October 9, 2014

ముకుందమాల... 13 వ శ్లోకం

******కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల******

13 వ శ్లోకం
భవజలధిగతానాం ద్వంద్వవాతాహతానాం
సుతదుహితృకళత్ర త్రాణభారార్ధితానాం

విషమవిషయతోయే మజ్జతామప్లవానాం

భవతు శరణమేకో విష్ణుపోతో నరాణాం 



భావం:-
ఈ నరులు సంసార సముద్రములోపడి, సుఖదుఃఖములు మొదలగు జంటలను గాలిచే కొట్టుకొనిపోవుచున్నారు. బిడ్డలు, భార్య మొదలగువారి బరువు వారిని మరింత క్రిందకు ముంచుతున్నది. ఆ బరువుతో ఈ విషయములు అనెడి జలమున మునుగుతున్న నరులను కాపాడుటకు ఏ తెప్పయు కనబడకున్న సమయమున వారిని కాపాడు నౌక ఒక్క శ్రీమహావిష్ణువు మాత్రమే.  



No comments:

Post a Comment