అహోబిలం 27 జూన్ (2015)
పచ్చని చెట్లతో కూడిన కొండలు, కొండలపై నుండి కిందకి దూకే జలపాతాలు..... చూసి ఆనందాన్ని అనుభవించాలేకానీ అక్కడి ప్రకృతిని వర్ణించటం చాలా కష్టం. ఎటు చూసినా పచ్చని ప్రకృతి, జలపాతాలే కనిపిస్తాయి.
మేము వెళ్ళినరోజు స్వాతి నక్షత్రం అయినందువల్ల, అహోబిలంలో దిగువ నరసింహస్వామివారికి గరుడవాహనంపై తిరువీధి జరుపున్నారు.....
స్వాతి నక్షత్రం రోజున అహోబిల నరసింహస్వామివారిని ఏది కోరుకుంటే అది సిద్ధిస్తుందంట, మేము వెళ్ళిన రోజు స్వాతి నక్షత్రం అవ్వటం వలన జనం చాలా ఎక్కువగా ఉన్నారు.
పచ్చని చెట్లతో కూడిన కొండలు, కొండలపై నుండి కిందకి దూకే జలపాతాలు..... చూసి ఆనందాన్ని అనుభవించాలేకానీ అక్కడి ప్రకృతిని వర్ణించటం చాలా కష్టం. ఎటు చూసినా పచ్చని ప్రకృతి, జలపాతాలే కనిపిస్తాయి.
ఒక అబ్బాయి..... పుట్టు జుత్తులు(కేశఖండన) కోసం వారి కుటుంబం మొత్తం బస్సులో వచ్చిన దృశ్యం.
అహోబిలం దిగువ నరసింహస్వామి కోవెల
No comments:
Post a Comment