September 24, 2015

"సర్దుకు పోవటమా? " నో వే..!!

"సర్దుకు పోవటమా? " నో వే..!!

ఈ రోజుల్లో ఎవరిని కదిపినా మనకు వినిపించే మాట ఇది. ఈ స్టేట్మెంట్ తో పాటు కొన్ని అనుబంద ప్రశ్నలు కూడా వేస్తారు..".అసలు ఎందుకు సర్దుకుపోవాలి ? ", నేనే ఎందుకు సర్దుకు పోవాలి ?", అంటూ ఒక పది ప్రశ్నలు అయినా మనమీదకి దూసుకు వస్తాయి..పొరపాటున " సర్దుకోవచ్చు" కదా ! అని మనం సలహా చెప్పగానే . అదేదో వాళ్ళ ఆస్తి రాసి ఇమ్మన్నట్టు , చేయకూడని పని చేయమన్నట్టు చూస్తారు మన వైపు.

ఎక్కడా , ఎవరి మధ్యా ఈ సర్దుకు పోవటం అన్న ప్రశ్నే లేదు...అది ఏ సంబంధం అయినా కానీయండి., ఇదంతా సరే ..ఈ మద్య అబ్బాయిలు, అమ్మాయిలు పెళ్లి చేసుకోవటానికి తెగ ఆలోచిస్తున్నది ...ఎందుకు అంటే ..ఇందుకే..అదేనండి ..ఎక్కడ సర్దుకు పోవాల్సి వస్తుందో అని. ఇద్దరూ సర్దుకుపోవటానికి సిద్దం గా లేరు కాబట్టి , గొడవలు ఎలాగు తప్పవు. ఆ గోలంతా ఎందుకు అసలు పెళ్ళే మానస్తే పోలే ? అన్న అభిప్రాయానికి వచ్చేస్తున్నారు..దాంతో పాటు పెళ్లి చేసుకోవటానికి కొన్ని లక్షలు ఖర్చు , ఆ పైన వద్దు అనుకుంటే విడి పోవటానికి మరికొన్ని లక్షలు ఖర్చు, కొన్ని రోజుల ముచ్చటగా మిగిలే దానికోసం ఇంత డబ్బులు వేస్ట్ ఎందుకు? హాయిగా లివింగ్ రిలేషన్ అయతే ..రూపాయి ఖర్చు ఉండదు. నచ్చితే కలసి వుంటాం, లేదంటే బై చెప్పి బయటకి వచ్చేస్తాం. సో సింపుల్ , .అనేస్తున్నారు.

బామ్మలు, అమ్మమ్మలు,తాతమ్మలు ముక్కున వేలేసుకున్నా., ఇది మన పద్దతి కాదని మొత్తుకున్నా."సారీ ..ఈ ప్రపంచం లో నాకు నచ్చని ఒకే ఒక్కమాట సర్దుకు పోవటం...అలా పోవాలి అంటే ఏది వదులు కోవటానికి అయినా నేను రెడీ. "అని ఖచ్చితంగా సెల్ పగలు కొట్టి మరి చెబుతున్నారు (కుండ ఔట్ డేటెడ్ అయ్పోయింది కదా ).

అమ్మానాన్నతో సర్దుకు పోలేరు ....ఇల్లు వదిలి వెళ్ళిపోతారు ,
అన్నదమ్ములతో సర్దుకు పోలేరు....మాటలు మానేస్తారు.
అత్తగారితో సర్దుకు పోలేరు ....వేరు కాపురం పెడతారు.
స్నేహితులతో సర్దుకు పోలేరు....టాటా ..బై బై చెప్పేస్తారు.

భార్యా భర్తలు సర్దుకుపోలేరు...విడాకులు తీసుకుంటారు.
ప్రపంచంతో సర్దుకుపోలేరు....ఆత్మహత్య చేసుకుంటారు ..
సో సింపుల్...ఏది వదులు కోవటానికి అయినా రెడీ...కాని సర్దుకు పొమ్మని మాత్రం అడక్కండి...

..........రమ

No comments:

Post a Comment