February 16, 2015

దారిద్ర్యదహన శివస్తోత్రమ్

దారిద్ర్యదహన శివస్తోత్రమ్.....రచన: వసిష్ఠ మహర్షి

విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ
కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ |
కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ||

గౌరీప్రియాయ రజనీశ కళాధరాయ
కాలాంతకాయ భుజగాధిప కంకణాయ |
గంగాధరాయ గజరాజ విమర్ధనాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ||

భక్తప్రియాయ భవరోగ భయాపహాయ
ఉగ్రాయ దుఃఖ భవసాగర తారణాయ |
జ్యోతిర్మయాయ గుణనామ సునృత్యకాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ||

చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ
ఫాలేక్షణాయ మణికుండల మండితాయ |
మంజీరపాదయుగళాయ జటాధరాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ||

పంచాననాయ ఫణిరాజ విభూషణాయ
హేమాంకుశాయ భువనత్రయ మండితాయ
ఆనంద భూమి వరదాయ తమోపయాయ |
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ||

భానుప్రియాయ భవసాగర తారణాయ
కాలాంతకాయ కమలాసన పూజితాయ |
నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ||

రామప్రియాయ రఘునాథ వరప్రదాయ
నాగప్రియాయ నరకార్ణవ తారణాయ |
పుణ్యాయ పుణ్యభరితాయ సురార్చితాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ||

ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ
గీతాప్రియాయ వృషభేశ్వర వాహనాయ |
మాతంగచర్మ వసనాయ మహేశ్వరాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ||

వసిష్ఠేన కృతం స్తోత్రం సర్వరోగ నివారణమ్ |
సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్రాది వర్ధనమ్ |
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం న హి స్వర్గ మవాప్నుయాత్ ||

ఇతి శ్రీ వసిష్ఠ విరచితం దారిద్ర్యదహన శివస్తోత్రమ్ సంపూర్ణమ్


శివ భుజంగప్రయాతస్తోత్రమ్

శివ భుజంగప్రయాతస్తోత్రమ్....రచన: ఆది శంకరాచార్య

కృపాసాగరాయాశుకావ్యప్రదాయ
ప్రణమ్రాఖిలాభీష్టసందాయకాయ |
యతీంద్రైరుపాస్యాంఘ్రిపాథోరుహాయ
ప్రబోధప్రదాత్రే నమః శంకరాయ ||

చిదానందరూపాయ చిన్ముద్రికోద్య-
త్కరాయేశపర్యాయరూపాయ తుభ్యమ్ |
ముదా గీయమానాయ వేదోత్తమాంగైః
శ్రితానందదాత్రే నమః శంకరాయ ||

జటాజూటమధ్యే పురా యా సురాణాం
ధునీ సాద్య కర్మందిరూపస్య శంభోః
గలే మల్లికామాలికావ్యాజతస్తే
విభాతీతి మన్యే గురో కిం తథైవ ||

నఖేందుప్రభాధూతనమ్రాలిహార్దా-
ంధకారవ్రజాయాబ్జమందస్మితాయ |
మహామోహపాథోనిధేర్బాడబాయ
ప్రశాంతాయ కుర్మో నమః శంకరాయ ||

ప్రణమ్రాంతరంగాబ్జబోధప్రదాత్రే
దివారాత్రమవ్యాహతోస్రాయ కామమ్ |
క్షపేశాయ చిత్రాయ లక్ష్మ క్షయాభ్యాం
విహీనాయ కుర్మో నమః శంకరాయ ||

ప్రణమ్రాస్యపాథోజమోదప్రదాత్రే
సదాంతస్తమస్తోమసంహారకర్త్రే |
రజన్యా మపీద్ధప్రకాశాయ కుర్మో
హ్యపూర్వాయ పూష్ణే నమః శంకరాయ ||

నతానాం హృదబ్జాని ఫుల్లాని శీఘ్రం
కరోమ్యాశు యోగప్రదానేన నూనమ్ |
ప్రబోధాయ చేత్థం సరోజాని ధత్సే
ప్రఫుల్లాని కిం భో గురో బ్రూహి మహ్యమ్ ||

