December 20, 2014

సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిసూక్తులు 15

సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిసూక్తులు 15


సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిసూక్తులు 14

సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిసూక్తులు 14


సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిసూక్తులు 13

సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిసూక్తులు 13

సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిసూక్తులు 12

సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిసూక్తులు 12


సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిసూక్తులు 11

సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిసూక్తులు 11


సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిసూక్తులు 10

సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిసూక్తులు 10


December 18, 2014

సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిసూక్తులు 09

సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిసూక్తులు 09


సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిసూక్తులు 07

సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిసూక్తులు 07


సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిసూక్తులు 08

సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిసూక్తులు 08


సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిసూక్తులు 06

సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిసూక్తులు 06


సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిసూక్తులు 05

సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిసూక్తులు 05


సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిసూక్తులు 04

సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిసూక్తులు 04


సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిసూక్తులు 03

సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిసూక్తులు 03


సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిసూక్తులు 01

సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిసూక్తులు 01


సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిసూక్తులు 02

సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిసూక్తులు 02


December 17, 2014

ఆనందం చిరునామా ఇదిగో...

ఆనందం చిరునామా ఇదిగో...

‘‘ఆనందం. ఒక మానసిక స్థితి అది. జీవితంలో కోరుకున్నవన్నీ దక్కినా అది స్వంతం అవుతుందన్న గ్యారంటీ ఏం లేదు’’ అంటున్నారు పరిశోధకులు. ‘‘సానుకూల మనస్తత్వం’’ మీద శాస్త్రవేత్తలు ఎన్నో సంవత్సరాల నుంచి పరిశోధనలు చేస్తున్నారు. దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ పరిశోధనల్లో పలు ఆసక్తికర అంశాలు తెలిశాయి. ‘‘కావల్సినవన్నీ ఉన్నా ఆనందంగా లేము’’ అని బాధపడేవారికి మేం చెప్పేది ఒక్కటే - ఆనందాన్ని అందించేవి, నిలబెట్టేవి వక్తుల అలవాట్లు, ఆహారం, ప్రవర్తనలే. ఎందుకంటే ఈ అంశాలే మెదడులో ఆనందానికి సంబంధించిన సంకేతాలిచ్చే ‘‘ఉత్ప్రేరకాల’’ స్థాయిని పెంచుతాయి అని గట్టిగా చెబుతున్నారు ఆ పరిశోధకులు.
ఇంతకీ ఏమిటా అలవాట్లు అంటే...

‘‘ఆటలు చిన్నపిల్లలకి చాలా ఇష్టం. ఓ గంట ఆడనిస్తే చాలు హుషారుగా మనం చెప్పినట్టు వింటారు. పెరిగినకొద్దీ ఆ ఆటలకి దూరమవుతూ... ఆ ఆనందాన్ని, హుషారుని కూడా దూరం చేసుకుంటున్నామన్నమాట. ‘‘నేను ఆనందంగా వుండాలి’’ అని కోరుకునే ప్రతి ఒక్కరూ హాయిగా ఆడుకోండి చాలు’’ అంటున్నారు సిడ్నీలోని హ్యాపీనెస్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు. ఆటలన్నారు కదా అని వీడియో గేమ్స్, కంప్యూటర్ గేమ్స్ ఆడితే సరిపోతుందని అనుకోకండి. రన్నింగ్, స్విమ్మింగ్, టెన్నిస్, క్రికెట్... ఇలా ఒళ్ళు అలిసేలా ఆడే ఆటలు ఆడాలి. అప్పుడు మెదడులో ‘‘ఎండార్ఫిన్’’ అనే హార్మోన్ ప్రేరేపించబడుతుంది. ఈ హార్మోను నొప్పులు తెలియకుండా చేస్తుంది. ఆనందాన్నిస్తుంది. కాబట్టి ఆటలు ఆనందానికి చిరునామాలు.

వ్యాయామం ఒంటికి మంచిదేగా...

‘‘వ్యాయామం - మీకు నచ్చిందే చేయండి. కానీ, రోజూ తప్పకుండా చేయండి. దానివల్ల గుండె నుంచి రక్తప్రసరణ మెరుగుపడి ఉల్లాసం కలుగుతుంది’’ అంటున్నారు స్విన్‌బర్న్ విశ్వవిద్యాలయం పరిశోధకులు. మానసిక ఆందోళనతో బాధపడేవారిలో మెదడు ముందు భాగానికి సరైన రక్తప్రసరణ ఉండటం లేదని వీరి పరిశోధనల్లో తేలిందట. అందే వ్యాయామం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరిగి, ఒత్తిడి తగ్గి ఉత్సాహం,  స్థైర్యం పెరుగుతాయట. సో.. రోజూ వ్యాయామం ఒంటికి మంచిది. మనసుకీ మంచిది.

ఆనందానికి ఆహారమూ ముఖ్యమే...

పౌష్టికాహారం తీసుకోకపోతే అలసిపోవడం, ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు వస్తాయి. అవి నేరుగా మనిషి ఆనందం మీద ప్రభావం చూపిస్తాయి. అలాగే కొన్ని ఆహార పదార్ధాలు నేరుగా ఆనందాన్ని కలిగించే ‘‘సెరోటానిన్’’ అనే ఉత్ప్రేరకం స్థాయిని పెంచుతాయి. ఎక్కువ మాంసకృత్తులు, తక్కువ పిండి పదార్ధాలు కలిగిన ఆహారాన్ని తీసుకునేవారిలో ఈ ‘‘సెరోటానిన్’’  స్థాయులు తక్కువగా వుంటాయిట. పిండి పదార్ధాలున్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల ట్రైప్టోఫాన్ అనే రసాయనం ప్రేరేపితమవుతుంది. అదే సెరోటెనిన్‌గా మారుతుంది. చాక్లెట్, హెర్బల్ టీ వంటివి కూడా ఆనందాన్ని కలిగించే ఆహారాలే అంటున్నారు బ్రిటన్ పరిశోధకులు.

ధ్యానం.. ఆనంద యోగం...

