September 15, 2014

వివాహములు - అష్టవిధములు

వివాహములు - అష్టవిధములు

1)యథాశక్తి కన్యలను అలంకరించి, వరునకు ఇచ్చి, కన్యాదానము చేస్తే - అది బ్రహ్మ వివాహము అందురు. ఈవిధంగా కన్యాదానము చేయుటవలన ముందు పది తరములవారు, వెనుక పది తరములవారు, కన్యాదాత తరము మొత్తం 21 తరములవారు తరింతురు. 

2) యజ్ఞము నందు ఋత్విక్కునకు జరుపు కన్యాదానము --- ఇది 14 తరములవారు తరింతురు. ఇది దైవ వివాహము. 

3) రెండు ఆవులను తీసుకొని, కన్యాదానము చేయునది ఆర్షమనబడును. ఈవిధంగా చేస్తే  6 తరములవారు తరింతురు.

4) వలచి వచ్చిన వరునకు ఇచ్చునది ప్రాజాపత్యము అందురు. 6 తరములవారు తరింతురు.(వెనుక - ముందు తరములవారు.)   

5) కన్యను ధనమునకు విక్రయించి, వరునకు ఇచ్చునది. అసురము అందురు. 

6) కన్యా - వరుడు ఒప్పిదము మీద జరుపుకొను వివాహము -- గాంధర్వము అందురు. 

7) యుద్ధము నందు అపహరింపబడి వివాహము జరిపినచో - అది రాక్షస వివాహము అందురు. 

8) మోసముచే కన్యను అపహరించి వివాహము జరిపినచో - అది పైశాచిక వివాహము అందురు.(యాజ్ఞవల్క్య వచనము)



No comments:

Post a Comment