October 9, 2014

ముకుందమాల... 9 వ శ్లోకం

******కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల******

9 వ శ్లోకం
చింతయామి హరిమేవ సంతతం
మందమంద హసితాననాంబుజం
నందగోప తనయం పరాత్పరం
నారదాది మునిబృంద వందితం  

భావం:-
నారదాదిమునీశ్వరులచే సేవింపబడుచుండు వానిని, పరాత్పరుని, నందగోపకుమారుని, నవ్వు రాజిల్లెడి మోమువానిని, కృష్ణుని ఎల్లప్పుడూ నేను ధ్యానించు చుందును. 

(నాల్గవ శ్లోకం నుండి ఇంతవరకు అనన్య ప్రయోజనముగా సర్వదేశ సర్వకాల సర్వావస్థల యందు అవిచ్ఛన్నముగా ఆటంకములు లేక హరిస్మరణమే తనకు కావలెనని కులశేఖరులు కోరినారు. ఆ కోరికను అనుసరించి లభించిన హరిని అనుభవించి తృప్తితో ఈ శ్లోకమును చెప్పుచున్నారు)   



No comments:

Post a Comment