టిబెట్ బౌద్ధ సన్యాసులలో సెరోటానిన్ స్థాయి ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు పరిశోధకులు. ధ్యానం వల్ల మెదడులో ఆనందాన్ని కలిగించే భాగం ప్రేరేపితమవుతున్నట్టు, అలా ధ్యానం చేసే వ్యక్తులు ఉత్సాహంగా, ప్రశాంతంగా, సంతోషంగా ఉంటున్నట్టు తేలింది వీరి పరిశోధనల్లో. రోజూ ఓ ఐదు నిమిషాలపాటు మనసుని, మెదడుని నియంత్రిస్తూ ఏకాగ్రతతో ధ్యానం చేయగలిగితే చాలు.. అమితానందం మీ స్వంతం. అందుకు మేము హామీ అంటున్నారు వీరు.

ఆ నలుగురు... ఆనందాన్నిస్తారు...

ఇక ఆఖరుది.. ముఖ్యమైనది.. ‘‘నలుగురు మనుషులు’’. రోజూ ఓ నలుగురు వ్యక్తులతో మనసువిప్పి మాట్లాడితే చాలు ‘‘ఆక్సిటోసిన్’’ అనే రసాయనం స్థాయులు పెరుగుతాయి. దానివల్ల మనసులో ప్రేమాభిమానాలు పొంగుతాయి. అనుబంధాలు బలపడతాయి. అంతులేని ఆనందం స్వంతమవుతుంది. ఒంటరితనం ఒత్తిడిని, నిరుత్సాహాన్ని పెంచుతుంది. అందుకే ఆనందంగా ఉండాలి అనుకుంటే నలుగురిలో కలవండి. మాట్లాడండి. సంతోషాన్ని పొందండి, పంచండి. ఇదే విస్కాన్సిన్ విశ్వవిద్యాలయ పరిశోధకుల ఉవాచ.

ఆనందం అడ్రస్ తెలిసిందిగా.. మరి ఆనందాన్ని పట్టుకుని మన జీవితాలలో నింపుకోవడమే మిగిలింది. అన్నీ చిన్నవే. ఆచరించడం కూడా కష్టమేం కాదు. ఎటొచ్చీ ఆనందం వాటిల్లో దాగుందని మనకి తెలియదు అంతే. దీర్ఘకాలం పరిశోధనల తర్వాత పరిశోధకులు తేల్చిచెప్పిన ఆ సత్యాలు మనకి మార్గ నిర్దేశం చేస్తున్నాయి. ఆలోచించండి. ఆటలు, వ్యాయామం, ఆహారం, ధ్యానం, నలుగురిలో కలవటం... ఇవి చాలు అవధులు లేని ఆనందాన్ని అందుకోవటానికి.
                                                                                                         -రమ ఇరగవరపు
http://www.teluguone.com/news/content/how-to-become-happier-35-40581.html#.VJFA_NKUfng


తాళం చెవుల‘కీ’ చెవి!

తాళం చెవుల‘కీ’ చెవి!

ఆఫీసుకు టైమవుతుంటే బండి తాళాలు కనిపించవు. కారు తాళాలు ఎక్కడో వుంటాయి. వెతుకులాటతో చిరాకు, కోపం ఉదయాన్నే మనల్ని ఆవహిస్తాయి. ఇక ఆ చికాకు రోజంతా వెన్నాడుతుంది. ఇవన్నీ సరే హ్యాండ్ బ్యాగ్‌లో వేసిన ఇంటి తాళం చటుక్కున చేతికి అందదు. ఈ తాళాలతో ఇన్ని తిప్పలు. ‘‘ఎంచక్కా సెల్‌కి రింగ్ ఇచ్చి దాని అడ్రస్సు కనుక్కున్నట్టు వీటికీ ఓ ఆప్షన్ ఉంటే బాగుండును’’ అని మనందరం ఎప్పుడో ఒకప్పుడు అనుకునే వుంటాం కదా!

మనలాంటి వారి కోసమే ‘‘విజిల్ కీ ఫైండర్’’ తయారు చేశారుట. ఈసారి తాళాలు కనిపించకపోతే ఒక్క విజిల్ వేయండి చాలు అంటున్నారు దీని తయారీదారులు. మన విజిల్ సౌండ్‌కి ఈ ఫైండర్‌కి వున్న ఎల్ఇడి లైట్ వెలగటంతోపాటు ఓ బీప్ సౌండ్ కూడా వస్తుంది. దాంతో ఎక్కడ దాగున్నా టక్కున పట్టుబడిపోతుంది మన తాళం చెవి. 

By~~~~ ఇరగవరపు రమ 

http://www.teluguone.com/news/content/-whistle-key-finder-35-40415.html#.VJE_3dKUfng


చీకట్లో చిరు దీపాన్ని వెలిగించుదాం

చీకట్లో చిరు దీపాన్ని వెలిగించుదాం 



ఒకానొక ఆశ్రమంలో ఒకనాడు ఒక శిష్యుడు అతని గురువు దగ్గరకు వచ్చి - "గురువర్యా ! నా ఆధ్యాత్మిక సాధన ముందుకు సాగడంలేదు. ఉపవాసాలు చేస్తున్నాను, పుణ్యక్షేత్రాలని దర్శిస్తున్నాను, పూజలూ, యజ్ఞయాగాదులు చేశాను" ఈ విధంగా చెప్పుకుంటూ పోతున్న శిష్యుని మాటలను మధ్యలోనే ఆపి "నీవు ఎవరికైనా సేవ చేసావా ?" అని గురువుగారు అడిగి, అక్కడనుండి వెళ్ళిపోయారు. ఎవరికైనా ఏదైనా మనం సేవ(సహాయం) అనేది చెయ్యాలి. అది మానవ సహజ లక్షణం. ప్రతీప్రాణీ తాను ఇతరులకు ఏదో ఒకరకంగా సేవ చేస్తూనే ఉంటుంది. సేవలో - ఆస్తికుడు దేవుడిని తెలుసుకుంటాడు. నాస్తికుడు తనను తాను తెలుసుకుంటాడు. 

