవే శౌరి నీవె

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

62. 

గుణమ్ముల్ సత్ గుణమ్ములు 

నిర్గుణమ్ముల్ నీ యాధీనమే 

సర్వాధారా! సకలాధారా! సద్వైభవ! 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

63. 

సమ్మోహనాకార మోహినీ అవతార 

చూడ్కులె సమ్మోహనాస్త్రమ్ములయి 

పంచితివి అమృతము పదిలమ్ముగ 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

64. 

వనమాలికి పంకజాక్షికి 

కలహమా? ప్రణయ కలహమా 

ఔరా !ఔరౌరా ! విభ్రమమందె విభుధ జనులు 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

65. 

సొగసు మీర సోగ కనుల సొగసున 

సొంపైన ఇంపైన సొగసరి నీవని సిరి 

హారతులిడగ గైకొను సిరిపతి శ్రీహరీ

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

66. 

భక్తి కుదిరి రక్తి కుదిరి శక్తి యుక్తులన్ని నీవని 

నీవేనని నికరముగ నెఱ నమ్మి తి 

నీలమేఘరూపా! నీరజాక్షా! నీదయనిజూపు

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

67.  

జ్యోతులు పరంజ్యోతులయి విరాజిల్లే 

వినువీధుల మనో వీధుల హరిచరియించె 

మహా సంకర్షణా! ప్రద్యుమ్నానిరుద్ధా! వాసుదేవ 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

68. 

నిష్కామ కర్మములు పరిఢవిల్ల   

శాంతి సౌభాగ్యములు విస్తరిల్ల 

ఇలపైన వైకుంఠమే వైకుంఠనాథా!

 లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్ 

69.  

దురితమ్ముల నోపగలేము దురితాపహారా!

దుష్టసంహారా! దృగంచల లోచనావలోకా!

సత్ కృపన్ కృపజేయుమా మా మాధవా!

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్ 

70. 

ఙ్ఞానసాగరమ్ము మథియించి మథియించి  

మదినెంచి భక్తి తీరము చేర ఆనతి నీయుమా 

ఆది నారాయణా ! ఆనంద నిలయ నిఘూఢా 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

శ్రీ జగన్నాథ అక్షర సుమమాలిక 51 To 60

 శ్రీ జగన్నాథ అక్షర సుమమాలిక 51 To 60

51. 

పరుగులిడును ఉరకలిడును నీ కొఱకై 

వేదనలు సంవేదనలు నైవేద్యమ్ములయి 

ప్రాణదీపము పయనించును నీ దరికి 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్ 

52. 

నీ నామంబులతో జిహ్వ తరియింప 

నీ సంకీర్తనా ధ్వనులతో ఒడలు పులకింప 

గళము కీర్తించె పరమపురుషా యని 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

53. 

విష్ణుండవయి నీవేతెంచగా 

జిష్ణుండవయి చిత్తమున వసియింపగా..

ఓ!శంఖుచక్రథారీ! చక్రపాణీ! చతురాననా!

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

54. 

కనులు నిండుగ మనసు నిండుగ 

మాకు పండుగ నీ నిరంతర

నిత్యోత్సవమ్ములు నిరంజనా!నీలోత్పలా! 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

55. 

వేదవేత్తలు వినుతి జేసిరి 

వేదాచలమే స్థిరమని దివ్యఫలమని 

వేదాంతరంగా! రంగ రంగా !

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

56. 

అలలు ఎగసినవి మనస్సంద్రమున    

నీ పాదపద్మములు చేరు యాశతోడి 

మెరుపు మెరిసినది మిలమిల హృదిన 

మీదుమిక్కిలి ప్రేమతోడి ప్రేమావతారా 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

57. 

చెలువలు కలువలు మగువలు పరమ 

పురుష పరాగ కాంక్షులై పుప్పొడులైరి 

పులకరించుచూ పురుషోత్తమా! పురాధీశా!

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

58.   

సంకల్పమ్ములు వికల్పమ్ములు  

ఘర్షణమ్ములు సంఘర్షణమ్ములు 

సర్వంబు నీ యాధీనమే సర్వాంతరంగా 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

59. 

దుర్యోగమ్ములు దగ్ధమవ్వు యాగాగ్నిలో 

సుయోగమ్ములు ఉద్భవించు యోగాగ్నిన 

చరాచర సృష్ఠికర్తా! సర్వచమత్కారా! 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

60.

 'న'కారమ్ములేల మనసా...సకారాత్ముడు 

ఎదుటనుండ స్వచ్ఛందనాల మనసు 

సుమ సౌరభ మనోహరుడు కేశవునిదే....కేశవా!

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్