April 13, 2015

నమస్కారం అనేది మన భారతీయ సంస్కృతి

నమస్కారం అనేది మన భారతీయ సంస్కృతి 


ఏదేశ సంస్కృతి ఐనా ఆ దేశ ఆత్మ అయి ఉంటుంది. మన భారతీయ సంస్కృతి యొక్క మహత్తు చాలా గొప్పది. మన సంస్కృతిలో పూర్వకాలం నుంచి వస్తున్న సంప్రదాయాల వెనుక గొప్ప తాత్విక వైజ్ఞానిక రహస్యాలు దాగి ఉన్నాయి. నమస్కారం అనేది భారతీయ సంస్కృతి యొక్క అపురూప రత్నం. భారతీయ సంస్కృతిలో నమస్కరానికి తనదైన ఒక స్థానం, మహత్తు ఉన్నాయి. పాశ్చాత్య సంస్కృతిలో ఏవిధంగా అయితే షేక్ హ్యాండ్ (కరచాలనం) ఇస్తారో- అదేవిధంగా మన భారతీయ సంస్కృతలో రెండు చేతులు జోడించి, తలను వంచి, ప్రాచీన పధ్ధతి ఉంది. నమస్కారానికి వేర్వేరు భావాలూ, అర్థాలు ఉన్నాయి. 

నమస్కారం అనేది ఒక ఉత్తమ సంప్రదాయం. ఎదుటి వానికి నమస్కారం చెయ్యటంలోనే తెలుస్తుంది మన సంస్కారమేమిటని. మనం మనకంటే పెద్దవారికి, తల్లిదండ్రులకి, సజ్జనులు, మహాత్ములని కలుసుకున్న సమయంలో వారి ఎదుట చేతులు రెండు జోడించి, తలను వంచితే, మనలో ఉండే అహంకారం పోయి మనసు నిర్మలమవుతుంది. 


నమస్కారం మూలంగా మన అహం ఏ యోగ్యుడి ఎదుటైనా తల వంచితే శరణాగత, సమర్పణ భావాలు  కలుగుతాయి. అన్ని మతాలలోనూ ఈ నమస్కార సంప్రదాయం ఉంది. క్రైస్తవ మతంలో ఛాతీపై చేతిని ఉంచి, తలను వంచుతారు. బౌద్ధులు కూడా తల వంచి ప్రణామం చేస్తారు. జైనులు కూడా తలవంచి నమస్కారం చేస్తారు. వైదిక ధర్మంలో నమస్కార పద్ధతే అన్నింటిలోకీ శ్రేష్టమైనది. రెండు చేతులనూ జోడించటం వల్ల జీవనశక్తిని, తేజోవలయాన్ని రక్షించే ఒక చక్రం ఏర్పడుతుంది. అటువంటి నమస్కారం విశేష లాభదాయకమైంది. ఎందుకంటే ఒకరి చేతులు మరొకరు అందుకోవటం వలన జీవశక్తి నశించి, ఒకరి రోగాలు మరొకరికి వ్యాపించే అవకాశం ఉంది.      

                                  

No comments:

Post a Comment