**************************

మరికొద్ది రోజుల్లో ఆంగ్ల నూతన సంవత్సరం రాబోతోంది కదా ! మనం కొత్త కొత్త తీర్మానాలని చేసుకుంటూ ఉంటాం. ఎలాగంటే నేను - నాకుటుంబం - నా కేరీర్ అనుకుంటూ. మన తీర్మానాలు అయితే బాగానే ఉన్నాయి. మనకోసం మనం ఆలోచిస్తున్నాం తీర్మానాలు చేసుకుంటున్నాం. మరి ఇతరుల కోసం ఏదైనా చేద్దామని ఒక్క క్షణమైనా ఆలోచిస్తున్నామా ? లేదే...... ఇతరులకు ఏమైనా సహాయం చేస్తున్నామా ? ఊహూ అదీ లేదు. కొద్దిమంది మేం ఇతరులకు సహాయం చేస్తున్నాం అని అంటారు. అది ఏవిధంగానో తెలుసా ? ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వాహనం(vehicle)  ఆగినప్పుడు యాచకుడికి ఒక రూపాయి వేయటం, భూకంపాలు - వరదలు వచ్చినప్పుడు వందో, రెందొండలో విరాళంగా ఇవ్వటం, పాతబట్టలని పెద్దమనస్సు చేసుకుని పనివాళ్ళకి ఇవ్వటం. ఇవన్నీ దానధర్మాల క్రింద జమ అవుతాయి. సహాయం అని అనిపించుకోదు కదా ? మనం చెయ్యాల్సినది - బాధ్యతగా మనవంతు సహాయం ఇతరులకు, సమాజానికి అందించటం. అది ఏవిధంగా అంటే నిరుద్యోగం, పేదరికం, నిరక్షరాస్యత, అనారోగ్యం...... ఇలాగ మనచుట్టూ అనేకానేక సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించటంలో మన వంతు బాధ్యత (పాత్ర) ఎంతవరకు అని అలోచించి వీలైతే పరిష్కరించాలి. 



***************************

పైన మనం చెప్పుకున్న సమస్యలకి సహాయం చెయ్యాలి అంటే మనం మహాత్ములం అవ్వనక్కరలేదు. మానవత్వం చూపించటానికి మథర్థెరీసా రావక్కరలేదు. అటువంటివారి వారసత్వం మనం అందిపుచ్చుకొని, మనచుట్టూ ఉన్నవారిని కూడా మనతో కలుపుకుంటూ మన వంతు బాధ్యతగా ఇతరుల సమస్యలు పరిష్కరిస్తూ ఉండాలి. అలా చేసేవారు మన మధ్య, మన చుట్టూ కూడా ఉంటారు, ఉన్నారు కూడా. అటువంటి వారిని గుర్తించి, గౌరవించటం మన బాధ్యత. మనకి చేతనైనంత సహాయసహకారాలు వారికి అందించటం మన కనీస కర్తవ్యం. ఆ దిశగా ఒక హృదయపూర్వక తీర్మానంతో మనం చేయిచేయి కలిపి కొత్త సంవత్సరంలోకి అడుగులు వేద్దాం రండి పదండి.

                                                                                                                ...........మీ శ్వేతవాసుకి   


కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుదాం.



                                           

విష్ణుసహస్రనామాలు 02

విష్ణుసహస్రనామాలు 02

పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః |
అవ్యయః పురుషః సాక్షీ క్షేత్రఙ్ఞో‌உక్షర ఏవ చ || 2 ||

10 పూతాత్మా (The Pure Self)
;భూతములు ఆవిర్భవించి వృద్ధి చెందుటకు భగవానుడు కారణమైనను జీవగుణములతో సంబంధము లేనివాడై "పూతాత్మా" అని పిలవబడుతున్నాడు. "పూత" అనగా పవిత్రమైన, ఆత్మా అనగా స్వరూపము కలవాడు, పవిత్రాతుడు. నిర్గుణుడైన భగవానుడు పవిత్రాత్ముడై పూతాత్మా అని స్తుతించబడుతున్నాడు. పూతాత్ముడైన ఆదిదేవుణ్ణి స్తుతించినవాడు కూడా పవిత్రుడే అవుతున్నాడు. పవిత్రాత్ముడే పరమగమ్యమైన పరమాత్మ అని రాబోవు నామము ద్వారా తెలుసుకుంటాము.         

11 పరమాత్మా (The Supreme Self)
నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వరూపమైన కార్యకారణముల కంటే విలక్షణమైనవాడు "పరమాత్మా" అని స్తుతించబడుతున్నాడు. తాను అందరకు ఆత్మ అయ్యి, తనకు మరొక ఆత్మ లేనివాడు. ముక్త పురుషులు తమ స్వానుభవము ద్వారా తెలుసుకున్నది కూడా ఈ పరమాత్మ తత్వమే. అందుకే తాను ముక్తపురుషులకు పరమగతియై ఉన్నాడు. ఈ విషయం తదుపరి నామంలో వివరించబడింది.        

12 ముక్తానాం పరమాగతిః (The Supreme Goal of the Liberated)
ముక్తపురుషులకు పరమగమ్యమై ఉన్నాడు. గతి అనగా గమ్యము. గతి అను పదమునకు ముందు పరమా అను విశేణము చేర్చుటచేత ఉత్తమగమ్యము అని తెలుస్తున్నది. ఏది గ్రహించిన తరవాత మరొకటి గ్రహించటం అవసరంలేదో, ఏ స్థానం చేరితే జ్ఞానికి పునర్జన్మ లభించదో అదే పరమగతి అని తెలుస్తుంది. నదికి సాగరం పరమగతి అయినట్టు, మానవులకు భగవానుడు పరమగమ్యమై ఉన్నాడు. సాగరంలో కలిసిన నది తన వ్యక్తిత్వమును కోల్పోయి, అనంత సాగరంలో కలిసిన రీతిగా, భగవానుని చేరిన జీవి భగవత్ వైభవంలో కలిసిపోవుట జరుగుతోంది. అది కరిగిపోయే సమస్థితే కానీ, తిరిగివచ్చే దుస్థితి ఎంత మాత్రం కాదు. "దేనిని చేరిన తరవాత జీవులు తిరిగి రాలేరో అటువంటి పవిత్ర పరమగతియే నా నివాసము" అని భగవానుడు భగవద్గీతలో తెలియచేసాడు. ముక్తులకు పరమగతి భగవానుడై ఉన్నాడని గ్రహించం కదా ! మరి అటువంటి పరమగతి శాశ్వతమా ? అశాస్వతమా ? అనే అనుమానం మనకు రావచ్చు. దానికి సమాధానం తదుపరి నామంలో తెలుసుకుందాం.            

