August 23, 2014

పావగడ శీతలాదేవి - శనీశ్వర ఆలయం

పావగడ శీతలాదేవి - శనీశ్వర ఆలయం

పావగడ పుణ్యక్షేత్రం - అనంతపూర్ - హిందూపూర్ జిల్లాలకి  45 కి. మీ. దూరంలో,  ఆంధ్రా - కర్ణాటక సరిహద్దుల్లో టుముకూరు జిల్లాలో ఉంది.



పౌరాణిక గాథ 

పావగడ - కోట, తోటలతో ప్రకృతి సౌందర్యంతో సదా పచ్చగా ఉండే చిన్ని ఊరు.



హొయసల రాజులు, మొగల్ చక్రవర్తులు, మైసూర్ మహారాజులు మొదలైనవారు పాలించిన ఈ ఊళ్ళో 400 ఏళ్ళకు పూర్వం వర్షాలు లేక  కరువు కాటకాలు తాండవించాయి. పచ్చని పైర్లన్ని ఎండిపోయాయి. జంతువులు, పక్షులు కరువు కాటకాలు వాళ్ళ ఆహరం నీళ్ళు లేక పరితపించసాగాయి. ప్రజలు ఆకలి దప్పులతో అలమటించసాగారు. 

ఏం చెయ్యాలో దిక్కుతోచక ప్రజలందరూ ఆ ఊరికి సమీపాన ఉన్న ఒక అరణ్యాన్ని చేరుకొని, అక్క కఠిన తపస్సు చేస్తున్న మునులతో తమ కష్టాలను తీర్చమని ప్రాధేయపడసాగేరు. 

దయార్ద్ర హృదయులైన మునులు, యోగులు, అందరూ కలుసుకొని, ఆ ఊరిని కాపాడటానికి ఒక మార్గాన్ని కనుగొన్నారు. 

ఒక నల్లరాతిని తీసుకొని, దానిపై శీతలాదేవి మహాబీజాక్షర మంత్రాన్ని రాసారు. దానిపై అమ్మవారిని ఆవాహనం కావించి, భూమిపై ప్రతిష్ఠ జరిపారు. తరవాత ఎన్నో అభిషేకాలు, పూజలు చేసారు. భువిని కాపాడే ఆ తల్లి ఆ ప్రాంతాన్ని కూడా కాపాడాలని నిశ్చయించుకుంది. వర్షాలు బాగా పడ్డాయి, జీవజంతువులు సంతోషపడ్డాయి. ఊరు బాగుపడి ప్రజలంతా సంతోషంగా జీవించసాగారు. ఆనాటి నుండి ఈ యంత్రాన్ని పూజిస్తే అసాధ్యమైన ఎన్నో కోరికలు కూడా సఫలం అయ్యాయి. చుట్టుపక్కల కరువు తాండవించినా ఈ యంత్రాన్ని పూజించటం మొదలుపెట్టారు. అపారమైన నమ్మకంతో వరుణజపం చేస్తే తప్పక వర్షాలు కురుస్తాయన్న నమ్మకం ఏర్పడింది. ఇక పూజలు చేస్తే ఏ ఊళ్ళోనైనా వర్షం పడగలదన్న నమ్మకం ప్రజలకు ఏర్పడింది. యంత్ర ప్రతిష్ఠ జరిపిన అదే ప్రాంతంలో అమ్మవారికి ఒక గర్భగుడిని నిర్మించారు. 

కొన్ని శతాబ్దాల తరవాత కొంతమంది భక్తులు అమ్మవారి పక్కనే శనీశ్వర స్వామిని కూడా ప్రతిష్టించాలని సంకల్పించారు. ఒక భక్తుడు తన కోరికను మిగిలిన భక్తులతో ప్రస్తావించగా అందరి మనస్సులలోనూ అదే ఆలోచన ఉన్నట్టు తెలుసుకొని సంతోషపడి, భక్తులందరూ కలసి ఆలయం నిర్మించారు. ఆ స్వామిని ప్రతిష్టించాక శీతలాదేవి ఆలయం కాస్తా శనీశ్వరస్వామి నెలకొన్న పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది.

ఆలయ విశేషాలు 

ఎన్నో దేవతా విగ్రహాలతో నిండిన శీతలాదేవి ఆలయం, ఒక పెద్ద మండపంలో నెలకొంది. ఆ మండపం కింద చుట్టూ ఎన్నో రంగు రంగుల దేవతా విగ్రహాలు దర్శనమిస్తాయి. 

ఈ ఆలయం ఎల్లప్పుడూ భక్తజనసందోహంతో కిక్కిరిసి ఉంటుంది.  ఆలయం లోపలి ప్రవేశించగానే ఎడమవైపున ఒక మహాగణపతి విగ్రహం మనకు దర్శనమిస్తుంది. ముందుగా విఘ్ననాయకుడిని దర్శించాకే మిగిలిన దేవుళ్ళను దర్శిస్తారు.

