October 9, 2014

ముకుందమాల... 4 వ శ్లోకం

******కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల******


4వ శ్లోకం
ముకుంద మూర్ధ్నా ప్రణిపత్య యాచే
భవంతమేకాంతమియంతమర్ధం
అవిస్మృతిస్త్వచ్చరణారవిందే
భవేభవే మేస్తు భవత్ప్రసాదాత్



భావం:-
(శ్రీకులశేఖర మహారాజు - మొదటి శ్లోకంలో కృష్ణుని పిలిచి, రెండో శ్లోకంలో ఎదుట నిలచిన కృష్ణునకు జయము పలికిరి. ఈ శ్లోకం నుండి శ్రీకులశేఖరులు స్తోత్రము చేయుచున్నారు. ఈ శ్లోకం "ముకుంద"తో ప్రారంభమగుట వలన "ముకుందమాల" అను పేరు ఈ స్తోత్రమునకు వచ్చినది. ఇందులో ముకుంద దశాక్షరీమంత్రము నిక్షిప్తమై ఉన్నాడని పెద్దలు చెప్పుదురు.)


ఓ ముకుందా! నీ పాదారవిందములను జన్మజన్మమూల నేను మరువకుండునట్లు అనుగ్రహింపుము. నీ ఎదుట శిరస్సు వంచి, మోకరిల్లి ఈ కోరికను కోరుకుచున్నాను.


No comments:

Post a Comment