******కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల******
19 వ శ్లోకం
హే మర్త్యా: పరమం హిత శృణుత వో వక్ష్యామి సంక్షేపత:
సంసారార్ణవమాపదూర్మిబహుళం సమ్యక్ప్రవిశ్య స్థితా:
నానాగ్నానమపాస్య చేతసి నమో నారాయణాయేత్యముం
మంత్రం సప్రణవం ప్రణామసహితం ప్రావర్తయధ్వం ముహు:
భావం:-
మర్త్యులు అమృతత్వము పొందుటకు ఉపాయము ఇందు ఉపదేశిస్తున్నారు. ఉపాయములు కర్మజ్ఞాన భక్తి యొగములుగా పేర్కొనబడినవి ఎన్నియో ఉన్నవి. కాని అవి ప్రయాససాధ్యములని సంక్షేపముగ ఒక ఉపయమును ఉపదేశించుచున్నారు.
ఆపదలనెడి కెరటములతో నిండిన సంసారమనెడి సముద్రములో చొచ్చియున్న ఓ మర్త్యులారా! వినుడు. మీకు సంగ్రహముగా ఒక ఉపయమును చెప్పెదను. అనన్యమగు భక్తితో తదితర చింతనములను విడచి మనసున "నమో నారాయణాయ" అను ఈ మంత్రమును ఓంకార పురస్సరముగా జపించండి.

No comments:
Post a Comment