రామ సేతువే కట్టండి రాముని ఎదలో నిలుపండి
రచన - డా.పి.ఎల్.ఎన్.ప్రసాద్
సంగీతం & గానం - శ్రీమతి రామవల్లి.
రాగం బృందావన సారంగి
రామ సేతువే కట్టండి రాముని ఎదలో నిలుపండి
రామ నామమే రాయై నిలువ భువికి దివికి మదిని వారధిగా
రామ సేతువే కట్టండి
సౌమిత్రి పిలువగా శమదమాదులే వచ్చెనుగా
పావని పిలువ పంచ తత్త్వములు నిండెనుగా
భరతుని తలచిన భువి లో భక్తి మీదే గా
జానకి తలచిన జన్మ తరించి పోవును గా..!
రామ సేతువే కట్టండి. రాముని ఎద లో నిలుపండి.!!
రామ తారక మంత్రమే. పాపరాసి ని దాటించును గా
శ్రీ రామ ధ్యానమే..ధర్మము నిలుపు ను గా.
రామ భక్తుల సన్నిధి.. సత్య సాధనమయ్యెనుగా.
రామాయణ పారాయణం. మోక్షానికి సోపానము గా!!
రామ సేతువే కట్టండి. రాముని ఎద లో నిలుపండి..
రామ నామమే రాయై నిలువ
భువికి దివికి మదిని వారధి గా
రామ సేతువే కట్టండి..రాముని ఎద లో. నిలుపండి..
No comments:
Post a Comment