April 4, 2020

కరోనాని ఎదుర్కొందాం - మనల్ని మనం రక్షించుకుందాం

కరోనాని ఎదుర్కొందాం - మనల్ని మనం రక్షించుకుందాం

భారతీయులారా మేల్కొనండి ! 
ఇప్పుడు మనం యుద్ధం చేసే సమయం ఇది. ప్రతీ భారతీయుడు ఒక సైనికుడే.
ఎన్నాళ్ళిలా ఇంట్లో కూర్చోవాలి అని అనుకుంటూ అందరూ నిరాశలో ఉండకుండా .... మన చేతిలో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందరో మహానుభావులు సమాజంలోకి తొంగిచూడకుండా ఒంటరిగానే నాలుగు గోడలమధ్య ఉండి, ఎన్నో ఘనవిజయాలు సాధించారు, మనకెన్నో తెలియని విషయాలు తెలియచెప్పారు... అటువంటివారిని ఆదర్శంగా తీసుకోవాలి మనం. 

సైనికులు శత్రువుకి ఎదురుగా వెళ్ళి పోరాడుతారు. కానీ మనం శత్రువు కంటబడకుండా, ఎదురువెళ్ళకుండా, మౌనంగా పోరాడాలి.  మనం  ఎదురుగా వెళితే శత్రువుకి బలం పెరుగుతుంది అందుకే శత్రువుకి ఎదురు పడకుండా యుద్ధం చెయ్యాలి. అంటే ఎవరి ఇంట్లో వాళ్ళే కూర్చొని యుద్ధం చెయ్యటం అన్నమాట. ఇంట్లో కూర్చుంటే యుద్ధం ఎలాగా అని ఆలోచిస్తున్నారు కదా .... వినండి .... ఇక్కడ శత్రువు మనకి కనబడడు ..... అలాగే మన ఆయుధాలు మన చేతిలోనే ఉంటాయి, కానీ ఎవరికీ కనబడవు, ఎవరూ దోచుకోలేరు..... ఇది ఆధ్యాత్మిక యుద్ధం ... అంటే దైవభక్తితో కూడిన ధ్యానంతో శత్రువుని ఓడిస్తాం .... ఈ శత్రువు బలం & బలహీనత రెండూ మనిషే.....మనిషి ఎదురుపడితే శత్రువు బలం పెరుగుతుంది...... ఎదురుపడకపోతే బలం తగ్గుతుంది......అంటే మనం అస్సలు శత్రువు కంటపడకూడదు..... దైవశక్తితో శత్రువుని జయించాలి, అంటే మనం ఇంట్లోనే ఉంటూ ధ్యానం, దైవస్మరణ చెయ్యాలి .... మీరే కాదు మీ పిల్లలు, ముసలివారు అన్ని వయసులవారు, అన్ని మతాలవారు, అన్ని కులాలవారు, మొత్తం మన భారతీయులందరూ ఈ యుద్ధంలో సైనికులే... దైవశక్తి ముందు ఎన్ని దుష్టశక్తులైనా నశించాల్సిందే....ఎందరు రాక్షసులైనా ఓడిపోవలసిందే, మట్టికరవాల్సిందే....మీరు ధ్యానం చెయ్యండి ధ్యానమే నేటి తపస్సు ... మీ తపశ్శక్తిని దేశానికి ధారపొయ్యండి.... మనమంతా సైనికులం ..... సైన్యం అంతా సైన్యాధికారి చెప్పినట్లు నడుచుకోవాలి..... మన సైన్యాధికారి మన ప్రధానిగారే....అతను చెప్పింది పాటించాలి ..... కాదని ఎదురుతిరిగితే నష్టపోయేది మనమే....దేవుడి గుడికి దయ్యాలు రావు అంటారుగా .... అదే విధంగా అందరం ఒక్కటై దైవభక్తితో కూడిన ధ్యానం చేస్తే "కరోనా వైరస్" అనే దయ్యాన్ని మన దేశం నుండి మనమంతా తరిమికొట్టగలం. నేటి నుండే మీ యుద్ధాన్ని మొదలుపెట్టండి.  

కొన్ని సందర్భాల్లో మనం అంటూవుంటాం ....నేనే కనుక ఆ సమయంలో అక్కడ ఉంటే ఇలా చేసేవాడిని అలాచేసేవాడిని అని ప్రగల్భాలు పలుకుతూ ఉంటాం.... ఇప్పుడు ఆ సమయం ఆసన్నమయ్యింది.... ఈ క్లిష్ట సమస్య  మీ ఎదురుగానే ఉంది .... మీరే సైనికులు ఐతే  ఈ సమస్యని ఎలా ఎదుర్కొంటారో మీ సత్తా చూపండి. 

ఎవరికి ఇష్టమైన  భగవంతుడిని వారు ప్రార్థించండి. ఈ దేవుడినే మీరు స్మరణ చెయ్యండి అని చెప్పటం లేదు ఇక్కడ. మీ మీ ఇష్టదైవాన్ని మీరు స్మరణ చెయ్యవచ్చు. మనందరం (అన్ని మతాల,కులాల వారు) ఎన్నో పురాణాలు, గ్రంథాలు చదివి,  విని ఉంటాం కదా  .... అన్నింటిలో చివరికి గెలిచేది దైవశక్తే .....విజయం లభించేది భగవంతుని నమ్మిన వాళ్ళకే ..... కనుక ఈ సమయంలో భగవంతుణ్ణి సంపూర్ణ విశ్వాసంతో నమ్మండి... మనకి విజయం తథ్యం....

ఎదుటివాడి వినాశనం కోరితే మనమే నష్టపోతాం ......అందుకే మన పూర్వీకులు సామెతల రూపంలో సూక్తులు, బుద్ధులూ మనకి నేర్పించారు....."చేరపకురా చెడేవు" అని, "వినాశకాలే విపరీత బుద్ధి:" అని, "ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు" అని ..... సామెతలు ఊరికే పుట్టలేదు .... సందర్భానుసారం మన పెద్దలు పలికిన మాటలు .... నేడు సామెతలుగా చలామణి అవుతున్నాయి.   

ఎవరికీ కంటపడనిది కరోనా ..... ఎవరికీ కనిపించనివి మన ఆయుధాలు ...... ధ్యానం, దైవనామస్మరణ ..... దేవుడి గుడికి దయ్యాలు రావు అంటారుగా .... అదే విధంగా అందరం ఒక్కటై దైవస్మరణ చేస్తే "కరోనా వైరస్" అనే దయ్యాన్ని మన దేశం నుండి మనమంతా తరిమికొట్టగలం.  

అందరూ బావుండలి - అందులో మనం ఉండాలి. 
కరోనాని ఎదుర్కొందాం - మనల్ని మనం రక్షించుకుందాం. 
దైవభక్తితో కూడిన ధ్యానాన్ని చేద్దాం - కరోనాని తరిమికొడదాం.  
ఇట్లు --- మీ శ్రేయోభిలాషి (ఒక భారతవాసి... మీ శ్వేతవాసుకి) 

3 comments: