October 9, 2014

ముకుందమాల... 20 వ శ్లోకం

******కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల******


20 వ శ్లోకం
పృధ్వీ రేణురణు: పయాంసి కణికా: ఫల్గుస్ఫులింగోనల:

తేజో ని:శ్వసనం మరుత్ తనుతరం రంధ్రం సుసూక్ష్మం నభ:

క్షుద్రా రుద్రపితామహప్రభృతయ: కీటాస్సమస్తాస్సురా:

దృష్టే యత్ర స తావకో విజయతే భూమావధూతావధి: 



భావం:-
పరబ్రహ్మ స్వరూపమగు నారాయణుని దర్శించినచో అందు ఈ పృథ్వి ఒక సూక్ష్మాతి సూక్ష్మమైన రేణువు. ఈ జగము నీటి తుంపర. తేజస్సు సూక్ష్మమగు అగ్నికణము. వాయువు నిస్శ్వాసము. ఆకాశము సన్నని చిన్నరంధ్రము. రుద్రా పితామహాది దేవతాకోటి సమస్తము క్షుద్రకీటకములు. ఆ పరబ్రహ్మమగు నారాయణుని అతిశయము అవధులు మీరి విరాజిల్లుచున్నది.  



No comments:

Post a Comment