October 21, 2019

శ్రీ నృసింహాష్టకం (రామకవి ప్రణీతం)

శ్రీ నృసింహాష్టకం (రామకవి ప్రణీతం)
చదివినవారు ..... ఐ.వి.పద్మహాస చక్రవర్తి

1
శ్రీరమాకుచాగ్రభాసి   కుంకుమాంకితోరసం
పావనాంఘ్రిసారసం సదాదయాసుధారసం
కుందశుభ్ర శారదారవిందచంద్ర సుందరం
సింహశైల మందిరం నృసింహదేవమాశ్రయే ll 

సంపదలనిచ్చు లక్ష్మీదేవి యొక్క వక్షోజలముపై ప్రకాశించుచు ఆమె కుచములకు అంటి ఉన్న కుంకుమచేత చిహ్నితమైన వక్షస్థలం గల వాడును, పవిత్రములైన (ఆశ్రితులను పవిత్రులుగా చేయు) పాదపద్మములు గలవాడను. మల్లెపూలవలె శరత్కాలపు అందమైన తెల్లతామర పూవువలె చంద్రునివలె సుందరమైన వాడును, సింహాచలమందు నివసించువాడును అగు నృసింహదేవుని ఆశ్రయించుచున్నాను. 

I seek my refuge in Lord Narasimha, the dweller of the Lion - hill, who is recognised by his devotees by the saffrom marks on his chest, caused by contact with the nipples of the breasts of the Rama his consort, by his lotus like holy feet, by his nectar like kindness, by his (bodily) beauty which throws into shade the whiteness of the jasmine lower, the brilliance of the lotus which blossoms in sarat and the effulgence of the moon.    

2
ధారిణీ వధూమణీగృహీత పాద పల్లవం
నందగోష్ణ పల్లవీసతీమనోజ్ఞ వల్లభం
మాయినాం విశారదం భవాంబురాశిపారదం
 సింహశైల మందిరం నృసింహదేవమాశ్రయే ll

3
సంచలత్సటాచ్చవా విసున్న మేఘమండలం
భైరవారవాట్టహాస భేదితా హితోదరం
ధీనలోక సాదరం జటాధరం ధరాభరం
సింహశైల మందిరం నృసింహదేవ మాశ్రయే ll 

కదులుతున్న మెడ యందలి వెంట్రుకుల సమూహములచే విదల్పబడిన మేఘ మండలము గలవాడును, భయంకరమైన ధ్వని కలుగునట్లు నవ్వుటచే శత్రువుల గుండెలవియునట్లు చేయువాడును, దీనుల యందు దయను చూపువాడును, వరాహ రూపమున భూమిని ధరించిన వాడును, జడలను ధరించువాడును, అగు సింహాద్రిదాసుడగు నృసింహదేవుని ఆశ్రయించుచున్నాను. 

I take refuge in Lord Narasimha, the dweller of the Lion - hill who by the momenium of his name is scattering the clouds on high, who is breaking the hearts of his enemies by the fearful sounds of his derisive laugh, who is all kindness to helpless souls, who in the form of a boat had lifted up the earth and who beare the name of a lion.      
           
4
శాకినీ పిశాచఘోరఢాకినీ భయంకరం
బ్రహ్మరాక్షసస్మయక్ష యంకరం శివంకరం
దైవతా సుహృత్తమో దివాకరం సుధాకరం
సింహశైల మందిరం నృసింహదేవ మాశ్రయే ll

5
మత్స్యకూర్మఘోర నారసింహ వామనాకృతిం
భార్గవం రఘూద్వహం ప్రలంబకర్భురాపహం
బుద్ధకల్కి విగ్రహం జగద్విరుద్ధ విగ్రహం
సింహశైల మందిరం నృసింహదేవ మాశ్రయే ll

6
మోహతాపహారిణం  గదా రధాంగధారిణం
శ్రీ మనోవిహారిణం విధేర్వచో విహారిణం
దానవేంద్రవైరిణం తపోధనేష్ట కారిణం
సింహశైల మందిరం నృసింహదేవ మాశ్రయే ll

7
పారిజాతపుష్పమాలికా నిబద్దకంధరం
పారిజాత బంధుకోటి తేజసం విరాజసం
కర్మబంధి తారకంరుజా విపన్నివారకం
సింహశైల మందిరం నృసింహదేవమాశ్రయే ll

8
రామసత్క విప్రణీత మేతదష్టకం శివం
దేవసారసంగ్రహం మహోగ్రపాతకాంతకం
జల్పతాంనిరంతరం సమస్తకామపూరకం
సింహశైల మందిరం నృసింహదేవమాశ్రయే ll


సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి గారి సూక్తులు Video

డాll సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి గారి సూక్తులు
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
Happy Teacher's Day

August 10, 2019

April 4, 2019

కృష్ణ శ్వేత పద్యాలు

                          కృష్ణ నామ స్మరణ (కృష్ణ శ్వేత పద్యాలు)


01
నిలుపుము నాఎద లోతుల్లో 
నిరతము నీ నామము 
సతతము నీ ధ్యానము 
విడువక పూజింతు నీ చరణములే నిజముగ కృష్ణా!  



02
పరవశమొందిరి గోపకాంతలు నిను కీర్తించి    
పులకించిరి గొల్ల పడుచులు నీ ప్రణయకేళిలో  
నర్తించెను శుకపికములు నీ మురళీగానమునకి 
ఆనందించెను నా హృదయము నినుగాంచి నిజముగ కృష్ణా!  

03
దానములెన్నో జేసితి
మోహములన్నీ వీడితి
కోపము నాపైనేలనయ్యా
ప్రాణము నీవేనని నమ్మితిగద నిజముగ కృష్ణా!

04
అత్తరు నీకై తెచ్చితి
మెత్తని నీ మేనునద్ద
ఉత్తమమైన నా సేవలందుకో
చిత్తము నీపై నిలిపితి నిజముగ కృష్ణా!

05
మన్ను ముద్దలేలనయ్య 
వెన్న ముద్ద లివిగోనయ్య 
పన్నగ శయనా పలుకవేమయ్యా 
కన్నా నాదరికి చేర రావయ్యా నిజముగ కృష్ణా!

06
ముక్తినొసగు దాతవు నీవని 
శక్తి మీర సేవలెన్నో చేసితి
భక్తి తోడ భజనలు చేసితి 
అనురక్తి నీనుండి వీడకుంటిని నిజముగ కృష్ణా!

07
కాంక్షలేమి నాకు లేవు 
ఆంక్షలoదుకు నిను చేరేందుకు 
క్షణమైనా నిను వీడి ఉండలేనే 
ఆకాంక్ష ఒక్కటే నీ చరణాలని  చేరాలని నిజముగ కృష్ణా!

08
పొదలమాటున దాగేవు
ఎదలనెన్నో దోచావు
వెతలను తీర్చగ రావా
నా మదిలో నీ రూపం నిలపగ లేవా నిజముగ కృష్ణా!


09
టక్కరి వాడవు నీవని తెలిసీ
చక్కని చుక్కలు నీవెంట పడిరి
మక్కువ నీ పై ఎక్కువ పెంచి 
ఠక్కున వారిని విడిచి పోవుట తగునా నీకిది నిజముగ కృష్ణా!

10
దేహభ్రాంతి లేదు నాకు 
విషయవాంఛ లేదు నాకు 
వస్తు మోహం లేదు నాకు 
నిను తలచిన నాటినుండి నిజముగ కృష్ణా !