ప్రభాధూతచంద్రాయుతాయాఖిలేష్ట-
ప్రదాయానతానాం సమూహాయ శీఘ్రమ్|
ప్రతీపాయ నమ్రౌఘదుఃఖాఘపంక్తే-
ర్ముదా సర్వదా స్యాన్నమః శంకరాయ ||

వినిష్కాసితానీశ తత్త్వావబోధా -
న్నతానాం మనోభ్యో హ్యనన్యాశ్రయాణి |
రజాంసి ప్రపన్నాని పాదాంబుజాతం
గురో రక్తవస్త్రాపదేశాద్బిభర్షి ||

మతేర్వేదశీర్షాధ్వసంప్రాపకాయా-
నతానాం జనానాం కృపార్ద్రైః కటాక్షైః |
తతేః పాపబృందస్య శీఘ్రం నిహంత్రే
స్మితాస్యాయ కుర్మో నమః శంకరాయ ||

సుపర్వోక్తిగంధేన హీనాయ తూర్ణం
పురా తోటకాయాఖిలఙ్ఞానదాత్రే|
ప్రవాలీయగర్వాపహారస్య కర్త్రే
పదాబ్జమ్రదిమ్నా నమః శంకరాయ ||

భవాంభోధిమగ్నాన్జనాందుఃఖయుక్తాన్
జవాదుద్దిధీర్షుర్భవానిత్యహో‌உహమ్ |
విదిత్వా హి తే కీర్తిమన్యాదృశాంభో
సుఖం నిర్విశంకః స్వపిమ్యస్తయత్నః ||

ఇతి శ్రీశంకరాచార్య భుజంగప్రయాతస్తోత్రమ్


శివాపరాధక్షమాపణ స్తోత్రం

శివాపరాధక్షమాపణ స్తోత్రం.......రచన: ఆది శంకరాచార్య

ఆదౌ కర్మప్రసంగాత్కలయతి కలుషం మాతృకుక్షౌ స్థితం మాం
విణ్మూత్రామేధ్యమధ్యే కథయతి నితరాం జాఠరో జాతవేదాః |
యద్యద్వై తత్ర దుఃఖం వ్యథయతి నితరాం శక్యతే కేన వక్తుం
క్షంతవ్యో మే‌உపరాధః శివ శివ శివ భో శ్రీ మహాదేవ శంభో ||

బాల్యే దుఃఖాతిరేకో మలలులితవపుః స్తన్యపానే పిపాసా
నో శక్తశ్చేంద్రియేభ్యో భవగుణజనితాః జంతవో మాం తుదంతి |
నానారోగాదిదుఃఖాద్రుదనపరవశః శంకరం న స్మరామి
క్షంతవ్యో మే‌உపరాధః శివ శివ శివ భో శ్రీ మహాదేవ శంభో ||

ప్రౌఢో‌உహం యౌవనస్థో విషయవిషధరైః పంచభిర్మర్మసంధౌ
దష్టో నష్టో‌உవివేకః సుతధనయువతిస్వాదుసౌఖ్యే నిషణ్ణః |
శైవీచింతావిహీనం మమ హృదయమహో మానగర్వాధిరూఢం
క్షంతవ్యో మే‌உపరాధః శివ శివ శివ భో శ్రీ మహాదేవ శంభో ||

వార్ధక్యే చేంద్రియాణాం విగతగతిమతిశ్చాధిదైవాదితాపైః
పాపై రోగైర్వియోగైస్త్వనవసితవపుః ప్రౌఢహీనం చ దీనమ్ |
మిథ్యామోహాభిలాషైర్భ్రమతి మమ మనో ధూర్జటేర్ధ్యానశూన్యం
క్షంతవ్యో మే‌உపరాధః శివ శివ శివ భో శ్రీ మహాదేవ శంభో ||

నో శక్యం స్మార్తకర్మ ప్రతిపదగహనప్రత్యవాయాకులాఖ్యం
శ్రౌతే వార్తా కథం మే ద్విజకులవిహితే బ్రహ్మమార్గే‌உసుసారే |
ఙ్ఞాతో ధర్మో విచారైః శ్రవణమననయోః కిం నిదిధ్యాసితవ్యం
క్షంతవ్యో మే‌உపరాధః శివ శివ శివ భో శ్రీ మహాదేవ శంభో ||

