దసరా నవరాత్రుల లో అమ్మవారి అవతారాలు, అమ్మకు పెట్టవలసిన నైవేద్యాలు, శ్లోకాలు, ఆశ్వయుజ శుద్ద పాడ్యమి నుండి శుద్ధ దశమి వరకు దేవీ నవరాత్రులలో రోజుకొక దుర్గా రూపమును ఉపాసించ వలెను.
నవదుర్గలు :
ప్రథమా శైలపుత్రీచ|
ద్వితీయా బ్రహ్మచారిణీ|
తృతీయా చంద్రఘంటేతి|
కూష్మాండేతి చతుర్థికీ|
పంచమా స్కందమాతేతి|
షష్ఠా కాత్యాయనేతిచ|
సప్తమా కాళరాత్రీచ|
అష్టమాచేతి భైరవీ|
నవమా సర్వసిద్ధిశ్చాత్|
నవదుర్గా ప్రకీర్తితా||
నవరాత్రులలో ఈ తొమ్మిది రూపాలలో అమ్మవారిని పూజించాలి.
నవదుర్గా ధ్యాన శ్లోకములు
శైలపుత్రీ : (బాలా త్రిపుర సుందరి)
నైవేద్యం : కట్టు పొంగలి
శ్లో|| వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతశేఖరాం|
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ||
బ్రహ్మ చారిణి ( గాయత్రి ):
నైవేద్యం : పులిహోర
శ్లో|| దధానా కరపద్మాభ్యాం అక్షమలాకమండలూ |
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||
చంద్రఘంట ( అన్నపూర్ణ )
నైవేద్యం : కొబ్బరి అన్నము
శ్లో|| పిండజప్రవరూరుఢా చంద్రకోపాస్త్ర కైర్యుతా|
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ||
కూష్మాండ ( కామాక్షి )
నైవేద్యం : చిల్లులులేని అల్లం గారెలు
శ్లో|| సురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ|
దధానా హస్త పద్మభ్యాం కూష్మాండా శుభ దాస్తుమే ||
స్కందమాత ( లలిత )
నైవేద్యం : పెరుగు అన్నం
శ్లో|| సంహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా|
శుభదాస్తు సదాదేవీ స్కందమాతా యశస్వినీ ||
కాత్యాయని(లక్ష్మి)
నైవేద్యం : రవ్వ కేసరి
శ్లో|| చంద్రహాసోజ్జ్వలకరా శార్దూల వరవాహనా |
కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినీ ||
కాళరాత్రి ( సరస్వతి )
నైవేద్యం : కూరగాయలతో వండిన అన్నాన్ని
శ్లో|| ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నాఖరాస్థితా|
లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ |
వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా|
వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ ||
మహాగౌరి( దుర్గ )
నైవేద్యం : చక్కెర పొంగలి (గుఢాన్నం)
శ్లో|| శ్వేతే వృషే సమారూడా స్వేతాంబరధరా శుచిః|
మహాగౌరీ శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా ||
సిద్ధిధాత్రి ( మహిషాసుర మర్దిని ) ( రాజ రాజేశ్వరి )
నైవేద్యం : పాయసాన్నం
శ్లో|| సిద్ధ గంధర్వ యక్షాద్యైరసురైరమరైరపి |
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ||
దుర్గా ధ్యాన శ్లోకము :
శ్లో|| ఓం హ్రీం కాలాభ్రాభాం కటాక్షైరరికులభయదాం మౌలిబద్ధేందురేఖాంశంఖం
చక్రం కృపాణం త్రిశిఖమపి కరైరుద్వహంతీం త్రినేత్రామ్ |
సింహస్కంధాధిరూఢాం త్రిభువనమఖిలం తేజసా
పూరయంతీం ధ్యాయేద్ దుర్గాం జయాఖ్యాం త్రిదశ పరివృతాం సేవితాం సిద్ధికామైః ॥
No comments:
Post a Comment