September 29, 2015

Ropeway To Manokamnadevi Temple

Ropeway To Manokamnadevi Temple

బొజ్జగణపయ్య నిమజ్జనం 2015

బొజ్జగణపయ్య నిమజ్జనం 2015

ఈ సంవత్సరం గణపయ్య నిమజ్జనానికి (స్కూటర్ హాండిల్ పై) తమ్ముడు చేసిన అలంకరణ ఇది. ఆదిశేషుని ఒడిలో వేంకటేశ్వరస్వామి.....స్వామివారి ఒడిలో బుజ్జి బొజ్జగణపయ్య. 11 రోజులూ గణపతిని ఇంట్లో పూజించి ..... చివరిరోజు అందరి వినాయకులతో తాను పూజించిన వినాయకుడిని కూడా ఒక్కో సంవత్సరం ఒక్కో అలంకరణతో స్కూటర్ పై గణపతిని ఘనంగా ఊరేగించి, టాంక్ బండ్ వద్ద హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తాడు.  


అలంకరణ ఎలా చేసాడో మీరే గమనించండి.


టాంక్ బండ్ వద్ద హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసాం.క్రిందటి సంవత్సరం (2014) అలంకరణ...... పార్వతమ్మ ఒడిలో గణనాథుడు.   నిమజ్జనానికి వచ్చిన మరికొన్ని వినాయక మూర్తులు
ఆకుపచ్చని దారపురీళ్ళతో తయారుచేసిన గణనాథుడు  
నిమజ్జనానికి విచ్చేసిన భక్తజనం  

ఓం గం గణపతియే నమః 

September 26, 2015

నేపాల్ యాత్రా విశేషాలు Part 9 ఖాట్మండు నుండి నేపాల్ బోర్డర్ కి ప్రయాణం

నేపాల్ యాత్రా విశేషాలు Part 9 ఖాట్మండు నుండి నేపాల్ బోర్డర్ కి ప్రయాణం

ఆ రాత్రి అక్కడే ఉండి, మరుసటిరోజు ఉదయం 6.30కి ఖాట్మండు నుండి నేపాల్ బోర్డర్ కి మాప్రయాణం మొదలయ్యింది. ముక్తినాథ్ లో గండకీనదిని చూడలేదు, నదీ స్నానం చెయ్యలేదు అనే అసంతృప్తి అందరిలోనూ ఉంది. అది గ్రహించిన మా బస్సు డ్రైవరు బబ్లూ మార్గమధ్యంలో బస్సుని ఆపి, ఇక్కడే గండకీనది చివరి స్థానం. ఈ ప్రాంతం దాటితే మనకు గండకీనది కనిపించదు, ఎవరైనా వెళితే వెళ్ళి నదిని దర్శించి రండి అని చెప్పగానే, అందరం చాలా సంతోషంతో నదీమతల్లిని దర్శిద్దామని వెళ్ళాము. ఆరోజు శ్రావణమాసం ఆఖరి శుక్రవారం. గండకీనదిలో స్నానం చెయ్యాలని కోరిక ఆపుకోలేక అందరం స్నానాలు చేసేసాము. 
అందరి మనస్సులు తృప్తి చెందాయి. తిరిగి బోర్డర్ కి ప్రయాణమయ్యాము. బోర్డరుకి వచ్చేసరికి సాయంత్రం 6 అయ్యింది. అందరి వద్ద ఉన్న నేపాలీ కరెన్సీని మళ్ళీ ఇండియన్ కరెన్సీగా మార్చుకొన్నాము. మొత్తానికి నేపాల్ బోర్దరుని దాటి ఇండియాలోకి అడుగుపెట్టాం. రాత్రి 10.30 కి గోరఖ్పూర్ రైల్వేస్టేషన్ కి చేరుకున్నాము. స్టేషను ఎదురుగా ఉన్న హోటల్ లో రూములు తీసుకొని, రాత్రి నిద్రించాము.

Day 9
ఉదయం గోరఖ్పూర్ లో 6.30 కి రైలు ఎక్కాము. 

Day 10
మరుసటిరోజు సాయంత్రం 3.30 కి హైదరాబాదు స్టేషనులో దిగి సంతోషవదనాలతో ఎవరిళ్ళకి వాళ్ళు తిరుగుముఖం పట్టాం. ఇవి మా యాత్రావిశేషాలు.                                                                                        

