ఉపాధ్యాయ దినిత్సవం ....... (డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి)
(జననం 05-09-1888 - 17-04-1975)
సుప్రసిద్ధ తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు, అసాధారణ మేధావి, విశ్వవిఖ్యాతి గాంచిన రచయిత భారతదేశ రాశ్రపటిగా (1962-67) పనిచేసిన ప్రజానాయకుడు డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ కు దక్షిణపు సరిహద్దును ఆనుకొని తమిళనాడులో ఉన్న తిరుత్తనిలో ఒక తెలుగు కుటుంబంలో 1888 సెప్టెంబర్ 05న జన్మించారు. తిరుత్తనిలో హైస్కూలు విద్యనూ, నెల్లూరులో FA ను పూర్తిచేసి మద్రాసులో క్రైస్తవ కాలేజీలో తత్వశాస్త్రంలో MA పట్టాను పొందారు. అనంతరం మద్రాసులో ప్రెసిడెన్సీ కాలేజీలో 1909 న తత్వశాస్త్ర అధ్యాపకునిగా చేరి, 1918లో ఆ పదవిని వదులుకొని, మైసూరు విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర శాఖా అధ్యక్షునిగా పనిచేసి, విద్యాబోధనలో అగ్రశ్రేణికి చెందిన ఆచార్యునిగా పేరు గడించారు. 1921లో కలకత్తా విశ్వవిద్యాలయంలో మానసిక, తత్వశాస్త్ర శాఖలకు ఆచార్యునిగా నియమితులయ్యారు. అదే సమయంలో "హిందూతత్వశాస్త్రము" అనే అర్థం వచ్చే పేరుతొ ఇంగ్లీషులో ఒక ఉద్గ్రంథాన్ని రచించారు. 1926లో Oxford University లో భారతీయ జీవిత దృక్పథంను గురించి ఆయన ఉపన్యాసాలు ఇచ్చారు. 1927లో 31వ భారతీయ తత్వశాస్త్ర మహాసభకు అధ్యక్షత వహించారు.
1929లో గ్రేట్ బ్రిటనులో మాంచెస్టర్ కాలేజీ (Oxford) రాధాకృష్ణన్ ను ఆచార్య పదవిలో నియమించి గౌరవించింది. 1931 నుండి 1936 వరకు ఆంధ్ర విశ్వవిద్యలమునకు, 1939 నుండి 1948 వరకు కాశీలోని హిందూ విస్వవిద్యాలయమునకు ఉపాధ్యక్షునిగా ఆయన వ్యవహరించారు. ఆ పండితుని పదవీ నిర్వహణ కాలంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం అంతర్జాతీయ స్థాయిని అందుకొంది.
నిర్భయతకు, స్వతంత్ర భావాలకు పేరుగన్న వారు రాధాకృష్ణన్. బ్రిటీషు ప్రభుత్వం ఆయనకు "సర్" అనే బిరుదునిచ్చి గౌరవించింది. అయినను భారతదేశమునందలి బ్రిటీషు పాలనను నిరాఘాటంగా విమర్శించి, గాంధీజీ నాయకత్వంలో సాగిన స్వాతంత్ర్య పోరాటాన్ని ఆయన సమర్థించారు. గాంధీజీ 75వ జన్మదినోత్సవం సందర్భంలో అభినందన గ్రంథ సంకలనమున రాధాకృష్ణన్ సారథ్యం వహించి, ఆ గ్రంథమును గాంధీజీకి సమర్పించెను. విశ్వకవి రవీంద్రుని కవిత్వ తత్వమును వివరిస్తూ బృహద్గ్రంథమును రచించి ప్రచురించెను. ప్రపంచ దేశాలన్నింటిని దర్శించి భరతవాణిని వినిపించి, ఆయన శ్రోతలను ముగ్ధులను కవించెను. 1946లో అంతర్జాతీయ వైజ్ఞానిక సమితిలో పాల్గొనిన భారత రాయబారమునకు ఆయన నాయకత్వము వహించెను.