గణపతికి కుడివైపున ఒక అశ్వర్థ చెట్టు క్రింద శీతలాదేవి విగ్రహం, ఉత్సవ విగ్రహం మనకు కనిపిస్తాయి. అక్కడ రాతిపై చెక్కిన బీజాక్షర మంత్రమున్న యంత్రాన్ని దర్శించవచ్చును. ఆ విగ్రహం పసుపు రాసి, కుంకుమ బొట్టుపెట్టి, ఎంతో మంగళకరంగా కనిపిస్తుంది. అమ్మవారికి చేతులనిండా రంగురంగు గాజులు వేస్తారు. సంతానం కొరకు స్త్రీలు మొక్కుకొని, అమ్మవారికి గాజులు సమర్పించి, తరవాత ఆలయానికి వచ్చిన ముత్తైదువలకి ఇస్తారు.ఆ యంత్రం, ఆ దేవిని చూసినవారికి ఎవరికీ అది ఒక రాయి అన్న భావన కలుగదు. భక్తిభావం ఉప్పొంగి, ఒళ్ళు పులకరిస్తుంది.



శీతలాదేవిని పూజించిన భక్తులకు ఆయురారోగ్య ఐస్వర్యాలు సమకూరుతాయి. వారికి సంబంధించిన జీవ జంతువులు, పిల్లాపాపలు, పక్షులు ఇలా అందరినీ అన్ని వేళల్లో కరువు కాటకాల నుండి కాపాడుతుంది ఈ తల్లి.

వర్షాలు లేక చెరువులు ఎండిపోయినప్పుడు - ఆ దేవికి 101 కొబ్బరి బొండాలు, 101 నిమ్మకాయలు, 101 బిందెలతో అభిషేకం చేస్తారు. వేదమంత్రాలు పఠిస్తారు. పూజ ముగిసిన తరవాత మంగళ హారతులు ఇచ్చి పెరుగన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. పశువులకు, పక్షులకు కూడా అనారోగ్య సమయంలో ఆ తల్లికి పాలాభిషేకం చేస్తారు. శీతలాష్టకం, శీతలాంబ సుప్రభాతం చదివితే మనసుకి ప్రశాంతత లభించి, జీవితం సంతోషంగా గడిచిపోతుంది.

ఆలయం వెనుక శనీశ్వర స్వామికి ప్రత్యేకమైన సన్నిధిని దర్శించవచ్చును. నవగ్రహాల మధ్యన, కవచం ధరించి ఉన్న శనీశ్వరుని మనం చూడవచ్చును. ఈ సన్నిధిలో మూలవిగ్రహం శనీశ్వరుడు. ఈ స్వామి ముందు ఉత్సవ మూర్తి జ్యేష్ఠాదేవితో పాటు కొలువై ఉంటాడు. పూజలు, అభిషేకాలు, అలంకారాలు అన్నీ ఈ ఉత్సవ విగ్రహం శనీశ్వరునికే.


వివాహం జరగాలని, లేదా సంతానం కలగాలని, వేడుకున్న వారికీ, తప్పక ఆ స్వామి ఆశీస్సులు లభించి, కోరికలు నెరవేరుతాయి. మాంగల్య పూజ జరిపిస్తే మూడు నెలల నుండి ఆరు నెలల లోపు తప్పక పెళ్ళి జరుగుతుందని భక్తులు ఏంటో సంతోషంగా చెబుతుంటారు.

వ్యాపారం బాగా జరగాలంటే ప్రాకారపూజ జరిపిస్తారు. ప్రాకారపూజ జరిపించే వారికి శనీశ్వరుని గదని ఇస్తారు. ఆ గదని చేతపట్టుకొని ప్రాకారం చుట్టూ ప్రదక్షిణం గ్రహదోషాలు తొలగిపోతాయంట. వ్యాపారము తప్పక అభివృద్ధి చెంది లాభాలు పొందుతారంట.

శీతలాదేవిని, శనీశ్వరుని పూజించే భక్తులు తమ కోరికలు నెరవేరటం వలన సంతోషంతో పొంగిపోతుంటారు. ఆతరువాత మళ్ళీ స్వామిని దర్శించి ఆనందిస్తారు.


                                                       

August 15, 2014

ఎంతోమంచిరోజు.... హ్యాపీ ఆగష్ట్ ఫిఫ్టీన్

ఎంతోమంచిరోజు

ఎంతోమంచిరోజు సంతోషించే రోజు
స్వాతంత్ర్యం వచ్చింది ఈరోజు
మన బాధలన్ని తీరాయి ఈరోజు
హ్యాపీ ఆగష్ట్ ఫిఫ్టీన్
హ్యాపీ ఆగష్ట్ ఫిఫ్టీన్ ll ఎంతోమంచిరోజుll

గాంధి నెహ్రూలు కలిసారు
తెల్లవాళ్ళ ఆక్రమాలు అణిచారు
మనపంతం నెగ్గింది
మన ఇష్టం సాగింది
మనవారి కోరికే తీరింది
హ్యాపీ ఆగష్ట్ ఫిఫ్టీన్
హ్యాపీ ఆగష్ట్ ఫిఫ్టీన్ ll ఎంతోమంచిరోజుll

అంబేద్కరుని రాజ్యాంగముపై
వేసెను పునాది శాస్త్రీజీ
భారత ప్రఖ్యాతి మన ధ్యేయమని
ప్రతిజ్ఞ చేసెను మన ఇందిర
హ్యాపీ ఆగష్ట్ ఫిఫ్టీన్
హ్యాపీ ఆగష్ట్ ఫిఫ్టీన్ ll ఎంతోమంచిరోజుll


