October 9, 2014

ముకుందమాల... 16 వ శ్లోకం

******కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల******


16 వ శ్లోకం
మాద్రాక్షం క్షీణపుణ్యాన్ క్షణమపిభవతో భక్తిహీనాన్ పదాబ్జే
మాశ్రౌషం శ్రావ్యబంధం తవచరిత మపాస్యా నన్యదాఖ్యాన జాతం
మాస్మార్షం మాధవత్వామపి భువనపతేచేత సాపహ్నువానాన్ 
మాభూవం త్వత్సపర్యావ్యతికర రహితో జన్మ జన్మాంతరేపిll   


భావం:-
(భక్తినొసంగుమని ప్రార్థించి, కులశేఖరులు ఆ భక్తి కలుగుటకు ప్రతిబంధకముగా ఉండు పాపములను తొలగించుటకై, కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ మనస్సులచే సాధింపదగు శమ దమాది సంపత్తిని ఇందు వివరించుచున్నారు.) 

హే జగన్నాథా! మాధవ! నీ పాదారవిందములయందు క్షణమైనను భక్తి నిలుపని పుణ్యహీనులను కంటితో చూడను. చేవికింపైన బంధముకలదయినను చరిత్రము తప్ప వేరొక కథాసందర్భమును చెవితో వినను. (ఈ రెండింటిచేత జ్ఞానేంద్రియ నిగ్రహమును సూచించిరి.) మానసికముగా నీ అస్తిత్వమును అంగీకరింపని వారలను (అసత్పురుషులను) నేను స్మరింపను. దీనిచే మనోనిగ్రహము సూచింపబడినది.) జన్మజన్మాంతరములందును నీ కైంకర్యములేని మనుగడను కలిగియుండును.(దీనిచే కర్మేంద్రియ నిగ్రహము సూచింపబడినది.)  


No comments:

Post a Comment