13 అవ్యయః (The Unchanging)
వినాశము కానివాడు, వికారం లేనివాడు అయినందున "అవ్యయః" అని భగవానుడు కీర్తించబడ్డాడు.యితడు జరామరణములు లేక అవ్యయుడై ఉన్నాడని అందురు. కనిపించేది ఏదైనా పరిణామము చెందును. పరిణామము చెందే వస్తువు నశిస్తుంది. భగవంతుడు అలా పరిణామం చెందే వస్తు సముదాయంలో చేరడు. అందుకే తాను వస్తురహిత చైతన్యమై "అవ్యయః" అని స్తుతించబడ్డాడు. అవ్యయుడైన ఆ పరమాత్మను చేరినవారు మళ్ళీ ఈ జగత్తులోనికి రారు. మరి అవ్యక్తమైన అవ్యయ స్వరూపుడగు పరమాత్మను మనం ధ్యానించి, సాధించేది ఏముంది ? అవ్యక్తమైన పరమాత్మను దర్శించి, అనుభవించుట ఎలా ? అనే ప్రశ్నలకు సమాధానం వచ్చే నామంలో తెలుసుకుందాం.                 

14 పురుషః (The person)
దేహమందు ఉండే చైతన్యమే పురుషుడై ఉన్నాడు. నవద్వారములు కలిగిన పురమునందు ఉన్నవాడు పురుషుడు. అని భగవానుడు భగవద్గీతలో తెలియచేసాడు. కనుక పురము ఉన్నవాడే పురుషుడు అవుతాడు కానీ, పురము తాను కాదు. "ఈ దేహము ఏర్పడక ముందే నేను ఉన్నాను అనేదే పురుషునకు పురుషత్వము" అని వేదము తెలియచేస్తోంది. శ్రేష్టమైన ఫలములను ఇచ్చువాడు పురుషుడు. ప్రళయకాలమున సకల భువనములను అంతమొందించువాడు పురుషుడు. "ఈ విశ్వమును పూరించి ఉండుటచే" పురుషుడు అయినాడు. పురుషుడే నారాయణుడు. కనుకనే చైతన్య స్వరూపుడైన పురుషుడే విశ్వమంతటికి అధారమై ఉన్నాడు. జీవుని దేహెంద్రియ మనోబుద్ధులలో జరుగు సమస్తమును తానే తెలుసుకుంటున్నాడు. తెలుసుకునే వాడే కానీ తగులుకొనేవాడు కాదు. ఊరకుండేవాడే కానీ ఊగులాడేవాడు కాదు. ఈ విషయాన్నే వచ్చే నామంలో తెలుసుకుంటాము.                  

15 సాక్షీ (The Witness) 
 సా + అక్షి = చక్కగా దర్శించువాడు. సమస్తమును చక్కగా దర్శించువాడు సాక్షి. ఇంద్రియ మనో బుద్ధులు అవసరములేకుండానే సమస్తమును దర్శించగలవాడు "సాక్షి" అనబడతాడు. సాక్షి అయినవాడు కేవలం చుసేవాడే కానీ కర్తకాడు. చైతన్య స్వరూపమై దేహములోనే ఉంటూ, దేహెంద్రియ మనోబుద్ధులలో జరిగే సమస్త వ్యాపారాలని తానే చూస్తూ, దేనికీ అంటకకుండా ఉండుటచే అంతర్యామి సాక్షి అని పిలవబడుతున్నాడు. ప్రాణుల క్షేత్రములలో సాక్షిమాత్రుడు అని తెలియచేయగానే అతడు జ్ఞానపూరితుడై సాక్షి అని పిలవబడ్డాడా ? లేక గ్రహించనేరని సాక్షియా ? అనే సందేహం రాకుండా తాను జ్ఞానవంతుడై, సమస్తమును తెలుసుకొని సాక్షియై ఉన్నాడని వచ్చే నామం మనకు తెలియచేస్తోంది.          

16 క్షేత్రజ్ఞః (The Knower of the Field)
"క్షేత్ర" అనగా శరీరం. "జ్ఞః" అనగా తెలుసుకొనువాడు. "క్షేత్రజ్ఞః" అంటే శరీరంలో జరుగు క్రియలన్నిటినీ గ్రహించువాడు. శరీరములను వీనికి బీజములైన శుభాశుభ కర్మలను తెలుసుకొనుటచే ఆ యోగాత్ముడు క్షేత్రజ్ఞుడు  అని పిలవబడుచున్నాడు. క్షేత్రములు నశించును. మరి క్షేత్రజ్ఞుడు నశించునా ? నశించడు. క్షేత్రజ్ఞుడు అవినాశి. ఆ విషయం రాబోయే నామం తెలియచేస్తోంది.             

17 అక్షరః (The Imperishable) 
క్షరం కానివాడు లేక నాశరహితుడు. 'నక్షరతి" నశించడు కావున "అక్షరః" అని పిలువబడుతున్నాడు. "మాయ క్షరం అని, బ్రహ్మము అక్షరం అని వేదం తెలియచేస్తోంది. ఈ రెండవ శ్లోకంలో 17 వ నామం చివర "ఏవచ" అని ఉంది. "ఏవ" కారమునుబట్టి అక్షర క్షేత్రజ్ఞులకు పారమార్థికమగు(absolute) భేదం లేదు అని సూచన. "చ" కారమును బట్టి వ్యావహారిక(relative) భేదం కూడా లేదని తెలియవస్తోంది. అక్షర పురుషుడైన భగవానుడితో తాదాత్మ్యము చెందాలి. ఆ విషయాన్నే తరవాత వచ్చే నామంలో తెలియవస్తుంది. 