August 14, 2014

పిల్లల్లారా పాపల్లారా - రేపటి భారత పౌరుల్లారా

పిల్లల్లారా పాపల్లారా - రేపటి భారత పౌరుల్లారా

పిల్లల్లారా పాపల్లారా
రేపటి భారత పౌరుల్లారా
పెద్దలకే ఒక దారిని చూపే పిన్నల్లారా | | పిల్లల్లారా పాపల్లారా | |

మీ కన్నుల్లో పున్నమి జాబిల్లి ఉన్నాడు
ఉన్నాడు...  పొంచి ఉన్నాడు
మీ మనసుల్లో దేవుడు కొలువై ఉన్నాడు
ఉన్నాడు.. అతడున్నాడు

భారత మాతకు ముద్దుపాపలు మీరేలే మీరేలే
అమ్మకు మీపై అంతులేని ప్రేమేలే  ప్రేమేలే | | పిల్లల్లారా పాపల్లారా | |

భారతదేశము ఒకటే ఇల్లు
భారతమాతకుమీరే కళ్ళు
జాతి పతాకము పైకెగరేసి
జాతి గౌరవము కాపాడండి

బడిలో బయట అంతా కలిసి
భారతీయులై మెలగండి
భారతీయులై మెలగండి

కన్యాకుమారికి కాశ్మీరానికి
అన్యోన్యతను పెంచండి
వీడని బంధము వేయండి | | పిల్లల్లారా పాపల్లారా | |


August 12, 2014

108 వైష్ణవ దివ్య క్షేత్రాలు

108 వైష్ణవ దివ్య క్షేత్రాలు

వైష్ణవులకు అత్యంత పవిత్రమైన క్షేత్రాలు 108 ఉన్నాయి. పన్నిద్దరు (12) ఆళ్వారులు తమ రచనలయిన పాశురములలో ఈ 108 విష్ణు రూపాలను కొలిచారు. ఇందులో 105 భారతదేశంలో, 1 నేపాల్ లో, మరియు మిగితా 2 దివ్య తిరుపతులు భూమిలి వెలుపల ఉన్నవి.

1. శ్రీరంగం 2. ఉరైయూర్ 3. తంజమా మణిక్కోయిల్ 4. తిరువన్బిల్ 5. కరంబనూర్ 6. తిరువెళ్లరై 7. పుళ్ళం పూదంగుడి 8. తిరుప్పేర్ నగర్ 9. ఆదనూర్ 10. తిరువళందూర్ 11. శిరుపులియూర్ 12. తిరుచ్చేరై 13. తలైచ్చంగణాన్మదియం 14. తిరుక్కుడందై 15. తిరుక్కండియూర్ 16. తిరువిణ్ణగర్ 17 తిరువాలి తిరునగరి 18. తిరుకన్నాపురం 19. తిరునాగై 20. తిరునరైయూర్

21. తిరునందిపురం 22. తిరువిందళూరు 23. తిరుచిత్రకూటం 24. శ్రీరామవిణ్ణగర్ 25. కూడలూర్ 26. తిరుక్కణ్ణంగుడి 27 తిరుక్కణ్ణ మంగై 28. కపిస్థలం 29. తిరువెళ్లియం గుడి 30. తిరుమణి మాడక్కోయిల్ 31. వైకుంఠ విణ్ణగరం 32. తిరుఅరిమేయ విణ్ణంగరం 33. తిరుత్తేవనార్ తొగై 34. తిరువణ్ పురుషోత్తమం 35. తిరుశెంపొన్ శెయ్ కోయిల్ 36. తితుతైత్తియంబలం 37. తిరుమణిక్కూడం 38. తిరుక్కావళంపాడి 39. తిరువెళ్లక్కుళం 40. తిరుపార్తాన్ పళ్ళి

41. తిరుమాలిరుం శోలైమలై 42. తిరుక్కోటియూర్ 43. తిరుమెయ్యం 44. తిరుప్పల్లాణి 45. తిరుత్తంగాల్ 46. తిరుమోగూర్ 47. తెన్ మధురై 48. శ్రీ విల్లిపుత్తూరు 49. తిరుక్కురు గూర్ 50. తిరుతులై విల్లి మంగళం 51. శిరీవర మంగై 52. తిరుప్పళింగుడి 53. తెన్ తిరుప్పేర్ 54. శ్రీ వైకుంఠం 55. తిరువరగుణ మంగై 56. తిరుక్కళందై 57. తిరుక్కురుం గుడి 58. తిరుక్కోళూరు 59. తిరువనంతపురం 60. తిరువణ్ పరిశరాం

61. తిరుకాట్కరై 62. తిరుమూరీక్కళం 63. తిరుప్పలియూర్ 64. తిరుచిత్తార్ 65. తిరునావాయ్ 66. తిరువల్లవాళ్ 67. తిరువణ్ వండూరు 68. తిరువాట్టర్ 69. తిరువిత్తు వక్కోడు 70. తిరుక్కడిత్తానం 71. తిరువారన్ విళై 72. తిరువహింద్ర పురం 73. తిరుక్కోవలూర్ 74. పెరుమాళ్ కోయిల్ 75. శ్రీ అష్టభుజం 76. తిరుత్తణ్ కా 77. తిరువేళుక్కై 78. తిరుప్పాడగం 79. తిరునీరగం 80. తిరునిలాత్తింగళ్ తుండం

