October 9, 2014

ముకుందమాల... 5 వ శ్లోకం

******కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల******

5 వ శ్లోకం
నాహం వందే తవ చరణయోర్ద్వంద్వహేతో:
కుంభీపాకం గురుమపి హరే నారకం నాపనేతుం
రమ్యా రామా మృదుతనులతా నందనే నాపి రంతుం
భావే భావే హృదయభవనే భావయేయం భవంతం


భావం:-
ఓ కృష్ణా! ద్వంద్వాతీతస్థితిని అందవలెనని కాని, కుంభీపాకనరకమును తప్పించుకొనవలెనని కాని, లావణ్యవతులగు అప్సరసలను స్వర్గములో అనుభవింపవలెనని కాని, నేను నీ పాదారవిందములకు నమస్కరించుటలేదు. ఎట్టి దేహము ఇచ్చినను సరే, నాకు అభ్యంతరము లేదు. కానీ సర్వదా మనసులో నిన్నే స్మరించునట్లు ఉండవలెననియే నమస్కరించుచున్నాను.



No comments:

Post a Comment