స్నాత్వా ప్రత్యూషకాలే స్నపనవిధివిధౌ నాహృతం గాంగతోయం
పూజార్థం వా కదాచిద్బహుతరగహనాత్ఖండబిల్వీదలాని |
నానీతా పద్మమాలా సరసి వికసితా గంధధూపైః త్వదర్థం
క్షంతవ్యో మే‌உపరాధః శివ శివ శివ భో శ్రీ మహాదేవ శంభో ||

దుగ్ధైర్మధ్వాజ్యుతైర్దధిసితసహితైః స్నాపితం నైవ లింగం
నో లిప్తం చందనాద్యైః కనకవిరచితైః పూజితం న ప్రసూనైః |
ధూపైః కర్పూరదీపైర్వివిధరసయుతైర్నైవ భక్ష్యోపహారైః
క్షంతవ్యో మే‌உపరాధః శివ శివ శివ భో శ్రీ మహాదేవ శంభో ||

ధ్యాత్వా చిత్తే శివాఖ్యం ప్రచురతరధనం నైవ దత్తం ద్విజేభ్యో
హవ్యం తే లక్షసంఖ్యైర్హుతవహవదనే నార్పితం బీజమంత్రైః |
నో తప్తం గాంగాతీరే వ్రతజననియమైః రుద్రజాప్యైర్న వేదైః
క్షంతవ్యో మే‌உపరాధః శివ శివ శివ భో శ్రీ మహాదేవ శంభో ||

స్థిత్వా స్థానే సరోజే ప్రణవమయమరుత్కుంభకే (కుండలే)సూక్ష్మమార్గే
శాంతే స్వాంతే ప్రలీనే ప్రకటితవిభవే జ్యోతిరూపే‌உపరాఖ్యే |
లింగఙ్ఞే బ్రహ్మవాక్యే సకలతనుగతం శంకరం న స్మరామి
క్షంతవ్యో మే‌உపరాధః శివ శివ శివ భో శ్రీ మహాదేవ శంభో ||

నగ్నో నిఃసంగశుద్ధస్త్రిగుణవిరహితో ధ్వస్తమోహాంధకారో
నాసాగ్రే న్యస్తదృష్టిర్విదితభవగుణో నైవ దృష్టః కదాచిత్ |
ఉన్మన్యా‌உవస్థయా త్వాం విగతకలిమలం శంకరం న స్మరామి
క్షంతవ్యో మే‌உపరాధః శివ శివ శివ భో శ్రీ మహాదేవ శంభో ||

చంద్రోద్భాసితశేఖరే స్మరహరే గంగాధరే శంకరే
సర్పైర్భూషితకంఠకర్ణయుగలే (వివరే)నేత్రోత్థవైశ్వానరే |
దంతిత్వక్కృతసుందరాంబరధరే త్రైలోక్యసారే హరే
మోక్షార్థం కురు చిత్తవృత్తిమచలామన్యైస్తు కిం కర్మభిః ||

కిం వా‌உనేన ధనేన వాజికరిభిః ప్రాప్తేన రాజ్యేన కిం
కిం వా పుత్రకలత్రమిత్రపశుభిర్దేహేన గేహేన కిమ్ |
ఙ్ఞాత్వైతత్క్షణభంగురం సపది రే త్యాజ్యం మనో దూరతః
స్వాత్మార్థం గురువాక్యతో భజ మన శ్రీపార్వతీవల్లభమ్ ||

ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యౌవనం
ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః |
లక్ష్మీస్తోయతరంగభంగచపలా విద్యుచ్చలం జీవితం
తస్మాత్త్వాం (మాం)శరణాగతం శరణద త్వం రక్ష రక్షాధునా ||

వందే దేవముమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిమ్ |
వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్ ||

గాత్రం భస్మసితం చ హసితం హస్తే కపాలం సితం
ఖట్వాంగం చ సితం సితశ్చ వృషభః కర్ణే సితే కుండలే |
గంగాఫేనసితా జటా పశుపతేశ్చంద్రః సితో మూర్ధని
సో‌உయం సర్వసితో దదాతు విభవం పాపక్షయం సర్వదా ||

కరచరణకృతం వాక్కాయజం కర్మజం వా
శ్రవణనయనజం వా మానసం వా‌உపరాధమ్ |
విహితమవిహితం వా సర్వమేతత్క్ష్మస్వ
శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో ||

