April 4, 2019

కృష్ణ శ్వేత పద్యాలు

                          కృష్ణ నామ స్మరణ (కృష్ణ శ్వేత పద్యాలు)


01
నిలుపుము నాఎద లోతుల్లో 
నిరతము నీ నామము 
సతతము నీ ధ్యానము 
విడువక పూజింతు నీ చరణములే నిజముగ కృష్ణా!  



02
పరవశమొందిరి గోపకాంతలు నిను కీర్తించి    
పులకించిరి గొల్ల పడుచులు నీ ప్రణయకేళిలో  
నర్తించెను శుకపికములు నీ మురళీగానమునకి 
ఆనందించెను నా హృదయము నినుగాంచి నిజముగ కృష్ణా!  

03
దానములెన్నో జేసితి
మోహములన్నీ వీడితి
కోపము నాపైనేలనయ్యా
ప్రాణము నీవేనని నమ్మితిగద నిజముగ కృష్ణా!

04
అత్తరు నీకై తెచ్చితి
మెత్తని నీ మేనునద్ద
ఉత్తమమైన నా సేవలందుకో
చిత్తము నీపై నిలిపితి నిజముగ కృష్ణా!

05
మన్ను ముద్దలేలనయ్య 
వెన్న ముద్ద లివిగోనయ్య 
పన్నగ శయనా పలుకవేమయ్యా 
కన్నా నాదరికి చేర రావయ్యా నిజముగ కృష్ణా!

06
ముక్తినొసగు దాతవు నీవని 
శక్తి మీర సేవలెన్నో చేసితి
భక్తి తోడ భజనలు చేసితి 
అనురక్తి నీనుండి వీడకుంటిని నిజముగ కృష్ణా!

07
కాంక్షలేమి నాకు లేవు 
ఆంక్షలoదుకు నిను చేరేందుకు 
క్షణమైనా నిను వీడి ఉండలేనే 
ఆకాంక్ష ఒక్కటే నీ చరణాలని  చేరాలని నిజముగ కృష్ణా!

08
పొదలమాటున దాగేవు
ఎదలనెన్నో దోచావు
వెతలను తీర్చగ రావా
నా మదిలో నీ రూపం నిలపగ లేవా నిజముగ కృష్ణా!


09
టక్కరి వాడవు నీవని తెలిసీ
చక్కని చుక్కలు నీవెంట పడిరి
మక్కువ నీ పై ఎక్కువ పెంచి 
ఠక్కున వారిని విడిచి పోవుట తగునా నీకిది నిజముగ కృష్ణా!

10
దేహభ్రాంతి లేదు నాకు 
విషయవాంఛ లేదు నాకు 
వస్తు మోహం లేదు నాకు 
నిను తలచిన నాటినుండి నిజముగ కృష్ణా !

కృష్ణ శ్వేత పద్యాలు 10

కృష్ణ శ్వేత పద్యాలు 10

దేహభ్రాంతి లేదు నాకు 
విషయవాంఛ లేదు నాకు 
వస్తు మోహం లేదు నాకు 
నిను తలచిన నాటినుండి నిజముగ కృష్ణా 

కృష్ణ శ్వేత పద్యాలు 09

కృష్ణ శ్వేత పద్యాలు 09

టక్కరి వాడవు నీవని తెలిసీ
చక్కని చుక్కలు నీవెంట పడిరి
మక్కువ నీ పై ఎక్కువ పెంచి 
ఠక్కున వారిని విడిచి పోవుట తగునా నీకిది నిజముగ కృష్ణా!


కృష్ణ శ్వేత పద్యాలు 08

కృష్ణ శ్వేత పద్యాలు 08

పొదలమాటున దాగేవు
ఎదలనెన్నో దోచావు
వెతలను తీర్చగ రావా
నా మదిలో నీ రూపం నిలపగ లేవా నిజముగ కృష్ణా!


కృష్ణ శ్వేత పద్యాలు 07

కృష్ణ శ్వేత పద్యాలు 07

కాంక్షలేమి నాకు లేవు 
ఆంక్షలoదుకు నిను చేరేందుకు 
క్షణమైనా నిను వీడి ఉండలేనే 
ఆకాంక్ష ఒక్కటే నీ చరణాలని  చేరాలని నిజముగ కృష్ణా!

కృష్ణ శ్వేత పద్యాలు 06

కృష్ణ శ్వేత పద్యాలు 06

ముక్తినొసగు దాతవు నీవని 
శక్తి మీర సేవలెన్నో చేసితి
భక్తి తోడ భజనలు చేసితి 
అనురక్తి నీనుండి వీడకుంటిని నిజముగ కృష్ణా!