బొమ్మలకొలువు సంప్రదాయపు పాట
రండమ్మా రారండమ్మా బొమ్మలకొలువు పేరంటానికి
పసుపుకుంకుమల ఫలాలు నొంది పాపాల దీవింప రారమ్మ
మా పాపాల దీవింప రారమ్మ ..... రండమ్మా రారండమ్మా
వెన్నతినే చిన్ని కృష్ణుడు వేణువునూదే లీలాకృష్ణుడు
మత్స్య కల్కాది అవతారాలు అర్థనారీశ్వర రూపాలు
llరండమ్మా రారండమ్మాll
లక్ష్మీ పార్వతి సరస్వతి ప్రతిరూపాల ప్రతిమలు
భువిలో సంక్రాతి వేడుక చూడ దివినించి భువికేగి యున్నారు
ll రండమ్మా రారండమ్మాll
పురివిప్పిన నెమళ్ళు మెరిసే కళ్ళ లేళ్ళు
ఠీవిగ నిలిచిన సింహాలు భీతిని గొలిపే పులులు
సజీవతకు సాక్ష్యాలు చెబితేనే అవి బొమ్మలు

No comments:
Post a Comment