ఇతి శ్రీమద్ శంకరాచార్యకృత శివాపరాధక్షమాపణ స్తోత్రం సంపూర్ణమ్


శ్రీ మల్లికార్జున మంగళాశాసనం

శ్రీ మల్లికార్జున మంగళాశాసనం

ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే
శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళమ్ ||

సర్వమంగళ రూపాయ శ్రీ నగేంద్ర నివాసినే
గంగాధరాయ నాథాయ శ్రీగిరీశాయ మంగళమ్ ||

సత్యానంద స్వరూపాయ నిత్యానంద విధాయనే
స్తుత్యాయ శ్రుతిగమ్యాయ శ్రీగిరీశాయ మంగళమ్ ||

ముక్తిప్రదాయ ముఖ్యాయ భక్తానుగ్రహకారిణే
సుందరేశాయ సౌమ్యాయ శ్రీగిరీశాయ మంగళమ్ ||

శ్రీశైలే శిఖరేశ్వరం గణపతిం శ్రీ హటకేశం
పునస్సారంగేశ్వర బిందుతీర్థమమలం ఘంటార్క సిద్ధేశ్వరమ్ |
గంగాం శ్రీ భ్రమరాంబికాం గిరిసుతామారామవీరేశ్వరం
శంఖంచక్ర వరాహతీర్థమనిశం శ్రీశైలనాథం భజే ||

హస్తేకురంగం గిరిమధ్యరంగం శృంగారితాంగం గిరిజానుషంగమ్
మూర్దేందుగంగం మదనాంగ భంగం శ్రీశైలలింగం శిరసా నమామి ||


శివషడక్షరీస్తోత్రం.

శివషడక్షరీస్తోత్రం.....రచన: ఆది శంకరాచార్య

ఓం - ఓం
ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః |
కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమోనమః ||

ఓం - నం
నమంతి మునయః సర్వే నమంత్యప్సరసాం గణాః |
నరాణామాదిదేవాయ నకారాయ నమోనమః ||

ఓం - మం
మహాతత్వం మహాదేవ ప్రియం ఙ్ఞానప్రదం పరమ్ |
మహాపాపహరం తస్మాన్మకారాయ నమోనమః ||

ఓం - శిం
శివం శాంతం శివాకారం శివానుగ్రహకారణమ్ |
మహాపాపహరం తస్మాచ్ఛికారాయ నమోనమః ||

ఓం - వాం
వాహనం వృషభోయస్య వాసుకిః కంఠభూషణమ్ |
వామే శక్తిధరం దేవం వకారాయ నమోనమః ||

ఓం - యం
యకారే సంస్థితో దేవో యకారం పరమం శుభమ్ |
యం నిత్యం పరమానందం యకారాయ నమోనమః ||

షడక్షరమిదం స్తోత్రం యః పఠేచ్ఛివ సన్నిధౌ |
తస్య మృత్యుభయం నాస్తి హ్యపమృత్యుభయం కుతః ||

శివశివేతి శివేతి శివేతి వా
భవభవేతి భవేతి భవేతి వా |
హరహరేతి హరేతి హరేతి వా
భుజమనశ్శివమేవ నిరంతరమ్ ||

ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య
శ్రీమచ్ఛంకరభగవత్పాదపూజ్యకృత శివషడక్షరీస్తోత్రం సంపూర్ణమ్ |


ఉమా మహేశ్వరాష్టకం

ఉమా మహేశ్వరాష్టకం

నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం
పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యామ్ |
నగేంద్రకన్యావృషకేతనాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

నమః శివాభ్యాం సరసోత్సవాభ్యాం
నమస్కృతాభీష్టవరప్రదాభ్యామ్ |
నారాయణేనార్చితపాదుకాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం
విరించివిష్ణ్వింద్రసుపూజితాభ్యామ్ |
విభూతిపాటీరవిలేపనాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

నమః శివాభ్యాం జగదీశ్వరాభ్యాం
జగత్పతిభ్యాం జయవిగ్రహాభ్యామ్ |
జంభారిముఖ్యైరభివందితాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

నమః శివాభ్యాం పరమౌషధాభ్యాం
పంచాక్షరీపంజరరంజితాభ్యామ్ |
ప్రపంచసృష్టిస్థితిసంహృతాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

