October 9, 2014

ముకుందమాల... 15 వ శ్లోకం

******కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల******

15 వ శ్లోకం
తృష్ణాతోయే మదనపవనోద్ధూతమోహోర్మిమాలే
దారావర్తే తనయసహజగ్రాహసంఘాకులే చ
సంసారాఖ్యే మహతి జలధౌ మజ్జతాం నస్త్రిధామన్ 
పాదాంభోజే వరద భవతో భక్తినావం ప్రయచ్చ 


భావం:-
(సంసారమను సముద్రములోపడి, మునుగుచు, తెలుచూ, దాటలేక బాధపడుచున్న వారికి విష్ణువే నౌక అని, విష్ణుభక్తియే నౌక అని వెనుకటి 2 శ్లోకములలో పేర్కొని, ఆ నౌకను ఇవ్వమని విష్ణువునే ప్రార్థింపవలెనని తెలుసుకొని, ఈ శ్లోకంలో ప్రార్థించుచున్నారు.) 

ఈ సంసారమను సముద్రములో ఆశయే జలము. ఆ జలము కామమను పెనుగాలిచే కదిలింపబడుచున్నది. ఆ విధంగా కదులుటచే మొహమను కెరటములు వరుసగా సాగుచుండును. ఈ సముద్రములో భార్య సుడిగుండమువలె పట్టి తిప్పి, అందు పడినవారిని బయటకు పోనీయక ముంచివేయును. బిడ్డలు, బంధువులు- మొసళ్ళు మొదలగు జంతువులవలె కబళింప ప్రయత్నించుచుందురు. ఇట్లు భయంకరమగు సంసార మహాసముద్రమున పడి, దాటు ఉపాయము లేక మునుగుచున్న మాకు, ఓ వరద! ఓ త్రిధామ! నీ పాదపద్మభక్తి అనెడి నౌకను ఇచ్చి దరిజేర్చుమయ్యా.  

  

No comments:

Post a Comment