******కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల******
7 వ శ్లోకం
దివి వా భువి వా మమాస్తు వాసో
దివి వా భువి వా మమాస్తు వాసో
నరకే వా నరకాంతక ప్రకామం
అవధీరిత శారదారవిందౌ
చరణౌ తే మరణేపి చింతయామి
భావం:-
(వెనుకటి శ్లోకంలో భగవంతుని తలచుట కంటే ఇతరములైన ఫలములను వేటినీ తాను కోరనని(కాంక్షించనని) చెప్పిన కులశేఖరులు ఈ శ్లోకంలో, ఈ ప్రదేశముననే ఉండవలెనను కోరిక కూడా నాకు లేదు అనుచున్నారు.)
ఓ నరకాంతక! కృష్ణా! స్వర్గమునందున్నను, లేదా ఈ భూమి యందే ఉన్నను నాకేమీ బాధ లేదు. కానీ శరత్కాల పద్మసుందరములగు నీ చరణారవిందములనే మరణ సమయమున కూడా ధ్యానించుచుందును.

No comments:
Post a Comment