81. తిరువూరగం 82. తిరువెక్కా 83. తిరుక్కారగం 84. తిరుకార్వానం 85. తిరుక్కల్వనూర్ 86. తిరుపవళ వణ్ణం 87. పరమేశ్వరవిణ్ణగరం 88. తిరుప్పళ్ కుళి 89. తిరునిర్రవూర్ 90. తిరువెవ్వుళూరు 91. తిరునీర్మలై 92. తిరువిడ వెండై 93. తిరుక్కడల్ మల్లై 94. తిరువల్లిక్కేణి 95. తిరుఘటిగై 96. తిరుమల 97. అహోబిలం 98. అయోధ్య 99. నైమిశారణ్యం 100. సాలగ్రామం 101. బదరికాశ్రమం 102. కండమెన్రుం కడినగర్ 103. తిరుప్పిరిది 104. ద్వారక 105. బృందావనం 106. గోకులం 107 క్షీరాబ్ది 108. పరమపదం.

108 దివ్యదేశాలు

శ్రీరంగం
ఉరైయూర్
తంజమా మణిక్కోయిల్ (తంజావూర్-తిరువయ్యార్ 3 కి.మీ.)
అన్బిల్ (బాణాపురం) (లాల్గుడి నుండి 8 కి.మీ.)
కరంబనూర్ (ఉత్తమర్ కోయిల్)
తిరువెళ్ళరై (శ్వేతగిరి)
తిరుప్పుళ్ళం పూతంగుడి (కుంభఘోణము 10 కి.మీ.)
తిరుప్పేర్ నగర్ (అప్పక్కుడుత్తాన్) (లాల్గుడి 10 కి.మీ.) (కోవిలడి)
తిరువాదనూర్ (స్వామిమలై 3 కి.మీ.)
తిరువళందూర్ (మాయవరం 12 కి.మీ.) (తేరళందూర్)
శిరుపులియూర్
తిరుచ్చేరై (కుంభకోణం 12 కి.మీ.) (సార క్షేత్రము)
తలైచ్చంగనాణ్మదియమ్ (తలైచ్చగాండ్రు)
తిరుక్కుడందై (కుంభకోణము)
తిరుక్కండియూర్
తిరువిణ్ణగర్ (కుంభకోణం 5 కి.మీ.) (ఉప్పిలి యప్పన్ కోయిల్)
తిరువాలి తిరునగరి (శీర్గాళి 18 కి.మీ.)
తిరుక్కణ్ణపురం (నన్నిలమ్ నుండి 7 కి.మీ.)
తిరునాగై (నాగపట్నం)
తిరునరైయూర్ (కుంభకోణం 10 కి.మీ.)
నందిపుర విణ్ణగరమ్ (కుంభకోణం 10 కి.మీ.) (నాథన్ కోయిల్)
తిరువిందళూరు (మాయావరం) (తిరువళందూర్)
తిరుచ్చిత్తరకూడమ్ (చిదంబరం)
కాంచీరామ విణ్ణగరమ్ (శీయాళి) (శీర్గాళి)
కూడలూర్ (తిరువయ్యారు 10 కి.మీ.) (ఆడుదురై పెరుమాళ్ కోయిల్)
తిరుక్కణ్ణంగుడి (కృష్ణారణ్యక్షేత్రం)
తిరుక్కణ్ణమంగై (తిరువారూరు 8 కి.మీ.) (కృష్ణమంగళ క్షేత్రం)
కపి స్థలమ్
తిరువెళ్ళియంగుడి
మణిమాడక్కోయిల్ (తిరునాంగూర్) (శీర్గాళి-వైదీశ్వరన్ కోయిల్ 10 కి.మీ.)
వైకుంద విణ్ణగరమ్
అరిమేయ విణ్ణగరమ్
తిరుత్తేవనార్ తొగై (కీళచాలై)
వణ్ పురుడోత్తమ్
శెంపొన్ శెయ్ కోయిల్
తిరుత్తెట్రియమ్బలమ్
తిరుమణిక్కూడమ్ (తిరునాంగూర్ తిరుపతి)
తిరుక్కావళంబాడి (తిరునాంగూర్ తిరుపతి)
తిరువెళ్ళక్కుళమ్ (అణ్ణన్ కోయిల్)
తిరుపార్తన్ పళ్ళి
తిరుమాలిరుం శోలై మలై (మధుర 20 కి.మీ.) (అంగర్ కోయిల్)
తిరుక్కోట్టియూర్ (గోష్ఠీపురము)
తిరుమెయ్యమ్ (పుదుక్కోట్టై 20 కి.మీ.)
తిరుప్పుల్లాణి (రామనాథపురం 10 కి.మీ.) (దర్భ శయనం)
తిరుత్తణ్ కాల్ (తిరుత్తంగాలూర్) (శివకాశి 3 కి.మీ.)
తిరుమోగూర్ (మర 10 కి.మీ.) (మోహనపురము)
తెన్ మధురై (మధుర) (తిరుక్కూడల్)
శ్రీవిల్లి పుత్తూరు
తిరుక్కురుగూర్ (ఆళ్వార్ తిరునగరి)
తిరుత్తొల విల్లి మంగలమ్ (ఇరిట్టై తిరుప్పతి)
శిరీవరమంగై (నాంగునేరి) (వానమామలై)
తిరుప్పుళింగుడి
తెన్ తిరుప్పేర్ (తిరుప్పేరై)
శ్రీ వైకుంఠము
తిరువరగుణమంగై (నత్తం)
తిరుక్కుళందై (తెన్ కుళన్దై) (పెరుంకొళమ్)
తిరుక్కురుంగుడి
తిరుక్కోళూరు
తిరువనంతపురమ్
తిరువణ్ పరిశారమ్
తిరుక్కాట్కరై
తిరుమూళక్కళమ్
తిరుప్పులియూర్ (కుట్టనాడు)
తిరుచ్చెంకున్నూర్ (శంగణూర్)
తిరునావాయ్
తిరువల్లవాళ్ (తిరువల్లాయ్) (శ్రీవల్లభక్షేత్రం)
తిరువణ్ వండూరు
తిరువాట్టార్
తిరువిత్తువక్కోడు (తిరువిచ్చిక్కోడు)
తిరుక్కడిత్తానమ్
తిరువాఱన్ విళై (ఆరుముళై)
తిరువయిందిర పురమ్
తిరుక్కోవలూరు (గోపాలనగరమ్)
పెరుమాళ్ కోయిల్ (కాంచీపురము)
అష్ట భుజమ్ (కాంచీ)
తిరుత్తణ్ గా (కాంచీ)
తిరువేళుక్కై (కాంచీ)
తిరుప్పాడగమ్ (కాంచీ)
తిరునీరగమ్ (కాంచీ)
నిలాత్తింగళ్ తుండత్తాన్ (కాంచీ)
ఊఱగమ్ (కాంచీ)
తిరువెంకా (కాంచీ)
తిరుక్కారగమ్ (కాంచీ)
కార్వానమ్ (కాంచీ)
తిరుక్కళ్వనూర్ (కాంచీ)
పవళవణ్ణమ్ (కాంచీ)
పరమేశ్వర విణ్ణగరమ్ (కాంచీ)
తిరుప్పుళ్ కుం (కాంచీ)
తిరునిన్ఱవూర్
తిరువెవ్వుళ్ళూరు (తిరువళ్ళూరు)
తిరునీర్మలై (ఘండారణ్యక్షేత్రము)
తిరువిడవెన్దై
తిరుక్కడల్‌మలై (మహాబలిపురం)
తిరువల్లిక్కేణి (చెన్నై)
తిరుక్కడిగై (చోళసింహపురము)
తిరువేంగడమ్ (తిరుమలై - తిరుపతి)
శింగవేళ్ కున్ణమ్ (అహోబిలం)
తిరువయోధ్యై
నైమిశారణ్యం
శాళక్కిణామం (సాలగ్రామమ్)
బదరికాశ్రమం (బదరీనాథ్)
కండమెన్ణుం కడినగర్ (దేవప్రయాగ)
తిరుప్పిరిది (నందప్రయాగ) (జోషిమఠ్)
వడమధురై (ఉత్తరమధుర)
శ్రీ ద్వారక
తిరువాయిప్పాడి (గోకులము)
తిరుప్పార్ కడల్ (క్షీర సముద్రము)
పరమపదమ్ (తిరునాడు)



