శ్రీకృష్ణ లీలామృతం
"పురిటి జోల"
కన్న ఏడవకు తండ్రీ
ఏడిస్తే నిన్నెవరు యెత్తు కొనువారు ||ఏ||
నిశిరాత్రి చెఱలోన బందీనైయుండి -
నీ ముద్దుమురిపెములు తీర్చలేనైతి ||ఏ||
నీ మామ కంసుడు బహుక్రోధశాలి -
నీ ఏడుపు వినివచ్చి నిన్నేమి చేయునో ॥ఏ॥
నీ తాత ముత్తవ్వలు నిను చూడనెంచి -
తల్లడిల్లేరు తండ్రీ ఏడవకు ||ఏ|
నీ తండ్రి వసుదేవుడు - నీ మామకు వెఱచి -
నందవ్రజముకు నిన్ను చేర్చేరు ఏడవకు ||ఏ||
దుష్టులను సంహరించి - శిష్టులను కాపాడ -
అవతారమెత్తిన నా తండ్రి నీకిదెలాలి ||ఏ||
ముక్కోటి వేల్పులార కరుణించి మీరు -
నా చిన్ని కన్నయ్యకు డోలికలనూపండి ||ఏ||
జో... జో ... జో ... జో