September 25, 2015

నేపాల్ యాత్రా విశేషాలు Part 5 - మనోకామనాదేవి ఆలయ దర్శనం

నేపాల్ యాత్రా విశేషాలు Part 5 (మనోకామనాదేవి ఆలయ దర్శనం & ఖాట్మండుకి ప్రయాణం)


Day 6 - పోఖరా నుండి ఖాట్మండు
మళ్ళీ పొద్దున్నే పోఖరా నుండి ఖాట్మండుకి 6.30 కి ప్రయాణమయ్యాం. దారిలో 10 గంటలకి రహదారి పక్కనే ఆనుకొని ఉన్న మనోకామనాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించాం. 








అమ్మవారి దర్శనం చేసుకోవాలంటే ఆలయానికి చేరుకోవటానికి, రోడ్డు, మెట్లు మార్గాలు లేవు. కేబుల్ కార్లు మాత్రమే ఉన్నాయి. రెండు ఎత్తైన పర్వతాలని దాటితే అమ్మవారిని దర్శించవచ్చును. 



అలా కేబులుకార్లలో ప్రయాణం చేస్తూ క్రిందకి చుస్తే పచ్చని పొలాలు, లోయలు ఎంత అందమగా కనిపించాయో. 

కేబులుకారు దిగాక సుమారుగా 200 మెట్లు ఎక్కి వెళ్ళాక కోవెల ఉంటుంది. అమ్మవారి కోవెల పునర్నిర్మాణంలో ఉంది. అందువల్ల మేము అమ్మవారి ఆలయ నమూనా చూసే భాగ్యం కలుగలేదు.  

అమ్మవారిని ఆలయానికి అనుకొని ఉన్న ఒక చిన్న గదిలో ఉంచారు. అక్కడే అమ్మవారిని దర్శించి, ఆమె ఆశీస్సులు అందుకొని, తిరిగివచ్చాం.










కేబులుకారులో వెళ్ళిరావటానికి ఒక మనిషికి 575 రూపాయలు. 

తరవాత మళ్ళీ ఖాట్మండుకి ప్రయాణం మొదలయ్యింది. మధ్యమధ్యలో ఆగి, టిఫిన్లు, భోజనాలు చేసుకొని, సాయంత్రం 6 గంటలకు ఖాట్మండు చేరుకున్నాం. వెళ్ళగానే హోటలు రూములో లగేజీ ఉంచి, shopping కోసం బయలుదేరాము. కాని మేం వెళ్లేసరికి 6.30 అవ్వటంతో అక్కడ షాపులు అన్నీ మూసేసి ఉన్నాయి. ఆరోజు tourism ఎక్కువ లేదని షాపులన్నీ త్వరగా ముసేసారంట. అందరం దిగాలు ముఖాలతో హోటలుకి తిరిగి వచ్చేసి, పడుకొన్నాం. 

No comments:

Post a Comment