నేపాల్ యాత్రా విశేషాలు Part 8 - ఖాట్మండులో ఆలయాల దర్శనం పశుపతినాథుని ఆలయం

నేపాల్ యాత్రా విశేషాలు Part 8 - ఖాట్మండులో ఆలయాల దర్శనం పశుపతినాథుని ఆలయం
అనంతరం పశుపతినాథుని ఆలయానికి వెళ్ళాం.
అక్కడ ఆలయం బయట పూజరులచే మేమంతా గోత్రనామాలతో పూజలు చేయించుకొని, రుద్రక్షమాలను ప్రసాదంగా స్వీకరించి, రుద్రుని దర్శనానికి లోనికి ప్రవేసించాము. ఆలయ ప్రవేశమార్గంలో ఒక పెద్ద నంది ఠీవిగా కూర్చొని మనకు స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటుంది. ప్రతీ శివాలయంలో రాతి నందిని మనం చూస్తాం. కానీ ఇక్కడ ఇత్తడి నంది మనకు దర్శనమిస్తుంది. ఇక్కడ పశుపతినాథుడు పంచముఖుడు. నాల్గువైపులా నాల్గు ముఖాలు కలిగి, శిరస్సు పైన 5వ ముఖముతో ఉంటాడు. ప్రతీ ఆలయానికి ఒక ముఖద్వారమే ఉంటుంది. కానీ ఇక్కడ శివయ్య పంచముఖుడు అగుటవలన నాలుగు వైపులా ఆలయ ద్వారాలు ఉంటాయి. నాలుగువైపులా తిరిగి, ప్రదక్షిణచేసి, శివుడిని దర్శించవచ్చు. నేను నాలుగు వైపులా ప్రదక్షిణ చేసి వచ్చేసరికి అక్కడ శివయ్యకి పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది. ఆ అభిషేకం అర్థగంట సేపు జరిగింది. అంతసేపూ స్వామిని స్తుతిస్తూ, ఆ అభిషేకం చూస్తూ నేను అక్కడే ఉండిపోయాను. 

మావాళ్ళంతా ఆలయానికి చుట్టుప్రక్కల ఉన్న మిగిలిన ఆలయాలని దర్శించి, నన్ను వెతుక్కుంటూ వచ్చారు. అప్పటికి అభిషేకం పూర్తయ్యింది. మనస్సు తృప్తి చెందింది. పంచామృతాభిషేకం అనంతరం స్వామికి కవచం ధరింపచేసి, మూడువైపులా ఉన్న ద్వారాలను ఉదయం 11.30 నిమిషాలకి మూసివేస్తారు. ఒకవైపు ద్వారం నుండే స్వామిని దర్శించాలి. అందుకే ఎవ్వరు వెళ్ళినా 11.30 లోపే స్వామిని నాలుగు వైపుల నుండి చూసి, స్వామి నాలుగు ముఖాలను దర్శించవచ్చును. 

స్వామి దర్శనం అనంతరం ప్రాకారంలో ఉన్న భైరవుడు, సహస్రలింగాలు, అమ్మవారి కోవెల మొదలైన వాటిని దర్శించి బయటకు వచ్చాము. 

అక్కడ నుండి నేపాల్ మాహారాజ ప్యాలెస్ కి వెళ్ళాము.

ప్యాలెస్ అంతా చూసి, హోటలుకి, రూముకి తిరిగి వచ్చాం. మా హోటల్ ప్రక్కనే బజారు ఉండటంతో ఎవరికివారే వెళ్ళి, షాపింగ్ చేసుకువచ్చారు. 

నేపాల్ యాత్రా విశేషాలు Part 7 - ఖాట్మండులో ఆలయాల దర్శనం జలనారాయణ(బుద్ధనీలకంఠ)

నేపాల్ యాత్రా విశేషాలు Part 7 - ఖాట్మండులో ఆలయాల దర్శనం జలనారాయణ(బుద్ధనీలకంఠ)

తరవాత జలనారాయణుని(బుద్ధనీలకంఠని) దర్శించాము. నీటిలో ఉన్న నారాయణుని సాలగ్రామ విగ్రహంను చూడగానే, వైకుంఠములో ఉండే నారాయణుడు ఎలా ఉంటాడో తెలియదు కానీ, వైకుంఠ నారాయణుని తలపించాడు. అంత పెద్ద విష్ణు రూపాన్ని చూసేసరికి మనస్సు ఒక్కసారిగా ఉప్పొంగిపోయి పది నిమిషాలపాటు ఆనందభాష్పాలు ఆగలేదు.అనంతరం పశుపతినాథుని ఆలయానికి వెళ్ళాం.

నేపాల్ యాత్రా విశేషాలు Part 6 - ఖాట్మండులో ఆలయాల దర్శనం స్వయంభూనాథ్ (బౌద్ధనాథ్)

నేపాల్ యాత్రా విశేషాలు Part 6 - ఖాట్మండులో ఆలయాల దర్శనం 

Day 7 ఖాట్మండులో ఆలయాల దర్శనం స్వయంభూనాథ్ (బౌద్ధనాథ్)
ఉదయాన్నే స్నానాదికాలు ముగించుకొని 6.30 నిమిషాలకి బస్సులో బయలుదేరి 7.30 కి స్వయంభుని (బౌద్ధస్థూపంని) దర్శించాం. ఈ ఆలయం కొండగుట్ట పైన ఉంది. ఇక్కడికి వెళ్ళాలంటే నడిచే ఓపిక ఉంటే నడిచి వెళ్ళొచ్చును, లేదా బస్సు, వ్యానులపైన వెళ్ళొచ్చును.


Vasudhara is the goddess of wealth and abundance in Buddhist theology. Often referred to as the "Bearer of Treasure," she is the Buddhist counterpart of the Hindu goddess Sri-Lakshmi.

కొండ దిగువన బుద్ధ అమీదేవ పార్క్ ఉంది. 


తరవాత జలనారాయణుని(బుద్ధనీలకంఠని) దర్శించాము.