******కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల******
6 వ శ్లోకం
నాస్ధా ధర్మే న వసునిచయే నైవ కామోపభోగే
నాస్ధా ధర్మే న వసునిచయే నైవ కామోపభోగే
యద్యద్ భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం
ఏతత్ ప్రార్ధ్యం మమ బహుమతం జన్మజన్మాంతరేపి
త్వత్పాదాంబోరుహయుగగతా నిశ్చలా భక్తిరస్తు
భావం:-
ఓ కృష్ణా! ధర్మమును ఆర్జించవలెనని గాని, అర్థమును కూడబెట్టవలెనని గాని, కామములను అనుభవించవలెనని గాని నాకు కోరిక లేదు. నా పూర్వకర్మములను అనుసరించి ఏది ఎలా జరగవలెనో అలాగే జరుగునుగాక. ఈ జన్మయందు గాని, జన్మాంతరమందు గాని, నీ పాదారవిందములయందు గాని, నాకు నిశ్చలమగు భక్తి కలుగవలెననునది ఒక్కటియే అభిమతమగు కోరిక. (జన్మరాహిత్యము లేదా మోక్షము కంటే కూడా, కృష్ణభక్తినే ముఖ్యముగా ప్రార్థించుచున్నారు కులశేఖరులు. నాలుగు పురుషార్థముల కంటే కూడా భగవంతుని యందు ప్రేమయే పరమ పురుషార్థమని వారి ఆశయము.)

No comments:
Post a Comment