October 9, 2014

ముకుందమాల... 12 వ శ్లోకం

******కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల******

12 వ శ్లోకం
మాభీర్మందమనో విచింత్య బహుధా యామీశ్చిరం యాతనా:
నామీ న: ప్రభవంతి పాపరిపవ: స్వామీ నను శ్రీధర:
ఆలస్యం వ్యపనీయ భక్తిసులభం ధ్యాయస్య నారాయణం
లోకస్య వ్యసనాపనోదనకరో దాసస్య కిం న క్షమా:   

భావం:-
ఓ మూఢమైన మనసా! యమ యాతనలను పలువిధముల చిరకాలము చింతించి భీతినొందకుము. మన ప్రభువగు శ్రీహరి ఉండగా ఈ పాపములనెడి శతృవులు మనలను ఏమియూ చేయలేవు. కావున భక్తిచే సులభముగా పొందదగు నారాయణుని జాగుచేయక ధ్యానింపుము. లోకములో అందరి ఆపదలను తీర్చువాడు, తనదాసుని ఆపదలు తొలగింపలేడా !   



No comments:

Post a Comment