August 10, 2014

జాతీయగీతం యొక్క ప్రతిపదార్థం

జాతీయగీతం యొక్క ప్రతిపదార్థం :)

జన = ప్రజలు
గణ = గ్రూప్మన = మైండ్అధినాయక = లీడర్జయ హే = విక్టరీ ఉండండిభరత్ = భారతదేశంభాగ్య = డెస్టినీవిధాత = డిస్పోసేర్పంజాబ్ = పంజాబ్సింధూ = ఇందుస్గుజరాత్ = గుజరాత్మరాఠా = మహారాష్ట్రద్రావిడ = దక్షిణఉత్కళ = ఒరిస్సాబంగా = బెంగాల్వింధ్యా = వింధ్యాస్హిమాచల = హిమాలయాలయమునా = యమునాగంగా = గంగాఉచ్చ్చాల = మూవింగ్జలధి = మహాసముద్రంతరంగ = వేవ్స్తవ = మీశుభా = శుభప్రదమైననామే = పేరుజాగే = అవేకెన్తవ = మీశుభా = శుభప్రదమైనఆశిష = ఆశీస్సులుమాగే = సహాయముగాహే = సింగ్తవ = మీజయ = విక్టరీగాథ = సాంగ్జన = ప్రజలుగణ = గ్రూప్మంగళ = అదృష్టందాయక = ఇవ్వగలిగినవాడుజయ హే = విక్టరీ ఉండండిభారత = భారతదేశంభాగ్య = డెస్టినీవిధాతా = డిస్పెన్సెర్
జయ హే , జయ హే ,జయ హే జయ, జయ, జయ, జయ హే ..