నమః శివాభ్యామతిసుందరాభ్యాం
అత్యంతమాసక్తహృదంబుజాభ్యామ్ |
అశేషలోకైకహితంకరాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

నమః శివాభ్యాం కలినాశనాభ్యాం
కంకాళకల్యాణవపుర్ధరాభ్యామ్ |
కైలాసశైలస్థితదేవతాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

నమః శివాభ్యామశుభాపహాభ్యాం
అశేషలోకైకవిశేషితాభ్యామ్ |
అకుంఠితాభ్యాం స్మృతిసంభృతాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

నమః శివాభ్యాం రథవాహనాభ్యాం
రవీందువైశ్వానరలోచనాభ్యామ్ |
రాకాశశాంకాభముఖాంబుజాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

నమః శివాభ్యాం జటిలంధరాభ్యాం
జరామృతిభ్యాం చ వివర్జితాభ్యామ్ |
జనార్దనాబ్జోద్భవపూజితాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

నమః శివాభ్యాం విషమేక్షణాభ్యాం
బిల్వచ్ఛదామల్లికదామభృద్భ్యామ్ |
శోభావతీశాంతవతీశ్వరాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

నమః శివాభ్యాం పశుపాలకాభ్యాం
జగత్రయీరక్షణబద్ధహృద్భ్యామ్ |
సమస్తదేవాసురపూజితాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

స్తోత్రం త్రిసంధ్యం శివపార్వతీభ్యాం
భక్త్యా పఠేద్ద్వాదశకం నరో యః |
స సర్వసౌభాగ్యఫలాని
భుంక్తే శతాయురాంతే శివలోకమేతి ||


కాలభైరవాష్టకం

కాలభైరవాష్టకం

దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం
వ్యాళయఙ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరమ్ |
నారదాది యోగిబృంద వందితం దిగంబరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||

భానుకోటి భాస్వరం భవబ్ధితారకం పరం
నీలకంఠ మీప్సితార్ధ దాయకం త్రిలోచనమ్ |
కాలకాల మంబుజాక్ష మస్తశూన్య మక్షరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||

శూలటంక పాశదండ పాణిమాది కారణం
శ్యామకాయ మాదిదేవ మక్షరం నిరామయమ్ |
భీమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||

భుక్తి ముక్తి దాయకం ప్రశస్తచారు విగ్రహం
భక్తవత్సలం స్థితం సమస్తలోక విగ్రహమ్ |
నిక్వణన్-మనోఙ్ఞ హేమ కింకిణీ లసత్కటిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||

ధర్మసేతు పాలకం త్వధర్మమార్గ నాశకం
కర్మపాశ మోచకం సుశర్మ దాయకం విభుమ్ |
స్వర్ణవర్ణ కేశపాశ శొభితాంగ నిర్మలం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||

రత్న పాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం
నిత్య మద్వితీయ మిష్ట దైవతం నిరంజనమ్ |
మృత్యుదర్ప నాశనం కరాళదంష్ట్ర భూషణం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||

అట్టహాస భిన్న పద్మజాండకోశ సంతతిం
దృష్టిపాత నష్టపాప జాలముగ్ర శాసనమ్ |
అష్టసిద్ధి దాయకం కపాలమాలికా ధరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||

భూతసంఘ నాయకం విశాలకీర్తి దాయకం
కాశివాసి లోక పుణ్యపాప శోధకం విభుమ్ |
నీతిమార్గ కోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||

కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
ఙ్ఞానముక్తి సాధకం విచిత్ర పుణ్య వర్ధనమ్ |
శోకమోహ లోభదైన్య కోపతాప నాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువమ్ ||


February 11, 2015

Animutyalu (ఆణిముత్యాలు) 2....My Slideshow

Telugu Quotestions ....Animutyalu (ఆణిముత్యాలు) 2...My Slideshow....

