******కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల******
ఓ లోకులారా! చావు పుట్టుకలను వ్యాధికి యోగమెరింగిన యాజ్ఞవల్క్యాదులగు మునులు కనిపెట్టిన ఈ చికిత్సను వినడు, వారు కనుగొనిన మందు కృష్ణామృతము. దానిని సేవించినచో ఈవ్యాధి శాశ్వతముగా తొలగిపోవును. ఆమందు ప్రకాశవంతము, అద్వితీయము, ఇట్టిదని చెప్పనలవికానిదియునై వెలయు చుండును.
18 వ శ్లోకం
హేలోకాశ్శృణుత ప్రసూతి మరణ వ్యాధేశ్చికిత్సా మిమాం
యోగజ్ఞాః సముదాహరంతి మునయో యాం యాజ్ఞవల్క్యాదయ:
అంతర్జ్యోతి రమేయ మేక మమృతం కృష్ణాఖ్య మాపీయతాం
తత్పీతం పరమౌషధం వితనుతే నిర్వాణ మాత్యంతికంll
భావం:-
రెండు శ్లోకములలో ముందు తెలియక బాధపడుచున్న సంసార వ్యాధిగ్రస్తులకు, కులశేఖరులు తాను తెలుసుకున్న చికిత్సను వివరించుచున్నారు.
No comments:
Post a Comment