                  

December 16, 2014

విష్ణుసహస్రనామాలు 01

విష్ణుసహస్రనామాలు 01

విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః |
భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః || 1 ||

1 విశ్వం (The Universe) 
విష్ణుసహస్రనామ స్తోత్రంలో ప్రారంభమున భగవంతుని "విశ్వం" అని నామకరణం చేయటం జరిగింది. అజ్ఞానాంధకారమును పారద్రోలుటలో ఈ మొదటి నామము జ్ఞానభాస్కర తేజమై విరాజిల్లుతుంది. జగత్సృష్టికి భగవానుడు కారణమై ఉన్నందున తానే సృష్టికర్త  అయ్యెను.    
"విశ్వం" అనగా ఓంకారమని శ్రీ శంకరులు తన భాష్యములో తెలియచేసారు. "ఓమితి బ్రహ్మ, ఓమితీ దగం పర్వం" ఓం అనునదియే బ్రహ్మం. సర్వ వేదములలోని ఓంకారము నేనై ఉన్నానని భగవానుడు బావద్గీతలో విజ్ఞానయోగంలో తెలియచేసాడు. ఎవ్వరైతే ఈ విశ్వమంతయూ బ్రహ్మముకన్నా అన్యము కాదని గ్రహించి, ప్రణవ స్వరూపమని గుర్తించి,దానికి అనుగుణమైన జ్ఞానము కలవాడై జీవించునో అట్టివాడు విశ్వవైభవమును విశ్వనాధుని వైభవముగా దర్శించి జీవించును. రాగద్వేషము అంతరించును. అద్వైతానుభూతి కరతలామలకమగును.

ఆది కారణమైన చైతన్యమే "విశ్వం" అని పిలవబడుతుంది. ఆ కారణ చైతన్యం ఎవరు ? అనే దానికి సమాధానం రెండవ నామం అయిన "విష్ణుః" అనే నామంలో తెలియచేయటం జరిగింది.

2 విష్ణుః (The All -Pervading)
మొదటి నామంలో భగవానుని "విశ్వం" అని తెలియచేసి ఈ రెండవ నామంలో "విష్ణుః" అని తెలియచేయుట భావగర్భితంగా ఉంది. కనిపించి, వినిపించు విశ్వమంతయూ బాహ్య-అంతరములలో నారాయణుడు వ్యాపించి ఉన్నాడని నారాయణోపనిషత్తు తెలియచేస్తోంది. కాబట్టి కనిపించే జగత్తు అంతా నారాయణ స్వరూపము ఐనందున తాను "విశ్వం" అని పిలవబడి "వ్యాసనశీలత్వాత్" అను ధర్మం వాళ్ళ విష్ణువు అయ్యెను. 

"విష్ణుః" అనే నామము పలుకగానే సర్వమును విష్ణు స్వరూపముగా దర్శించగలిగి  ఉండాలి. అంటే మనలో దాగిఉన్న అజ్ఞానము దగ్ధం అవ్వాలి. మనలోని అహంకారాన్ని సమిధిగా మార్చి విష్ణు స్వరూపము అనే యజ్ఞంలో ఆహుతి చెయ్యాలి. అందుచేతనే విష్ణుమూర్తి యజ్ఞస్వరూపుడు అని మూడవ నామంలో తెలియచేయబడుతోంది. 

3 వషట్కారః (He on whose Account Vashatkara is offered)
వషట్కారుడు అని విష్ణుమూర్తిని కీర్తించుట వలన తాను వేదస్వరూపుడని తెలియబడుతున్నాడు. యజ్ఞ నిర్వహణలో మంత్రాలు చదివేటప్పుడు ప్రతీ మంత్రము చివర "వషట్" అను పదముతో ముగుస్తుంది. విష్ణుమూర్తిని ఉద్దేశించి అతని ప్రీత్యర్థము గౌరవించబడు యజ్ఞంలో "వషట్" అనేది పలుకుటచే తాను యజ్ఞస్వరూపుడైన "వషట్కారః"అని పిలవబడుచున్నాడు. విష్ణుమూర్తి వేదస్వరూపుడగుట వలన సర్వమూ తన వశమై ఉన్నది. సర్వం విష్ణుమూర్తియే. మనలను మనం భగవానునికి సమర్పించుకొనుటే ఆత్మయజ్ఞము. యజ్నమే విష్ణువు అని తెలిసింది కదా ! యజ్ఞము (సరైన)కాలములో మొదలై, కాలములో ముగుస్తుంది. యజ్ఞము అనేది కాలపరిధిలో ఉన్నది. అలా అయితే భగవానుడు విష్ణువు కూడా కాలపరిధిలో ఉన్నాడా ? లేడు. మరైతే అతనెలా ఉన్నాడు ? ఈ విషయాన్ని నాల్గవ నామంలో మనం తెలుసుకుందాం.

4 భూతభవ్యభవత్ప్రభుః (The Lord of Present Past and Future)
భూత భవిష్య వర్తమానముల యందు విస్వమంతటికీ అధినేతగా భగవానుడు ఉన్నాడు. కాలము మనస్సు నుండి ఆవిర్భవించింది. కాలమంతా భగవానుని యందే నడుస్తున్నది. భగవానుడు తాను కాలస్వరూపుడై, కాలాతీతుడై ఉన్నాడు. భూత భవిష్య వర్తమానములు తనలో అంశ మాత్రమై ఉన్నాయి. మూడు కాలాలలో జరిగే సంఘటనలను తాను చూస్తూనే(గమనిస్తూనే) ఉంటాడు. అతని ఆజ్ఞకు లోబడియే సర్వం నడుస్తుంది. కనుక భగవానునికి అన్యమైనది ఏదియూ త్రికాలముల యందు లేకపోవుటచే తాను "భూతభవ్యభవత్ప్రభుః" అని పిలవబడుతున్నది.   

భూత భవిష్య వర్తమానముల యందలి సకలమునకు తానూ ప్రభువని తెలియచేయబడింది. ప్రభువు అనగా అధినేత, మరి భగవానుడు ప్రభువు అయితే తాను పాలించే సృష్టి తనదా ?లేక తాను పాలించుటకు మరొకరు సృష్టించినదా ? దీనికి వివరణ వచ్చే నామంలో వివరించబడింది.

5 భూతకృద్ (The Evolver of Being)

త్రికాలవేది అయిన విష్ణుమూర్తియే భూతములను సృష్టించి "భూతకృద్" అయ్యెను. తానే రజోగుణముతో కూడి బ్రహ్మయై సృష్టి చేసి "భూతకృద్" అయ్యెను. తానే తమోగుణముతో కూడి రుద్రుడై "కృతంతి" సంహారము చేసి "భూతకృద్" అయ్యెను. రజోతమోగుణ సమన్వితుడై తాను సృష్టి సంహారములు సాగించగా తనలోని సత్వగుణము ఏమయ్యింది ? ఇందుకు వివరణ రాబోయే నామంలో మనం తెలుసుకుందాం.