రాజ్యాంగ విధాన పరిషత్ సభ్యునిగా ఆయన చేసిన ప్రసంగములు ఆయన రాజనీతిజ్ఞతకు, లౌకిక ప్రజ్ఞకు మచ్చుతునకలు. భారతదేశం స్వతంత్రతను ఆర్జించిన తరవాత, విజయలక్ష్మీ పండిట్ తరువాత రాధాకృష్ణన్, సోవియట్ దేశంలో, భారతదేశ రాయబారిగా నియుక్తులయ్యారు. ఆనాటి రష్యాకు అధినేతగా ఉండిన స్టాలిన్, రాధాకృష్ణన్ ఎదల అత్యంత మన్ననను ప్రదర్శించి, తన కార్యాలయమునకు ఆయనను 2సార్లు పిలిపించుకొని రాజకీయ సాంస్కృతిక విషయములను ఎన్నింటినో చర్చించెను.
భారతదేశ తోలి ఉపరాష్టపతిగ రాధాకృష్ణన్ 1952లో ఎన్నికై 1962 వరకు ఆ పదవిని నిర్వహించెను. ఆ కాలంలో రాజ్యసభలో అధ్యక్షపీఠంలో ఉండి, సభా నిర్వహణలో ఆయన తన అసమాన చాతుర్యాన్ని ప్రదర్శించి, అన్ని రాజకీయ పక్షాల మన్ననలను ఆర్జించెను. అధ్యక్ష పదవి నుండి రాజేంద్రప్రసాద్ వైదొలగగానే, 1962లో భారతదేశానికి రాధాకృష్ణన్ అధ్యక్షునిగా ఎన్నుకొనబడి 1967 వరకు ఆ పదవిలో ఉండెను. ఆ పదవీకాలంలో భారతదేశం పలు సంఘటనలను ..... 1) భారతదేశపు సరిహద్దులపై చైనా దండయాత్ర, 2) పండిత జవహర్లాల్ మరణించడం, 3)భారతదేశంపై పాకిస్తాన్ దండయాత్ర. ---- ఎదుర్కొనవలసి వచ్చిననూ, వాటి నుండి భారత ప్రజాస్వామ్యం మొక్కపోకుండా బయట పాడటానికి రాధాకృష్ణన్ ప్రజాస్వామ్య నిరతి, భావ స్వాతంత్ర్యం, కార్యచాతుర్యం ఎక్కువగా తోడ్పడ్డాయి.
రాధాకృష్ణన్ అసమాన వక్తగా పేరుగాంచారు. ఆంగ్లభాషపై అతనికిగల అభిమానం సాటిలేనిది. ఆంగ్లమే మాతృభాషగా కలిగిన సర్ స్టాఫర్డ్ క్రిప్స్ వంటి వక్తలు సైతం అతని పాండిత్యానికి, వచో విన్యాసానికి, ఆంగ్లభాషా పరిజ్ఞానికి ఆశ్చర్యపడ్డారు, పైన పేర్కొనబడినవేగాక రాధాకృష్ణన్ పండితుడు, ఇతర గ్రంథాలని చాలావాటిని ఆంగ్లంలోకి రచించారు. మాస్కోలో ఉన్నప్పుడు 'దమ్మపదము' పై వ్యాఖ్యానమును రచించెను. 'నాగరికతా భవిష్యత్తు' అను గ్రంథమును రచించి తన సహధర్మచారిణికి అంకితమిచ్చెను. తక్కిన రచనలో హైందవ జీవిత దృక్పధం - ప్రాక్పశ్చిమములు, గౌతమ బుద్ధుడు, గాంధీ, భగవద్గీత, ఉపనిషత్తులు ఎక్కువగా వ్యాప్తిని, ఆదరణను ఆర్జించాయి.
దేశ సేవారంగమున ముఖ్యంగా విద్యారంగమున రాధాకృష్ణన్ చేసిన కృషికి కృతజ్ఞతను వెల్లడించుటకై ఆయన జన్మదినము అయిన సెప్టెంబర్ 05 ను అధ్యాపక దినోత్సవం(Teacher's Day)గా దేశం పాటిస్తోంది. ఆ మహామనిషి రాధాకృష్ణన్ 1975 ఏప్రియల్ 17న మద్రాసులో పరమపదించారు.
No comments:
Post a Comment