October 9, 2014

ముకుందమాల... 21 వ శ్లోకం

******కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల******


21 వ శ్లోకం
బద్ధేనాంజలినా నతేన శిరసా గాత్రైస్సరోమోద్గమై:

కంఠేన స్వరగద్గదేన నయనే నోద్గీర్ణ బాష్పాంబునా

నిత్యం త్వచ్చరణారవిందయుగళ ధ్యానామృయాస్వాదినాం

అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితం  



భావం:-
ఓ పుండరీకాక్ష! నీకై మొగిడ్చిన దోసిలి, వంగిన శిరస్సు, గగుర్పొడిచిన యవయవములు, గద్గదస్వరము గల కంఠము, కన్నీటితో నిండు కన్నులు కలిగి ఎల్లప్పుడూ నీ పాదారవింద ధ్యానామృతమును ఆస్వాదించుచునే మా జీవితమంతయు సాగునట్లు అనుగ్రహింపుము.   



No comments:

Post a Comment