October 9, 2023

బ్రహ్మచారిణి

బ్రహ్మచారిణి ( గాయత్రి )

దధానా కరపద్మాభ్యాం అక్షమలా కమండలః | 

దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||




'బ్రహ్మచారిణి' యనగా తపమాచరించు తల్లి. బ్రహ్మమునందు చరించునది.కుడి చేతియందు జపమాలను, ఎడమచేతియందు కమండలువును ధరించును. పరమేశ్వరుని పతిగా బడయుటకు తీవ్రమైన తపమొనర్చి ఉమ యని ప్రసిద్ధి వహించెను. ఈ దేవి స్వరూపము జ్యోతిర్మయము. మిక్కిలి శుభంకరము. భక్తులకును, సిద్ధులకును అనంత ఫలప్రథము. బ్రహ్మచారిణీ దేవి కృపవలన ఉపాసకులకు నిశ్చలమగు దీక్ష, సర్వత్ర సిద్ధి, విజయము ప్రాప్తించును.

నైవేద్యం : పులిహోర

శైలపుత్రి

 దసరా నవరాత్రులలో అమ్మవారి అవతారాలు, అమ్మకు పెట్టవలసిన నైవేద్యాలు, శ్లోకాలు మనం తెలుసుకుందాం…. ….   

ఆశ్వయుజ శుద్ద పాడ్యమి నుండి శుద్ధ దశమి వరకు దేవీ నవరాత్రులలో రోజుకొక దుర్గా రూపమును ఉపాసించాలి.



శైలపుత్రి (బాలా త్రిపుర సుందరి)

వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతశేఖరాం| 

వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ||


సతీదేవి యోగాగ్నిలో తనువును త్యజించి, పిదప పర్వతరాజైన హిమవంతుని యింట పుత్రికయై అవతరించినందున ఆమెకు శైలపుత్రి అను నామము. వృషభవాహనారూఢయైన ఈ మాతకు కుడిచేతిలో త్రిశూలము, ఎడమచేతిలో కమలము విరాజిల్లుచుండును. తలపై చంద్రవంకను ధరించియుండును. పార్వతి, హైమవతి అనునవియు ఆమె పేర్లే. శైలపుత్రి మహిమలు, శక్తులు అనంతములు. వాంఛితములను ప్రసాదించు తల్లి. .......  

నైవేద్యం : కట్టు పొంగలి