శ్రీ అంతర్వేది క్షేత్ర మహాత్మ్యం (1 అధ్యాయం)

శ్రీ అంతర్వేది క్షేత్ర మహాత్మ్యం (1 అధ్యాయం) 


శ్రీకరము శుభప్రదమగు నైమిశారణ్యంలో కృతయుగమున శౌనకాది మహర్షులు సత్రయాగము చేస్తూ, పురాణకథా కాలక్షేపం కొరకు సకలపురాణాలు తెలిసిన సూతమహాముని వద్దకు వెళ్ళి, సమస్త పాపాలు నివారించి, సకల శుభాలను పొందే అంతర్వేది దివ్యస్థలం యొక్క మహాత్మ్యంను, శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి లీలా వైభవములను తెలియచేయమని ప్రార్థించిరి. మునులందరూ వచ్చి కోరిన తీరుని చూసి సంతోషించి, ఆనాడు అంతర్వేది మహాత్మ్యం గురించి బ్రహ్మదేవుడు – నారదమహర్షికి తెలియచేసిన కథను ..... మునులందరికీ ఈవిధంగా చెప్పుచున్నారు.

ఒకరోజున బ్రహ్మ దేవతా గణములతో కొలువై ఉన్న సమయంలో త్రిలోకసంచారి అయిన నారదుడు తన గానమాధుర్యముతో బ్రహ్మని పొగుడుతూ వచ్చి “తండ్రీ !భూలోకంలో పుణ్యప్రదమైనది, దర్శనం చేసినంత మాత్రమునే సకల శుభాలు ప్రసాదించే నరసింహ క్షేత్రాలలో ప్రసిద్ధి పొందిన అంతర్వేది దివ్యపుణ్యక్షేత్రం మహిమను, శ్రీలక్ష్మీనరసింహ స్వామి, పార్వతీ నీలకంఠేశ్వరులు ఈ క్షేత్రంలోనే నివసించుటకు గల కారణాలు, వశిష్ట సాగరసంగమం మహత్యమును వివరింపుడు” అని ప్రార్థించెను. అంతట విధాత నారదుని ప్రశ్నలకి సంతోషించి, “కుమారా ! నీ ప్రశ్నలు అన్నింటికీ సమాధానములు చెబుతాను, జాగ్రత్తగా విను” అని ఈవిధంగా చెప్పుచున్నాడు బ్రహ్మ.

"గోహత్యా పాపవిమోచనం కోసం గంగాది సర్వతీర్థాలతో సమానమైన పరమపవిత్రమైన పుణ్య గోదావరీ నదిని గౌతమ ముని కొవ్వూరు వరకు తీసుకొని రాగా, సప్తమహర్షులు ఆ నదిని ఏడు పాయలుగా విభజించి, సాగరమున సంగమం గావించారు.

సప్తరుషులలో ప్రధానుడైన బ్రహ్మర్షి వశిష్ట మహర్షి అరుంధతీతో గౌతమీ గోదావరీ శాఖను సముద్రమున సంగమింప చేసి, ఆ తీరముననే ఒక ఆశ్రమం ఏర్పాటుచేసుకోని తపస్సు చేసుకుంటున్నాడు. వశిష్టుడు తాను గావించిన శివాపచారమునకు నివారణగా అంతర్వేది క్షేత్రమున వశిష్టునిచే తీసుకురాబడిన నదీశాఖను, సముద్రమునకు గల మధ్య ప్రదేశమును “యజ్నశాల” గా చేసి, రుద్రయాగం చేసి, పార్వతీ నీలకంఠేశ్వరుల విగ్రహములను ప్రతిష్ఠించి, పాప నిష్కృతి పొంది, కృతార్థుడయ్యెను. అందుకే ఈప్రాంతమునకు “అంతర్వేది” అని పేరు వచ్చింది.

“వశిష్ఠముని నీతాయా గంగాయా స్సాగర స్యచ
తయోర్మధ్య గతా భూమీ ‘రంతర్వేదీ’ తివిశ్రుతా !”   