word by word meaning of our National Anthem

Please every one try to understand the meaning and pronounce it perfectly ... 

word by word meaning

jana= people
gana= group
mana= mind
adhinayaka = leader
jaya he= victory be
Bharata= India
bhagya=Destiny
vidhata=Disposer
Pañjaba=Punjab
Sindhu=Indus
Gujarata=Gujarat
Maratha=Maharashtra
Dravida=the south
Utkala=Orissa
Banga=Bengal
Vindhya=vindhyas
Himacala= Himalayas
Yamuna=yamuna
Ganga=ganges
Ucchala=moving
jaladhi=ocean
taranga=waves
Tava=your
subha=auspicious
name= name
jage=awaken,
Tava=your
subha=auspicious
asisa=blessings
mage= ask,
Gahe=sing
tava=your
jaya=victory
gatha=song
jana= people
gana= group
mangala=good fortune
dayaka=giver
jaya he=victory be
Bharata= India
bhagya= Destiny
vidhata=dispenser
Jaya he, jaya he, jaya he, Jaya jaya jaya jaya he.= victory,victory,victory,victory for ever.....

ALL PEOPLE KNOW THE MEANING OF OUR NATIONAL ANTHEM......JAI HIND.





August 6, 2014

ఆణిముత్యాలు - నిత్యసత్యాలు

ఆణిముత్యాలు - నిత్యసత్యాలు


ఆణిముత్యాలు - నిత్యసత్యాలు

ఆణిముత్యాలు - నిత్యసత్యాలు



భారతీయ ఔన్నత్యం - Jean Sylvain Bailly

భారతీయ ఔన్నత్యం - Jean Sylvain Bailly


భారతీయ ఔన్నత్యం - Jean Sylvain Bailly

భారతీయ ఔన్నత్యం - Jean Sylvain Bailly 


భారతీయ ఔన్నత్యం - John Archibald Wheeler

భారతీయ ఔన్నత్యం - John Archibald Wheeler


శ్రీ కృష్ణభక్తుడు – జయదేవుడు

శ్రీ కృష్ణభక్తుడు జయదేవుడు

జయదేవుడు జన్మతః ఓడ్రుడై, వంగదేశంలో జీవించి, వాగ్గేయకారుడై, అక్కడ రాజపోషణ పొంది, ప్రసిద్ధుడై ఉన్నట్లు తెలుస్తుంది. ఆయన భారతదేశానికంతకు ఆది ప్రబంధకర్తగా ఆరాధ్యుడయ్యాడు. వాగ్దేవతా చరిత చిత్రిత చిత్త పద్మా పద్మావతీచరణ చారణ చక్రవర్తి అని చెప్పుకున్నారు. ఇతని భార్యపేరు పద్మావతి. వారిరువురి దాంపత్యం అన్యోన్యమైంది.  ఆదర్శమైంది. అంతకుపూర్వం ఏకవి సాహసించని నవ్యరీతిని ఇతడుభార్యపేరును తన పేరుతో చేర్చి పద్మావతీ చరణ చారణ చక్రవర్తి అనీ, జయతి పద్మావతీ సుఖసమాజే భణతి జయదేవ కవిరాజరాజే అనీ, పలుచోట్ల పల్కి, తనకు ఆమె పట్ల గల అనురాగాన్ని వ్యక్తం చేసాడు. ఆమె అనురాగ ప్రోత్సాహాలే తన కవితకు ప్రేరకాలంటారు. ఆయన కీర్తనలు పాడుతుంటే ఆమె చరణాలు నర్తించేవట.

ఒకనాడు జయదేవుడు తన గీతగోవిందంకావ్యంలో వదసి యది కించిదపి అనే అష్టపది రచిస్తున్నాడట. స్పర్శగరళ ఖండనం మామ శిరసి మండనం దేహి పద పల్లవ ముదారం అని శ్రీకృష్ణుడు మన్మథ విషయంలో ఉద్రేకించిన తన శిరస్సుపైన రాధ పదపల్లవమనే చిగురాకును ఔషధంగా చేర్చమని రాధను ప్రాధేయపడతాడు. ఇలా రాసిన తరవాత భగవంతుడంతటివాని తలపై స్త్రీ పాదాలను చేర్చుట ఏమిటని అనిపించి, ఆ పంక్తులను కొట్టివేసి, అభ్యంగన స్నానానికి వెళ్ళాడట. ఆ తరవాత శ్రీకృష్ణుడు ఒంటికి నూనె రాసుకున్న జయదేవుని రూపంలో వచ్చి, కొట్టివేసిన ఆ పంక్తులనే తిరిగి వ్రాసి వెళ్ళాడట. స్నానాంతరం జయదేవుడు ఆ పంక్తుల విషయం భార్యను ప్రశ్నిస్తే మీరే వచ్చి వ్రాసి వెళ్ళారు కదా ? అని పత్రంపై తైలపు చుక్కలను కూడా చూపిందట. శ్రీకృష్ణుడే ఆమెకు ప్రత్యక్షమై ఆ భావం ఉచితమేనని తెలియచేసినందుకు ఆయన పొంగిపోయాడు. భార్యను అభినందించి జయతి పద్మావతీ రమణ జయదేవ కవిభారతీ భణితమతిశాతం అని పూరించాడట. దీనిని సంగీత సాహిత్యజ్ఞులుదర్శనాష్టపది అని అంటారు. దీనికే సంజీవనీ అష్టపది అని కూడా పేరు.

