September 16, 2014

పుష్కరాలు ఎప్పుడెప్పుడు వస్తాయి – వాటి వివరములు

పుష్కరాలు ఎప్పుడెప్పుడు వస్తాయి వాటి వివరములు

ఇట్టి గురుడు మేషాది రాసులయందు ప్రవేశించినప్పుడు ఆయా నియమిత నదీ తీర్థముల యందు పుష్కరతీర్థములు అగును. ఆ సమయమున త్రింశత్రికోటి దేవతలునూ, సమస్త నదీనదములునూ, ఆయా తీర్థములయందు(నదుల యందు) పితృదేవతలతో సహా ప్రవేశింతురు. ఆయా నదీతీర్థముల యందు పుష్కరకాలమున పితృదేవతలకు తర్పణములు, దానములు జరిపించిన సహస్ర ఫలితము కలుగును. పితృదేవతలు తరింతురు. సహజముగా గురుడు అతి చారగతిలో రాశియందు ప్రవేశించి, తిరిగి వక్రగతితో వెనుక రాశికి వక్రించి, తిరిగి ఋజమార్గమున రాశియందు ప్రవేశించినప్పుడు అనగా ఈ రెండవసారి ప్రవేశించినప్పుడు మాత్రమే పుష్కరకాలము అందురు.

ఈ గురుడు ఏరాశియందు ప్రవేశించినను 1 సంవత్సర కాలము ఉండి, తిరిగి ముందు రాశికి ప్రవిశించును. ప్రవేశించిన 12 రోజులవరకు పుష్కరకాలం అంటారు.  

గోదావరీనదికి మాత్రముగురుడు సింహరాశిలో ప్రవేశించిన తరవాత 12  రోజులు పుష్కరకాలమును, అంత్యమున అనగా కన్యారాశిలో ప్రవేశించుటకు ముందు 12 రోజులు అంత్యపుష్కరకాలము జరుపుతారు.  

1)  గురుడు  మేషరాశిలో  ప్రవేశించినప్పుడు  గంగానదికి  పుష్కరాలు వస్తాయి
2)  గురుడు  వృషభరాశిలో  ప్రవేశించినప్పుడు  నర్మదానదికి  పుష్కరాలు  వస్తాయి
3)  గురుడు  మిథునరాశిలో ప్రవేశించినప్పుడు  సరస్వతినదికి పుష్కరాలు వస్తాయి
4)  గురుడు  కర్కాటకరాశిలో ప్రవేశించినప్పుడు  యమునానదికి పుష్కరాలు వస్తాయి
5)  గురుడు  సింహరాశిలో ప్రవేశించినప్పుడు  గోదావరినదికి పుష్కరాలు వస్తాయి
6)  గురుడు  కన్యారాశిలో ప్రవేశించినప్పుడు  కృష్ణానదికి పుష్కరాలు వస్తాయి
7)  గురుడు  తులారాశిలో ప్రవేశించినప్పుడు  కావేరీనదికి పుష్కరాలు వస్తాయి
8)  గురుడు  వృశ్చికరాశిలో ప్రవేశించినప్పుడు  తామ్రపర్ణి(భీమరధీ)నదికి  పుష్కరాలు వస్తాయి
9)  గురుడు  ధనుస్సురాశిలో ప్రవేశించినప్పుడు  పుష్కరిణీనదికి  పుష్కరాలు వస్తాయి
10)  గురుడు  మకరరాశిలో ప్రవేశించినప్పుడు  తుంగభద్రానదికి  పుష్కరాలు వస్తాయి
11)  గురుడు  కుంభరాశిలో ప్రవేశించినప్పుడు  సింధునదికి  పుష్కరాలు వస్తాయి
12) గురుడు  మీనరాశిలో  ప్రవేశించినప్పుడు  ప్రణితానదికి  పుష్కరాలు వస్తాయి.  




No comments:

Post a Comment