వేదవేదాంగ నిష్ణాతులు, ఆగమాచార్యులు ప్రతీరోజు చేసే విష్ణుపురాణ పారాయణములతో, ప్రబోధనలతో, హరినామ సంకీర్తనలతో, వివిధ పూజలతో, బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించే బ్రాహ్మణులు తమ తపజప విశేషములతో భూలోక వైకుంఠముగా ఈ అంతర్వేది క్షేత్రం వైభవోపేతంగా విరాజిల్లుతోంది. ఈ క్షేత్రంలో ఉండేవారు అన్యచింత(వేరే ధ్యాస) లేకుండా నిత్యం ధ్యాన సమాధిలో ఉంటూ హరినామ స్మరణ చేస్తూ ఉంటారు.
మాఘశుద్ధ ఏకాదశి – పాల్గుణమాసం పౌర్ణమి రోజుల్లో చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి,  వివిధ రాష్ట్రాల నుండి కూడా ప్రజలు వచ్చి, ఈ క్షేత్రమందలి సాగరసంగమమున స్నానాలు చేసి, క్షేత్ర పాలకుడైన శ్రీ నీలకంఠేశ్వరుని దర్శించి, పూజించి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి పంచామృత అభిషేకాలు చేయించి, సర్వపాపాల నుండి విముక్తులై ఇహపర సౌఖ్యాలు పొందుతారు. ఎవ్వరైతే అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహుని త్రికరణ శుద్ధిగా పూజిస్తారో, వారు అనాయాసంగా ముక్తిని పొందుతారు.


నరసింహస్వామినిదర్శించటానికి వచ్చిన వారికీ, అటంకములచే రాలేని వారికీ, దర్శించుకోవాలి అని మనసున సంకల్పించుకొన్న వారికీ, అందరికీ సమానంగా ముక్తిని ప్రసాదించే స్వామి .... ఈ నరసింహస్వామి. ఈ క్షేత్రమును సందర్శించినంత మాత్రమునే వారి మనోసంకల్పములు సిద్ధిస్తాయి. ఈ అంతర్వేది నరసింహక్షేత్రమునకు రెండు క్రోసుల దూరములో ఉన్న పరిసర ప్రాంతమంతా “నరసింహ క్షేత్రం” – “ముక్తిక్షేత్రం” అని ప్రసిద్ధి పొందింది. ఈ క్షేత్రం తూర్పు- దక్షిణ భాగమున సముద్రము, పశ్చిమ భాగమున గోదావరి నది, ఉత్తర భాగమున “రక్త కుల్యానది” కలిగి ఉన్నాయి. శ్రీస్వామివారి కరుణచే ఈ క్షేత్ర వాసులకు, సందర్శకులకు సర్వతీర్థ స్నాన ఫలము ప్రాప్తించును.


మాతాపితృ హంతకుడు, గురుద్రోహి, భ్రూణహత్యా పాతకుడు, సురపానుడు, గోహంతకుడు మొదలైన మహాపాపాలు చేసినవారు ఈ క్షేత్రమందు సాగరసంగమంలో స్నానం చేసినట్లయితే సర్వపాపాలు పోయి, సకల శుభాలు పొందుతారు. ఇంతటి మహాత్మ్యం కలిగినది ఈ అంతర్వేది పుణ్యక్షేత్రము” అని బ్రహ్మదేవుడు – నారదమహామునికి తెలియచేసాడు. 
                                                                               (To be countinued)  

February 9, 2015

ఆణిముత్యాలు ...... మంచిమాటలు 10

ఆణిముత్యాలు ...... మంచిమాటలు 10


ఆణిముత్యాలు ...... మంచిమాటలు 9

ఆణిముత్యాలు ...... మంచిమాటలు 9


ఆణిముత్యాలు ...... మంచిమాటలు 8

ఆణిముత్యాలు ...... మంచిమాటలు 8


ఆణిముత్యాలు ...... మంచిమాటలు 7

ఆణిముత్యాలు ...... మంచిమాటలు 7


ఆణిముత్యాలు ...... మంచిమాటలు 6

ఆణిముత్యాలు ...... మంచిమాటలు 6


ఆణిముత్యాలు ...... మంచిమాటలు 5

ఆణిముత్యాలు ...... మంచిమాటలు 5


ఆణిముత్యాలు ...... మంచిమాటలు 4

ఆణిముత్యాలు ...... మంచిమాటలు 4


ఆణిముత్యాలు ...... మంచిమాటలు 3

ఆణిముత్యాలు ...... మంచిమాటలు 3


ఆణిముత్యాలు ...... మంచిమాటలు 2

ఆణిముత్యాలు ...... మంచిమాటలు


ఆణిముత్యాలు ...... మంచిమాటలు

ఆణిముత్యాలు ...... మంచిమాటలు