October 9, 2014

ముకుందమాల... 17 వ శ్లోకం

******కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల******


17 వ శ్లోకం
జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం
పాణి ద్వంద్వ సమర్చ యాచ్యుత కధా: శ్రోత్రద్వయ త్వం శృణు
కృష్ణం లోకయ లోచనద్వయ హరే ర్గచ్చాంఘ్రి యుగ్మాలయం
జిఘ్రఘ్రాణ ముకుంద పాదతులసీం మూర్ధన్ నమాధోక్షజంll  

భావం:-
(ఇంద్రియ నిగ్రహం రెండు రకాలు. చేయకూడని వాని నుండి మరలించుట, చేయవలసిన వానిని చేయుట. వెనుకటి శ్లోకమున జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మనస్సులచే విడువదగినవానిని చెప్పి, ఇందు చేయదగనివానిని చెప్పుచున్నారు.) 

ఓ పాద ద్వంద్వమా! నీవు భగవదాలయమునకు నడుచుచుండుము. ఓ హస్తద్వంద్వమా! నీవు భగవదర్చన చేయుచుండుము. ఓ వాగింద్రియమా! నీవు కేశవుని కీర్తింపుచుండుము. ఓ శిరమా! నీవు భగవంతుని నమస్కరించుచుండుము.(ఇట్లు కర్మేంద్రియములను నిగ్రహింపవలెను.) ఓ నేత్రద్వంద్వమా! శ్రీకృష్ణభగవానునే చూడుము. ఓ శ్రోత్రద్వంద్వమా! ఆ శ్రీకృష్ణుని లీలలనే ఆకర్శింపుము.(ఇట్లు జ్ఞానేంద్రియములను నిగ్రహింపవలెను.) ఓ మనసా! ఆ శ్రీధరునే ధ్యానింపుము.(ఈవిధంగా మనస్సును నిగ్రహింపవలెను)    




No comments:

Post a Comment