August 17, 2022

శ్రీకృష్ణజననం

 శ్రీకృష్ణజననం




పుట్టుశంఖు చక్రములతో పుట్టెనమ్మ కృష్ణమూర్తి వీపునను వింజామరలతో కాంతిచంద్రుని బోలెనే హరిహరీ - కృష్ణమూర్తి పుట్టెనమ్మా ॥

1. పళ్ళవరుస పలుచనాలుక - పలుచనైన పై పెదవి చాల జగములేలుటకు - బాలుడై హరి పుట్టెనే అమ్మా - కృష్ణమూర్తి పుట్టెనమ్మా ॥

2. మూడుఘడియలు దాచవమ్మ - మూడులోకాలేలుతాను నాల్గు ఘడియలు దాచవమ్మ - నరులనే రక్షిస్తు నూ... అమ్మా - నన్నెక్కడైనను దాచవే తల్లీ॥

3. ఏడుఘడియలు దాచవమ్మ - ఏడులోకాలేలుతాను పదిఘడియలు దాచవమ్మ - పరులనే రక్షిస్తునూ అమ్మా - నన్నెక్కడైనను దాచవే తల్లీ ॥

4. తూరుపున చుక్కమొలచెను - దుష్టమాయలకోడికూసెను బాలుడొచ్చి వాడజేరె - పడతిదేవకి వడిని జేరే హరి హరీ - కృష్ణమూర్తి పుట్టెనమ్మా ॥

5. జగములేలే మేనమామకు - సాటియెవ్వరు లేరని కుక్షి లోపల కృంగుచుంటివి - దీనురాలగు చుంటివీ అమ్మా నే కృష్ణమూర్తిని పుట్టితి తల్లీ॥


No comments:

Post a Comment