జయదేవుని గీతగోవిందం వంటిదే రాజయిన లక్ష్మణసేనుడు కూడా రచించాడు. కానీ ఆనతి ప్రజలు జయదేవుని అష్టపదులనే ఆదరించేవారట. దానికి ఆ రాజు అసూయచెంది, పండిత సమక్షంలో జయదేవుని పిలిపించాడట. ఆ రెండు రచనలలో ఏది గొప్పదే తెలుసుకోవటానికి రెంటిని జగన్నాథ ఆలయంలో ఉంచి, మర్నాడు తలుపులు తెరిచారట. జయదేవుని కావ్యం ఆ స్వామి శిరస్సుపైన, ఆ రాజు గ్రంథం క్రిందన పడవేసి ఉన్నాయట. రాజు గర్వం తగ్గి, కవికి సాష్టంగపడి, అతణ్ణి మెచ్చుకొని, గౌరవించాడట. ఆ రాజు పట్టమహిషి, పద్మావతి పాతివ్రత్యాన్ని అందరూ మెచ్చుకుంటుంటే ఈర్ష్య చెందిందట. ఒకనాడు రాజు జయదేవునితో వేటకై గ్రామాంతరం వెళితే, అతడు (జయదేవుడు) పులివాతపడి మరణించాడని పద్మావతికి కబురు చేసింది. ఆ దుర్వార్త విన్న పద్మావతి తరువులా కూలిపోయిందట. ఆమె మరణవార్త విన్న జయదేవుడు వదసి యది కించిదపి అనే దర్శనాష్టపదిని గానం చేయగానే పద్మావతి కళ్ళు విప్పి లేచిందట. అందుకే దానికి సంజీవనీ అష్టపదిగా ప్రతీతి.

సాహిత్యరీత్యా గీతగోవిందం అలంకారికులకు ప్రామాణికమైనది. 24 అష్టపదులతో 80కి మించిన శ్లోకాలతో 12 సర్గల గేయ ప్రబంధమది. ఏ పంక్తి చూసినా రసస్ఫూర్తితో, కొమలపదాలతో హృదయాన్ని పరవశింపచేస్తుంది.

యది హరిస్మరణే మనో
యది విలాసకలాసు కుతూహలం
మధుర కోమల కాంత పదావళీం
శ్రుణు తదా జయదేవ సరస్వతీంll  

అని తన శబ్ద మాధుర్యం గూర్చి తానే చెప్పుకోగల్గిన ఆత్మవిశ్వాసం, శిల్పచాతుర్యం గల మహాకవి జయదేవుడు. ప్రళయ పయోధిజల్ అనే దశావతార అష్టపది కావ్యానికి మకుటాయమైంది.  రాధాగోవిందుల ప్రణయ, విరహ, విశ్లేష, కలహ, ఖండన, సానునయ, సమాగమ, సంధానముల ద్వారా జీవ బ్రహ్మైక్య సంధానవేదాంతం వ్యంజితమౌతుంది. ఆంధ్రలో లీలాశుకుడు, అన్నమాచార్యులు, నారాయణతీర్థులు, రామదాసు మొదలగువారి కవితల్లో వ్యాపించిన భక్తికవితావాహినికి జన్మస్థానమైన గంగోత్రి జయదేవుని గీతగోవిందమే. భక్త మీరాబాయి భర్త మహారాణా కుంభకర్ణుడు గీతగోవిందానికి రసమంజరి అనే వ్యాఖ్యను, తిరుమలరాయని ఆస్థానంలోని చెరుకూరి లక్ష్మీధరుడు శృతిరంజని వ్యాఖ్యను రచించారు.


జయదేవుని అష్టపదులను సంగీత విద్వాంసులు అనేక బాణీలతో వారివారి సంప్రదాయానుసారం గానం చేస్తుంటారు. జయదేవుని గీతగోవింద రచనా పద్ధతిని ఎందరో అనుకరించినవారున్నారు. శ్రీ చంద్రశేఖర సరస్వతీస్వామి శివాష్టపది, - రామకవి రామాష్టపది. వేంకటమఖి త్యాగరాజాష్టపది రచించారు. 18వ శతాబ్దంలో కళువె వీరరాజు అనే వాగ్గేయకారుడు పార్వతీపరమేశ్వరులను నాయికా నాయకులుగా చేసి సంగీత గంగాధరము రచించారు. ఈవిధంగా జయదేవుని గీతగోవిందం ఎందరికో శిరోధార్యమై, మార్గాదర్శకమై భక్తిసుధలను పంచింది.       

