అక్షయతృతీయ రోజు తప్పనిసరిగా ఈ స్తోత్రం చదవాలి
శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి (సింహాచలం) వారి అవతార స్తుతి
త్రాహీతి వ్యాహరస్తం త్రిదశ రిపుసుతం
త్రాతు కామో రహస్యే
విశ్వస్త్రం పీతవస్త్రం నిజకటి యుగళే
సవ్య హస్తేన గృహ్ణన్
వేగ శ్రాంతం నితాన్తం ఖగపతి మమృతం
పాయయన్ నన్యపాణౌ
సింహాద్రౌ శీఘ్రపాత క్షితి పిహిత పదః
పాతుమాం నారసింహః
కందాబ సుందర తనుః పరిపూర్ణ చంద్ర:
బింబాను కారి వదనో ద్విభుజ త్రినేత్రః
శాంత స్త్రి భంగి లలితః క్షితి గుప్త పాదః
సింహాచలే జయతి దేవవరో నృసింహః
తాక్ష్యాస పీత వాసనాంచల దత్తాహస్తం
యుగ్మో నతాంశ వలయీ కృతవాల శోభిః
సంస్తబ్ద కర్ణయుగళ చ్ఛట కాభి రామః
సింహాచలే జయతి దేవవరో నృసింహః
ధరణి గుప్తంబైన చరణ యుగ్మముతోడ
అలరారు ప్రక్కగాయంబు తోడ
రమణీయమైన వరాహననము తోడ
ఘనతల ఫాల లోచనము తోడ
నిగనిగలాడు బల్ నిడుపుకొల్ జడతోడ
నవ్య గోక్షీర వర్ణంబు తోడ
మై నిండ నలదిన మంచి గంధంబు తోడ
అమిత భక్తాను గ్రహంబు తోడ
అఖిలలోకావనము సేయ అవతరించియున్న
మిమ్ముల వినుతింప నోపలేరు
హిమకర కిరీట ముఖులు నేనెంతవాడ
వైరి హర రంహ సింహాద్రి నారసింహ
వర శంఖ చక్ర స్ఫురిత గదా ఖడ్గ సహిత శోభిత
సుభుజ హరామిత్రా ధృతగోత్ర వరగాత్ర నృతచరిత్ర వర నరసింహ
అంగజ సదృశ శుభాంగ మంగళ మకుటాం చితోత్తమాంగ
కరుణాపాంగ సురపుంగవ సత్సంగ రిపుభంగ సింహశైల నృసింహ
నమః సింహాద్రినాధాయ నృసింహాయ నమోస్తుతే
లక్ష్మీ భూమీ సమేతాయ భూయోభూయో న్నమోన్నమః
శ్రీమన్నారాయణుని అవతారములన్నింటిలో త్రిభంగిమలో ఉన్న అవతారములు రెండే రెండు
1. శ్రీకృష్ణుడు 2. శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామి
No comments:
Post a Comment