.6 భూతభృత్(The Sustainer of Beings)
రజో తమోగుణ సమన్వితుడైన సృష్టి సంహారములు చేసిన భగవానుడు సత్వగుణముతో కూడి భూతస్రష్టయై "భూతభృత్" అయ్యెను. తనలోని సత్వగుణమే స్థితి కారణం అయ్యెను. "భూతభృత్" అనగా జీవులందరినీ పోషించువాడు అని భావం. ఎలా పోషించగలడు అనే విషయాన్ని తరువాత నామంలో తెలుసుకుందాం.

7 భావః (The Absolute Existence)
సమస్త చరాచర భూత ప్రపంచమంతయూ తానే వ్యాపించి ఉండుటచే భగవానుడు "భావః" అని తెలియబడుతున్నాడు. తాను తయారుచేసిన సృష్టి తనకంటే అన్యముకాకపోవుట వలన తానూ సర్వవ్యాపి అయ్యాడు. "భవతీతి భావః" అగుట వలన "భావః" అని కీర్తించబడుతున్నాడు. విశ్వమంతయూ తానై ఉండుటచే "భావః" అయినాడు. మరి విశ్వమునకు నశించు స్వభావం ఉన్నది కదా ? విశ్వమే నారాయణుడు అయినచో నారాయణుడు మాత్రము నశించడా ? దీనికి సమాధానం తరవాత నామంలో తెలుస్తుంది.

8 భూతాత్మా (The Self of Beings)
సర్వ జీవకోటి యందు అంతర్యామిగా ఉండువాడు "భూతాత్మా" అని పిలువబడుతాడు. సర్వభూతాంతరాత్మకుడైన తాను సమస్త శరీర మనుగడకు కరయై, సాక్షియై ఉండు చైతన్యము అగుటచే "భూతాత్మా" అని పిలవబడినాడు. భగవానుడు సాక్షి చైతన్యమై "భూతాత్మా" అని పిలవబడినట్లయితే సృష్టి స్థితుల యందు ఉత్సాహమును చూపు శక్తి ఏది ? అది కూడా భగవానుడే ... ఆ విషయం వచ్చే నామంలో మనకు తెలుస్తుంది.

9 భూతభావనః (The Generator అఫ్ Beings)
జీవులు పుట్టి పెరుగుటకు కారణమైనవాడై "భూతభావనః" అని పిలువబడ్డాడు. తల్లిదండ్రులవలె జన్మనిచ్చి, పెంచి, పోషించుటచేత, భగవానుడు "భూతభావనః" అని కీర్తించబడినాడు. అందుచేతనే భగవానుని "జగత్పిత" అంటారు.

"భూత భావన భూతేశ దేవదేవ జగత్పతే" అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్ముని విభూతియోగంలో కీర్తించాడు.
            

December 15, 2014

నిత్య స్మరణీయుడు మన బాపు

బాపు...


ఆ పేరు విన‌గానే  కుంచె సంబ‌ర‌ప‌డుతుంది.....కెమెరా `క‌న్ను` స‌రిచేసుకొ౦టుంది......రంగులు హుషారుప‌డతాయి.


త‌న గీత‌ల‌తో ఎంద‌రినో స‌మ్మోహ‌ప‌రిచిన ఆయ‌న‌ని ఏదీ ప్ర‌లోభ పెట్ట‌లేదు. అన్నిటికీ అతీతుడుగా, త‌న‌దైన లోకంలో ఆనందంగా అవిశ్రంతంగా విహ‌రిస్తూ మ‌న‌ల్ని అల‌రించిన బాపు ఓ తాత్వికుడు!! అస‌లెలా సాధ్యం ఆయ‌న‌కు?.....వేలెడంత లేని బుడుగుని గీస్తారు.



చ‌క్క‌లిగిలిగిలిపెట్టి భ‌ళ్లున న‌వ్వించే కొంటె కార్టైన్లూ గీస్తారు.....


.వ‌య్యారి భామ‌ల సంగ‌తి స‌రేస‌రి.


వీట‌న్నింటితోపాటు ఆ దివిలో ఉండే దేవ‌త‌ల‌ను రంగు గీతల మ‌ధ్య బంధించి మ‌న క‌ళ్ల‌ముందు  సాక్ష్యాత్క‌రింప చేస్తారే.. ఎంత అద్భుతం ఆ ప్ర‌తిభ‌??


ఎన్ని వేల‌సార్లు జోత‌లు ప‌ట్టాలి ఆ కుంచె ప‌ట్టిన చేతికి
ఆయ‌న ఊహ‌ల్లో మెదిలిన చిత్రం అచ్చం అలానే ప్రాణం పోసుకొని 70 ఎంఎం తెర‌పై డైలాగులు చెప్తొంటే అచ్చెరువు చెంద‌కుండా ఎలా ఉండ‌గ‌లం?
ప్ర‌తి ఫ్రేమూ కెమెరా కంటే ముందు ఆయ‌న కాగితంపై బంధీ కావ‌ల్సిందే.


బోసిన‌వ్వు .. ప‌సివాళ్ల‌కే సొంత‌మైన సొత్త‌ది. వ‌య‌సుతో పాటు క‌రిగి కాలంలో క‌లిసిపోతుంది.కానీ అదేం చిత్ర‌మో... ఆ న‌వ్వు నన్నోద‌ల‌కు ప్లీజ్ అంటూ.. ఆయ‌న‌తో పాటు చివ‌రిదాకా స్నేహం చేసింది. ఎంతందంగా ఉంటుందా న‌వ్వు..?!  ఎంత స్వ‌చ్ఛంగా ఉంటుందా న‌వ్వు..?  అచ్చం ప‌సివాడి పాల న‌వ్వులా ఆయ‌న ప‌సిమ‌న‌సుకు అద్దం ప‌డుతూ.


ప‌ని.. ప‌ని.. ప‌ని, అదే ఊపిరి, దైవం. అల‌సిపోయేది ప‌నితోనే, సేద తీరేది ప‌నిలోనే.   అదేంటో...?!  ప‌నిలోనే ఆనందం ఉందంటారు. మ‌నం ఆ మాట విన్నాం. కానీ అది ఆయ‌న రుచి చూశారు. అందుకే ఇంత ఆస్తి మ‌న‌కు ఇవ్వ‌గ‌లిగారు. ఒక‌టా రెండా?  ఎన్నెన్ని బొమ్మ‌లు. ఎన్నెన్ని కార్ట్యూన్లు, ఎన్నెన్నో సినిమాలు. ఒక జీవిత కాలంలో ఇంత సృష్టా??   సాధ్య‌మే అన‌డానికి నిలువెత్తు సాక్ష్య౦ ఆయ‌న మ‌న‌కు అందించిన సృష్టి. బ్ర‌హ్మ‌లా తాను సృష్టించ‌డానికే పుట్టారు. అందుకే త‌పస్సులా దాన్ని కొన‌సాగించారు.. చివ‌రి దాకా.


'రాజీ' కి బాపు అంటే చ‌చ్చేంత భ‌యం.
అందుకే ఆయ‌న ద‌రిదాపుల్లోకే రావ‌డానికి భ‌య‌ప‌డింది. ఒక్క‌సారైనా ఆయ‌న్ని వ‌శ‌ప‌రుచుకోవాల‌ని ఆశ ప‌డింది. కానీ ఓడిపోయింది. అది చిన్న కార్టూన్‌ కావ‌చ్చు. నిలువెత్తు దేవ‌తా మూర్తి కావ‌చ్చు. ఓ పుస్త‌క ముఖ చిత్రం కావ‌చ్చు. త‌న సినిమాలో ఓ ఫ్రేమ్ కావ‌చ్చు. ఎక్క‌డా 'రాజీ' ప్ర‌స‌క్తే లేదు. 

ఆత్మీయ‌త అనుబంధం క‌ల‌గ‌లిస్తే మా బాపు అంటూ ఎవ‌రికి వారే.. ఆ పేరునీ, మ‌నిషినీ గుండెల్లో బంధీ చేసేశారు. ఈయ‌న నా సొంతం, అచ్చంగా నా సొంత‌మే అనుకోవ‌డంలో ఎంత ఆనందం ఉంటుందో తెలుగువాళ్లంద‌రికీ తెల్సు. బాపు గురించి మాట్లాడాలీ అంటే.. ఒక్క బాపు అంటే అసంపూర్ణంగా అనిపిస్తుంది. ఒక్క ఆత్మ రెండు రూపాల్లో జీవం పోసుకొని మ‌న క‌ళ్లెదుట నిలిస్తే 'బాపు ర‌మ‌ణ‌లు' అవుతారు. ఒక‌రు గీత మ‌రొక‌రు రాత‌!!


ఆ గీత ఆ రాత‌ను ఉత్సాహ‌ప‌రిచిందో
ఆ రాత ఆ గీత‌ను క‌వ్వంచిందో... అద్భుత‌మైన స్స‌ష్టి జ‌రిగిపోయింది
ఏమైనా మ‌నం అదృష్ట వంత‌లు. ఆ ఇద్ద‌రూ మ‌న సొంతం.
బాపు లేరంటే మ‌న‌సొప్పుకోదు.
బుడుగు హ‌న్నా అంటాడు.
గ్యాన పెసూనాంబ అలిగి అన్నం తిన‌దు.
వయ్యారి భామ‌లు అలంక‌రించుకోరు. 
ఆ దేవ‌ర భువిలో నాకేం ప‌ని అంటాడు.
అందుకే బాపు ఉన్నారు.. మ‌న‌తోనే ఉన్నారు. ''మ‌న ప‌ని నిల‌బ‌డాల‌య్యా.. మ‌న‌కొచ్చిన బిరుదులు కాదు'' అనే ఆయ‌న మాట‌లు నిజం చేస్తూ మ‌న‌తో పాటు ఎప్ప‌టికీ నిలిచిపోయే చిరంజీవి మ‌న బాపు...!!



                                                                                                                        .....రమ ఇరగవరపు

విశాఖపట్నంలో వెలసిన శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారు చరిత్ర

శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి పురాతన - అధునాతన ప్రాభవాలు 

లక్ష్మీర్భూషయతే రూపం లక్ష్మీర్భూషయతే కులం l
లక్ష్మీర్భూషయతే విద్యాం సర్వాన్ లక్ష్మీర్విశిష్యతే ll

అన్నట్టుగా లక్ష్మీదేవి కృపవలనే మన రూపం జనాకర్షణీయము అవుతోంది. లక్ష్మీదేవి కృపవల్లనే ఒక కులము ఉన్నతస్థాయిలో విరాజిల్లుతుంది. ఆదిలక్ష్మీదేవి కృపవల్లనే విద్యావంతులు చదువుసంధ్యలు కొనసాగిస్తున్నారు. ఈ సృష్టిలో సమస్తం ఆ శ్రీమహాలక్ష్మీ కరుణాకటాక్షములచేతనే విరాజిల్లుతున్నది. అందువల్లనే ప్రాణికోటి సమస్తం ఆ శ్రీమహాలక్ష్మీదేవిని వేయి విధములుగా ఆరాధించుచున్నది. 

జగన్మాత అయిన ఆ తల్లికూడా భక్తుల వాంఛితములను నెరవేర్చటానికి, వారిని ఉద్ధరించటానికి అలివేలమంగగానూ, శ్రీరంగనాయికగానూ, వివిధ ప్రాంతాలలో వివిధ నామాలతో వెలసి విరాజిల్లుతోంది. అటువంటి శ్రీమహలక్ష్మీదేవి పీఠాలలో అత్యంత మహిమాన్వితమైనది విశాఖపట్నంలో బురుజుపేటలో వెలసిన శ్రీకనకమహలక్ష్మీదేవి పీఠం. భక్తకోటి హృదయాలయములే తప్ప తనకంటూ భౌతికంగా గుడి లేని తల్లి ఈమె. అత్యద్భుతమైన శ్రోతలకు, చదువరులకు విశేష ఆశ్చర్యములను, భక్తి శ్రద్ధలను కలిగించును. 


