September 26, 2015

నేపాల్ యాత్రా విశేషాలు Part 8 - ఖాట్మండులో ఆలయాల దర్శనం పశుపతినాథుని ఆలయం

నేపాల్ యాత్రా విశేషాలు Part 8 - ఖాట్మండులో ఆలయాల దర్శనం పశుపతినాథుని ఆలయం
అనంతరం పశుపతినాథుని ఆలయానికి వెళ్ళాం.




అక్కడ ఆలయం బయట పూజరులచే మేమంతా గోత్రనామాలతో పూజలు చేయించుకొని, రుద్రక్షమాలను ప్రసాదంగా స్వీకరించి, రుద్రుని దర్శనానికి లోనికి ప్రవేసించాము. ఆలయ ప్రవేశమార్గంలో ఒక పెద్ద నంది ఠీవిగా కూర్చొని మనకు స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటుంది. ప్రతీ శివాలయంలో రాతి నందిని మనం చూస్తాం. కానీ ఇక్కడ ఇత్తడి నంది మనకు దర్శనమిస్తుంది. ఇక్కడ పశుపతినాథుడు పంచముఖుడు. నాల్గువైపులా నాల్గు ముఖాలు కలిగి, శిరస్సు పైన 5వ ముఖముతో ఉంటాడు. ప్రతీ ఆలయానికి ఒక ముఖద్వారమే ఉంటుంది. కానీ ఇక్కడ శివయ్య పంచముఖుడు అగుటవలన నాలుగు వైపులా ఆలయ ద్వారాలు ఉంటాయి. నాలుగువైపులా తిరిగి, ప్రదక్షిణచేసి, శివుడిని దర్శించవచ్చు. నేను నాలుగు వైపులా ప్రదక్షిణ చేసి వచ్చేసరికి అక్కడ శివయ్యకి పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది. ఆ అభిషేకం అర్థగంట సేపు జరిగింది. అంతసేపూ స్వామిని స్తుతిస్తూ, ఆ అభిషేకం చూస్తూ నేను అక్కడే ఉండిపోయాను. 

మావాళ్ళంతా ఆలయానికి చుట్టుప్రక్కల ఉన్న మిగిలిన ఆలయాలని దర్శించి, నన్ను వెతుక్కుంటూ వచ్చారు. అప్పటికి అభిషేకం పూర్తయ్యింది. మనస్సు తృప్తి చెందింది. పంచామృతాభిషేకం అనంతరం స్వామికి కవచం ధరింపచేసి, మూడువైపులా ఉన్న ద్వారాలను ఉదయం 11.30 నిమిషాలకి మూసివేస్తారు. ఒకవైపు ద్వారం నుండే స్వామిని దర్శించాలి. అందుకే ఎవ్వరు వెళ్ళినా 11.30 లోపే స్వామిని నాలుగు వైపుల నుండి చూసి, స్వామి నాలుగు ముఖాలను దర్శించవచ్చును. 

స్వామి దర్శనం అనంతరం ప్రాకారంలో ఉన్న భైరవుడు, సహస్రలింగాలు, అమ్మవారి కోవెల మొదలైన వాటిని దర్శించి బయటకు వచ్చాము. 

అక్కడ నుండి నేపాల్ మాహారాజ ప్యాలెస్ కి వెళ్ళాము.

ప్యాలెస్ అంతా చూసి, హోటలుకి, రూముకి తిరిగి వచ్చాం. మా హోటల్ ప్రక్కనే బజారు ఉండటంతో ఎవరికివారే వెళ్ళి, షాపింగ్ చేసుకువచ్చారు. 

No comments:

Post a Comment