April 30, 2024

నర్మదా స్తోత్రం

నర్మదా స్తోత్రం (నర్మదా పుష్కరాల సందర్భంగా)




రచన - శ్రీ సీ.ఎన్. నాగేశ్వర్రావు గారు


సంగీతం & గానం - శ్రీమతి వల్లూరి సరస్వతి

వింధ్య మహాచల సాత్పుర శ్రేణి మహామరకంటక శైలసుతే, 
నర్మద కుండ సరోవర నిత్య జలాశయ లింగ మహజ్జనితే, 
ఋష్య మహీధర శృంగ తపస్థిత శంకర స్వేద మహోల్లలితే, 
మాతరుమాపతి నందిని, దివ్య మహానద నర్మద, శైవమయే. 1 

‘కంకర కంకర శంకర శంకర’ సర్వ నదిస్థల శర్వమయే, 
బ్రహ్మ మురారి సదాశివ శాంకరి సర్వ సురాలయ దివ్య తటే, 
పాద పరిక్రమ యాత్ర సముద్యత భక్త మహార్చిత దేవి సురే, 
మాతరుమాపతి నందిని, దివ్య మహానద నర్మద, శైవమయే. 2 

భూరుహ బంధుర కానన సుందర మండల గామిని నర్మ గతే, 
సాత్పుర వింధ్య ధరాధర శృంఖల మధ్య మహోద్ధృత వేగవతే, 
పశ్చిమ సాగర సంగమ కామిని, దివ్య తరంగిణి పుణ్య నదే, 
మాతరుమాపతి నందిని, దివ్య మహానద నర్మద, శైవమయే. 3 

భారత, రామకథా, రఘువంశ శతాధిక కావ్య మహోల్లిఖితే, 
స్కంధ, సువిష్ణు, సుమత్స్య, సుకూర్మ, సుపద్మ పురాణ మహత్కథితే, 
మైకల కన్యక, రేవ, మహజ్జటశంకరి, దేవి, కృపా, సురసే, 
మాతరుమాపతి నందిని, దివ్య మహానద నర్మద, శైవమయే. 4 

గంగ మహాసతి సంతత దర్శిత బ్రహ్మ చతుర్ముఖ అశ్రు ఝరే 
వామన, పిప్పల, పుష్కరిణీ, భృగు తీర్థ తటాధిక భక్త నుతే, 
భూధర నిర్జర భిన్న మహోపనదీ జల సంగమ చారు చరే, 
మాతరుమాపతి నందిని, దివ్య మహానద నర్మద, శైవమయే. 5 

భారత పంచ నదీనద మానిత, హైహయ, వర్ధన రాజ్య తటే, 
పుష్కర ఘాట బృహత్తర, సజ్జలపాత సమున్నత రుద్రసుతే
పాండవ వాస గుహాలయ పర్వత దృశ్య మనోహార తీర యుగే, 
మాతరుమాపతి నందిని, దివ్య మహానద నర్మద, శైవమయే. 6 

సోమ సముద్భవ, సూన సహోద్గమ, సుస్వన సుందర సత్సరితే, 
శంభు వరామర, దక్షిణ గంగ, తపస్విని యోగిని, పుణ్యమయే, 
ధార్మిక వేదిక శ్రాద్ధ కృతాలయ, నిర్మల వేణి మహా మహితే, 
మాతరుమాపతి నందిని, దివ్య మహానద నర్మద, శైవమయే. 7 

రావణ బ్రహ్మ పరాజిత పూర్వ మహిష్మతి పట్టణ తీర ఘనే, 
అంధక సూదన శంకర కంటక శైలజ సుందరి మోక్షకరే, 
సంకట పాప విమోచన కారిణి, భక్తవశంకరి, ‘నాగ’ నుతే, 
మాతరుమాపతి నందిని, దివ్య మహానద నర్మద, శైవమయే.8

No comments:

Post a Comment