పురాణగాథ
ఆశ్రిత అఖిలదాయిని అయిన శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారు ఇక్కడ ఎప్పుడు వెలిసింది ఎవరికీ ఇదమిద్దంగా తెలియదు, చెప్పలేరు. ఇక్కడి జనులు నానుడి ఏమిటంటే -- ఈతల్లి పురాణకాలం నుండి ఉన్నది అని చెప్పుకుంటూ ఉంటారు. వింధ్యను దాటి  దక్షిణాదికి అగస్త్యుడు వచ్చినప్పుడు, శివాజ్ఞకు బద్ధుడై వ్యాసుడు కాశీ నుండి దక్షారామమునకు వచ్చినప్పుడు ఈ ప్రాంతమందు వారు ఈ తల్లిని ఆరాధించినట్లు చెప్పుకుంటుంటారు. ఈ ప్రాంతం యొక్క పేరు గాని, అప్పటి రాజుల రాజశాసనాలలోగానీ ఆరోజుల్లో ఎక్కడా ప్రస్థావించినట్లు దాఖలాలు ఎవరికీ లభించలేదు. 

చారిత్రిక గాథ
కర్ణాటక నుండి కళింగపట్నం వరకు విజయయాత్ర చేసిన శ్రీకృష్ణదేవరాయులు అతను ఇరువైపులా ప్రయాణం చేసినప్పుడు ఈ కనకమహాలక్ష్మీ అమ్మవారిని తప్పకుండా దర్శించి వెళ్ళేవారని చెప్పబడుతోంది, కానీ అందుకు ఆధారాలు ఏమీ చూపించుటకు లేవు. ఈ  తల్లికి ఆలయ నిర్మాణం ఎందుకు చేయకూడదు అన్న విషయానికి కూడా ఋజువులు, సాక్ష్యాలు ఏమీ లభించలేదు. 

(నేటి)వర్తమాన చరిత్ర 
విశాఖపట్నం లోని బురుజుపేటలో కొలువై ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు కోవెల చాల ప్రసిద్ధమైనది. ఈ అమ్మవారు స్వయంభువు. 

శ్రీకనకమహాలక్ష్మీ అమ్మవారు విశాఖపట్నంలో ఉండే రాజుల ఇలవేల్పు అని తెలుస్తోంది.  పూర్వం రాజుల కోటబురుజులు ఉన్న ప్రాంతమే ఈనాడు బురుజుపేటగా పిలవబడుతోంది అని చరిత్రకారులు భావిస్తున్నారు. 

బ్రిటీషువారి హయాంలో 1912 లో ఈప్రాంతంలో వీధులను వెడల్పు చేయటం కోసం ఈ విగ్రహాన్ని కొంత దూరంగా జరిపారు. ఆ సంవత్సరం ఆ ప్రాంతంలో ప్లేగు వ్యాధి వ్యాపించి, ఎవరూ ఊహించనంతగా ప్రాణనష్టం జరిగింది. ప్రజాభిప్రాయంపై నాటి ప్రభుత్వంవారు విగ్రహాన్ని యథాస్థితిలో ఉంచగానే వ్యాధి ఉపశమించి, ఆ ప్రాంతవాసులందరూ సత్వరమే ఆరోగ్యాన్ని పొందరంట. అందుకీ ఈతల్లి జనానికి దూరంగా ఉండుటకు ఇష్టపడని ప్రజాదేవతగా ప్రసిద్ధిచెందింది. 

శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారు భక్తులపాలిట కల్పవల్లిగా, స్త్రీలకు ఐదవతనాన్ని ప్రసాదించే దేవతామూర్తిగా కొలువబడుతోంది. సత్యంగల తల్లిగా, కోరిన వరాలిచ్చే కొంగు బంగారంగా, నగరవాసులకు ఆరోగ్యాన్నియినుమడింపజేసే దేవతామూర్తిగా భక్తులు శ్రీ అమ్మవారిని అత్యంత భక్తిశ్రద్ధలతో సేవిస్తూంటారు. 

ఇక్కడ ఉన్న విశేషం ఏమిటంటే, భక్తులు తము స్వయంగా మూలవిరాట్టుకు పూజలు చేసుకోవచ్చు. అభిషేకాలు చేసుకోవచ్చు. 

ఈతల్లికి అత్యంత ప్రీతికరమైన తిథి - దశమి. అత్యంత ఇష్తమైన రోజు లక్ష్మీవారము(గురువారము). అమిత ప్రీతిమంతమైన నెల మార్గశిరమాసం. అందుకే ఇక్కడ మార్గశిర మాసంలో పూజలు చాల విశేషంగా జరుగుతాయి. మార్గశిర మాసం ప్రత్యేకించి లక్ష్మివారం(గురువారం) ఈ తల్లికి విశేష పూజలు, అభిషేకాలు జరుగుతాయి. భక్తులు ఎంతో ఆనందోత్సాహాలతో ఇందులో పాల్గొంటారు. వైజాగ్, చుట్టుపక్కల ప్రాంతాలనుండే కాకుండా, పక్క రాష్ట్రాల నుండి కూడా విచ్చేసి అమ్మవారి పూజలు చేసుకుంటారు. ఈ అమ్మవారిని, కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా, సత్యమైన తల్లిగా, స్త్రీలకు సౌభాగ్యం ప్రసాదించే తల్లిగా నమ్ముతారు. ఈ నెలరోజులూ కూడా ప్రతీరోజూ తెల్లవారుఝామున అభిషేకంతో మొదలై--- కుంకుమారాధనలు నడిరాత్రి వరకూ అమ్మవారికి వివిధ సేవలు జరుగుతూనే ఉంటాయి. ఆఖరి గురువారము సాయంత్రం వేయి బిందెలతో అమ్మవారికి సహస్ర పట్టాభిషేకం(ఘట్టాభిషేకం) కూడా జరిపిస్తారు.          
                                     
జగన్మాతా భక్తుల పాలిట కల్పవల్లీ నమోన్నమః 

December 2, 2014

Aristotle Telugu Quotations ........My Slideshow

Aristotle Telugu Quotations......I created this video with the YouTube Slideshow Creator (http://www.youtube.com/upload)