April 12, 2015

రామాయణ కాలంలో ప్రాచీన దేశాలు – ఆధునిక ప్రాంతాలు

మనం పురాణాలు చదువుతుంటాం కానీ, వాటిలో తెలియచేసే రాజ్యాలు ... నేడు ఏ ఏ ప్రాంతాలో మనలో చాలమందికి తెలియవు ..... అలనాటి రాజ్యాల పేర్లు – నేటి రాష్ట్రాలు, దేశాల పేర్లు ఏమిటో తెలుసుకుందాం.


ప్రాచీన దేశాలు – ఆధునిక ప్రాంతాలు

1) భగీరథుడు గంగను భూమి మీదకు తెచ్చిన స్థలం 
--గంగోత్రి, ఉత్తరాఖండ్ 


2) కపిల మహర్షి ఆశ్రమం, - (శ్రీరాముని పూర్వీకులు సగర చక్రవర్తి కొడుకులు 60,౦౦౦ మంది కాలి బూడిదైన స్థలం)
--గంగాసాగర్ –  వెస్ట్(పశ్చిమ)బెంగాల్

3) కాంభోజ రాజ్యం (శ్రీరాముని ముత్తాత రఘు మహారాజు సామ్రాజ్యం ఉజ్బెకిస్తాన్, తలకిస్తాన్, కజఖిస్తాన్ దాటి భారతదేశం వరకు విస్తరించి ఉంది)
--ఇరాన్ 

4) రక్షస్థలం – (రావణాసురుడు తన పది తలలు నరికి శివున్ని పూజించి, వరాలు పొందిన ప్రాంతం)
--లాంగకో...టిబెట్....చైనా

5) గోకర్ణ – శివుని ఆత్మలింగాన్ని గణేశుడు నేలపైన ఉంచిన చోటు 
--గోకర్ణ – కర్ణాటక 

6) సీతాదేవి - జనకునికి భూమిలో దొరికిన చోటు    
--సీతామర్హి – బీహార్ 


7) కోశలదేశం – రాజధాని అయిన అయోధ్య నుండి నేపాల్ లోని కొన్ని ప్రాంతాల వరకు ఉన్న ప్రదేశం 
  – దశరథుడు పుత్రకామేష్టియాగం చేసిన స్థలం 

8) మిథిల - సీతాదేవి పుట్టినిల్లు 
-- జనక్ పూర్ 
9) సరయూ నది – ఈ నది ఒడ్డునే అయోధ్య నిర్మితమైనది 
--ఘాఘరా నది 

10) అయోధ్య/ సాకేతపురం – శ్రీరాముని జన్మస్థలం, బంగారు సీతతో అశ్వమేధ యాగం చేసిన స్థలం, సరయూ నదిలో మునిగి వైకుంఠం చేరిన స్థలం 
--అయోధ్య – ఉత్తరప్రదేశ్ 
రామ జన్మభూమి 


బంగారు సీతతో అశ్వమేధ యాగం

సరయూ నదిలో మునిగి శ్రీరాముడు వైకుంఠం చేరుట 

11) తాటక వధ జరిగిన స్థలం 
బక్సర్ – బీహార్ 

12) అహల్య శాపవిమోచనస్థలం 
--అహిరౌలి – బీహార్ 

13) కుశనాథపురం – విశ్వామిత్రుడు యాగం చేసిన స్థలం 
--సుల్తాన్పూర్ – ఉత్తరప్రదేశ్ 

14) గుహుడు సీతారామ లక్ష్మణులను కలిసిన చోటు 
--శృంగబేరిపురం – అలహాబాద్ దగ్గర 

15) దండకారణ్యం 
--చత్తీస్ ఘడ్ లోని బస్తర్ జిల్లా, ఆంధ్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు


16) చిత్రకూటం – సీతారామ లక్ష్మణులు వనవాసం చేసిన చోటు 
--సాత్న జిల్లా, మధ్యప్రదేశ్ 

17)  పంచవటి – శూర్పణఖ  ముక్కూ, చెవులు కోసిన చోటు,
--నాసిక్ – మహారాష్ట్ర 

18) కబంధాశ్రమం- 
--కర్దిగుడ్ – బెల్గావ్ – కర్ణాటక 

19) శబరి  ఆశ్రమం 
--సర్బన్పె- బెల్గావ్, కర్ణాటక 

20) హనుమంతుడు మొదటిసారి శ్రీరాముని కలిసిన చోటు 
--హనుమాన్ హళ్ళి – కొప్పాళ, కర్ణాటక 


21) ఆంజనేయ పర్వతం, ఋష్యమూక పర్వతం  – హనుమంతుడి జన్మస్థలం, కిష్కింద – సుగ్రీవుని రాజ్యం 
--తుంగభద్రా నదీతీర ప్రాంతం – హంపి దగ్గర – కర్ణాటక 


22)  విభీషణుడు శ్రీరాముని శరణు కోరిన స్థలం 
--ధనుష్కోటి – తమిళనాడు 

 23) శ్రీరాముడు వానరసైన్యంతో వారధి నిర్మించిన చోటు 
--రామేశ్వరం –తమిళనాడు

24) రత్నద్వీపం / సింహళం/  లంక 
-- శ్రీలంక 

25) అశోకవనం - సీతాదేవి బందీగా ఉన్న ప్ర్రదేశం 
--కాండీ దారిలోని సీత ఏళియ, శ్రీలంక 

26) శ్రీరాముడు , రావణుని వధించిన చోటు 
-- దునువిల్ల , శ్రీలంక 

27) సీతాదేవి అగ్నిప్రవేశం చేసిన ప్రాంతం 
-- దివిరుంపోల, శ్రీలంక 

28) వాల్మీకి ఆశ్రమం / సీతాదేవి కుశలవులకు జన్మనిచ్చిన స్థలం / భూదేవిలో ఐక్యమైన స్థలం 
-- ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ నుండి 30 మైళ్ళ దూరంలోని బితూర్. 

29) కుశపురం- సీతారాముల పెద్దకొడుకు కుశుడు కట్టించిన నగరం 
-- కుశార్ , పాకిస్తాన్ 

30) లవపురం -  సీతారాముల చిన్నకొడుకు లవుడు కట్టించిన నగరం 
-- లాహోర్ , పాకిస్తాన్ 

31) తక్షశిల - శ్రీరాముని తమ్ముడు భరతుని పెద్దకొడుకు తక్షుడు నిర్మించిన నగరం 
-- తక్షశిల , పాకిస్తాన్ 

32) పుష్కలావతి / పురుషపురం - శ్రీరాముని తమ్ముడు భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం 
-- పెషావర్ , పాకిస్తాన్ 

అమృతం అనే ఆయుర్వేద, ఆధ్యాత్మిక పత్రికలో ఉన్న ఈ points ని  నేను చదివాను, నాకు బాగా నచ్చాయి. అందుకే అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో ఇక్కడ భద్రపరచాను. 

5 comments: