May 22, 2014

మనం తెలుసుకోదగిన కొన్నివిషయాలు.....శతావధానం, అష్టావధానం

మనం తెలుసుకోదగిన కొన్నివిషయాలు

శతావధానం

శతావధానంలో వందమంది పృచ్ఛకులకు వారు అడిగిన విషయాలమీద తడవకు ఒక పాదం చెబుతూ, వంద పద్యాలు చెప్పాలి. అన్నీ గుర్తుంచుకొని చివరకు ఆ వంద పద్యాలూ అప్పజెప్పాలి.


అష్టావధానం

అష్టావధానంలో ఎనిమిది మంది పృచ్ఛకులు ఉంటారు. అయినా ఇది శతావధానం కంటే కూడా ఎక్కువ కష్టమైనది. దీనికి ధారణశక్తి ఎక్కువగా కావాలి. సమస్య, వర్ణన, నిషిద్దాక్షారీ, వ్యస్తాక్షరీ, పురాణం, దత్తపది, ఆశుకవిత్వం, ఖేలనం(చదరంగం), గణనం(లెక్కపెట్టటం), వంటి ఎనిమిది అంశాలు ఉంటాయి. అవధానిని పద్యాలు ఆలోచించుకోనివ్వకుండా పృచ్ఛకులు అడుగడుగునా అడ్డుతగులుతుంటారు. అయినా ఏమాత్రం విసుక్కోకుండా, అలసిపోకుండా అందరికీ జవాబులు చెబుతూ, మధ్య - మధ్య చమత్కార ప్రసంగాలతో సభను రంజింపచేస్తూ చిట్టచివరికి అన్ని పద్యాలు జ్ఞాపకం పెట్టుకొని అప్పచెప్పాలి.


అష్టనాయికలు

కావ్యాలలో అష్టనాయికలను వర్ణిస్తారు. వారి పేర్లు 1) ప్రోషిత భర్తృక, 2)ఖండిత 3)కలహాంతరిత 4) విప్రలబ్ద 5)వాసకసజ్జిక 6)స్వాధీన పతిక, 7) అభిసారిక, 8) విరహోత్కంఠిత.
ఈ అష్టనాయికలు మమతరెడ్డిగారు తయారుచేసిన చిత్రాలు.  


అష్టదిగ్గజాలు

ఐరావతం, పుండరీకం, వామనం, కుముదం, అంజనం, పుష్పదంతం, సార్వభౌమ, సుపత్రీకం -- అనేవి దిగంతాలలోని ఎనిమిది గజాలు.

భువనవిజయంలోని అష్టదిగ్గజాలలో - అల్లసాని పెద్దన, నంది తిమ్మన, భట్టుమూర్తి, అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన్న, తెనాలిరామకృష్ణుడు, ధూర్జటి, మాదయగారి మల్లన.  

          

అష్టకష్టాలు

అష్టకష్టాలు పడటమంటే - దాస్యం, దారిద్ర్యం, భార్యలేకపోవటం, ఒకరిదగ్గర చేయిచాచి అడుక్కుతినే దుర్గతి పట్టడం, అడిగి లేదనిపించుకోవటం, అప్పు పడటం, ఇతరుల సహాయం మాత్రం లేకుండా... తన కృషి మీదనే ఆధారపడి బ్రతకడం, ఒంటరిగా త్రోవలో నడక సాగించడం.  

అష్టాదశ పురాణాలు

శ్లో!! మద్వయం భద్వయం చైవ
బ్రత్రయం వచతుషటయం
అనాపలింగ కూస్కానీ
పురాణాని ప్రచక్షత!!

మద్వయం: మ కారంతో 2. అవి మత్స్య పురాణం. మార్కండేయ పురాణం.
భద్వయం: భ కారంతో 2. అవి భాగవత పురాణం. భవిష్యత్ పురాణం.
బ్రత్రయం: బ్ర కారంతో 3. అవి బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం.
వచుతష్టయం: వకారంతో 4. అవి వాయుపురాణం, వరహా పురాణం, వామన పురాణం, విష్ణు పురాణం.
అ కారంతో అగ్ని పురాణం, నా కారంతో నారద పురాణం, ప కారంతో పద్మ పురాణం, లి కారంతో లింగ పురాణం, గ కారంతో గరుడ పురాణం, కూ కారంతో కూర్మ పురాణం మరియు స్క కారంతో స్కంద పురాణం రచించిరి.

1)మత్స్య పురాణము 2)మార్కండేయ పురాణము 3)భాగవత పురాణము 4)భవిష్యపురాణము 5)బ్రహ్మపురాణము 6)బ్రహ్మ వైవర్త పురాణము 7)బ్రహ్మాండ పురాణము 8)వాయు పురాణం 9)వరాహపురాణము 10)వామన పురాణం 11)విష్ణు పురాణం 12)అగ్నిపురాణము 13)నారదపురాణము 14)పద్మపురాణము 15)లింగపురాణము 16)గరుడ పురాణము 17)కూర్మ పురాణము 18)స్కాంద పురాణము



అష్టాదశ పర్వాలు

భారతంలోని 18 పర్వాలను అష్టాదశ పర్వాలు అని అంటారు.
ఆదిపర్వం, సభాపర్వం, వనపర్వం, విరాటపర్వం, ఉద్యోగపర్వం, భీష్మపర్వం, ద్రోణపర్వం, కర్ణపర్వం, శల్యపర్వం, సాప్తికపర్వం, స్త్రీపర్వం, శాంతి పర్వం, అనుశాసనిక పర్వం, అశ్వమేధ పర్వం, ఆశ్రమవాస పర్వం, మౌసల పర్వం, మహాప్రస్థాన పర్వం, స్వర్గారోహణ పర్వం. 

               
అష్టాదశ వర్ణనలు

నగరం, సముద్రం, శైలం, ఋతువు, చంద్రోదయం, సూర్యోదయం, ఉద్యానం, జలక్రీడ, మధుపానం, రథోత్సవం, విప్రలంబం, వివాహం, కుమారోదయం, మంత్రం, ద్యూతం, ప్రయాణం, యుద్ధం, నాయకాభ్యుదయం.              

దశరూపకాలు

నాటకం, ప్రకరణం, బాణం, ప్రహసనం, దీమం, వ్యాయోగం, సమవాకారం, వీధి, అంకం, ఈహామృగం.          

నవరసాలు

మన కావ్యాలలో వర్ణింపబడే నవరసాలు - శృంగారం, హాస్యం, కరుణ, రౌద్రం, వీరం, భయానకం, భీభత్సం, అద్భుతం, శాంతం.   నవరసాల చిత్రాలు బాపూగారి బొమ్మల్లో.  

    
నవవిధ భక్తి ప్రభోదాలు

శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవ, అర్చన, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం.  

    
పంచాంగం

జ్యోతిష్యంలో పంచాంగం అంటే - తిథి, వార, నక్షత్ర, యోగ కరణములు.

ఉపవాసంలో పంచాంగం అంటే - జపం, హోమం, తర్పణం, అభిషేకం, బ్రాహ్మణ భోజనం.

ఇవేకాకుండా ఉపాయం, సహాయం, దేశకాశ విభజనం, ఆపదకు ప్రతిక్రియ, కార్యసిద్ధి - అనే ఐదింటిని కూడా పంచాంగాలు అని అంటారు.

          

దశోపనిషత్తులు

ఈశ, కేశ, కఠ, ప్రశ్న, ముండక, మాండుక్య, తైత్తరీయ, ఐతరేయ, ఛాందోగ్య, బృహదారిణ్యకములు.

                                      

No comments:

Post a Comment