                                                                                        

August 5, 2014

"తత్వమసి" ...... శ్రీరామకృష్ణ పరమహంస కథలు

"తత్వమసి" ...... శ్రీరామకృష్ణ పరమహంస కథలు

" 'నేను బద్ధజీవుణ్ణి! నాకు ఎన్నటికీ భక్తీ, జ్ఞానము కలుగవు.' అని కొంతమంది అంటూ ఉంటారు. కాని గురువు అనుగ్రం పొందటానికి ఆ భయం లేదు"...... అని శ్రీరామకృష్ణులు ఈ క్రింది కథను ఈ విధంగా చెప్పారు. 

ఒకసారి ఒక ఆడపులి ఒక మేకలమంద మీద పడింది. అదే సమయానికి దూరం నుండి ఒక బోయవాడు బాణం వేసి దానిని చంపిసాడు. ఆ పులి నిండుచూలాలు. బాణం దెబ్బకు అది చనిపోతూ, ఒక పిల్లను కని కన్నుమూసింది. ఈ పులికూన మేకల మందలో కలసి పెరుగుతూ వచ్చింది. ఆ మేకలే దానికి పాలిచ్చి పెంచాయి. క్రమక్రమంగా రోజులు గడిచేకొద్దీ ఆ పులిపిల్ల మేకలతో కలసి తిరగటం వాటిలాగానే గడ్డి మేయటం, అవి అరుస్తున్నట్టే 'మే, మే' అని అరవటం మొదలు పెట్టింది. క్రమంగా అది పెరిగి ఒక పెద్దపులిలాగా తయారైంది. అయినా కూడా అది గడ్డితినటం, మేకలాగా అరవటం చేస్తూనే ఉంది. ఏదైనా కౄరమృగం వచ్చి తరిమితే ఈ 'మేక-పులి' కూడా మేకలాగా మేకలగుంపుతో కలసి పారిపోతూ ఉండేది. 

ఇలా ఉండగా ఒకసారి మరొక భయంకరమైన పులి ఆ మేకలమందపై పడింది. ఆ మందలో గడ్డి తింటూ మేకలతో పరుగెత్తిపోతున్న ఈ 'మేక-పులి'ని చూసి ఆశ్చర్యపడింది. ఇతర మేకలను వదిలి ఆ పులి ఈ గడ్డితినే 'మేక-పులి'ని వెంటాడి పట్టుకుంది. అది భయంతో వణుకుతూ మేకలాగా అరుస్తూ, తప్పించుకోవటానికి ప్రయత్నించింది. కానీ ఈ భయంకరమైన పులి దానిని నీటి దగ్గరకు ఈడ్చుకుపోయి, 'నువ్వు నాలాగా పెద్దపులివై ఉండి కూడా మేకలతో తిరుగుతూ గడ్డి తింటున్నావెందుకు? నీళ్ళలో నీ ముఖం చూసుకో! నాకున్నట్లుగానే గుండ్రమైన ముఖం నీకు కూడా ఉంది.' అని దాని నోటిలో ఒక మాంసం ముక్కను కుక్కింది. గడ్డి తినటానికి అలవాటు పడిన ఆ 'మేక-పులి' మొదట మాంసం తినటానికి ఇష్టపడలేదు. కానీ మాంసం నాలుకకు తగిలేసరికి, రుచిమరిగి తినటం ప్రారంభించింది. చివరకు ఆ భయంకరమైన పులి దానితో, 'ఎంత సిగ్గుచేటు ! ఈ మేకలతో కలసి తిరుగుతూ గడ్డి తింటున్నావు, చూడు నాకు - నీకు తేడా ఏమైనా ఉన్నదా ? ఏమీ లేదు, నాతో కలసి అడవిలోకి రా!' అని అన్నది. ఈ మాటలు విని ఆ 'మేక-పులి' తన ప్రవర్తనకు సిగ్గుపడి, తన నిజస్వరూపాన్ని తెలుసుకొని, ఆ పులితోపాటు అడవిలోకి వెళ్ళిపోయింది.'

ఈ కథను గురుదేవులు 'శ్రీరామకృష్ణ కథామృత' రచయితా అయిన మహేంద్రనాథగుప్తాకు చెప్పి, 'గురువు అనుగ్రహం పొందిన వానికి భయం లేదు. అసలు నీవెవరివో, నీ నిజతత్వమేమిటో, గురువు నీకు తెలియచేస్తాడు. కథలో గడ్డి తినటం అంటే - 'కామినీ - కాంచన' సుఖాలలో మునిగితేలటం. .... 'మే - మే' అని అరుస్తూ పారిపోవటమంటే ..... సామాన్య మానవునిలాగా సంసారంలో మెలగటం. కొత్త పులిని అనుసరించటం పోవటం అంటే --- మన ఆధ్యాత్మిక చైతన్యాన్ని మేల్కొల్పిన గురువును శరణుపొంది, ఆయనయే మన ఆప్త బంధువని గుర్తించటం. నీటిలో తన ముఖం యొక్క ప్రతిబింబాన్ని సరిగ్గా చూసుకోవటం అంటే ----'తన ఆత్మతత్వాన్ని అనుభూతి పొందటం' అని వివరించారు.' "తత్వమసి" (అదే నీవు! అంటే నీవు ఈ అశాశ్వతమైన శరీరానివి కావు. ఆ పరమాత్మవే) అనే మహావాక్య వివరణే ఈ కథలోని అంతరార్థం" ..... అని వివరించారు.